
సాక్షి, చిత్తూరు : వృధ్యాప్యంలో ఉన్న అమ్మమ్మ చేసిన పొరపాటు ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసింది. చికెన్ కర్రీలో మసాల అనుకుని విష గుళికలు కలిసింది ఆ వృద్ధురాలు. విషగుళికలు కలిపిన ఆహారం తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గుడిపాల మండలంలోని ఏఎల్‌పురం గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులు తవణంపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన రోహిత్, జీవాగా గుర్తించారు. (చదవండి : ‘అమ్మ’మ్మలే హతమార్చారు..)
వడ్డేపల్లికి చెందిన ఇద్దరు పిల్లలు అమ్మమ్మ ఊరైన ఏఎల్‌పురానికి వెళ్లారు. దీంతో వాళ్ల అమ్మమ్మ చికెన్ వండి... పిల్లలకు పెడదామని నిర్ణయించుకుంది. చికెన్ చేసే సమయంలో చికెన్ మసాలా బదులు విష గుళికలు కలిపింది. గుళికలు వేసిన చికెన్ తినడంతో ఆ ఇద్దరు బాలులు మృతి చెందారు. కేసు దర్యాప్తు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment