
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దసరా పండగ రోజు కోడికూర వండలేదని భార్యను హతమార్చాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సన్నయ్య మద్యానికి బానిసగా మారాడు. దసరా పండగ రోజు (ఆదివారం) మద్యం తాగివచ్చి, భార్య సీతమ్మ(38)ను కోడికూర వండమని చెప్పగా.. ఆమె వండలేదు. దీంతో కోపోద్రిక్తుడైన సన్నయ్య భార్యను కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లిపోయాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులుకు సమచారం ఇవ్వగా.. అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: (నడిరోడ్డుపై యువతి దారుణ హత్య : షాకింగ్ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment