
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు, నటుడు రామ్‌చరణ్ భార్య ఉపాసన కామినేని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా ఆమె నిత్యం వార్తల్లో ఉంటారు. కోవిడ్ సమయంలో ప్రజల్లో హెల్దీ ఫుడ్ పట్ల అవగాహన పెంచేందుకు `యువర్ లైఫ్ పేరుతో వెబ్ పోర్టల్‌ని, ఓ సోషల్ మీడియాని ప్రారంభించింది. ముందుగా దీనికి గెస్ట్ ఎడిటర్‌గా స్టార్ హీరోయిన్ సమంతని నియమించింది. వీరిద్దరూ కలిసి ఇటీవల హెల్దీ ఫుడ్ విషయంలో ఆవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలతో పాటు హెల్త్ టిప్స్‌ని, ఆరోగ్య కరమైన వంటలకు సంబంధించిన విషయాల్ని వీడియోల రూపంలో పంచుకున్న విషయం తెలిసిందే.
తాజాగా సమంత స్థానంలో క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్నని గెస్ట్ ఎడిటర్‌గా ఉపాసన సెలెక్ట్ చేసింది. హెల్డీ ఫుడ్‌లో భాగంగా చికెన్‌తో ‘కోలిపట్టు’ కూర వండి ఉపాసనకు రుచి చూపించింది రష్మిక. కోలిపట్టు కూర రుచి చూసిన ఉపాసన రష్మికకు వంద మార్కులేసింది. రష్మిక సూపర్ చెఫ్ అని ప్రశంసించింది. రష్మికకు ఎవరైన చెఫ్‌గా అవకాశం ఇస్తే సూపర్ వంట చేస్తుందని పొగడ్తలతో ముంచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment