ఇంటి వంట ఎంత రుచి, శుచిగా ఉన్నా రెస్టారెంట్లను అప్పుడప్పుడు సందర్శించాల్సిందే. ఇదే ప్రస్తుత ట్రెండ్. కొన్ని పుడ్ ఐటమ్స్ ఫలానా రెస్టారెంట్‌లో బాగుంది అని తెలిస్తే చాలు.. క్యూలో ఉండి ఆ వంటకాన్ని ఇంటికి తెచ్చుకోవడమో, లేదా అక్కడే తినడమో చేస్తుంటారు. రెస్టారెంట్‌లో పుడ్ అనగానే రుచి వరకు ఓకే గానీ నాణ్యత విషయంలో మాత్రం అంతంత మాత్రమేనన్న ఘటనలు బోలెడు ఉన్నాయి. ఇక వెజ్ పరిస్థితి ఎలా ఉన్నా నాన్‌వెజ్ వంటకాల విషయంలో మాత్రం కొన్ని రెస్టారెంట్‌లు క్వాలిటీ పరంగా షాక్‌లు ఇస్తూనే ఉంటాయి. తాజాగా పంజాబ్‌లోని లుధియానాలో ఓ కస్టమర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
చికెన్ కర్రీలో ఎలుకలుంటాయ్
వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి లుధియానాలోని ప్రకాష్ ధాబాకు వెళ్లాడు. వెయిటర్ తన వద్దకు రాగానే.. ఆ వ్యక్తి తనకు నచ్చిన చికెన్ కర్రీ ఆర్డర్ చేశాడు. కాసేపు అనంతరం ఆర్డర్ తన టేబుల్ ముందుకు వచ్చింది. ఇక ఆకలిగా ఉన్న ఆ కస్టమర్.. ఓ పట్టు పట్టాలని తినేందుకు రెడీ అయ్యాడు. అంతలో చికెన్ గ్రేవీలో ఎలుక కనిపించింది. చికెన్ ముక్క అనుకుని గబుక్కున నోట్లో వేసుకుందామని చూసిన ఆ కస్టమర్ దెబ్బకు హడలిపోయాడు.
సిబ్బందికి ఈ విషయం చెప్పగా.. వాళ్లు పట్టించుకోకపోవడమే కాకుండా.. అసలు తమది తప్పే కాదన్నట్టుగా మాట్లాడారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ కస్టమర్. ఆ వీడియోలో.. "ప్రకాష్ ధాబా లూథియానా. ఇండియా చికెన్ కర్రీలో ఎలుకను వడ్డించండి. రెస్టారెంట్ యజమాని ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కి లంచం ఇవ్వడంతో ఇంత స్వేచ్ఛగా ప్రవర్తిస్తున్నారా ??? అనేక భారతీయ రెస్టారెంట్లలోని కిచెన్‌లో ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి" అని పోస్ట్ కింద క్యాప్షన్‌తో షేర్ చేశారు.
ఇదిలా ఉండగా రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆ కస్టమర్ కావాలనే తమ హోటల్ గుడ్ విల్ దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం కస్టమర్‌కే సపోర్ట్ చేశారు. అంత పెద్ద తప్పు చేసి మళ్లీ బుకాయిస్తున్నారా అంటూ మండి పడుతున్నారు. ఇంకొందరు...అసలు ఆ రెస్టారెంట్ లైసెన్స్‌ని క్యాన్సిల్ చేసేయాలని ఫైర్ అవుతున్నారు. లుధియానాలో ఇదేం కొత్త కాదు. చాలా రెస్టారెంట్‌లలో ఇదే పరిస్థితి ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Parkash dhaba Ludhiana. India Serve rat in chicken curry. Restaurant owner bribe the food inspector and go free??? Very poor standards in Kitchen of many Indian restaurants. Be aware . pic.twitter.com/chIV59tbq5
— NC (@NrIndiapolo) July 3, 2023
Comments
Please login to add a commentAdd a comment