కోల్‌కతా రైల్వే స్టేషన్‌లో లతా మంగేష్కర్ పాటలను ఆలపిస్తున్న రణు మొండాల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తల్లిని అనాథలా వదిలేసిన రణు కూతురు ఎలిజబెత్ సతీ రాయ్..సెలబ్రిటీ హోదా దక్కిన తర్వాత తిరిగి తల్లి చెంతకు చేరిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో వీటిపై రణు మొండాల్ స్పందించి ‘గతాన్ని ఆలోచించకుండా దేవుడి దయతో మళ్లీ తామంతా కలుస్తామని.. తన కూతురు సతీరాయ్‌ని ఉద్దేశించి పేర్కొంది. అదే విధంగా తనను చేరదీసిన అతీంద్ర చక్రవర్తి, తపన్ దాస్(క్లబ్ సభ్యులు)ను సతీ.. అపార్థం చేసుకుందని, కేవలం ఇతరుల అభిప్రాయాల వల్ల అలా ప్రవర్తించి ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది. కాగా సతీని.. ఎవరు రెచ్చగొట్టుతున్నారో, బెదిరిస్తున్నారో తనకు తెలియదని, అతీంద్ర చక్రవర్తి, తపన్ దాస్ తనను బాగా చూసుకుంటున్నారని రణు స్పష్టం చేసింది.
అదేవిధంగా ‘పాడటం మీద ప్రేమ లేకపోతే.. ఈ రోజు ఇలా పాటలు పాడలేకపోవచ్చు. దేవుని మీద ప్రేమ ఉంది. అందుకే పాడగలననే నమ్మకం కలుగుతోంది. రైల్వే స్టేషన్‌లో పాటలు పాడుకున్నప్పుడు గ్రహించలేదు.. ఇటువంటి ఓ రోజు వస్తుందని. ఇప్పుడు నా గొంతుపై పూర్తి నమ్మకం ఉంది. మొదట్లో లతా మంగేష్కర్ స్వరంతో ప్రేరణ పొందాను. భవిష్యత్తులో కూడా పాడటం కొనసాగిస్తాను. ఎప్పుడూ ఆశను కోల్పోలేదు’ అని రణు మొండాల్ పేర్కొంది. కాగా హిమేష్ రేష్మియా తను పాడటానికి కల్పించిన వేదికను ఊహించలేదన్నారు. గతంలో చిన్న వేదికపై ప్రదర్శన ఇచ్చానని తెలిపింది. కాగా హిమేష్.. రణుకు రెండు పాటలు పాడే అవకాశం కల్పించాడన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment