IOC meeting
-
IOC Session తిలకం దిద్ది మరీ స్వాగతం..సర్వం సిద్ధం: నీతా అంబానీ
ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో నీతా అంబానీ ఒకరు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా అనేక సేవా కార్యక్రమాల ద్వారా లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు తొలి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా కూడా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా ఇటీవల నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్‌ఎంఈసీసీ) ద్వారా భారతీయ కళలకు ఆమె ఇస్తున్న ప్రోత్సాహం పలువురి ప్రశంసలందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లోని ఎన్‌ఎంసీసీలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది. ఈ మీట్ సన్నాహాలకు సంబంధించిన వీడియోను ఎన్ఎంఏసీసీ షేర్ చేసింది. ప్రపంచ దేశాలనుంచి హాజరు కానున్న డెలిగేట్లకు అద్భుతమైన అనుభూతిని అందించేలా కృషి చేస్తోంది. భారతదేశం 40 సంవత్సరాల తర్వాత 141వ IOC సెషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 14న ప్రారంభించనున్నారు. ఒలింపిక్ క్రీడల భవిష్యత్తుకు సంబంధించి IOC సెషన్లలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. దేశానికి సంతోషకరమైన క్షణం. 40 ఏళ్ల తర్వాత ఐఓసీ సెషన్‌కుఆతిథ్యమివ్వడం భారత్‌కు గర్వకారణమని నీతా సంతోషాన్ని ప్రకటించారు. "ప్రపంచం నలుమూలల నుండి ముంబై నగరానికి వచ్చే ప్రతినిధులందరినీ స్వాగతం చెప్ప బోతున్నాం. 40 ఏళ్ల తర్వాత భారతదేశంలో ఒలింపిక్ సెషన్‌ను NMACCలో నిర్వహిస్తున్నాం. 80 దేశాల ప్రతినిధులను స్వాగతించడం చాలా సంతోషకరమైన క్షణం. భారత జెండాను ఎగురవేద్దాం. భారతీయులందరి తరపున, ప్రతినిధులందరికీ పెద్ద స్వాగతం అన్నారామె.అంతేకాదు ఈసందర్బంగా IOC ప్రెసిడెంట్ థామస్ బాచ్‌ను అంబానీ స్వగృహం యాంటిలియా వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నీతా తనదైన సాంప్రదాయ చీరలో ఎవర్ గ్రీన్‌గా కనిపించారు. p> ఒలింపిక్స్‌లో క్రికెట్ చివరిసారిగా 1983లో సెషన్‌ను ఇక్కడనిర్వహించింది. ఈ సెషన్లో, లాస్ ఏంజెల్స్‌లో జరిగే 2028 గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చడం గురించి విస్తృతంగా జరగనుంది. పారాలింపిక్ క్రీడలు బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్ (సిక్స్) , స్క్వాష్‌లతో సహా 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చేందుకు సిఫారసు చేయాలని నిర్వాహకులు తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సంతోషం వ్యక్తం చేసింది. నీతాదే కీలక పాత్ర IOC సెషన్‌కు హోస్టింగ్ హక్కులను భారత్ గెలుచుకోవడంలో నీతా అంబానీదే కీలక పాత్ర. 2023 IOC సెషన్‌కు ముంబై ఆతిథ్యం ఇవ్వాలనే ప్రతిపాదనను 2023లో ఒక ప్రతినిధి బృందం 139వ IOC సెషన్లో సమర్పించింది. ఇందులో నీతా, భారత ఒలింపిక్ సంఘం (IOA) మాజీ అధ్యక్షుడు డాక్టర్ నరీందర్ బాత్రా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా నాయకత్వం వహించారు. 2016లో తొలి భారతీయ మహిళగా నీతా అంబానీ రికార్డ్ కాగా నీతా అంబానీ 2016లో IOCలో తొలి భారతీయ మహిళా సభ్యురాలిగా ఎన్నికయ్యారు.అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 141వ సెషన్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ఆగస్ట్ 28న ప్రకటించారు. భారతీయ క్రీడలకు ఇది స్వర్ణయుగం అని పేర్కొంటూ, 141వ IOC సెషన్ అక్టోబర్ 15-17 మధ్య NMACCలో జరుగుతుందని నీతా అంబానీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఉగ్రవాదంపైనే యుద్ధం
అబుధాబి: ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతూ.. దేశాలను అస్థిర పరుస్తోన్న ఉగ్రవాదంపైనే తమ యుద్ధం తప్ప మతాలకు వ్యతిరేకంగా కాదని భారత్ స్పష్టం చేసింది. అరబ్ దేశాల ప్రతిష్టాత్మక ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) రెండు రోజుల సదస్సుకు భారత్ తరఫున విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ.. ‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు 130 కోట్ల మంది భారతీయుల అభినందనలు, ప్రత్యేకంగా 18 కోట్ల మంది ముస్లిం సోదరసోదరీమణుల శుభాకాంక్షలను ఇక్కడికి తీసుకొచ్చాను. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేందుకు మా దేశ ముస్లిం సోదరసోదరీమణులే నిదర్శనం. అయితే భారత్‌లోని కొంతమంది ముస్లింలు మాత్రమే విషపూరితమైన ఉగ్రవాద, తీవ్రవాద భావజాలాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇస్లాం ధర్మం అంటే శాంతి సూచిక. అల్లాకు ఉన్న 99 పేర్లలో ఎందులోనూ హింస లేదు. అలాగే ప్రతి మతంలో శాంతి, కరుణ, సోదరభావం ఉన్నాయి. భారతదేశం శాంతికి దారి చూపే మార్గంగా ఉంది. అన్ని మతాలకు భారత్ ఇల్లు లాంటిది. మా దేశంలో ఎన్నో మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల దేశాల్లో భారత్ ఒకటి. అక్కడ విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, రుచులు, భాషలను అవలంబిస్తూ తరతరాలుగా జీవిస్తున్నారు. ఎవరి నమ్మకాలను వాళ్లు పాటిస్తూ.. ఇతరులతో సోదరభావంతో మెలగుతున్నారు.’అని సుష్మా స్వరాజ్ అన్నారు. సమావేశానికి పాక్ డుమ్మా.. అయితే సుష్మా స్వరాజ్ రాకతో ఓఐసీ నిర్వహించిన ఈ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్ డుమ్మా కొట్టింది. భారత విదేశాంగ మంత్రిని ఓఐసీ సదస్సుకు ఆహ్వానించవద్దన్న తమ విజ్ఞప్తిని పట్టించుకోనందుకు గాను తాను ఈ సమావేశానికి హాజరుకానని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి శుక్రవారం ప్రకటించారు. 57 ముస్లిం దేశాలు హాజరయ్యే ఈ సమావేశానికి భారత్ తరఫున హాజరైన తొలి మంత్రి సుష్మా స్వరాజే కావడం గమనార్హం. గతంలో ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్న ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌ను 1969లో జరిగిన మొరాకో రాజధాని రబాట్‌లో ఓఐసీ సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. అయితే ఆయన సమావేశం కోసం రబాట్ చేరుకున్న సమయంలో పాకిస్తాన్ ఒత్తిడి మేరకు ఆహ్వానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పటినుంచి ఓఐసీ సమావేశాలకు భారత్‌ను ఆహ్వానించడంలేదు. -
టర్కీకి తొలి అవకాశం దక్కుతుందా!
బ్యూనస్ ఎయిర్స్: ప్రపంచ క్రీడా సమరాంగణం ఒలింపిక్స్ నిర్వహణ అంటే ఒక మహా యజ్ఞం. ఆర్థిక బలం ఉన్న ప్రతీ దేశం తమ స్థాయికి తగినట్లు... ఇంకా చెప్పాలంటే స్థాయిని దాటి కూడా ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతుంటాయి. ప్రపంచ వేదికపై తమ బలం నిరూపించుకోవాలన్న ఆలోచన కొన్ని దేశాలదైతే, క్రీడా పటంపై తమ దేశం తరఫున చిరకాల ముద్ర వేసేందుకు దేనికైనా సిద్ధమని సాహసించే దేశాలు మరికొన్ని. అయితే ఈ వేదిక ఖరారుకు ముందు అందరి మద్దతు కూడగట్టడం మొదలు సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. ఆ అడ్డంకులన్నీ అధిగమించి చివరగా మూడు నగరాలు 2020 ఒలింపిక్స్ నిర్వహణ బరిలో నిలిచాయి. ఈ మూడింటిలో ఒక నగరానికి ఒలింపిక్స్‌కు ఖరారు చేసేందుకు శనివారం ఐఓసీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో మూడు నగరాలపై ఒక విశ్లేషణ. మాడ్రిడ్ (స్పెయిన్) జనాభా: 30 లక్షల 30 వేలు; అంచనా వ్యయం: రూ. 32 వేల 643 కోట్లు; గతంలో పోటీ పడినది: 1972, 2012, 2016; బలాలు: తక్కువ బడ్జెట్; ఎన్నో స్టేడియాలు ఇప్పటికే పూర్తయి సిద్ధంగా ఉన్నాయి. నగర కేంద్రంనుంచి కేవలం 10 కిలోమీటర్ల పరిధిలో ఒలింపిక్ గ్రామం ఏర్పాటు. బలహీనతలు: బలహీనంగా ఉన్న దేశ ఆర్ధిక పరిస్థితి ఇటీవలి డోపింగ్ ఆరోపణలు టోక్యో (జపాన్) జనాభా: 1 కోటి 32 లక్షలు అంచనా వ్యయం: రూ. 54 వేల 87 కోట్లు గతంలో పోటీ పడినది: 1960, 2016 బలాలు: 2016 బిడ్‌తో పోలిస్తే మెరుగైన ప్రతిపాదనలతో సిద్ధం; ప్రపంచవ్యాప్తంగా నగరానికి ఉన్న ప్రాచుర్యం; బలహీనతలు: ఇటీవల ఫకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ కారణంగా వెలువడుతున్న తీవ్ర రేడియో ధార్మికత ప్రభావం. ఇప్పటికే 1964లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఇస్తాంబుల్ (టర్కీ) జనాభా: 1 కోటి 50 లక్షలు అంచనా వ్యయం: రూ. 1 లక్షా 45 వేల కోట్లు; గతంలో పోటీ పడినది: 2000, 2004, 2008, 2012 బలాలు: రెండు ఖండాలకు (ఆసియా, యూరోప్) సరిగ్గా మధ్యలో ఉన్న సౌలభ్యం; అవకాశం దక్కితే ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఇస్లామిక్ దేశమవుతుంది. బలహీనతలు: ఇరుకైన ప్రజా రవాణా వ్యవస్థ ఇటీవలి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు