హైదరాబాద్, సాక్షి: కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్వచ్చందంగా స్క్రాప్ చేపించాలని పిలుపు ఇచ్చారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మేరకు ఈవీ వాహనాలు కొనాలంటూ కోరుతున్నారాయన.
ఢిల్లీలో తీవ్ర వాయుకాలుష్యంతో స్కూల్స్‌కు బంద్ చేస్తున్నారని, అలాంటి పరిస్థితి తెలంగాణకు.. హైదరాబాద్‌కు రాకూడదనే ఈవీ పాలసీ తీసుకొచ్చామని చెప్పారాయన. ‘‘ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా తెలంగాణ ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉంది. ఈవీ వాహనాల పై రోడ్డు టాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నాం. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చాం..
.. హైబ్రిడ్ వాహనాల పై కూడా పన్ను రాయితీ పై ఆలోచిస్తున్నాం. ప్రజలు ఈవీ వాహనాల వైపు అడుగులేయండి. అలాగే.. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠినంగా వ్యవహరించాలని రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను ఆదేశించారాయన.
Comments
Please login to add a commentAdd a comment