IOC Session  తిలకం దిద్ది మరీ స్వాగతం..సర్వం సిద్ధం: నీతా అంబానీ | Nita Ambani Looks After The Preparations For 141st IOC Session At NMAC | Sakshi
Sakshi News home page

IOC Session  తిలకం దిద్ది మరీ స్వాగతం..సర్వం సిద్ధం: నీతా అంబానీ

Published Fri, Oct 13 2023 12:23 PM | Last Updated on Fri, Oct 13 2023 12:59 PM

Nita Ambani Looks After The Preparations For 141st IOC Session At NMAC - Sakshi

ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో నీతా అంబానీ ఒకరు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్య నీతా రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌గా అనేక సేవా కార్యక్రమాల ద్వారా లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు తొలి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా కూడా  పాపులర్‌ అయ్యారు.  ముఖ్యంగా ఇటీవల నీతా  ముఖేష్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ (ఎన్‌ఎంఈసీసీ) ద్వారా  భారతీయ కళలకు ఆమె ఇస్తున్న ప్రోత్సాహం పలువురి ప్రశంసలందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లోని ఎన్‌ఎంసీసీలో  141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)  సెషన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది. ఈ మీట్‌ సన్నాహాలకు సంబంధించిన వీడియోను  ఎన్‌ఎంఏసీసీ షేర్‌ చేసింది.    ప్రపంచ దేశాలనుంచి హాజరు కానున్న  డెలిగేట్‌లకు  అద్భుతమైన  అనుభూతిని అందించేలా కృషి చేస్తోంది.

భారతదేశం 40 సంవత్సరాల తర్వాత 141వ IOC సెషన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 14న ప్రారంభించనున్నారు. ఒలింపిక్ క్రీడల భవిష్యత్తుకు సంబంధించి IOC సెషన్లలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. దేశానికి సంతోషకరమైన క్షణం. 40 ఏళ్ల తర్వాత ఐఓసీ సెషన్‌కుఆతిథ్యమివ్వడం భారత్‌కు గర్వకారణమని నీతా సంతోషాన్ని ప్రకటించారు.

"ప్రపంచం నలుమూలల నుండి ముంబై నగరానికి వచ్చే ప్రతినిధులందరినీ స్వాగతం చెప్ప బోతున్నాం. 40 ఏళ్ల తర్వాత భారతదేశంలో ఒలింపిక్ సెషన్‌ను NMACCలో నిర్వహిస్తున్నాం. 80 దేశాల ప్రతినిధులను స్వాగతించడం చాలా సంతోషకరమైన క్షణం. భారత జెండాను ఎగురవేద్దాం. భారతీయులందరి తరపున, ప్రతినిధులందరికీ పెద్ద స్వాగతం అన్నారామె.అంతేకాదు ఈసందర్బంగా  IOC ప్రెసిడెంట్ థామస్ బాచ్‌ను అంబానీ స్వగృహం యాంటిలియా వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నీతా తనదైన సాంప్రదాయ చీరలో  ఎవర్‌ గ్రీన్‌గా కనిపించారు. 

p>

 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ 
చివరిసారిగా 1983లో సెషన్‌ను  ఇక్కడనిర్వహించింది. ఈ సెషన్‌లో, లాస్ ఏంజెల్స్‌లో జరిగే 2028 గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చడం గురించి విస్తృతంగా జరగనుంది. పారాలింపిక్ క్రీడలు బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్ (సిక్స్) , స్క్వాష్‌లతో సహా 2028 ఒలింపిక్స్‌లో  క్రికెట్‌ను చేర్చేందుకు సిఫారసు చేయాలని నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సంతోషం వ్యక్తం చేసింది.

నీతాదే కీలక పాత్ర
IOC సెషన్‌కు హోస్టింగ్ హక్కులను భారత్ గెలుచుకోవడంలో నీతా అంబానీదే   కీలక పాత్ర. 2023 IOC సెషన్‌కు ముంబై ఆతిథ్యం ఇవ్వాలనే ప్రతిపాదనను 2023లో ఒక ప్రతినిధి బృందం 139వ IOC సెషన్‌లో సమర్పించింది. ఇందులో నీతా, భారత ఒలింపిక్ సంఘం (IOA) మాజీ అధ్యక్షుడు డాక్టర్ నరీందర్ బాత్రా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా నాయకత్వం వహించారు.

2016లో  తొలి భారతీయ  మహిళగా నీతా అంబానీ రికార్డ్‌ 
కాగా నీతా అంబానీ 2016లో IOCలో తొలి భారతీయ మహిళా సభ్యురాలిగా ఎన్నికయ్యారు.అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 141వ సెషన్‌కు భారతదేశం ఆతిథ్యం  ఇవ్వనున్నట్టు ఆగస్ట్ 28న  ప్రకటించారు. భారతీయ క్రీడలకు ఇది స్వర్ణయుగం అని పేర్కొంటూ, 141వ IOC సెషన్ అక్టోబర్ 15-17 మధ్య NMACCలో జరుగుతుందని నీతా అంబానీ  వెల్లడించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement