
ఇస్తాంబుల్: టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. టర్కీలోని స్కీ రిసార్ట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 66 మంది దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని టర్కీ ఇంటరీయర్ మినిస్టర్ అలీ యెర్లికాయ ధృవీకరించారు.
స్కీ ిరిసార్ట్‌లో ఘోర అగ్ని ప్రమావం చోటు చేసుకుని 66 మంది మృతి చెందగా, 55 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు. ఇది అత్యంత విషాదకర ఘటన’ అని పేర్కొన్నారు.
క్యాపిటల్ అంకారాకు 100 మైళ్ల దూరంలో ఉన్న కార్తాల్‌కాయా స్కీ రిసార్ట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున 3.27 ని.లకు ఈ విషాదకర ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment