మనలో చాలా మందికి పీడకలలు వస్తుంటాయి. ఉలిక్కిపడి లేచి హమ్మయ్య నిజం కాదు గదా అని ఊపిరి పీల్చుకుంటాం. అయితే తమ కలలు చాలావరకు నిజం అవుతూ ఉంటాయని కొంతమంది చెబుతారు. యూకేలోని మహిళకు ఇలాగే జరిగిందట. తన కలే తన జీవితాన్ని కాపాడింది అంటోంది.. వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.
మెట్రో నివేదిక ప్రకారం యూకేకు చెందిన వ్యాపారవేత్త 46 ఏళ్ల షార్లెట్ వ్రోకి ఒక విచిత్రమైన కల(2021లో ) వచ్చింది. తనకు రొమ్ములో ఒక గడ్డ ఉన్నట్టు, డాక్టరు మాట్లాడుతున్నట్టు కల వచ్చింది. అంతేకాదు ఆ వైద్యుడు బ్రెస్ట్ కేన్సర్ అని చెప్పినట్టుగా కూడా చాలా స్పష్టంగా వినిపించింది. దీంతో చటుక్కున మెలకువ వచ్చింది. అప్పటికి సమయం తెల్లవారుజామున 4 గంటలు అయింది.
లేచి భయంతోనే రొమ్ములను చెక్ చేసుకుంది. నిజంగానే కలలో కనిపించిన ప్రదేశంలోనే చేతికి ఒక ముద్దలాగా తగిలింది. ఇది కలా? నిజమా అనుకుంటూనే వెంటనే వైద్యులను సంప్రదించింది. స్కానింగ్‌లు, పరీక్షల తరువాత ఆమెకు ట్రిపుల్ నెగెటివ్ కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. భర్త, పిల్లల సహకారంతో కేన్సర్ చిక్సితను మొదలు పెట్టింది. కీమోథెరపీ చేయించుకుంది. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు మాస్టెక్టమీ, రేడియోథెరపీ ,మళ్లీ కీమోథెరపీలు జరిగాయి. చివరికి 2023 మార్చి నాటికి ఆమెకు కేన్సర్ నయమైంది.
''నా కలలు..సినిమా చూస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంటాయి. నిజంగా ఆకలవల్లే భయంకరమైన కేన్సర్‌ను తొందరగార్తించి జయించగలిగాను లేదంటే పరిస్థితి ఏంటో ఊహించడానికి కూడా భయంగా ఉంది. కొంతమంది ఇది యాదృచ్ఛికం అన్నారు. కానీ విశ్వం లేదా మరెవరో ముందస్తుగా నన్ను ఇలా హెచ్చరించి ఉంటారనే కచ్చితంగా నమ్ముతున్నాను. ఎప్పటికీ కృతజ్ఞురాలిని’’
కాగాభవిష్యత్తు గురించి సమాచారం అందించే, లేదా హెచ్చరించే కలలను ''ప్రికోగ్నిటివ్ డ్రీమ్స్'' అంటారట. 900 మందిపై జరిపిన ఒక అమెరికన్ అధ్యయనంలో 33 శాతం మంది పాల్గొనేవారు ఒక కలను గుర్తుకు తెచ్చుకోవడం, ఆ కల నిజం కావడం సంభవించిందట.
Comments
Please login to add a commentAdd a comment