చనిపోయిన తర్వాత మళ్లీ బతకడం సాధ్యమేనా? కానీ ఈ వింత సంఘటన నిజంగానే జరిగింది. లండన్‌కు చెందిన ఓ మహిళ చనియినట్లు నిర్థారించిన 40 నిమిషాల తర్వాత ప్రాణాలతో బయటపడింది. స్పృహలో లేని ఆ సమయంలో చావు అంచుల దాకా వెళ్లొచ్చిన ఆమె తనకు ఎలాంటి అనుభూతి ఎదురయ్యిందో సోషల్ మీడియాలో పంచుకుంది.
''చనిపోయాక మనిషికి ఇంకో జన్మ ఉంటుందా? అనిపిస్తుంది. ఎందుకంటే మళ్లీ బతుకుతాను అన్న ఆశ లేని సమయంలో జీవితం మరో అవకాశాన్ని ప్రసాదించింది. ఆరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా భర్త స్టూ, నేను డిన్నర్ డేట్‌కు ప్లాన్ చేసుకున్నాం. ఇంకాసేపట్లో బయలుదేరుతున్నాం అనుకునేలోపు సోఫాలో కుప్పకూలిపోయాను. స్టూ ఎంత పిలుస్తున్నా నాలో ఎలాంటి చలనం లేదు. నా ఆత్మ నా శరీరం నుంచి వెళ్లిపోయినట్లుగా అనిపించింది.
ఇంతలో నన్ను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లడం, వాళ్లు పరీక్షించి బతికే అవకాశాలు లేవని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది. నా కుటుంసభ్యులకు కూడా ఇదే విషయం చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పారు. నన్ను పరీక్షించిన తర్వాత చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు కూడా. కానీ నన్ను నేనే నమ్మలేకపోతున్నా. కోమాలోకి వెళ్లిన దాదాపు 40 నిమిషాల తర్వాత నాకు స్పృహ వచ్చి ఇప్పుడు మళ్లీ మామూలు మనిషి అయిపోయాను'' అంటూ క్రిస్టీ బోర్టోస్ తెలిపింది.
ఆమె చనిపోయిందని ప్రకటించిన 40 నిమిషాల తర్వాత క్రిస్టీ ప్రాణాలతో బయటపడడం డాక్టర్లను కూడా ఆశ్చర్యపరిచింది. మెదడుకు 5 నుంచి 10 నిమిషాల పాటు ఆక్సిజన్ అందకపోతే మనిషి బతికే ఛాన్స్ లేదు. మరి క్రిస్టీ విషయంలో జరిగిన మెడికల్ మిరాకిల్ ఏంటన్నది ఇప్పటికీ వైద్యులకు అర్థం కావడం లేదు.
గతంలోనూ పలుమార్లు ఆమె గుండెపోటుకు గురయ్యింది. అలాంటిది దాదాపు చావు వరకు వెళ్లి తిరిగిరావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మెదడుకు ఎక్కువ కాలం ఆక్సిజన్ అందకపోతే దెబ్బతింటుంది. కానీ క్రిస్టీని పరీక్షించినప్పుడు ఆమెకు గుండె, ఊపిరితిత్తులు, మెదడు అన్నీ అవయవాలు బాగానే ఉన్నాయని పరీక్షల్లో వెల్లడి కావడం మరో ఆశ్చర్యం.
Comments
Please login to add a commentAdd a comment