Driving Test
-
డ్రైవింగ్.. ట్రాక్‌లో పడేలా
డ్రైవింగ్ లైసెన్స్ కావాలి.. మొదట లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నారు..ఏదో డ్రైవింగ్ స్కూల్లో చేరి కొన్ని రోజులు నేర్చుకున్నారు.. డ్రైవింగ్ టెస్టులో పాసయ్యేంత నైపుణ్యం లేకున్నా..ఎవరో ఏజెంట్నో, దళారీనో పట్టుకుని లైసెన్స్ సంపాదించేశారు. ఇదంతా బాగానే ఉంది..మరి వచ్చిరాని డ్రైవింగ్‌తో బండి వేసుకుని రోడ్డెక్కితే? ఏదైనా ప్రమాదానికి కారణమైతే? ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. సిటీలోని నాగోల్‌లో ఆధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకుని, ట్రాక్‌పై నిరీ్ణత ప్రమాణాల మేరకు నడిపితేనే.. లైసెన్స్ చేతికి వస్తుంది. లేకుంటే ఫెయిలే మరి.సాక్షి, హైదరాబాద్డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం వచ్చేవారికి రవాణా శాఖ తనిఖీ అధికారులే పరీక్షలు నిర్వహించి లైసెన్స్‌లను అందజేసే పద్ధతి చాలాకాలం నుంచి కొనసాగుతోంది. మాన్యువల్‌గా సాగుతున్న ఈ పద్ధతికి స్వస్తి చెప్పి.. మోటారు వాహన చట్టం నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ఆధునీకరణకు రవాణాశాఖ సిద్ధమైంది. ఆటోమేటిక్ పద్ధతిలో ట్రాక్‌ల నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో నిరీ్ణత ప్రమాణాల మేరకు వాహనం నడిపితేనే డ్రైవింగ్ లైసెన్స్ లభించనుంది. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్టుకు వచ్చేవారు ఎలాంటి దొడ్డిదారి మార్గాలను అన్వేíÙంచకుండా.. బాగా శిక్షణ తీసుకుని డ్రైవింగ్‌లో నైపుణ్యం సంపాదించాలని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి.రమేశ్ స్పష్టం చేస్తున్నారు. వాహనాల వినియోగం పెరుగుతూ.. ఇప్పుడు చాలా మందికి బైక్ లేదా కారు నిత్యావసరంగా మారింది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, మహిళలు అన్ని వర్గాల వారు వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్నారు. ఏటా వేలాది మంది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుని, వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. రవాణా రంగంలో డ్రైవర్లుగా చేరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత మూడేళ్లలో సుమారు 62 లక్షల మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకోవడం విశేషం. అయితే చాలా మంది ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా వచ్చేస్తే బాగుంటుందని భావిస్తుంటారు. ఇందుకోసం ఏజెంట్లను, మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. సరిగా నేర్చుకోకుండా, టెస్టుకు హాజరుకాకుండా తప్పుడు పద్ధతుల్లో లైసెన్సు తీసుకుని.. అరకొర అనుభవంతో బండి నడిపితే ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది.⇒ ఇన్నాళ్లూ కొనసాగిన మొక్కుబడి డ్రైవింగ్ టెస్టులకు చెల్లుచీటీ ⇒ రహదారులపై ఉండే ఇబ్బందులను తలపించేలా ట్రాక్‌లో ఏర్పాట్లు ⇒ లైసెన్స్ కోసం వచ్చేవారు ఎలా నడపగలుగుతున్నారో పరిశీలన ⇒ఆటోమేటిక్ పద్ధతిలో ట్రాక్‌ల నిర్వహణ⇒ టెస్ట్ వివరాలన్నీ కంఫ్యూటర్లో నిక్షిప్తం ⇒ ప్రమాణాల మేరకు డ్రైవింగ్ చేయకుంటే ఫెయిలేట్రాక్లో టెస్టు ఇలా..వాహనదారుల డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షించేందుకు రకరకాల ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. కారు నడిపేవారు ఈ అన్ని ట్రాక్‌లలో తమ నైపుణ్యాన్ని చూపాల్సి ఉంటుంది. అలాగే ద్విచక్ర వాహన దారులు, భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు కూడా ప్రత్యేక ట్రాక్‌లు ఉన్నాయి.ట్రాక్ ‘హెచ్’: వాహనం ముందుకు వెళ్లిన తరువాత రివర్స్ చేయాల్సి వస్తే.. ఎలా తీసుకొంటారో తెలుసుకొనేందుకే ఈ ట్రాక్. ట్రాక్ ‘ఎస్’: ఒక మూల నుంచి మరో మూలకు టర్న్ చేయాల్సి వచి్చనప్పుడు ఎలాంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారో ఈ ట్రాక్‌లో తెలుస్తుంది. ట్రాక్ ‘8’: బాగా మలుపులున్న రోడ్డుపై ఎలా ముందుకు వెళ్తున్నారో తెలుసుకొనేందుకు ఇది దోహదం చేస్తుంది. ఎత్తుపల్లాల ట్రాక్:⇒ ఎత్తైన ప్రదేశాలు, చిన్న లోయ వంటి ప్రాంతాల్లో ఎలా నడపగలరో పరిశీలించేందుకు ఇవి ఏర్పాటు చేశారు. ⇒చివరగా బండి పార్కింగ్ చేసే పద్ధతిని కూడా పరీక్షిస్తారు. ⇒టెస్ట్‌కు హాజరయ్యే సమయంలో ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్,ద్విచక్రవాహనమైతే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. లేకుంటే ఫెయిల్ చేస్తారు. ⇒ ట్రాక్‌లలో నడిపేటప్పుడు ఎలాంటి తప్పిదాలు చేసినా ఫెయిల్ అయినట్టుగా నిర్ధారిస్తారు. ఇలా ఫెయిలైన వారు మరోనెల పాటుశిక్షణ తీసుకొని హాజరుకావాల్సి ఉంటుంది.రోజూ వందలాది మందికి డ్రైవింగ్ టెస్టులు..గ్రేటర్ హైదరాబాద్‌లో నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, బండ్లగూడలలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ద్వారా రవాణా శాఖ డ్రైవింగ్ పరీక్షలను నిర్వహిస్తోంది. రోజూ వందలాది మంది ఈ టెస్టులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో దేశంలోనే అత్యాధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను నాగోల్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న 12 ట్రాక్‌లలో రోజూ వందల మందికి డ్రైవింగ్ టెస్టు చేస్తున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు నడిపేందుకు వేర్వేరు ట్రాక్‌లు ఉన్నాయి. అలాగే బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలను నడిపేవారికి టెస్టుల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. అనంతరం దశలవారీగా కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్ తదితర ఆర్టీఏలలోనూ ట్రాక్‌లను విస్తరించారు. నెలరోజులకే ‘టెస్టు’కు వస్తూ.. : అభ్యర్థులు తొలుత లెర్నింగ్ లైసెన్సు తీసుకుని డ్రైవింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెల రోజుల నుంచి 6 నెలలలోపు ఎప్పుడైనా డ్రైవింగ్ టెస్టు పాసై.. హాజరై శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు పొందవచ్చు. డ్రైవింగ్‌లో పట్టుసాధించాకే లైసెన్సు అందేలా ఈ నిబంధన అమలవుతోంది. కానీ చాలా మంది తూతూమంత్రంగా డ్రైవింగ్ నేర్చుకుని.. నెల రోజులకే టెస్టుకు హాజరవుతున్నారు. డ్రైవింగ్ పూర్తిగా రాకపోయినా, అడ్డదారిలో లైసెన్స్ పొందేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇకపై అలాంటి వాళ్లు టెస్టులో చిక్కులు ఎదుర్కోక తప్పదని నాగోల్ ప్రాంతీయ రవాణా అధికారి రవీందర్ తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాలని.. ఆ టెస్ట్ వివరాలను కంఫ్యూటర్లో నమోదు చేసి, ఉత్తీర్ణులుగా నిర్ధారణ అయితేనే లైసెన్స్ ఇస్తారని వెల్లడించారు.నైపుణ్యం ఉంటే కష్టమేమీ కాదు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వాహనం తప్పనిసరి అవసరంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, వాహనం నడపడంలో కచి్చతమైన నైపుణ్యం కలిగి ఉండాలి. డ్రైవింగ్‌లో ప్రావీణ్యం ఉన్నవారు ఆర్టీఏ టెస్ట్ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షల్లో తేలిగ్గా ఉత్తీర్ణులవుతారు. డ్రైవింగ్ ఎంతో కీలకమైంది. నాణ్యమైన శిక్షణ తీసుకొని, పూర్తి నమ్మకం కలిగాకే.. డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాలి. మొక్కుబడిగా నేర్చుకుని లైసెన్సుల కోసం రావడం వల్ల ప్రయోజనం ఉండదు. టెస్ట్‌కు రావడానికి ముందే ఒకసారి ట్రాక్‌పైన అవగాహన పెంచుకోవడం మంచిది. – సి.రమేశ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, హైదరాబాద్పూర్తిగా నేర్చుకుని వచ్చాను సాధారణంగా డ్రైవింగ్ స్కూల్లో నెల రోజులు మాత్రమే శిక్షణ ఇస్తారు. నైపుణ్యం పెంచుకునేందుకు అది ఏ మాత్రం చాలదు. కనీసం3 నెలల పాటు డ్రైవింగ్ మెళకువలు నేర్చుకోవాలి. ఎలాంటి రోడ్లపై అయినా సరే బండి నడపగలమనే ధైర్యం, నమ్మకం వచి్చన తర్వాత టెస్ట్‌కు రావడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈజీగా పాస్ కావొచ్చు. – పూరి్ణమ, టెస్ట్‌కు హాజరైన మహిళరోడ్లపై నడిపినట్లుగానే ఉంది ఈ ట్రాక్‌లో రోడ్డు మీద నడిపినట్టుగానే ఉంది. మూల మలుపులు, ఎత్తుపల్లాలు, స్పీడ్ బ్రేకర్లు అన్నీ ఉన్నాయి. బండి నడిపే సమయంలో ఏ రోడ్డుపైన ఎలా నడపాలోస్పష్టమైన అవగాహన ఉంటేనే ఇక్కడ టెస్ట్‌ను ఎదుర్కోగలుగుతాం. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నడిపితే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షలు ఏ మాత్రం ఇబ్బంది కాదు. – శ్రీధర్, టెస్ట్‌కు హాజరైన యువకుడు -
డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్.. ప్రభుత్వం స్పష్టత
గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఏడీటీసీ), డ్రైవింగ్ స్కూళ్లు జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. మీడియా కథనాలపై స్పందించిన మంత్రిత్వ శాఖ జూన్ 1 నుంచి ప్రస్తుత నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది."కొన్ని వర్గాల మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలకు సంబంధించి, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 లో గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణ కేంద్రాలకు నిర్దేశించిన నిబంధనలు 31బీ నుంచి 31జే వరకు 2021 జూన్ 7న జీఎస్ఆర్ 394 (ఇ) ప్రకారం చేర్చడం జరిగింది. ఈ నిబంధనలు 2021 జులై 1 నుంచి అమలులో ఉన్నాయి. కొత్తగా 2024 జూన్ 1 నుంచి వీటిలో ఎటువంటి మార్పు ఉండదు" అని రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరిఅంటే 2021 జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని, 2024 జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. అలాగే గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఫారం 5బి) లేదా ఇతర డ్రైవింగ్ స్కూళ్ల (ఫారం 5) నుంచి కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ పొందినప్పటికీ డ్రైవింగ్ పరీక్ష నుంచి మినహాయింపు ఉండదని రవాణా శాఖ పునరుద్ఘాటించింది. -
డ్రైవింగ్ లైసెన్స్‌లో కొత్త రూల్స్.. జూన్ 1 నుంచే..
డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన నిబంధనలలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. జూన్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైంది.కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు మీరు ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. బదులుగా ప్రైవేట్ సంస్థలు డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్లను జారీ చేస్తాయి. ఈ కొత్త రూల్ జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలుప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం కోసం కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ ట్రైనింగ్ కోసమైతే అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి.డ్రైవింగ్ పరీక్షల నిర్వహణ కోసం ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తగిన సౌకర్యాలను కలిగి ఉండాలి.శిక్షకులకు కనీసం హై స్కూల్ డిప్లొమా అర్హత తప్పనిసరి. దీంతో కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ మౌలిక అంశాలపై అవగాహన ఉండాలి.శిక్షణ సమయంలైట్ వెహికల్ శిక్షణ తప్పనిసరిగా 4 వారాల్లో పూర్తి చేయాలి (కనీసం 29 గంటలు). శిక్షణను రెండు విభాగాలుగా విభజించాలి. ఇందులో థియరీ విభాగం 8 గంటలు, ప్రాక్టికల్ 21 గంటలు ఉండాలి.హెవీ మోటారు వాహనాల కోసం 38 గంటల శిక్షణ ఉంటుంది. ఇందులో 8 గంటల థియరీ ఎడ్యుకేషన్, 31 గంటల ప్రాక్టికల్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ శిక్షణ 6 వారాల్లో పూర్తవుతుంది. -
ఇక ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్సుల జారీ విధానంలో సమూల మార్పులకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. లైసెన్సుల జారీకి ప్రస్తుతం ఉన్న విధానం స్థానంలో కొత్తగా ఆటోమేటెడ్ వ్యవస్థను నెలకొల్పనుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ, రాష్ట్ర రవాణా శాఖ సంయుక్తంగా రాష్ట్రంలోని 9 ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్‌లను నెలకొల్పాలని నిర్ణయించాయి. తద్వారా పూర్తిస్థాయిలో డ్రైవింగ్ నైపుణ్య పరీక్షలు నిర్వహించిన అనంతరమే లైసెన్సులు జారీ చేయనున్నారు. దాంతో లైసెన్సుల జారీలో సమగ్రత, కాలయాపన లేకుండా ఉంటుంది. మొదటి దశలో రాష్ట్రంలో చిత్తూరు, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళంలో ఈ ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్‌లను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇప్పటికే చిత్తూరులోని డ్రైవింగ్ ట్రాక్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మిగిలిన 8 కేంద్రాల్లోనూ త్వరలోనే ట్రాక్‌ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. సమగ్ర పరీక్షల అనంతరమే.. ప్రస్తుతం లైసెన్సుల జారీకి నాలుగంచెల్లో డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షిస్తున్నారు. మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షించి లెర్నింగ్ లైసెన్స్ (ఎల్ఎల్ఆర్), పర్మనెంట్ లైసెన్స్ జారీ చేస్తున్నారు. కాగా ఈ విధానం లోపభూయిష్టంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. తూతూ మంత్రంగా నైపుణ్య పరీక్షలు నిర్వహించి లైసెన్సులు జారీ చేసేస్తున్నారన్న విమర్శలున్నాయి. మరోవైపు లైసెన్సుల జారీలో తీవ్ర కాలయాపన జరుగుతోంది. రోజుకు సగటున 10 వేల వరకు దరఖాస్తులు వస్తున్నాయి. దాంతో పరీక్షల నిర్వహణ, లైసెన్సుల జారీకి ఎక్కువ సమయం పడుతోంది. దీనికి పరిష్కార మార్గంగా డ్రైవింగ్ లైసెన్సుల జారీకి ఆటోమేటెడ్ వ్యవస్థను నెలకొల్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. 24 రకాల నైపుణ్య పరీక్షలు.. ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్‌ల డిజైన్‌ను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) రూపొందించింది. దాంతో ఆధునిక రీతిలో డ్రైవింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేస్తారు. 24 కేటగిరీలుగా డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. వాహనాన్ని ముందుకు నడిపించడంలో 8 రకాలుగా పరీక్షిస్తారు. ఇక రివర్స్, ఎస్ టైప్ రివర్స్, ట్రాఫిక్ జంక్షన్లు, ఓవర్ టేక్ చేయడం, క్రాసింగ్, పార్కింగ్ ఇలా వివిధ రీతుల్లో డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షిస్తూ మొత్తం ప్రక్రియను వీడియో తీస్తారు. డ్రైవింగ్ ట్రాక్‌లలో సెన్సార్లు అమరుస్తారు. వాటిని కంప్యూటర్ గదికి అనుసంధానిస్తారు. డ్రైవింగ్ నైపుణ్య పరీక్షల సమయంలో తప్పు చేస్తే వెంటనే బీప్ శబ్ధం వస్తుంది. ఆ ట్రాక్‌పై డ్రైవింగ్ పరీక్ష పూర్తయ్యేసరికి ఆ విధంగా ఎన్ని బీప్‌లు వచ్చాయో లెక్కించి పాయింట్లు వేస్తారు. అర్హత పాయింట్లు వస్తే ఆటోమెటిక్‌గా లైసెన్సు జారీ చేస్తారు. లేకపోతే ఆటోమెటిక్‌గా లైసెన్సు తిరస్కరిస్తారు. ఆ తరువాత నిర్ణీత గడువు తరువాతే మళ్లీ పరీక్షకు హాజరుకావాలి. తమ డ్రైవింగ్ తీరును అభ్యర్థులు వీడియో ద్వారా చూసి లోటుపాట్లు తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్రంలో 9 ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్‌ల ఏర్పాటును ఏడాదిలోగా పూర్తి చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. సమాధానం ఇచ్చారు. -
ఇక డ్రైవింగ్ ‘పరీక్ష’ లేదు!
సాక్షి, అమరావతి: ఇకపై లైసెన్సు కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో నిర్దేశిత శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్ పొందితే చాలు.. రవాణా శాఖ కార్యాలయం డ్రైవింగ్ లైసెన్సును మంజూరు చేయనుంది. అదే సమయంలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ‘డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు–2022’ నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుత విధానంతో పాటు ఇది కూడా కొనసాగనుంది. కొత్త విధానాన్ని ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. లైసెన్సుల జారీ సులభతరం.. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి పరీక్ష పాస్ కావాలి. థియరీ, ప్రాక్టికల్ పరీక్షల్లో అర్హత సాధించాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చే విధానం ప్రకారం.. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ శిక్షణా కేంద్రం జారీ చేసే సర్టిఫికెట్ కాపీతో పాటు అవసరమైన గుర్తింపు కార్డుల కాపీలు జతచేసి దరఖాస్తు చేస్తే రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్సు ఇస్తుంది. దీనివల్ల లైసెన్సుల కోసం నిరీక్షించే సమయం తగ్గుతుందని.. లైసెన్సుల జారీ విధానం సరళతరం, సులభతరం అవుతుందన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. నిబంధనలు కఠినతరం.. ఈ ప్రక్రియలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల పాత్ర కీలకం కానుండటంతో.. గుర్తింపు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. గుర్తింపు పొందిన శిక్షణా కేంద్రం జారీ చేసే సర్టిఫికెట్‌ను మాత్రమే రవాణా శాఖ పరిగణనలోకి తీసుకోనుంది. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే.. ట్రాక్ కోసం కనీసం ఎకరా భూమి ఉండాలి. భారీ వాహనాల డ్రైవింగ్ స్కూల్‌కు అయితే కనీసం 2 ఎకరాల భూమి ఉండాలి. వాటిలో కేంద్ర మార్గదర్శకాల ప్రకారం టెస్టింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలి. ► డ్రైవింగ్‌పై ప్రాథమికంగా అవగాహన కల్పించేందుకు స్టిమ్యూలేటర్ ఏర్పాటు చేయాలి. ► శిక్షకులు కనీసం ఇంటర్మీడియట్ పాస్ కావడంతో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి. ► ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్ల డ్రైవింగ్ శిక్షణా కాలం కనీసం నాలుగు వారాల్లో 29 గంటల పాటు ఉండాలి. వాటిలో థియరీ క్లాసులు 8 గంటలు, ప్రాక్టికల్ క్లాసులు 21 గంటల పాటు నిర్వహించాలి. ► భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణా కాలం ఆరు వారాల్లో కనీసం 38 గంటలు ఉండాలి. ఇందులో థియరీ క్లాసులు 8 గంటలు, ప్రాక్టికల్ క్లాసులు 30 గంటలు నిర్వహించాలి. ► అన్ని అర్హతలు కలిగిన డ్రైవింగ్ స్కూల్‌కు ఐదేళ్ల పాటు గుర్తింపు ఇస్తారు. అనంతరం రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. -
ఇకపై డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ జారీ..
సాక్షి, న్యూఢిల్లీ : ఇకపై డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్‌లు జారీ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. పౌరులకు డ్రైవింగ్‌లో నాణ్యతతో కూడిన శిక్షణను అందించేందుకు డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు నిర్ధిష్టమైన అర్హతలతో కూడిన ముసాయిదాను రూపొందించింది. ఈ కేంద్రాల్లో డ్రైవింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇది రవాణా పరిశ్రమకు సుశిక్షితులైన డ్రైవర్లను అందించేందుకు తోడ్పడుతుందని, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గిస్తుందని రవాణా మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి పైగా తగ్గించాలనే ధ్యేయంతో రవాణా శాఖ ఈ ముసాయిదాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇటీవల కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ముసాయిదాను రూపొందిస్తుందంటూ పేర్కొన్నారు. -
జీన్స్ వేసుకుందని డ్రైవింగ్ టెస్ట్‌కు నో..
చెన్నై : డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు ఎలాంటి డ్రెస్ కోడ్ లేకున్నా జీన్స్ వేసుకున్న ఓ యువతిని డ్రైవింగ్ టెస్ట్‌కు నిరాకరించిన ఘటన వెలుగుచూసింది. సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేసే ఓ మహిళ జీన్స్, స్లీవ్‌లెస్ టాప్ ధరించి రావడంతో కేకే నగర్‌లోని ఆర్టీవో కార్యాలయ అధికారి ఒకరు ఆమెను డ్రైవింగ్ టెస్ట్‌కు నిరాకరించారు. ఇంటికి వెళ్లి సరైన డ్రైస్‌లో రావాలని తిప్పిపంపినట్టు తెలిసింది. షార్ట్స్‌తో వచ్చిన మరో మహిళను కూడా కుదురైన డ్రెస్ ధరించి రావాలని ఆ అధికారి కోరారు. షార్ట్స్, లుంగీలు, బెర్ముడాస్తో వచ్చిన పురుషులను కూడా పొందికైన డ్రెస్ ధరించి రావాలని కోరామని, అలాగే మహిళలకూ సూచించామని ఆర్టీఏ వర్గాలు పేర్కొన్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసే కార్యాలయం ప్రభుత్వ కార్యాలయమని ఇక్కడకు వచ్చేవారిని సరైన దుస్తులు ధరించాలని కోరడంలో తప్పేముందని ఆర్టీవో అధికారి ప్రశ్నించారు. ఇది మోరల్ పోలీసింగ్ కిందకు రాదని ఆ అధికారి చెప్పుకొచ్చారు. ఎంతో మంది ఇక్కడకు రోజూ వస్తుంటారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా పద్ధతిగా డ్రెస్ చేసుకుని రావాలని మాత్రమే తాము సూచించామని చెప్పారు. -
250 లెసెన్లు.. రూ. 5 లక్షలు...!
లండన్: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఓ మహిళ 14 ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. 31 ఏళ్ల బ్రిటన్ మహిళ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అవిశ్రాంతంగా ప్రయత్నిస్తూనే ఉంది. కెంట్ లోని ఛాథమ్ ప్రాంతానికి చెందిన జనైన్ మార్స్ అనే మహిళ నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోంది. డ్రైవింగ్ టెస్టు పాసయ్యేందుకు 14 ఏళ్లుగా ఆమె విఫలయత్నం చేసింది. ఈ క్రమంలో 250 డ్రైవింగ్ పాఠాల కోసం 5000లకు పైగా పౌండ్లు(సుమారు రూ. 5లక్షలు) ఖర్చు చేసింది. దీంతో ఆమెకు 'బ్రిటీషు వరెస్ట్ డ్రైవర్' గా నామకరణం జరిగిపోయింది. అయినా వెనక్కు తగ్గేది లేదంటోంది మార్స్. ఏదో ఒకరోజు డ్రైవింగ్ టెస్టు పాసవుతానని దీమాగా చెబుతోంది. -
డ్రైవింగ్‌లో మాత్రం వీక్ అని..
ఇరవై నాలుగేళ్ల ‘హ్యారీపాటర్’ స్టార్ సినిమాల్లోనైతే అదరగొడుతున్నాడు గానీ... డ్రైవింగ్‌లో మాత్రం వీక్ అని ఇప్పుడే తెలిసింది. ఇన్నేళ్లుగా మనోడికి డ్రైవింగ్ లెసైన్సే లేదట. ఈస్ట్ లండన్ సబర్బన్ హార్న్చర్చ్లో రీసెంట్గా వేసిన ట్రయల్స్‌లో పాసైపోయాడట. విషయమేమంటే.. ఇదే ఈ హీరోగారి ఫస్ట్ అండ్ లాస్ట్ డ్రైవింగ్ టెస్ట్..! తనను ఎవరూ గుర్తు పట్టలేనంతగా... చింపిరి జుత్తు, మాసిన గడ్డంతో వెళ్లాడట రాడ్‌క్లిఫ్. విషయమేమంటే... అదే సమయంలో టెస్ట్‌లో గట్టెక్కిన జర్రా కషింగ్ అనే అమ్మాయికి కూడా అతడు క్లిఫ్ అని తెలియలేదట! -
హోంగార్డు ఉద్యోగానికి దరఖాస్తు చేయండిలా..
నోటిఫికేషన్ వివరాలు... మొత్తం పోస్ట్‌లు 150 ఎంపికైన వారు హైదరాబాద్ పరిధిలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగం, ప్రత్యేక విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది. భారతీయుడై ఉండాలి. హైదరాబాద్ సిటీ పోలీస్ పరిధిలోని వారై ఉండాలి. ఏడోతరగతి పాసై కనీసం పదేళ్లు పూర్తికావాలి. 50 ఏళ్లలోపు వయస్సు వారే అర్హులు. లైట్ మోటార్, హెవీ వెహికిల్ లెసైన్స్ కలిగి ఉండాలి. అభ్యర్థులు 160 సెం.మీ ఎత్తు ఉండాలి. దరఖాస్తు విధానం... అడిషనల్ డీజీపీ హోంగార్డ్స్, తెలంగాణ పేరిట దరఖాస్తు చేయాలి. ఇందుకు ttp://www.hyderabadpolice.gov.in/HGForm.pdf లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుకు ఆఖరు తేదీ... అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తులో ఉన్న కాలమ్స్‌లో వివరాలు పూరించండి. విద్యార్హత పత్రాలు, వయస్సు ధ్రువీకరించే పత్రం, వాహన లెసైన్స్ జిరాక్స్ జత చేయాలి. 4 పాస్‌పోర్ట్ కలర్ ఫొటోలు. స్థానికత ధ్రువీకరణ పత్రం. రూ.25 రుసుమును దరఖాస్తుతో ఇవ్వాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఆ రుసుం ఉండదు) చెక్‌లు, డీడీలు అనుమతించరు. దరఖాస్తులను 22-11-2014లోపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు జామ్‌బాగ్‌లోని గోషామహల్ స్టేడియంలో అందజేయాలి. దరఖాస్తును పోస్ట్ లేదా ఇతరుల ద్వారా పంపకూడదు. అభ్యర్థే స్వయంగా సంబంధిత అధికారికి సమర్పించాలి. అప్పటికప్పుడు దరఖాస్తును పరిశీలించి హాల్‌టికెట్ జారీ చేస్తారు. అభ్యర్థుల ఎంపిక విధానం... డ్రైవింగ్ స్కిల్స్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలు ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తారు. వీటితోపాటుగా మెడికల్‌గా ఫిట్నెస్ ఉన్నట్టు ధ్రువీకరణ వస్తేనే ఎంపిక చేస్తారు. గమనిక: దరఖాస్తులు అమ్మబడవు. ఏ పోలీస్ స్టేషన్లోనూ అందుబాటులో ఉండవు. కేవలం పైన పేర్కొన్న వెబ్‌లో నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. హెచ్చరిక: దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ధ్రువీకరణ పత్రాలు కచ్చితంగా ఉండాలి. ఒక వేళ తప్పుడు ధ్రువీకరణతో ఎంపికైనా మధ్యలో జరిగే విచారణలో బహిర్గతమైతే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే విధుల నుంచి తొలగిస్తారు.