UK woman
-
కలే నిజమైంది.. ప్రాణాలు కాపాడింది!
మనలో చాలా మందికి పీడకలలు వస్తుంటాయి. ఉలిక్కిపడి లేచి హమ్మయ్య నిజం కాదు గదా అని ఊపిరి పీల్చుకుంటాం. అయితే తమ కలలు చాలావరకు నిజం అవుతూ ఉంటాయని కొంతమంది చెబుతారు. యూకేలోని మహిళకు ఇలాగే జరిగిందట. తన కలే తన జీవితాన్ని కాపాడింది అంటోంది.. వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.మెట్రో నివేదిక ప్రకారం యూకేకు చెందిన వ్యాపారవేత్త 46 ఏళ్ల షార్లెట్ వ్రోకి ఒక విచిత్రమైన కల(2021లో ) వచ్చింది. తనకు రొమ్ములో ఒక గడ్డ ఉన్నట్టు, డాక్టరు మాట్లాడుతున్నట్టు కల వచ్చింది. అంతేకాదు ఆ వైద్యుడు బ్రెస్ట్ కేన్సర్ అని చెప్పినట్టుగా కూడా చాలా స్పష్టంగా వినిపించింది. దీంతో చటుక్కున మెలకువ వచ్చింది. అప్పటికి సమయం తెల్లవారుజామున 4 గంటలు అయింది.లేచి భయంతోనే రొమ్ములను చెక్ చేసుకుంది. నిజంగానే కలలో కనిపించిన ప్రదేశంలోనే చేతికి ఒక ముద్దలాగా తగిలింది. ఇది కలా? నిజమా అనుకుంటూనే వెంటనే వైద్యులను సంప్రదించింది. స్కానింగ్‌లు, పరీక్షల తరువాత ఆమెకు ట్రిపుల్ నెగెటివ్ కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. భర్త, పిల్లల సహకారంతో కేన్సర్ చిక్సితను మొదలు పెట్టింది. కీమోథెరపీ చేయించుకుంది. ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు మాస్టెక్టమీ, రేడియోథెరపీ ,మళ్లీ కీమోథెరపీలు జరిగాయి. చివరికి 2023 మార్చి నాటికి ఆమెకు కేన్సర్ నయమైంది.''నా కలలు..సినిమా చూస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉంటాయి. నిజంగా ఆకలవల్లే భయంకరమైన కేన్సర్‌ను తొందరగార్తించి జయించగలిగాను లేదంటే పరిస్థితి ఏంటో ఊహించడానికి కూడా భయంగా ఉంది. కొంతమంది ఇది యాదృచ్ఛికం అన్నారు. కానీ విశ్వం లేదా మరెవరో ముందస్తుగా నన్ను ఇలా హెచ్చరించి ఉంటారనే కచ్చితంగా నమ్ముతున్నాను. ఎప్పటికీ కృతజ్ఞురాలిని’’కాగాభవిష్యత్తు గురించి సమాచారం అందించే, లేదా హెచ్చరించే కలలను ''ప్రికోగ్నిటివ్ డ్రీమ్స్'' అంటారట. 900 మందిపై జరిపిన ఒక అమెరికన్ అధ్యయనంలో 33 శాతం మంది పాల్గొనేవారు ఒక కలను గుర్తుకు తెచ్చుకోవడం, ఆ కల నిజం కావడం సంభవించిందట. -
చనిపోయిన తర్వాత మరో జన్మ ఉంటుందా? యూకేలో వింత ఘటన
చనిపోయిన తర్వాత మళ్లీ బతకడం సాధ్యమేనా? కానీ ఈ వింత సంఘటన నిజంగానే జరిగింది. లండన్‌కు చెందిన ఓ మహిళ చనియినట్లు నిర్థారించిన 40 నిమిషాల తర్వాత ప్రాణాలతో బయటపడింది. స్పృహలో లేని ఆ సమయంలో చావు అంచుల దాకా వెళ్లొచ్చిన ఆమె తనకు ఎలాంటి అనుభూతి ఎదురయ్యిందో సోషల్ మీడియాలో పంచుకుంది. ''చనిపోయాక మనిషికి ఇంకో జన్మ ఉంటుందా? అనిపిస్తుంది. ఎందుకంటే మళ్లీ బతుకుతాను అన్న ఆశ లేని సమయంలో జీవితం మరో అవకాశాన్ని ప్రసాదించింది. ఆరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా భర్త స్టూ, నేను డిన్నర్ డేట్‌కు ప్లాన్ చేసుకున్నాం. ఇంకాసేపట్లో బయలుదేరుతున్నాం అనుకునేలోపు సోఫాలో కుప్పకూలిపోయాను. స్టూ ఎంత పిలుస్తున్నా నాలో ఎలాంటి చలనం లేదు. నా ఆత్మ నా శరీరం నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది. ఇంతలో నన్ను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లడం, వాళ్లు పరీక్షించి బతికే అవకాశాలు లేవని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది. నా కుటుంసభ్యులకు కూడా ఇదే విషయం చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పారు. నన్ను పరీక్షించిన తర్వాత చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు కూడా. కానీ నన్ను నేనే నమ్మలేకపోతున్నా. కోమాలోకి వెళ్లిన దాదాపు 40 నిమిషాల తర్వాత నాకు స్పృహ వచ్చి ఇప్పుడు మళ్లీ మామూలు మనిషి అయిపోయాను'' అంటూ క్రిస్టీ బోర్టోస్ తెలిపింది. ఆమె చనిపోయిందని ప్రకటించిన 40 నిమిషాల తర్వాత క్రిస్టీ ప్రాణాలతో బయటపడడం డాక్టర్లను కూడా ఆశ్చర్యపరిచింది. మెదడుకు 5 నుంచి 10 నిమిషాల పాటు ఆక్సిజన్ అందకపోతే మనిషి బతికే ఛాన్స్ లేదు. మరి క్రిస్టీ విషయంలో జరిగిన మెడికల్ మిరాకిల్ ఏంటన్నది ఇప్పటికీ వైద్యులకు అర్థం కావడం లేదు. గతంలోనూ పలుమార్లు ఆమె గుండెపోటుకు గురయ్యింది. అలాంటిది దాదాపు చావు వరకు వెళ్లి తిరిగిరావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మెదడుకు ఎక్కువ కాలం ఆక్సిజన్ అందకపోతే దెబ్బతింటుంది. కానీ క్రిస్టీని పరీక్షించినప్పుడు ఆమెకు గుండె, ఊపిరితిత్తులు, మెదడు అన్నీ అవయవాలు బాగానే ఉన్నాయని పరీక్షల్లో వెల్లడి కావడం మరో ఆశ్చర్యం. -
మెక్‌డోనాల్డ్స్ హ్యాపీ మీల్ ఆర్డర్ చేస్తున్నారా ? ఈ మహిళ షాకింగ్ అనుభవం తెలిస్తే..!
UK Woman Finds Cigarette Butt In Child Happy Meal At McDonald: ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డోనాల్డ్స్‌లో యూకేకు చెందిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తన ఇద్దరు చిన్నారుల కోసం మెక్‌డొనాల్డ్స్‌లో హ్యాపీ మీల్‌ను ఆర్డర్ చేసింది. బిడ్డల ఆకలి తీర్చాలన్న ఆమె ఆరాటం కాస్తా ప్యాకెట్ విప్పిన చూసాక ఆవిరైపోయింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. గెమ్మా కిర్క్-బోనర్ ఇంగ్లాండ్‌లోని బారో-ఇన్-ఫర్నెస్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ నుండి పిల్లల హ్యాపీ మీల్‌ను కొనుగోలు చేసింది. రెండు ఫిష్ ఫింగర్ హ్యాపీ మీల్స్‌ను ఇంటికి తీసుకెళ్లింది. ఒక ప్యాకెట్ విప్పి పెద్దకుమారుడు జాక్సన్(3)కి ఇచ్చింది. మరో మీల్ ఓపెన్ చేసిన ఏడాది వయస్సున్న చిన్న కుమారుడు కాలేబ్‌కు తినిపించాలని ప్రయత్నిస్తుండగా అందులో కాల్చి పారేసిన సిగరెట్ పీక, బూడిదను గమనించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చిన్న పిల్లాడికి తీనిపిస్తూ తాను చూశాను గనుక సరిపోయింది.. అదే పెద్దవాడు చూడకుండా తినేసి ఉంటే అన్న ఆలోచనే ఆమెలో అసహ్యాన్ని, ఆందోళననూ రేపింది. మరొకరికి తనలాంటి అనుభవం ఎదురు కాకూడదంటూ ఈ విషయాన్ని ఫోటోతో సహా ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. సిగరెట్ పీక, బూడిదతో ఇపుడు అదనపు రుచి అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు దీనిపై ఫిర్యాదు చేయబోగా డాల్టన్ రోడ్‌లోని మెక్‌డొనాల్డ్స్ బ్రాంచ్ మేనేజర్ కటువుగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడని కూడా పేర్కొంది. ఈ వ్యవహారంలో తనకు న్యాయం కావాలని, కంపెనీ క్షమాపణ చెప్పాలని కోరుతోంది. దీనిపై స్పందించిన ఫ్రాంచైజీ కస్టమర్ల సంతృప్తి, ఆహార భద్రతే తమకు తొలి ప్రాధాన్యమని వెల్లడించింది. ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
కొన్న రేటు రూ. 500.. అమ్మింది ఏమో రూ. 16 లక్షలకు!!!
Wooden Chair Bought From Junk Shop Brings Luck For UK Lady: అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. ‘టకాటకా’మని బాదినప్పుడే తలుపు తీయాలి. ఓ మహిళ అలా చేసింది కాబట్టే ఇంట కాసుల వర్షం కురిసింది. జంక్ షాపులో కొన్న ఓ పాత కుర్చీ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఎలాగో ఇది చదవండి.. ఈస్ట్ సస్సెక్స్(యూకే) బ్రిగ్టన్కు చెందిన ఓ మహిళ.. పాత సామాన్లు అమ్మే ఓ షాపు నుంచి ఆమధ్య ఓ కుర్చీ కొనుక్కుంది. దాని ధర 5 పౌండ్లు(మన కరెన్సీలో 500రూ. దాకా). అయితే అప్పుడు దాని విలువ ఆమెకి తెలియదు. పాత సామాన్లపై ఆసక్తి ఉన్న ఓ దగ్గరి బంధువు ఆ కుర్చీ మీద వేసిన డేట్ చూశాడు. స్టడీ చేసి దాని గొప్పతనం గురించి చెప్పడంతో ఆమె దానిని వేలంపాటకు తీసుకెళ్లింది. వేలంలో ఆమెకు 16, 250 పౌండ్లు వచ్చాయి. మన కరెన్సీలో దాని విలువ రూ. 16 లక్షల 40 వేల రూపాయలకు పైనే. ఆ కుర్చీ 20వ శతాబ్దంలో వియన్నా(ఆస్ట్రియా) ఎవంట్ గార్డే ఆర్ట్ స్కూల్‌కి చెందిందట. ఆస్ట్రియన్ పెయింటర్ కోలోమన్ మోసర్ 1902లో దానిని డిజైన్ చేశాడట. కోలోమన్ సంప్రదాయ శైలిలను వ్యతిరేకిస్తూ.. మోడ్రన్ ఆర్ట్ వర్క్ ద్వారా ఆస్ట్రియాలో పేరు సంపాదించుకున్నారు. నిచ్చెన తరహా స్టైల్లో పట్టీలను ఉపయోగించి ఆ కుర్చీనీ రూపొందించారాయన. ఇదంతా తెలిశాక ఆ మహిళ ఆ పాత కుర్చీతో ఎస్సెక్స్‌లోని స్వోడర్స్ యాక్షనీర్స్ ఆఫ్ మౌంట్ఫిట్చెట్ వాళ్లను సంప్రదించింది. వాళ్లు దానిని వేలం వేయగా.. ఆస్ట్రియాకు చెందిన ఓ డీలర్ దానిని 16,250 పౌండ్లు చెల్లించి దక్కించుకున్నాడు. విశేషం ఏంటంటే.. 120 ఏళ్లు గడుస్తున్నా కుర్చీ ఇంకా ఒరిజినల్ కండిషన్లోనే ఉండడం. చదవండి: వాసి వాడి తస్సాదియ్యా! 23 ఏళ్లకే 400 కోట్ల సంపాదన! -
ఏడాది పిల్లాడితో ఐసిస్‌లో చేరింది!
లండన్: ఏడాది వయస్సున్న పిల్లాడిని తీసుకొని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపులో చేరేందుకు సిరియా వెళ్లిందో బ్రిటన్ మహిళ. అక్కడ పరిస్థితులు బాగలేకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ బ్రిటన్‌లో అడుగుపెట్టింది. ఈ మేరకు తరీనా షకిల్ (26)ను కోర్టు దోషిగా తేలింది. ఐసిస్ (ఐఎస్ఐఎస్) సభ్యురాలిగా ఉండి ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించినందుకు బ్రిటన్ కోర్టు ఆమెను దోషిగా ప్రకటించింది. సోమవారం తరీనాకు శిక్ష ఖరారు కానుంది. దీంతో సిరియా వెళ్లి తిరిగి బ్రిటన్ వచ్చిన తొలి మహిళ నేరస్తురాలిగా పేరుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2014 అక్టోబర్ నెలలో తరీనా తన ఏడాది కొడుకుతోపాటు ఓ విమానంలో టర్కీ వెళ్లింది. అక్కడి నుంచి సిరియా సరిహద్దులు దాటి ఐసిస్ పేర్కొంటున్న కలిఫత్లో చేరింది. అక్కడ మూడు నెలలు గడిపిన అనంతరం గత ఏడాది ఫిబ్రవరిలో బ్రిటన్ తిరిగి వచ్చింది. ఆమెను బ్రిటన్ రాగానే ఉగ్రవాద నిరోధక దళం అధికారులు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్టు, పిల్లాడిని నిర్లక్ష్యం చేసినట్టు అభియోగాలు మోపారు. ఏడాది చిన్నారిని తల్లి నుంచి వేరుచేసి ఓ సంరక్షణ గృహానికి తరలించారు. అయితే పోలీసుల ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. కఠినమైన ఇస్లామిక్ చట్టాల ప్రకారం జీవించాలనే సిరియా వెళ్లానని, తాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడలేదని చెప్పుకొచ్చింది. అయితే ఐసిస్ ఉగ్రవాదులతో, ఆ గ్రూపు జెండాతో ఆమె దిగిన ఫొటోలు, ఆమె సిరియాకు వెళ్లేముందు ఐసిస్‌లో చేరాలంటూ పిలుపునిస్తూ చేసిన ట్వీట్లను పోలీసులు ఆధారాలుగా కోర్టు ముందు ఉంచారు. దీంతో ఆమెను కోర్టు దోషిగా ఖరారు చేసింది. -
ఫ్లవర్ వాజ్ అనుకొని ఫిరంగిలో పూలుపెట్టి..
లండన్: అది మొదటి ప్రపంచయుద్ధంనాటి పేలని ఫిరంగి గుండు. దాని గురించి తెలియని ఓ బ్రిటన్ మహిళ తనకు పదిహేనేళ్లు ఉన్నప్పటి నుంచి దానిని ఫ్లవర్ వాజ్గా ఉపయోగించింది. ప్రస్తుతం ఆమెకు 45 ఏళ్లు. అంటే దాదాపుగా 30 ఏళ్లుగా దానిని అలాగే వాడుతోంది. ఇటీవల అది ఫిరంగి తెలియడంతో అవాక్కయి అదిరిపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని కావెంట్రీ అనే ప్రాంతలో కేథరిన్ రాలిన్ అనే మహిళ ఉంటోంది. ఆమెకు 15 ఏళ్లు ఉన్న సమయంలో ఓ పాఠశాలకు సమీపంలో ఆడుకుంటుండగా ఓ ఫిరంగి గుండు దొరికింది. అయితే, దానిని ఇంటికి తీసుకెళ్లిన కేథరిన్ దానిని ఒక ఫ్లవర్ వాజ్గా భావించి అందులో తనకు ఇష్టమైన ప్లాస్టిక్ పూలను పెట్టి అలంకరించుకుంటోంది. అది లైవ్ బాంబ్ అని ఆమెకు తెలియదు కూడా. ఈ ఫిరంగి గుండుని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ సేనలు జారవిడిచాయి. కానీ అప్పట్లో అది పేలలేదు. ఇయితే ఇటీవల ఆమె ఓ డాక్యుమెంటరీని వీక్షించింది. అందులో నాడు జర్మనీ సేనలు కావెంట్రీ ప్రాంతంలో ఓ బాంబును జారవిడిచాయని, కానీ అది పేలలేదని దాని ఛాయా చిత్రాలు కూడా చూపించింది. దీంతో తొలుత అదిరిపడింది. అది పేలితే ఓ ఇళ్లును నేలమట్టం చేయడంతోపాటు 20 మీటర్ల ప్రాంతాన్ని ధ్వంసం చేస్తుందని కూడా పోలీసులు ఆ డాక్యుమెంటరీలో చెప్పారు. దీంతో ఆమెకు గుండెలు జారినంతపనైంది. దీంతో పోలీసులు వచ్చి దానిని తీసుకెళ్లి చివరకు అందులోని పేలుడు పదార్థాన్ని తొలగించి తిరిగి ఆమెకే ఆ వస్తువును అప్పగించడంతో మళ్లీ ఫ్లవర్ వాజ్గా వాడుకుంటోంది. ప్రస్తుతం ఇద్దరు బిడ్డల తల్లి అయిన కేథరిన్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. -
250 లెసెన్లు.. రూ. 5 లక్షలు...!
లండన్: డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఓ మహిళ 14 ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. వినడానికి వింతగా ఉన్న ఇది నిజం. 31 ఏళ్ల బ్రిటన్ మహిళ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అవిశ్రాంతంగా ప్రయత్నిస్తూనే ఉంది. కెంట్ లోని ఛాథమ్ ప్రాంతానికి చెందిన జనైన్ మార్స్ అనే మహిళ నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోంది. డ్రైవింగ్ టెస్టు పాసయ్యేందుకు 14 ఏళ్లుగా ఆమె విఫలయత్నం చేసింది. ఈ క్రమంలో 250 డ్రైవింగ్ పాఠాల కోసం 5000లకు పైగా పౌండ్లు(సుమారు రూ. 5లక్షలు) ఖర్చు చేసింది. దీంతో ఆమెకు 'బ్రిటీషు వరెస్ట్ డ్రైవర్' గా నామకరణం జరిగిపోయింది. అయినా వెనక్కు తగ్గేది లేదంటోంది మార్స్. ఏదో ఒకరోజు డ్రైవింగ్ టెస్టు పాసవుతానని దీమాగా చెబుతోంది.