డ్రైవింగ్‌.. ట్రాక్‌లో పడేలా | Modern driving test tracks to get license | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌.. ట్రాక్‌లో పడేలా

Published Mon, Jul 8 2024 5:47 AM | Last Updated on Mon, Jul 8 2024 5:47 AM

Modern driving test tracks to get license

సరిగా వాహనం నడపగలిగితేనే

లైసెన్స్‌ వచ్చేలా ఆధునిక డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లు 

సిటీలోని నాగోల్‌ ఆర్టీఏలో ఏర్పాటు చేసిన రవాణా శాఖ

డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలి.. మొదట లెర్నింగ్ లైసెన్స్‌ తీసుకున్నారు..ఏదో డ్రైవింగ్‌ స్కూల్‌లో చేరి కొన్ని రోజులు నేర్చుకున్నారు.. డ్రైవింగ్‌ టెస్టులో పాసయ్యేంత నైపుణ్యం లేకున్నా..ఎవరో ఏజెంట్‌నో, దళారీనో పట్టుకుని లైసెన్స్‌ సంపాదించేశారు. ఇదంతా బాగానే ఉంది..మరి వచ్చిరాని డ్రైవింగ్‌తో బండి వేసుకుని రోడ్డెక్కితే? ఏదైనా ప్రమాదానికి కారణమైతే? ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. సిటీలోని నాగోల్‌లో ఆధునిక డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. డ్రైవింగ్‌ సరిగ్గా నేర్చుకుని, ట్రాక్‌పై నిరీ్ణత ప్రమాణాల మేరకు నడిపితేనే.. లైసెన్స్‌  చేతికి వస్తుంది. లేకుంటే ఫెయిలే మరి.

సాక్షి, హైదరాబాద్‌
డ్రైవింగ్‌ లైసెన్స్‌ల కోసం వచ్చేవారికి రవాణా శాఖ తనిఖీ అధికారులే పరీక్షలు నిర్వహించి లైసెన్స్‌లను అందజేసే పద్ధతి చాలాకాలం నుంచి కొనసాగుతోంది. మాన్యువల్‌గా సాగుతున్న ఈ పద్ధతికి స్వస్తి చెప్పి.. మోటారు వాహన చట్టం నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ల ఆధునీకరణకు రవాణాశాఖ సిద్ధమైంది. ఆటోమేటిక్‌ పద్ధతిలో ట్రాక్‌ల నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో నిరీ్ణత ప్రమాణాల మేరకు వాహనం నడిపితేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌ లభించనుంది. ఈ క్రమంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం టెస్టుకు వచ్చేవారు ఎలాంటి దొడ్డిదారి మార్గాలను అన్వేíÙంచకుండా.. బాగా శిక్షణ తీసుకుని డ్రైవింగ్‌లో నైపుణ్యం సంపాదించాలని హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ సి.రమేశ్‌ స్పష్టం చేస్తున్నారు. 

వాహనాల వినియోగం పెరుగుతూ.. 
ఇప్పుడు చాలా మందికి బైక్‌ లేదా కారు నిత్యావసరంగా మారింది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, మహిళలు అన్ని వర్గాల వారు వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్నారు. ఏటా వేలాది మంది కొత్తగా డ్రైవింగ్‌ నేర్చుకుని, వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. రవాణా రంగంలో డ్రైవర్లుగా చేరుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గత మూడేళ్లలో సుమారు 62 లక్షల మంది డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తీసుకోవడం విశేషం. అయితే చాలా మంది ఎలాంటి డ్రైవింగ్‌ టెస్ట్‌ లేకుండా వచ్చేస్తే బాగుంటుందని భావిస్తుంటారు. ఇందుకోసం ఏజెంట్లను, మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. సరిగా నేర్చుకోకుండా, టెస్టుకు హాజరుకాకుండా తప్పుడు పద్ధతుల్లో లైసెన్సు తీసుకుని.. అరకొర అనుభవంతో బండి నడిపితే ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది.

⇒ ఇన్నాళ్లూ కొనసాగిన మొక్కుబడి డ్రైవింగ్‌ టెస్టులకు చెల్లుచీటీ 
⇒ రహదారులపై ఉండే ఇబ్బందులను తలపించేలా ట్రాక్‌లో ఏర్పాట్లు 
⇒ లైసెన్స్‌ కోసం వచ్చేవారు ఎలా నడపగలుగుతున్నారో పరిశీలన 
⇒ఆటోమేటిక్‌ పద్ధతిలో ట్రాక్‌ల నిర్వహణ
⇒ టెస్ట్‌ వివరాలన్నీ కంఫ్యూటర్‌లో నిక్షిప్తం 
⇒ ప్రమాణాల మేరకు డ్రైవింగ్‌ చేయకుంటే ఫెయిలే

ట్రాక్‌లో టెస్టు ఇలా..
వాహనదారుల డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని పరీక్షించేందుకు రకరకాల ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. కారు నడిపేవారు ఈ అన్ని ట్రాక్‌లలో తమ నైపుణ్యాన్ని చూపాల్సి ఉంటుంది. అలాగే ద్విచక్ర వాహన దారులు, భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు కూడా ప్రత్యేక ట్రాక్‌లు ఉన్నాయి.

ట్రాక్‌ ‘హెచ్‌’:
    వాహనం ముందుకు వెళ్లిన తరువాత రివర్స్‌ చేయాల్సి వస్తే.. ఎలా తీసుకొంటారో తెలుసుకొనేందుకే ఈ ట్రాక్‌. 
ట్రాక్‌ ‘ఎస్‌’:
    ఒక మూల నుంచి మరో మూలకు టర్న్‌ చేయాల్సి వచి్చనప్పుడు ఎలాంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారో ఈ ట్రాక్‌లో తెలుస్తుంది. 
ట్రాక్‌ ‘8’:
    బాగా మలుపులున్న రోడ్డుపై ఎలా ముందుకు వెళ్తున్నారో తెలుసుకొనేందుకు ఇది దోహదం చేస్తుంది. 
ఎత్తుపల్లాల ట్రాక్‌:
⇒ ఎత్తైన ప్రదేశాలు, చిన్న లోయ వంటి ప్రాంతాల్లో ఎలా నడపగలరో పరిశీలించేందుకు ఇవి ఏర్పాటు చేశారు.

 ⇒చివరగా బండి పార్కింగ్‌ చేసే పద్ధతిని కూడా పరీక్షిస్తారు.  

⇒టెస్ట్‌కు హాజరయ్యే సమయంలో ఫోర్‌ వీలర్‌ అయితే సీట్‌ బెల్ట్,ద్విచక్రవాహనమైతే హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి. లేకుంటే ఫెయిల్‌ చేస్తారు. 
⇒ ట్రాక్‌లలో నడిపేటప్పుడు ఎలాంటి తప్పిదాలు చేసినా ఫెయిల్‌ అయినట్టుగా నిర్ధారిస్తారు. ఇలా ఫెయిలైన వారు మరోనెల పాటు
శిక్షణ తీసుకొని హాజరుకావాల్సి ఉంటుంది.

రోజూ వందలాది మందికి డ్రైవింగ్‌ టెస్టులు..
గ్రేటర్‌ హైదరాబాద్‌లో నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, బండ్లగూడలలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ల ద్వారా రవాణా శాఖ డ్రైవింగ్‌ పరీక్షలను నిర్వహిస్తోంది. రోజూ వందలాది మంది ఈ టెస్టులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో దేశంలోనే అత్యాధునిక డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌ను నాగోల్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న 12 ట్రాక్‌లలో రోజూ వందల మందికి డ్రైవింగ్‌ టెస్టు చేస్తున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు నడిపేందుకు వేర్వేరు ట్రాక్‌లు ఉన్నాయి. అలాగే బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలను నడిపేవారికి టెస్టుల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. అనంతరం దశలవారీగా కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్‌ తదితర ఆర్టీఏలలోనూ ట్రాక్‌లను విస్తరించారు. 

నెలరోజులకే ‘టెస్టు’కు వస్తూ.. : అభ్యర్థులు తొలుత లెర్నింగ్‌ లైసెన్సు తీసుకుని డ్రైవింగ్‌ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెల రోజుల నుంచి 6 నెలలలోపు ఎప్పుడైనా డ్రైవింగ్‌ టెస్టు పాసై.. హాజరై శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్సు పొందవచ్చు. డ్రైవింగ్‌లో పట్టుసాధించాకే లైసెన్సు అందేలా ఈ నిబంధన అమలవుతోంది. కానీ చాలా మంది తూతూమంత్రంగా డ్రైవింగ్‌ నేర్చుకుని.. నెల రోజులకే టెస్టుకు హాజరవుతున్నారు. డ్రైవింగ్‌ పూర్తిగా రాకపోయినా, అడ్డదారిలో లైసెన్స్‌ పొందేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇకపై అలాంటి వాళ్లు టెస్టులో చిక్కులు ఎదుర్కోక తప్పదని నాగోల్‌ ప్రాంతీయ రవాణా అధికారి రవీందర్‌ తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరుకావాలని.. ఆ టెస్ట్‌ వివరాలను కంఫ్యూటర్‌లో నమోదు చేసి, ఉత్తీర్ణులుగా నిర్ధారణ అయితేనే లైసెన్స్‌ ఇస్తారని వెల్లడించారు.

నైపుణ్యం ఉంటే కష్టమేమీ కాదు 
ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వాహనం తప్పనిసరి అవసరంగా మారింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం వచ్చేవారు ట్రాఫిక్‌ నిబంధనలు, రహదారి భద్రత, వాహనం నడపడంలో కచి్చతమైన నైపుణ్యం కలిగి ఉండాలి. డ్రైవింగ్‌లో ప్రావీణ్యం ఉన్నవారు ఆర్టీఏ టెస్ట్‌ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షల్లో తేలిగ్గా ఉత్తీర్ణులవుతారు. డ్రైవింగ్‌ ఎంతో కీలకమైంది. నాణ్యమైన శిక్షణ తీసుకొని, పూర్తి నమ్మకం కలిగాకే.. డ్రైవింగ్‌ టెస్ట్‌కు హాజరుకావాలి. మొక్కుబడిగా నేర్చుకుని లైసెన్సుల కోసం రావడం వల్ల ప్రయోజనం ఉండదు. టెస్ట్‌కు రావడానికి ముందే ఒకసారి ట్రాక్‌పైన అవగాహన పెంచుకోవడం మంచిది.     – సి.రమేశ్, జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్, హైదరాబాద్‌

పూర్తిగా నేర్చుకుని వచ్చాను 
సాధారణంగా డ్రైవింగ్‌ స్కూల్లో నెల రోజులు మాత్రమే శిక్షణ ఇస్తారు. నైపుణ్యం పెంచుకునేందుకు అది ఏ మాత్రం చాలదు. కనీసం
3 నెలల పాటు డ్రైవింగ్‌ మెళకువలు నేర్చుకోవాలి. ఎలాంటి రోడ్లపై అయినా సరే బండి నడపగలమనే ధైర్యం, నమ్మకం వచి్చన తర్వాత టెస్ట్‌కు రావడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈజీగా పాస్‌ కావొచ్చు.  – పూరి్ణమ, టెస్ట్‌కు హాజరైన మహిళ

రోడ్లపై నడిపినట్లుగానే ఉంది 
ఈ ట్రాక్‌లో రోడ్డు మీద నడిపినట్టుగానే ఉంది. మూల మలుపులు, ఎత్తుపల్లాలు, స్పీడ్‌ బ్రేకర్లు అన్నీ ఉన్నాయి. బండి నడిపే సమయంలో ఏ రోడ్డుపైన ఎలా నడపాలోస్పష్టమైన అవగాహన ఉంటేనే ఇక్కడ టెస్ట్‌ను ఎదుర్కోగలుగుతాం. ఎలాంటి టెన్షన్‌ లేకుండా ప్రశాంతంగా నడిపితే డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షలు ఏ మాత్రం ఇబ్బంది కాదు. – శ్రీధర్, టెస్ట్‌కు హాజరైన యువకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement