
రాను మండల్.. పరిచయం అక్కర్లేని పేరు. బెంగాల్‌లోని రణఘాట్‌లో వీధుల్లో ఈమె పాడిన పాటతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె పాడిన పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. శ్రీలంక గాయకుడు, రచయిత యోహానీ రాసిన ‘ మానికే మాఘే హితే’ అనే పాటను మండల్ పాడారు. దీంతో రాను మండల్ మరోసారి వార్తల్లో నిలిచారు.
గతంలో బాలీవుడ్ డైరెక్టర్ హృశికేష్ మోండల్ దర్శకత్వం వహించిన ‘మిస్ నాను మరియా’ సినిమాలో పాటపాడటానికి అవకాశం ఇచ్చారు. దీనికి బాలీవుడ్ సింగర్ హిమేష్ రేష్మియా ఆమెను ప్రోత్సహించారు. సూపర్ స్టార్ రియాలిటీ షోలో పాట పాడటానికి హిమేష్.. మండల్‌ను ఆహ్వానించారు. హిమేష్ చిత్రం .. హ్యపీ హర్డీ అండ్ హీర్ సినిమాలో రెండు మండల్‌తో రెండు పాటలను పాడించారు.
ఆ తర్వాత.. ఒక కార్యక్రమంలో అభిమాని పట్ల మండల్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. ఒక పెద్ద సెలబ్రిటీలాగా ప్రవర్తిస్తోందని నెటిజన్లు ఆమె తీరుపై మండిపడ్డారు. ప్రస్తుతం మండల్ పాడిన పాట మరోసారి సోషల్ మీడియాలో సెన్సెషన్‌గా మారడంతో ఆమెకు మరో అవకాశం వస్తుందేమో చూడాలి.
చదవండి: Ranu Mondal Biopic: ‘ఆమె పాత్ర పోషించడాన్ని అవమానంగా భావించారు’
Comments
Please login to add a commentAdd a comment