నచ్చిన కూర చేయలేదని ఆత్మహత్య..! | Man Disappointed Over Chicken Curry Committed Suicide In Tamil Nadu | Sakshi
Sakshi News home page

నచ్చిన కూర చేయలేదని ఆత్మహత్య..!

Published Fri, Jan 31 2020 2:24 PM | Last Updated on Fri, Jan 31 2020 2:24 PM

Man Disappointed Over Chicken Curry Committed Suicide In Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అన్నానగర్‌ : కుత్తాలమ్‌ సమీపంలో తల్లి కోడి కూర చేయలేదని మనస్తాపం చెందిన ఓ కార్మికుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. నాగై జిల్లా, కుత్తాలమ్‌ సమీపం తిరుమంజేరి జేజేనగర్‌కు చెందిన రామచంద్రన్‌ కుమారుడు రాజా (22) కూలీ. ఇతను బుధవారం తన తల్లి కొలంజియమ్మాల్‌కు చికెన్‌ తెచ్చి కూర చేయమని చెప్పాడు. అయితే, కొలంజియమ్మాల్‌ తనకు ఆరోగ్యం బాగోలేదని, చేయలేనని చెప్పింది. దీంతో మనస్తాపం చెందిన రాజా, వ్యవసాయానికి ఉపయోగించే పరుగుల మందు తాగి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మయిలాడుదురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజా మృతి చెందాడు. కుత్తాలమ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రవిచంద్రన్‌ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని  విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement