ఫెరారీ ఎట్ 180 కోట్లు
ఇది ఫెరారీ 375 ప్లస్ మోడల్ కారు. 1950ల్లో తయారుచేశారు. అప్పటి మోటారు రేసుల్లో ఇది కింగ్ అట. పైగా.. ఈ మోడల్ కార్లను ఐదు మాత్రమే తయారుచేశారట. అందుకేనేమో.. శుక్రవారం బ్రిటన్‌లోని లీసెస్టర్‌లో దీన్ని వేలం వేసినప్పుడు ఏకంగా రూ.180 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా బ్రిటన్‌లో ఇప్పటివరకూ వేలం వేసిన అత్యంత ఖరీదైన కార్లలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గతంలో 1954 నాటి మెర్సిడెజ్ బెంజ్ కారు ఒకటి రూ.190 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ ఫెరారీ కారు జోరు కూడా కాసింత ఎక్కువే. గంటకు అత్యధికంగా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.