రాను మండల్.. ఈ పేరు ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్. బెంగాల్‌లోని రణఘాట్ వీధుల్లో పాడిన పాట ఓ అనామకురాలిలా ఉన్న ఈమెను ఓవర్‌నైట్ స్టార్‌ని చేసింది. ఎంతలా అంటే ఆమెపై బయోపిక్ తీసేంతలా. ప్రముఖ డైరెక్టర్ హృషికేశ్ మోండల్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పేరు మిస్ రాను మరియా. ఆమెకు మొదటిసారి బాలీవుడ్ ఫిల్మ్‌లో పాడే అవకాశం ఇచ్చిన హిమేష్ రేష్మియా ఈ చిత్రానికి పని చేయనున్నారు. బెంగాలీ నటి ఈషికా డే ప్రధాన పాత్ర పోషించనున్నారు.
ఈ బయోపిక్‌లో నటించడానికి తొలుత వేరే నటులను అనుకున్నామని, కానీ వాళ్లు రాను మండల్ పాత్ర పోషించడాన్ని అవమానకరంగా భావించారని డైరెక్టర్ హృషికేశ్ మోండల్ తెలిపాడు అయితే ఆ నటీమణుల పేర్లను మాత్రం బహిర్గతం చేయకపోవడం గమనార్హం. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఈ పాత్ర కోసం మొదట బెంగాలీ మూవీ ‘బరివాలి’తో ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుచుకున్న సుదీప్త చక్రబర్తిని సంప్రదించాం. ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాలని ఆమె ఎంతో కోరుకున్నారు. అయితే ఇంతకుముందు కమిట్ అయిన సినిమాల వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేక మా ఆఫర్‌ను వదులుకున్నారు’ చివరకు ‘పుర్బా పశీమ్ దక్షిణ్’ ఫేమ్ ఈషికాను సంప్రదించగా, ఆమె వెంటనే ఓకే చెప్పారు’అని దర్శకుడు చెప్పుకొచ్చాడు.
మొదట బెంగాలీలో మాత్రమే ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్న మేకర్స్ అనంతరం హిందీలోనూ తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ మూవీలో రాను మొండల్ జీవితంలో ఎదురొన్న సమస్యలను చూపించనున్నారు.కాగా ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటించనున్న ఈషికా డే సేక్రెడ్ గేమ్స్, గోల్పర్ మాయజల్, లాల్ కప్తాన్ వంటి వెబ్ సీరిస్, సినిమాలతో గుర్తింపు పొందారు. ఆమె ప్రస్తుతం మొండల్ బయోపిక్‌తో పాటు సినిస్తాన్ మూవీలో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment