వీళ్లంతా.. రాత్రికి రాత్రే సోషల్‌ మీడియా స్టార్లయిపోయి.. | Who Became Overnight Sensations on Social Media | Sakshi
Sakshi News home page

వీళ్లంతా.. రాత్రికి రాత్రే సోషల్‌ మీడియా స్టార్లయిపోయి..

Jan 23 2025 7:26 AM | Updated on Jan 23 2025 8:46 AM

Who Became Overnight Sensations on Social Media

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ మేళాకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు తరలివస్తున్నారు. వీరిలోని కొందరు సోషల్‌ మీడియాలో ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఇలాంటివారిలో వైరల్ గర్ల్ మోనాలిసా ఒకరు. ఈమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా తన అందమైన కళ్లు కారణంగా సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయారు. మహాకుంభ్‌లో దండలు, పూసలు అమ్మేందుకు వచ్చిన ఆమె అనూహ్య రీతిలో సోషల్‌ మీడియాలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు.

ప్రియా ప్రకాష్ వారియర్ 
ప్రియా ప్రకాష్ వారియర్.. మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’లోని ఒక చిన్న క్లిప్ వైరల్ కావడంతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయారు. దీంతో ఆమెకు ‘ది వింక్ గర్ల్’ అనే పేరొచ్చింది.

భుబన్ బద్యాకర్ 
పశ్చిమ బెంగాల్‌కు చెందిన  పల్లీల విక్రేత భుబన్ కస్టమర్లను ఆకర్షించడానికి ‘కచ్చా బాదం’ పాటను రూపొందించి పాడాడు. ఈ పాట కారణంగానే  భుబన్‌ రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయారు.

అంజలి అరోరా
నాడు వైరల్‌గా మారిన కచ్చా బాదం పాటకు ఆమె నృత్యం చేసిన వీడియో సోషల్ మీడియాలో తుఫాను సృష్టించింది. దీంతో అంజలి అరోరా రాత్రికి రాత్రే  సన్సేషనల్‌ స్టార్‌గా మారిపోయారు. కచ్చాబాదం ఆమె ఇంటి పేరుగా మారిపోయింది.

రాణు మండల్‌
రాణు మండల్ ఒక రైల్వే స్టేషన్‌లో లతా మంగేష్కర్ పాడిన ‘ఏక్ ప్యార్ కా నగ్మా హై’ పాట పాడి, రాత్రికి రాత్రే సంచలనంగా మారారు. సోషల్ మీడియాలో ఆమె​కు ప్రశంసలు వెల్లువెత్తాయి.

దనానీర్ ముబీన్
19 ఏళ్ల పాకిస్తానీ యువతి దనానీర్ ముబీన్‌కు చెందిన ‘పావ్రీ హో రహి హై’ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. దీంతో దనానీర్ రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయారు.

సంజీవ్ శ్రీవాస్తవ
మధ్యప్రదేశ్‌లోని విదిశకు చెందిన ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవ డ్యాన్సింగ్ అంకుల్‌గా పేరొందారు. సంజీవ్ శ్రీవాస్తవ బాలీవుడ్‌ హీరో గోవింద శైలిలో నృత్యం చేయడంతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిపోయారు.

ఇది కూడా చదవండి: వీళ్లంతా ఐఐటీ బాబాలు.. మంచి ఉద్యోగాలు వదిలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement