
ఫ్లిక్స్ బస్ ప్రారంభోత్సవంలో రవాణా మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: కాలుష్యరహితమైన, పర్యావరణహితమైన రవాణా సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అందజేసే రాయితీలను కొనసాగిస్తామని, ప్రజారవాణా రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఫ్లిక్స్ బస్ ఇండియా హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్ సర్వీసులను ప్రారంభించనుంది.
ఈ మేరకు గురువారం నగరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫ్లిక్స్‌బస్, ఈటీవో మోటర్స్ సంస్థలు కలిసి పర్యావరణహిత బస్సులను ప్రారంభించడాన్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
ఈ–బస్సుల విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందజేస్తుందన్నారు. బస్సుల నిర్వహణ, చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుపైన ఫ్లిక్స్‌బస్ ఇండియా–ఈటీవో మోటర్స్ సంస్థలు పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment