వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజంపేట మండలం రామాపురం చెక్పోస్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు ఆదివారం ఉదయం తనిఖీలు నిర్వహించారు.అందులోభాగంగా అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.దాంతో స్మగ్లర్లు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు.
దీంతో అటవీశాఖ అధికారులు వాహనాన్ని పోలీసులకు అప్పగించారు.వాహనాన్ని స్టేషన్కు తరలించి పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్పు ప్రారంభించినట్లు చెప్పారు.పట్టుబడిన ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 లక్షలు ఉంటుందని వెల్లడించారు.
అలాగే అదే జిల్లాలోని సుండుపల్లి మండలం గొల్లపల్లి వద్ద గత అర్థరాత్రి నుంచి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.ఈ నేపథ్యంలో అధిక మొత్తంలో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.