ఆకాశ్, నీతా అంబానీ చేరిక
న్యూఢిల్లీ: గ్లోబల్ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ దేశీ బిజినెస్‌తో విలీనం నేపథ్యంలో తాజాగా ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు వయాకామ్18 బోర్డులో చేరారు. ముకేశ్ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్శన్ నీతా అంబానీ, కుమారుడు ఆకాశ్ అంబానీ బోర్డు సభ్యులుగా చేరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ సిస్టమ్స్‌కు చెందిన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్‌లకు హోల్డింగ్ కంపెనీగా వయాకామ్18 వ్యవహరిస్తోంది.
స్టార్ ఇండియా విలీనానికి సీసీఐ, ఎన్‌సీఎల్‌టీ అనుమతులు లభించడంతో వాల్ట్ డిస్నీ, వయాకామ్18 బోర్డులో సర్దుబాట్లకు తెరలేచినట్లు తెలుస్తోంది. బోధి ట్రీ సిస్టమ్స్ సహవ్యవస్థాపకుడు జేమ్స్ మర్డోక్, కీలక ఇన్వెస్టర్ మహమ్మద్ అహ్మద్ అల్‌హర్డన్, ఆర్‌ఐఎల్ మీడియా, కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్‌పాండే, అనాగ్రామ్ పార్ట్‌నర్స్ పార్ట్‌నర్ శువ మండల్ సైతం బోర్డులో చేరనున్నారు. స్టార్ ఇండియాతో వయాకామ్18 మీడియా, డిజిటల్ 18 మీడియా విలీనానికి గత నెల(ఆగస్ట్) 30న ఎన్‌సీఎల్‌టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment