టర్కీకి తొలి అవకాశం దక్కుతుందా! | Madrid, Tokyo, Istanbul await 2020 Olympic choice | Sakshi
Sakshi News home page

టర్కీకి తొలి అవకాశం దక్కుతుందా!

Published Sat, Sep 7 2013 1:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:30 PM

Madrid, Tokyo, Istanbul await 2020 Olympic choice

బ్యూనస్ ఎయిర్స్: ప్రపంచ క్రీడా సమరాంగణం ఒలింపిక్స్ నిర్వహణ అంటే ఒక మహా యజ్ఞం. ఆర్థిక బలం ఉన్న ప్రతీ దేశం తమ స్థాయికి తగినట్లు... ఇంకా చెప్పాలంటే స్థాయిని దాటి కూడా ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతుంటాయి.
 
 ప్రపంచ వేదికపై తమ బలం నిరూపించుకోవాలన్న ఆలోచన కొన్ని దేశాలదైతే, క్రీడా పటంపై తమ దేశం తరఫున చిరకాల ముద్ర వేసేందుకు దేనికైనా సిద్ధమని సాహసించే దేశాలు మరికొన్ని. అయితే ఈ వేదిక ఖరారుకు ముందు అందరి మద్దతు కూడగట్టడం మొదలు సుదీర్ఘ ప్రక్రియ ఉంటుంది. ఆ అడ్డంకులన్నీ అధిగమించి చివరగా మూడు నగరాలు 2020 ఒలింపిక్స్ నిర్వహణ బరిలో నిలిచాయి. ఈ మూడింటిలో ఒక నగరానికి ఒలింపిక్స్‌కు ఖరారు చేసేందుకు శనివారం ఐఓసీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో మూడు నగరాలపై ఒక విశ్లేషణ.
 
 
 మాడ్రిడ్ (స్పెయిన్)
 జనాభా: 30 లక్షల 30 వేలు; అంచనా వ్యయం: రూ. 32 వేల 643 కోట్లు; గతంలో పోటీ పడినది: 1972, 2012, 2016;
 బలాలు: తక్కువ బడ్జెట్; ఎన్నో స్టేడియాలు ఇప్పటికే పూర్తయి సిద్ధంగా ఉన్నాయి. నగర కేంద్రంనుంచి కేవలం 10 కిలోమీటర్ల పరిధిలో ఒలింపిక్ గ్రామం ఏర్పాటు.
 బలహీనతలు: బలహీనంగా ఉన్న దేశ ఆర్ధిక పరిస్థితి
 ఇటీవలి డోపింగ్ ఆరోపణలు
 
 
 టోక్యో (జపాన్)
 జనాభా: 1 కోటి 32 లక్షలు
 అంచనా వ్యయం:  రూ. 54 వేల 87 కోట్లు
 గతంలో పోటీ పడినది:
 1960, 2016
 బలాలు: 2016 బిడ్‌తో పోలిస్తే మెరుగైన ప్రతిపాదనలతో సిద్ధం; ప్రపంచవ్యాప్తంగా నగరానికి ఉన్న ప్రాచుర్యం; బలహీనతలు: ఇటీవల ఫకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ కారణంగా వెలువడుతున్న తీవ్ర రేడియో ధార్మికత ప్రభావం. ఇప్పటికే 1964లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది.
 
 
 ఇస్తాంబుల్ (టర్కీ)
  జనాభా: 1 కోటి 50 లక్షలు
 అంచనా వ్యయం: రూ. 1 లక్షా 45 వేల కోట్లు;
 గతంలో పోటీ పడినది: 2000, 2004, 2008, 2012
 బలాలు: రెండు ఖండాలకు (ఆసియా, యూరోప్) సరిగ్గా మధ్యలో ఉన్న సౌలభ్యం; అవకాశం దక్కితే ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఇస్లామిక్ దేశమవుతుంది.
 బలహీనతలు: ఇరుకైన ప్రజా రవాణా వ్యవస్థ ఇటీవలి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement