![250 లెసెన్లు.. రూ. 5 లక్షలు...!](/styles/webp/s3/article_images/2017/09/2/81427084695_625x300.jpg.webp?itok=AkPDQp-E)
250 లెసెన్లు.. రూ. 5 లక్షలు...!
లండన్: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఓ మహిళ 14 ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. 31 ఏళ్ల బ్రిటన్ మహిళ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అవిశ్రాంతంగా ప్రయత్నిస్తూనే ఉంది. కెంట్ లోని ఛాథమ్ ప్రాంతానికి చెందిన జనైన్ మార్స్ అనే మహిళ నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోంది.
డ్రైవింగ్ టెస్టు పాసయ్యేందుకు 14 ఏళ్లుగా ఆమె విఫలయత్నం చేసింది. ఈ క్రమంలో 250 డ్రైవింగ్ పాఠాల కోసం 5000లకు పైగా పౌండ్లు(సుమారు రూ. 5లక్షలు) ఖర్చు చేసింది. దీంతో ఆమెకు 'బ్రిటీషు వరెస్ట్ డ్రైవర్' గా నామకరణం జరిగిపోయింది. అయినా వెనక్కు తగ్గేది లేదంటోంది మార్స్. ఏదో ఒకరోజు డ్రైవింగ్ టెస్టు పాసవుతానని దీమాగా చెబుతోంది.