
కువైట్‌లో సుండుపల్లి వాసి మృతి
సుండుపల్లిః
మండలంలోని అగ్రహారంకు చెందిన ఎస్.నూరుల్లా జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లి అక్కడ మృతి చెందాడు. కువైట్‌లో గత మంగళవారం మాళియా దగ్గర టీ తాగి వస్తుండగా కాలుజారి పడ్డాడు. తలకు తీవ్రమైన గాయమైంది. దీంతో బంధువులు వైఎస్సార్‌సీపీ కువైట్ అడహక్ కమిటీ సభ్యులు రెహమాన్‌ఖాన్, ఇలియాజ్‌లు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస వదిలాడు. నూరుల్లా మృతదేహం స్వదేశానికి రావడానికి వైఎస్సార్‌సీపీ అడహక్ కమిటీ సభ్యులు రెహమాన్‌ఖాన్, ఇలియాజ్‌తోపాటు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి చొరవ చూపడంతో బుధవారం మృతదేహారం అగ్రహారానికి చేరింది.
మృతునికి భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మొదటి కుమార్తె నసీనాకు వివాహమైంది. రెండవ కుమార్తె నస్రీన్ 8వ తరగతి చదువుతోంది. జెడ్పీటీసీ సభ్యుడు హకింసాబ్ మృతదేహాన్ని పరిశీలించి అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయనవెంట మండల కోఆప్షన్ మెంబర్ పండూస్, మండల ఉపసర్పంచ్ సిరాజుద్దీన్, వైఎస్సార్‌సీపీ గౌరవసలహాదారుడు క్రిష్ణంరాజు, బీసీ మండల కన్వీనర్ సూరి, ఎస్టీ మండల కన్వీనర్ చిన్నప్ప, మైనార్టీ నాయకుడు ప్రసాద్, రాజ పాల్గొన్నారు.