హైదరాబాద్: నగర పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. జీవో 41 ద్వారా అమల్లోకి కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చేందకు రంగం సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ఈవీ పాలసీ 2026 డిసెంబర్ వరకూ అమల్లో ఉండనుందన్నారు.
ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని, ఢిల్లీ తరహా కాలుష్య పరిస్థితులు హైదరాబాద్‌కు రాకూడదని ఈ సందర్బంగా పొన్నం పేర్కొన్నారు. తెలంగాణలో రవాణాశాఖ పరంగా మార్పులు చేర్పులు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్య తెచ్చే కార్యక్రమాలు చేపడతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment