ఖరీదైన కారు కొన్న స్టార్ హీరో.. రేటు తెలిస్తే బుర్ర తిరిగిపోద్ది! | Actor Ajith Kumar's Ferrari Car Cost Details | Sakshi
Sakshi News home page

Ajith Ferrari Car: కార్ల పిచ్చి.. మరో కాస్ట్ లీ కారు కొనేసిన ప్రముఖ హీరో

Jul 31 2024 8:26 AM | Updated on Jul 31 2024 8:55 AM

Actor Ajith Kumar's Ferrari Car Cost Details

కొందరు కార్లు పిచ్చి, మరికొందరకి బైక్స్ పిచ్చి. కానీ తమిళ స్టార్ హీరో అజిత్‌కి మాత్రం ఇవంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే డబ్బుల్ని దాచుకుంటాడో లేదో తెలీదు గానీ కొత్త కొత్త స్పోర్ట్స్ బైక్స్, కార్స్‌ని ఎప్పటికప్పుడు కొనేస్తుంటాడు. తాజాగా అలానే అత్యంత ఖరీదైన సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కారుని సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఈ కారు స్పెషాలిటీ ఏంటి? రేటు ఎంత?

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)

అప్పట్లో తెలుగు డబ్బింగ్ సినిమాలతో ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకున్న అజిత్.. ఇప్పుడు పూర్తిగా తమిళంకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం 'విడామయూర్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు దాదాపు రూ.9 కోట్ల విలువ చేసే ఎరుపు రంగు ఫెర్రరీ ఎస్ఎఫ్ 90 కారుని కొనుగోలు చేశాడు!

ఈ ఫెర్రారీ కారు ప్రత్యేకత ఏంటంటే.. ఇది హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వెహికల్. దీనితో పాటు అజిత్ కారు కలెక్షన్స్‌లో బీఎండబ్ల్యూ 740ఎల్ఐ, ఫెర్రారీ 458 ఇటాలియా, కవసాకీ నింజా జెడ్ ఎక్స్ 14ఆర్, బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, హోండా ఎకార్డ్ తదితర వెహికల్స్ ఉన్నాయి. వీటితో పాటు పలు స్పోర్ట్స్ బైక్స్ కూడా ఉండటం విశేషం.

(ఇదీ చదవండి: ఆస్పత్రి పాలైన హీరో కమల్ హాసన్ సోదరుడు.. ఏమైందంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement