హోంగార్డు ఉద్యోగానికి దరఖాస్తు చేయండిలా.. | notification for home guard jobs | Sakshi
Sakshi News home page

హోంగార్డు ఉద్యోగానికి దరఖాస్తు చేయండిలా..

Published Sun, Nov 16 2014 12:00 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

notification for home guard jobs

నోటిఫికేషన్ వివరాలు...
 మొత్తం పోస్ట్‌లు 150
 ఎంపికైన వారు హైదరాబాద్ పరిధిలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగం, ప్రత్యేక విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది.
 భారతీయుడై ఉండాలి. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని వారై ఉండాలి.
 ఏడోతరగతి పాసై కనీసం పదేళ్లు పూర్తికావాలి.
 50 ఏళ్లలోపు వయస్సు వారే అర్హులు.
 లైట్ మోటార్, హెవీ వెహికిల్ లెసైన్స్ కలిగి ఉండాలి.
 అభ్యర్థులు 160 సెం.మీ ఎత్తు ఉండాలి.

 దరఖాస్తు విధానం...
  అడిషనల్ డీజీపీ హోంగార్డ్స్, తెలంగాణ పేరిట దరఖాస్తు చేయాలి.
  ఇందుకు ttp://www.hyderabadpolice.gov.in/HGForm.pdf  లింక్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
 
దరఖాస్తుకు ఆఖరు తేదీ...
 అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తులో ఉన్న కాలమ్స్‌లో వివరాలు పూరించండి.
 విద్యార్హత పత్రాలు, వయస్సు ధ్రువీకరించే పత్రం, వాహన లెసైన్స్ జిరాక్స్ జత చేయాలి.
 4 పాస్‌పోర్ట్ కలర్ ఫొటోలు.
  స్థానికత ధ్రువీకరణ పత్రం.
 రూ.25 రుసుమును దరఖాస్తుతో ఇవ్వాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఆ రుసుం ఉండదు)
 చెక్‌లు, డీడీలు అనుమతించరు.  
 దరఖాస్తులను 22-11-2014లోపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు జామ్‌బాగ్‌లోని గోషామహల్ స్టేడియంలో అందజేయాలి.
 దరఖాస్తును పోస్ట్ లేదా ఇతరుల ద్వారా పంపకూడదు. అభ్యర్థే స్వయంగా సంబంధిత అధికారికి సమర్పించాలి.
 అప్పటికప్పుడు దరఖాస్తును పరిశీలించి హాల్‌టికెట్ జారీ చేస్తారు.
 
అభ్యర్థుల ఎంపిక విధానం...
  డ్రైవింగ్ స్కిల్స్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  ఈ పరీక్షలు ఆర్‌టీఏ అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తారు.
  వీటితోపాటుగా మెడికల్‌గా ఫిట్‌నెస్ ఉన్నట్టు ధ్రువీకరణ వస్తేనే ఎంపిక చేస్తారు.
 
గమనిక: దరఖాస్తులు అమ్మబడవు. ఏ పోలీస్ స్టేషన్‌లోనూ అందుబాటులో ఉండవు. కేవలం పైన పేర్కొన్న వెబ్‌లో నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
 హెచ్చరిక: దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా ఉండాలి. ఒక వేళ తప్పుడు ధ్రువీకరణతో ఎంపికైనా మధ్యలో జరిగే విచారణలో బహిర్గతమైతే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విధుల నుంచి తొలగిస్తారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement