Driving School
-
డ్రైవింగ్.. ట్రాక్‌లో పడేలా
డ్రైవింగ్ లైసెన్స్ కావాలి.. మొదట లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నారు..ఏదో డ్రైవింగ్ స్కూల్లో చేరి కొన్ని రోజులు నేర్చుకున్నారు.. డ్రైవింగ్ టెస్టులో పాసయ్యేంత నైపుణ్యం లేకున్నా..ఎవరో ఏజెంట్నో, దళారీనో పట్టుకుని లైసెన్స్ సంపాదించేశారు. ఇదంతా బాగానే ఉంది..మరి వచ్చిరాని డ్రైవింగ్‌తో బండి వేసుకుని రోడ్డెక్కితే? ఏదైనా ప్రమాదానికి కారణమైతే? ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది. సిటీలోని నాగోల్‌లో ఆధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. డ్రైవింగ్ సరిగ్గా నేర్చుకుని, ట్రాక్‌పై నిరీ్ణత ప్రమాణాల మేరకు నడిపితేనే.. లైసెన్స్ చేతికి వస్తుంది. లేకుంటే ఫెయిలే మరి.సాక్షి, హైదరాబాద్డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం వచ్చేవారికి రవాణా శాఖ తనిఖీ అధికారులే పరీక్షలు నిర్వహించి లైసెన్స్‌లను అందజేసే పద్ధతి చాలాకాలం నుంచి కొనసాగుతోంది. మాన్యువల్‌గా సాగుతున్న ఈ పద్ధతికి స్వస్తి చెప్పి.. మోటారు వాహన చట్టం నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ఆధునీకరణకు రవాణాశాఖ సిద్ధమైంది. ఆటోమేటిక్ పద్ధతిలో ట్రాక్‌ల నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో నిరీ్ణత ప్రమాణాల మేరకు వాహనం నడిపితేనే డ్రైవింగ్ లైసెన్స్ లభించనుంది. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్టుకు వచ్చేవారు ఎలాంటి దొడ్డిదారి మార్గాలను అన్వేíÙంచకుండా.. బాగా శిక్షణ తీసుకుని డ్రైవింగ్‌లో నైపుణ్యం సంపాదించాలని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి.రమేశ్ స్పష్టం చేస్తున్నారు. వాహనాల వినియోగం పెరుగుతూ.. ఇప్పుడు చాలా మందికి బైక్ లేదా కారు నిత్యావసరంగా మారింది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, మహిళలు అన్ని వర్గాల వారు వ్యక్తిగత వాహనాలను వినియోగిస్తున్నారు. ఏటా వేలాది మంది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుని, వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. రవాణా రంగంలో డ్రైవర్లుగా చేరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత మూడేళ్లలో సుమారు 62 లక్షల మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకోవడం విశేషం. అయితే చాలా మంది ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా వచ్చేస్తే బాగుంటుందని భావిస్తుంటారు. ఇందుకోసం ఏజెంట్లను, మధ్యవర్తులను ఆశ్రయిస్తారు. సరిగా నేర్చుకోకుండా, టెస్టుకు హాజరుకాకుండా తప్పుడు పద్ధతుల్లో లైసెన్సు తీసుకుని.. అరకొర అనుభవంతో బండి నడిపితే ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది.⇒ ఇన్నాళ్లూ కొనసాగిన మొక్కుబడి డ్రైవింగ్ టెస్టులకు చెల్లుచీటీ ⇒ రహదారులపై ఉండే ఇబ్బందులను తలపించేలా ట్రాక్‌లో ఏర్పాట్లు ⇒ లైసెన్స్ కోసం వచ్చేవారు ఎలా నడపగలుగుతున్నారో పరిశీలన ⇒ఆటోమేటిక్ పద్ధతిలో ట్రాక్‌ల నిర్వహణ⇒ టెస్ట్ వివరాలన్నీ కంఫ్యూటర్లో నిక్షిప్తం ⇒ ప్రమాణాల మేరకు డ్రైవింగ్ చేయకుంటే ఫెయిలేట్రాక్లో టెస్టు ఇలా..వాహనదారుల డ్రైవింగ్ నైపుణ్యాన్ని పరీక్షించేందుకు రకరకాల ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. కారు నడిపేవారు ఈ అన్ని ట్రాక్‌లలో తమ నైపుణ్యాన్ని చూపాల్సి ఉంటుంది. అలాగే ద్విచక్ర వాహన దారులు, భారీ వాహనాలు నడిపే డ్రైవర్లకు కూడా ప్రత్యేక ట్రాక్‌లు ఉన్నాయి.ట్రాక్ ‘హెచ్’: వాహనం ముందుకు వెళ్లిన తరువాత రివర్స్ చేయాల్సి వస్తే.. ఎలా తీసుకొంటారో తెలుసుకొనేందుకే ఈ ట్రాక్. ట్రాక్ ‘ఎస్’: ఒక మూల నుంచి మరో మూలకు టర్న్ చేయాల్సి వచి్చనప్పుడు ఎలాంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారో ఈ ట్రాక్‌లో తెలుస్తుంది. ట్రాక్ ‘8’: బాగా మలుపులున్న రోడ్డుపై ఎలా ముందుకు వెళ్తున్నారో తెలుసుకొనేందుకు ఇది దోహదం చేస్తుంది. ఎత్తుపల్లాల ట్రాక్:⇒ ఎత్తైన ప్రదేశాలు, చిన్న లోయ వంటి ప్రాంతాల్లో ఎలా నడపగలరో పరిశీలించేందుకు ఇవి ఏర్పాటు చేశారు. ⇒చివరగా బండి పార్కింగ్ చేసే పద్ధతిని కూడా పరీక్షిస్తారు. ⇒టెస్ట్‌కు హాజరయ్యే సమయంలో ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్,ద్విచక్రవాహనమైతే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. లేకుంటే ఫెయిల్ చేస్తారు. ⇒ ట్రాక్‌లలో నడిపేటప్పుడు ఎలాంటి తప్పిదాలు చేసినా ఫెయిల్ అయినట్టుగా నిర్ధారిస్తారు. ఇలా ఫెయిలైన వారు మరోనెల పాటుశిక్షణ తీసుకొని హాజరుకావాల్సి ఉంటుంది.రోజూ వందలాది మందికి డ్రైవింగ్ టెస్టులు..గ్రేటర్ హైదరాబాద్‌లో నాగోల్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, బండ్లగూడలలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ల ద్వారా రవాణా శాఖ డ్రైవింగ్ పరీక్షలను నిర్వహిస్తోంది. రోజూ వందలాది మంది ఈ టెస్టులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో దేశంలోనే అత్యాధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌ను నాగోల్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న 12 ట్రాక్‌లలో రోజూ వందల మందికి డ్రైవింగ్ టెస్టు చేస్తున్నారు. కార్లు, ద్విచక్ర వాహనాలు నడిపేందుకు వేర్వేరు ట్రాక్‌లు ఉన్నాయి. అలాగే బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలను నడిపేవారికి టెస్టుల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. అనంతరం దశలవారీగా కొండాపూర్, ఉప్పల్, మేడ్చల్ తదితర ఆర్టీఏలలోనూ ట్రాక్‌లను విస్తరించారు. నెలరోజులకే ‘టెస్టు’కు వస్తూ.. : అభ్యర్థులు తొలుత లెర్నింగ్ లైసెన్సు తీసుకుని డ్రైవింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెల రోజుల నుంచి 6 నెలలలోపు ఎప్పుడైనా డ్రైవింగ్ టెస్టు పాసై.. హాజరై శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు పొందవచ్చు. డ్రైవింగ్‌లో పట్టుసాధించాకే లైసెన్సు అందేలా ఈ నిబంధన అమలవుతోంది. కానీ చాలా మంది తూతూమంత్రంగా డ్రైవింగ్ నేర్చుకుని.. నెల రోజులకే టెస్టుకు హాజరవుతున్నారు. డ్రైవింగ్ పూర్తిగా రాకపోయినా, అడ్డదారిలో లైసెన్స్ పొందేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇకపై అలాంటి వాళ్లు టెస్టులో చిక్కులు ఎదుర్కోక తప్పదని నాగోల్ ప్రాంతీయ రవాణా అధికారి రవీందర్ తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాలని.. ఆ టెస్ట్ వివరాలను కంఫ్యూటర్లో నమోదు చేసి, ఉత్తీర్ణులుగా నిర్ధారణ అయితేనే లైసెన్స్ ఇస్తారని వెల్లడించారు.నైపుణ్యం ఉంటే కష్టమేమీ కాదు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి వాహనం తప్పనిసరి అవసరంగా మారింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, వాహనం నడపడంలో కచి్చతమైన నైపుణ్యం కలిగి ఉండాలి. డ్రైవింగ్‌లో ప్రావీణ్యం ఉన్నవారు ఆర్టీఏ టెస్ట్ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షల్లో తేలిగ్గా ఉత్తీర్ణులవుతారు. డ్రైవింగ్ ఎంతో కీలకమైంది. నాణ్యమైన శిక్షణ తీసుకొని, పూర్తి నమ్మకం కలిగాకే.. డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాలి. మొక్కుబడిగా నేర్చుకుని లైసెన్సుల కోసం రావడం వల్ల ప్రయోజనం ఉండదు. టెస్ట్‌కు రావడానికి ముందే ఒకసారి ట్రాక్‌పైన అవగాహన పెంచుకోవడం మంచిది. – సి.రమేశ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, హైదరాబాద్పూర్తిగా నేర్చుకుని వచ్చాను సాధారణంగా డ్రైవింగ్ స్కూల్లో నెల రోజులు మాత్రమే శిక్షణ ఇస్తారు. నైపుణ్యం పెంచుకునేందుకు అది ఏ మాత్రం చాలదు. కనీసం3 నెలల పాటు డ్రైవింగ్ మెళకువలు నేర్చుకోవాలి. ఎలాంటి రోడ్లపై అయినా సరే బండి నడపగలమనే ధైర్యం, నమ్మకం వచి్చన తర్వాత టెస్ట్‌కు రావడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈజీగా పాస్ కావొచ్చు. – పూరి్ణమ, టెస్ట్‌కు హాజరైన మహిళరోడ్లపై నడిపినట్లుగానే ఉంది ఈ ట్రాక్‌లో రోడ్డు మీద నడిపినట్టుగానే ఉంది. మూల మలుపులు, ఎత్తుపల్లాలు, స్పీడ్ బ్రేకర్లు అన్నీ ఉన్నాయి. బండి నడిపే సమయంలో ఏ రోడ్డుపైన ఎలా నడపాలోస్పష్టమైన అవగాహన ఉంటేనే ఇక్కడ టెస్ట్‌ను ఎదుర్కోగలుగుతాం. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నడిపితే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో నిర్వహించే పరీక్షలు ఏ మాత్రం ఇబ్బంది కాదు. – శ్రీధర్, టెస్ట్‌కు హాజరైన యువకుడు -
Anita Sharma: కదలండి కదిలించండి
ఆమె పోలియో బాధితురాలు. ఐ.ఐ.ఎం. ఇండోర్‌లో పీహెచ్డీ చేసిన విద్యాధికురాలు. కాని ఆమె తన జీవితాన్ని దివ్యాంగుల కోసం అంకితం చేసింది. పట్టుదలగా డ్రైవింగ్ నేర్చుకోవడమేగాక దివ్యాంగులకు డ్రైవింగ్ నేర్పించే స్కూల్ నడుపుతోంది. ఏయే పరికరాలు అమర్చడం ద్వారా దివ్యాంగులు సులభంగా డ్రైవ్ చేయవచ్చో తెలుపుతోంది. ‘డ్రైవ్ ఆన్ మై ఓన్’ సంస్థ నడుపుతున్న డాక్టర్ అనితా శర్మ గురించి. అనితాశర్మకు కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనిపించింది. జైపూర్ ఆమెది. జైపూర్‌లో పదిహేను, ఇరవై కాల్స్ చేసింది. ఎవరూ నేర్పించము అన్నారు. ఢిల్లీలో నేర్పుతారేమోనని అక్కడా ఒక పది, ఇరవై కాల్స్ చేసింది. అక్కడా ఎవరూ నేర్పము అన్నారు. కారణం? అనిత కుడికాలుకు పోలియో ఉంది. పోలియోతో బాధ పడుతున్నవారికి, లేదా ఇతర దివ్యాంగులకు కారు డ్రైవింగ్ నేర్పించే తర్ఫీదు డ్రైవింగ్ స్కూల్స్‌కు లేదు. అలా చేయడానికి అవసరమైన మోడిఫైడ్ కార్లు వారి దగ్గర ఉండవు. దివ్యాంగులు చక్రాల కుర్చీకి పరిమితం కావలసిందేనా? వారు తమకు తాముగా బయటకు తిరగకూడదా అనుకుంది అనితా శర్మ. తల్లి సహాయంతో... అనితా శర్మ ఇండోర్ ఐ.ఐ.ఎంలో పీహెచ్డీ చేసింది. అమృతసర్ ఐ.ఐ.ఎంలో ్ర΄÷ఫెసర్ ఉద్యోగం సం΄ాదించింది. అయితే ఆమెకు కారు నడ΄ాలన్న కోరిక మాత్రం తీరలేదు. ‘మొదట నేను అదనపు చక్రాలు బిగించిన టూ వీలర్ నడి΄ాను. నా ఆనందానికి అవధుల్లేవు. కారు నడిపితే ఎంత బాగుండో అనిపించింది. హ్యాండ్ కంట్రోల్ ఉండేలా కారును మోడిఫై చేయించి మా అమ్మ సహాయంతో నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఎక్కడికైనా నా కారులో ప్రయాణించగలను. నేను కారు నడపడం చూసి చాలామంది దివ్యాంగులు మాకు నేర్పించవచ్చు కదా అనడిగేవారు. వారి కోసం పని చేయాలనిపించింది. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేసి‘డ్రైవ్ ఆన్ మై ఓన్’ సంస్థ స్థాపించాను. దివ్యాంగులకు కారు డ్రైవింగ్ నేర్పించి, సొంత కారు కొనుక్కోవడంలో అవసరమైన సాయం చేయడమే మా సంస్థ ఉద్దేశం’ అంటుందామె. కస్టమైజ్డ్ కార్లు అనితాశర్మ సంస్థ దివ్యాంగుల కోసం డ్రైవింగ్ క్లాసులు నిర్వహిస్తుంది. వెబినార్లు, సెమినార్లు నిర్వహిస్తుంది. దివ్యాంగుల కమ్యూనిటీలో ఒకరికొకరికి పరిచయాలు చేసి ్రపోత్సహించుకునేలా చేస్తుంది. శారీరక పరిమితులను అనుసరించి కారులో ఎటువంటి మోడిఫికేషన్ చేస్తే కారు నడపవచ్చో సూచిస్తుంది. ఆ మోడిఫికేషన్ పరికరాలు సమకూర్చడంలో సాయం చేస్తుంది. ఆ తర్వాత కార్ల రిజిస్ట్రేషన్, జిఎస్టి వంటివి దివ్యాంగుల పక్షంలో జరిగేలా చూస్తుంది. ‘ఇదంతా చేయడానికి మేము కొంత ఫీజు తీసుకుంటాం. దివ్యాంగులు ఛారిటీ మీద కాకుండా తమ కాళ్ల మీద తాము బతకాలన్నదే నా ఉద్దేశం’ అంటుంది అనితా శర్మ. కుటుంబ సభ్యులు ‘దివ్యాంగులు కారు నడపడానికి వారి కుటుంబసభ్యులను ఒప్పించడమే పెద్ద సమస్య. దివ్యాంగులు కారు నడపగలరు. వారిని డ్రైవింగ్ సీట్లో స్లయిడర్స్ ద్వారా సులువుగా చేర్చవచ్చు. కాళ్లతో పని లేకుండా చేతులతోనే మొత్తం కంట్రోల్ చేయొచ్చు. వారికి తిరగాలని ఉంటుంది. ధైర్యం చెప్పి సహకరించి తిరగనివ్వండి’ అని సూచిస్తోంది అనితా శర్మ. -
జలజ: కారులో ఏముంది..కార్గోనే కిక్కిస్తుంది
ఉరుకుల పరుగుల జీవితంలో... అప్పుడప్పుడు కాస్త బ్రేక్ తీసుకుని ఎక్కడికైనా కొత్తప్రదేశానికి వెళ్తే శారీరకంగా, మానసికంగానూ ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది. చాలా మంది ఇలా ఆరునెలలకో, ఏడాదికోసారి ట్రిప్పులు వేస్తుంటారు. ఇలాంటి ట్రిప్పులకు ‘‘కార్లో వెళ్తే ఏం బావుంటుంది లారీ అయితే మరింత మజా వస్తుంది ఫ్రెండ్స్’’ అంటోంది జలజా రతీష్. మాటల దగ్గరే ఆగిపోకుండా కేరళ నుంచి కార్గోలారీని నడుపుకుంటూ కశ్మీర్ ట్రిప్‌నూ అప్ అండ్ డౌన్ పూర్తి చేసి ఔరా అనిపిస్తోంది జలజ. కొట్టాయంకు చెందిన నలభై ఏళ్ల జలజా రతీష్‌కు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. దీనికితోడు కొత్త ప్రదేశాలను చూడడం అంటే మక్కువ. దీంతో పెళ్లి తరువాత భర్త ప్రోత్సాహంతో డ్రైవింగ్ నేర్చుకుంది. ఒక పక్క ఇంటి పనులు చూసుకుంటూనే డ్రైవింగ్‌పై పట్టు రావడంతో సొంతంగాఎక్కడికైనా వెళ్లాలని ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న జలజకు.. భర్తకు ముంబైకు ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ రూపంలో అవకాశం వచ్చింది. దాంతో భర్తతో కలిసి బయలు దేరింది. ఈ ట్రిప్పులో తనే స్టీరింగ్ పట్టి నడిపింది. ఏ ఇబ్బంది లేకుండా ముంబై ట్రిప్పు పూర్తిచేయడంతో.. మరోసారి కూడా మళ్లీ లారీ నడుపుతూ ముంబై వెళ్లింది. ఈ రెండు ట్రిప్పులు ఆమె ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచి కేరళ నుంచి కశ్మీర్ వరకు ట్రిప్‌ను ప్లాన్ చేసేలా చేసింది. భర్తతో కలిసి.. లాంగ్ ట్రిప్‌కు పక్కగా ప్రణాళిక రూపొందించి భర్త రతీష్, మరో బంధువు అనీష్‌తో కలిసి ఫిబ్రవరి రెండోతేదీన ఎర్నాకుళం జిల్లా పెరంబూర్ నుంచి బయలు దేరింది. లారీలో ప్లైవుడ్ లోడింగ్ చేసుకుని పూనేలో డెలివరి ఇచ్చింది. తరువాత ఉల్లిపాయలను లోడ్ చేసిన మరో లారీని తీసుకుని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యాణ, పంజాబ్‌ల మీదుగా కశ్మీర్ చేరుకుంది. రోడ్డుమీద కార్గో లారీని నడుపుతోన్న జలజను చూసిన వారికి ‘‘ఇది నిజమేనా అన్నట్టు’’ ఆశ్చర్యంగా అనిపించింది. కొంతమంది ఆసక్తిగా చూస్తే, మరికొంతమంది విస్తుపోయి చూశారు. లారీ ఆపిన ప్రతిసారి చుట్టుపక్కల వాళ్లు వచ్చి జలజ డ్రైవింగ్‌ను పొగడడం, లారీ నడపడాన్ని అద్భుతంగా వర్ణిస్తుండడంతో.. మరింత ఉత్సాహంతో లారీని నడిపి కేరళ నుంచి కశ్మీర్ ట్రిప్‌ను వేగంగా పూర్తిచేసింది. తిరుగు ప్రయాణంలో కూడా కశ్మీర్లో ప్లైవుడ్ ట్రాన్స్పోర్ట్ దొరకడంతో హర్యాణ, బెంగళూరులో లోడ్ దించి, అక్కడ పంచదారను లోడ్ చేసుకుని కేరళ లో అన్లోడ్ చేయడంతో జలజ ట్రిప్పు విజయవంతంగా పూర్తయింది. ఈ ట్రిప్పు బాగా పూర్తవడంతో తరువాతి ట్రిప్పుని త్రిపుర నుంచి ఢిల్లీ ప్లాన్ చేస్తోంది. జలజ తన ట్రిప్ మొత్తాన్ని వీడియో తీసి నెట్లో పెట్టడంతో చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కొంతమంది అమ్మాయిలు తాము కార్గో లారీలు నడుపుతామని చెబుతున్నారు. సినిమాల్లో చూసినవన్ని ప్రత్యక్షంగా.. ‘‘గత కొన్నేళ్లుగా సినిమాల్లో చూసిన ఎన్నో ప్రదేశాలు ఈ ట్రిప్పు ద్వారా ప్రత్యక్షంగా చూడగలిగాను. ఆద్యంతం ఎంతో ఆసక్తిగా సాగిన ట్రిప్పులో గుల్మర్గ్, పంజాబ్ ప్రకృతి అందాలు మర్చిపోలేని సంతోషాన్నిచ్చాయి. చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ పెళ్లి తరువాతే నా కల నెరవేరింది. ఇప్పుడు కూడా నా భర్త రితీష్ ప్రోత్సాహంతో ఈ సుదీర్ఘ ట్రిప్పుని పూర్తిచేశాను. కార్గో లోడ్లను తీసుకెళ్లడం వల్ల ట్రిప్పుకు పెద్దగా ఖర్చు కాలేదు. లారీలోనే వంట చేసుకుని తినేవాళ్లం. కారులో కంటే లారీలో నిద్రపోవడానికి చాలా సౌకర్యంగా అనిపించింది. కారులో కంటే కార్గో ట్రిప్పు మంచి కిక్ ఇస్తుంది. త్వరలో కుటుంబం మొత్తం కలిసి ఇలాంటి జర్నీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము’’ అని జలజ చెప్పింది. రోజూ చేసే పని అయినా రొటీన్‌కు భిన్నంగా చేసినప్పుడే ఆ పని మరింత ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందనడానికి జలజ జర్నీనే ఉదాహరణ. -
టాప్‌గేర్‌లో హైదరాబాద్ మహిళలు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో మహిళలు టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు. డ్రైవింగ్‌లో సత్తా చాటుతున్నారు. అభిరుచి కోసం.. అవసరాల కోసం వాహనాలను నడుపుతున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. డ్రైవర్లపై ఆధారపడకుండా సొంత వాహనాలను వినియోగించేందుకే ఆసక్తి చూపుతున్నారు. మగువల అభిరుచికి తగ్గట్లు పలు మోడళ్లలో బైక్‌లు, కార్లు వచ్చేస్తున్నాయి. గేర్‌లెస్ వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రవాణా శాఖ గణాంకాల ప్రకారం గత మూడేళ్లలో 1,26,340 మంది మహిళలు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకోవడమే ఇందుకు నిదర్శనం. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు 33 వేల మంది డ్రైవింగ్ లైసెన్సులు తీసుకున్నారు. వీరిలో 65 శాతం ఫోర్ వీలర్ లైసెన్సులు కాగా, 35 శాతం వరకు టూ వీలర్ లైసెన్సులు ఉన్నాయి. చాలా మంది రెండు రకాల లైసెన్సులు తీసుకోవడం గమనార్హం. అభిరుచి.. అవసరం! ఇంట్లో నాలుగు కార్లు, 24 గంటల పాటు అందుబాటులో డ్రైవర్లు ఉన్నా.. ఇటీవల ఓ మహిళా ఐఏఎస్ అధికారి కారు డ్రైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. తన వ్యక్తిగత అవసరాల కోసమే ఆమె శిక్షణ పొందారు. ఉదయాన్నే జిమ్‌కు వెళ్లడం.. సాయంత్రం షాపింగ్‌కు వెళ్లడం.. పిల్లలను బయటకు తీసుకెళ్లడం.. ఇలాంటి పనులకు డ్రైవర్లపై ఆధారపడాల్సి రావడం ఇబ్బందిగానే ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. తమ ప్రయాణాన్ని, అవసరాలను వ్యక్తిగతంగా భావించే చాలామంది మహిళలు ఇలా సొంత వాహనాలనే ఇష్టపడుతున్నారు. సురక్షిత ప్రయాణం.. కోవిడ్ కారణంగా ఐటీ కంపెనీలు వర్క్‌ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి. కానీ, సాధారణంగా అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువ శాతం సొంత వాహనాలనే వాడుతారు. సాఫ్ట్వేర్ మహిళలకు సొంత కార్లు తప్పనిసరి అవసరంగా మారాయి. రాత్రింబవళ్లు విధులు నిర్వహించాల్సిన పరిస్థితుల్లో ఆఫీసుకు వెళ్లేందుకు, తిరిగి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకునేందుకు ఎక్కువ మంది సొంత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. 2018లో 42 వేల మందికి పైగా మహిళలు డ్రైవింగ్ లైసెన్సులు తీసుకున్నారు. పైగా కోవిడ్ నేపథ్యంలో చాలామంది సొంత వాహనాలకే మొగ్గు చూపు తున్నారు. డ్రైవింగ్‌ను అభిరుచి కోసమే కాకుండా షీ క్యాబ్స్ ద్వారా ఉపాధి పొందుతున్న మహిళలు కూడా ఉన్నారు. సౌకర్యంగా ఉంటుంది సొంత వాహనాల్లో ఇంటిల్లిపాది కలసి వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది. కోవిడ్ వచ్చినప్పటి నుంచి క్యాబ్‌లు, ఇతర వాహనాల్లో వెళ్లట్లేదు. నేనే స్వయంగా వాహనం నడపడం నేర్చుకొన్నాను. – శ్రీలక్ష్మి, గృహిణి ఉపాధి కోసం నేర్చుకున్నా.. షీ క్యాబ్ ద్వారా ఉపాధి పొందాలనే ఆలోచనతో ఇటీవలే డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. ప్రభుత్వ సహకారంతో బ్యాంకు రుణంతో కారు కొనుక్కొన్నాం. – కోలా కరోలిన్ కోవిడ్ తర్వాత డిమాండ్ పెరిగింది కోవిడ్ తర్వాత ప్రజా రవాణా వినియోగం తగ్గడంతో సొంత వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో శిక్షణకు వచ్చే మహిళలు కూడా పెరిగారు. ఇటీవల గృహిణులు ఎక్కువ సంఖ్యలో శిక్షణ తీసుకున్నారు. – సామ శ్రీకాంత్‌రెడ్డి, రెడ్డి మోటార్ డ్రైవింగ్ స్కూల్, బంజారాహిల్స్ -
డ్రైవింగ్ టెస్టుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ముందుగా లెర్నింగ్ తీసుకోవాలి. ఆ తర్వాత ఆరునెలల్లో శాశ్వత లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే సమయంలో ఎంచుకున్న సమయం ప్రకారం ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేల కనుక ఆ పరీక్షలో ఫెయిల్ అయితే మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది. అయితే తాజాగా కేంద్రం డ్రైవింగ్ లైసెన్స్ జారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందవచ్చు. డ్రైవింగ్ స్కూళ్లకు, డ్రైవర్ శిక్షణా కేంద్రాలకు ఈ మేరకు గుర్తింపు ఇవ్వనుంది. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం చేత గుర్తింపబడిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో విజయవంతంగా డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేసిన వారు రాష్ట్ర రవాణా అధికారుల నుండి లైసెన్స్ పొందవచ్చు. అలాగని శిక్షణ కేంద్రాలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వరు. వాటికి అనుమతులు, శిక్షణా కార్యక్రమాల పర్యవేక్షణకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వమే డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను గుర్తిస్తుంది. దీని కోసం ప్రభుత్వం కొన్ని నియమాలను సూచిస్తుంది. ఆ డ్రైవింగ్ కేంద్రాలు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది.(చదవండి: అసోంలో ప్రధాని మోదీ పర్యటన) -
బైక్ రైడర్.. ఫుడ్ ‘డ్రైవ్’ర్
సాక్షి, సిటీబ్యూరో: ఆమె ఇద్దరు పిల్లల తల్లిగా, ఇంట్లోవారి ఆలనాపాల చూస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. ఓ డ్రైవింగ్ స్కూల్ నడుపుతూ ఔత్సాహిక మహిళలు, యువతులకు బైక్ డ్రైవింగ్‌లో శిక్షణనిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన అర్చన చిగుళ్లపల్లి ఓ పార్శం మాత్రమే ఇది. ఎంబీఏ చదివి ఎయిర్‌లైన్స్‌లో పనిచేశారు. ఐటీ కంపెనీలో సేవలందించారు. మార్కెటింగ్ మేనేజ్మెంట్లో తన సత్తా నిరూపించుకున్నారు. అయితే, ఆమె.. బైక్ రైడర్‌గా మారి నిరుపేదల ఆకలి తీర్చేందుకు ‘ఫుడ్ డ్రైవ్’ మొదలు పెట్టారు. ఒంటరిగా ప్రయాణిస్తూ ఎక్కడ పార్టీలు, వేడుకలు జరిగినా అక్కడ మిగిలిన పదార్థాలను సేకరించి కొన్ని ఎన్జీఓలతో కలిసి బస్తీల్లోని పేదలకు అందిస్తున్నారు. ‘చిన్నప్పుడు ఆర్థికంగా వెనుకబడిన నా స్కూల్ ఫ్రెండ్ కోసం మా అమ్మ రెండు బాక్స్‌లు కట్టి ఇచ్చేది. మరొకరి ఆకలి తీర్చడం అప్పుడే అలవాటైంది. ఇప్పుడదే వ్యాపకంగా మారింది. ఏడాదంతా ఫుడ్ డ్రైవ్స్ చేస్తాను. 24/7 రెడీగా ఉంటాను’ అంటున్నారామె. బైక్ డ్రైవింగ్‌లో శిక్షణ ‘బైక్‌పై ఫుడ్ సేకరించడానికి వెళుతుంటే కొందరు ఆశ్చర్యపోతున్నారు. మహిళలు సహజంగా శక్తిమంతులు. అది బైక్ రైడింగ్‌లో నిరూపించవచ్చని నా నమ్మకం. అందుకే స్కూల్ డేస్ నుంచే ఆసక్తి ఉన్న మహిళలకు బైక్ నేర్పడం మొదలుపెట్టాను. ముఖ్యంగా చాలా మంది వర్కింగ్ లేడీస్‌కి ఫ్రీగా నేర్పించాను. బైక్ రైడింగ్ శిక్షణ కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా విద్యార్ధులు నా దగ్గరకి వస్తుంటారు’ అని వివరించారు అర్చన. -
మా మమ్మీ బండి మమ్మీ
పిల్లల్ని బడిబాట పట్టించినట్లుగా మహిళల్ని ‘బండిబాట’ పట్టించడానికి ‘ఆత్మనిర్భర్’ అనే డ్రైవింగ్ స్కూల్‌ను నడిపిస్తోంది పావని. ‘సాధికారత’కు ఆమె చెబుతున్న అర్థం.. ‘బండి నడపడం’. ఆమె చొరవతో మథురై, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇప్పుడు ప్రతి అమ్మా సాధికారతను ‘డ్రైవ్’ చేస్తోంది ‘‘ఫేస్బుక్లో బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఈ మాత్రం స్పందన చాలు ఇప్పటికిప్పుడు మొదలుపెట్టడానికి’’.. ఫేస్‌బుక్‌లోంచి లాగవుట్ అవుతూ అనుకుంది పావని ఖండేల్వాల్. ఆ తర్వాత ఎవరికో ఫోన్ చేసింది. కావల్సిన సమాధానమే వచ్చినట్టుంది. ఊరు వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకుంది. పుణె నుంచి ఆమె తన సొంతూరు మథుర (యుపి) వెళ్తోంది. పుణెలోని సింబయోసిస్ యూనివర్సిటీలో బీబీఎమ్ చదివింది పావని. అక్కడే ఉద్యోగం కూడా చేస్తోంది. ఆంట్రప్రెన్యూర్ అవ్వాలనే ఆశయం. అయితే పావని అమ్మగారు ఆమె ఆలోచనకు వేరే రూపునిచ్చారు! అమ్మ నసే.. ఐడియా! ‘‘పావనీ.. నన్ను బజార్‌కు తీసుకెళ్లు, పావనీ.. అత్తవాళ్లింటి దగ్గర వదిలిపెట్టు.. పావనీ.. కాస్త కూరలు తెచ్చిపెట్టవా? పావనీ.. నన్ను అక్కడ డ్రాప్ చేయవా? పావనీ.. ఇక్కడున్నాను.. వచ్చి తీసుకెళ్లవా?’’ అంటూ అమ్మ రేఖ.. సెలవులకు వెళ్లినప్పుడల్లా తనకు పనులు పురమాయించేది. తను ఉన్న వారం రోజుల్లో పనులన్నీ చేసేసుకోవాలని అమ్మ ఆరాటం. అలా మూడు నెలల కిందట మ«థుర వెళ్లినప్పుడు అమ్మ తనను చాలానే విసిగించింది. ‘‘నువ్వు నేర్చుకోవచ్చు కదా బండి నడపడం? ఇలా నా మీదో.. నాన్న మీదో ఆధారపడేకంటే?’’ అంది అదే విసుగుతో పావని. ఆ మాటను మనసుకు తీసుకుంది పావని తల్లి. లేడీ ట్రైనర్ కోసం చాలా వెదికింది. ఎవరూ దొరకలేదు. ఆమె పట్టుదల చూసి చివరకు తనే వారం రోజులు సెలవు పొడిగించుకుని, మథురలో ఉండి మరీ అమ్మకు బండి నేర్పించింది. అప్పుడు తట్టింది పావనికి ఐడియా! ఆ ఐడియా ఇప్పుడు ఓ ఆకారం దిద్దుకోబోతోంది. ట్రైన్ ఆగింది. స్టేషన్లో దిగింది పావని. మహిళలా! మథురలోనా?! అమ్మకు తను డ్రైవింగ్ నేర్పడానికి ముందు, స్కూటీ నేర్పే లేడీ ట్రైనర్ కోసం వెదకుతుంటే అర్థమైంది పావనికి.. లేడీ ట్రైనర్స్ అవసరం ఎంతుందో. అప్పుడే అలాంటి ప్రాజెక్ట్‌కు అంకురం పడింది ఆమె మైండ్‌లో. అమ్మకు డ్రైవింగ్ నేర్పించి, మథుర నుంచి పుణె వెళ్లగానే దానికి సంబంధించి ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసింది. చాలా మంది తమకూ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉందనీ పుణె నుంచి పోస్టులు పంపారు. మథుర సంప్రదాయబద్ధుల నిలయం. ఆ పట్టణంలో ఓ గృహిణి తన కట్టును చీర నుంచి సెల్వార్కమీజ్కు మార్చుకోవడమే పెద్ద విప్లవం. అలాంటి ఊళ్లో బండి నేర్చుకోవడానికి అంత మంది స్త్రీలు ఉత్సాహం చూపడం ఆమెకు ప్రోత్సాహాన్నిచ్చింది. మథుర వచ్చిన వెంటనే ‘ఆత్మనిర్భర్’ పేరుతో తను మొదలుపెట్టబోయే ‘ఆల్ విమెన్ టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్’ను రిజిస్టర్ చేయించింది. వెంటనే పనిలోకి దిగింది. డ్రైవ్ చెయ్యాలా.. వద్దా?! వారం గడిచేసరికి డ్రైవింగ్ నేర్చుకోడానికి ముందుకు వచ్చిన వాళ్లలో సగం మంది ‘ఎందుకులేబ్బా’ అని వెనక్కి తగ్గారు. పావని వాళ్ల అమ్మ నిరుత్సాహపడింది. అప్పటికే ఆమె స్కూటీ నడపడంలో పర్ఫెక్ట్ అయిపోయింది. డ్రైవింగ్‌ని ఆస్వాదిస్తోంది. ‘‘రెక్కలు కట్టుకుని విహరిస్తున్నట్టుంది’’ అంటుంది ఆమె. ఇంకొకరి మీద ఆధారపడకుండా బయట పనులన్నీ స్వయంగా చేసుకుంటే ఉండే సౌకర్యాన్ని, సాధికారతను, దర్పాన్నీ ఆమె అనుభవిస్తోంది. అదే మాట చెప్పింది.. తన కూతురు పెట్టిన డ్రైవింగ్ స్కూల్‌కి వచ్చిన మహిళలకు. కొంతమందికి ఆ మాటలు స్ఫూర్తినిచ్చాయి. డ్రైవింగ్ నేర్చుకోడానికి చేరారు. వాళ్ల సంఖ్య పెరిగేసరికి, నేర్పుతామని బయటి ఊళ్ల నుంచి వచ్చే మహిళా ట్రైనర్లూ పెరిగారు. ఇలా పద్దెనిమిది మందితో మొదలైన ఆ స్కూల్ నెల గడిచే సరికి 25 మందికి పెరిగింది. ఒకర్ని చూసి ఒకరికి ధైర్యం నలభై ఐదేళ్ల పావని వాళ్ల అమ్మ తన స్కూటీపై మథుర అంతా తిరుగుతుంటే ఆ వయసు వాళ్లకు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆశ కలిగింది. డ్రైవింగ్ స్కూల్లో ట్రైనర్స్ అంతా ఆడవాళ్లే అయ్యేసరికి ధైర్యమొచ్చింది. క్యూ కట్టారు స్కూల్‌కి. ఇప్పుడు దాదాపు యాభై మంది అయ్యారు నేర్చుకునేవారు. అంతా పదహారు నుంచి 48 ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్లే. చుట్టుపక్కల ఊళ్ల నుంచీ అప్లికేషన్లు పెరుగుతుండటంతో పక్కనే ఉన్న భరత్పూర్, జైపూర్‌లో కూడా బ్రాంచ్‌లను తెరిచింది పావని. ఆత్మనిర్భర్లోనే డ్రైవింగ్ నేర్చుకున్న కొంతమంది అల్పదాయ మహిళలకు అందులోనే ట్రైనర్స్‌గా అవకాశం ఇస్తోంది పావని. అలా వాళ్లు తమ కుటుంబానికి చేదోడువాదోడు అవుతున్నారు. ఆత్మనిర్భర్ ఆలోచన రావడానికి, అది కార్యాచరణ దాల్చడానికి వాళ్లమ్మే కారణం కాబట్టి దానికి వాళ్లమ్మనే సీఈఓగా నియమించింది పావని. సింపుల్ అండ్ స్పీడ్ కోర్స్ పావని డ్రైవింగ్ కోర్సులో థియరీ, ప్రాక్టికల్స్ రెండూ ఉంటాయి. కోర్సు వ్యవధి పది రోజులు. కోర్సు అయ్యాక బండి మెయిన్టెనెన్స్ గురించీ వివరిస్తారు. అంతేకాదు, లైసెన్స్‌ను ఇప్పించే బాధ్యతనూ ఆత్మనిర్భరే తీసుకుంటోంది. ఇలా.. పాతికవేల రూపాయల పెట్టుబడితో, రెండు స్కూటీలతో మొదలైన ఈ స్కూల్ యేడాది గడవకముందే ఏడాదికి ఆరు లక్షల ఆదాయానికి చేరుకుంది. ఇలా.. ఆంట్రప్రెన్యూర్ అవ్వాలన్న పావని కల కూడా నెరవేరింది. బ్రేక్స్ లేకుండా డ్రైవింగ్ స్కూల్‌ను ముందుకు పరిగెత్తించడమే నా ధ్యేయం అంటోంది పావని. – శరాది మహిళా (డ్రైవింగ్) దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తమ ఆత్మనిర్భర్‌లో విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఓ వర్క్‌షాప్‌నూ నిర్వహించింది పావని. దీనికి మథుర చుట్టుపక్కల పట్టణాల నుంచే కాక రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచీ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఇదికాకుండా ఏప్రిల్ నెలలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని చిన్న చిన్న పట్టణాల్లోని మహిళల కోసం డ్రైవింగ్ క్యాంప్స్ను నిర్వహించనున్నట్లు చెప్పింది పావని ఖండేల్వాల్. అన్నట్టు పావని రాయల్ ఎన్ఫీల్డ్ ‘బైకర్ని’ కూడా! బైకర్ని అంటే ఫిమేల్ బైకర్ అని. -
మా మమ్మీ బండి మమ్మీ
పిల్లల్ని బడిబాట పట్టించినట్లుగా మహిళల్ని ‘బండిబాట’ పట్టించడానికి ‘ఆత్మనిర్భర్’ అనే డ్రైవింగ్ స్కూల్‌ను నడిపిస్తోంది పావని. ‘సాధికారత’కు ఆమె చెబుతున్న అర్థం.. ‘బండి నడపడం’. ఆమె చొరవతో మథురై, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇప్పుడు ప్రతి అమ్మా సాధికారతను ‘డ్రైవ్’ చేస్తోంది మథుర సంప్రదాయబద్ధుల నిలయం. ఆ పట్టణంలో ఓ గృహిణి తన కట్టును చీర నుంచి సెల్వార్కమీజ్కు మార్చుకోవడమే పెద్ద విప్లవం. అలాంటి ఊళ్లో బండి నేర్చుకోవడానికి అంత మంది స్త్రీలు ఉత్సాహం చూపడం పావనికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్నీ ఇచ్చింది. ‘‘ఫేస్బుక్లో బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఈ మాత్రం స్పందన చాలు ఇప్పటికిప్పుడు మొదలుపెట్టడానికి’’.. ఫేస్‌బుక్‌లోంచి లాగవుట్ అవుతూ అనుకుంది పావని ఖండేల్వాల్. ఆ తర్వాత ఎవరికో ఫోన్ చేసింది. కావల్సిన సమాధానమే వచ్చినట్టుంది. ఊరు వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకుంది. పుణె నుంచి ఆమె తన సొంతూరు మథుర (యుపి) వెళ్తోంది. పుణెలోని సింబయోసిస్ యూనివర్సిటీలో బీబీఎమ్ చదివింది పావని. అక్కడే ఉద్యోగం కూడా చేస్తోంది. ఆంట్రప్రెన్యూర్ అవ్వాలనే ఆశయం. అయితే పావని అమ్మగారు ఆమె ఆలోచనకు వేరే రూపునిచ్చారు! అమ్మ నసే.. ఐడియా! ‘‘పావనీ.. నన్ను బజార్‌కు తీసుకెళ్లు, పావనీ.. అత్తవాళ్లింటి దగ్గర వదిలిపెట్టు.. పావనీ.. కాస్త కూరలు తెచ్చిపెట్టవా? పావనీ.. నన్ను అక్కడ డ్రాప్ చేయవా? పావనీ.. ఇక్కడున్నాను.. వచ్చి తీసుకెళ్లవా?’’ అంటూ అమ్మ రేఖ.. సెలవులకు వెళ్లినప్పుడల్లా తనకు పనులు పురమాయించేది. తను ఉన్న వారం రోజుల్లో పనులన్నీ చేసేసుకోవాలని అమ్మ ఆరాటం. అలా మూడు నెలల కిందట మ«థుర వెళ్లినప్పుడు అమ్మ తనను చాలానే విసిగించింది. ‘‘నువ్వు నేర్చుకోవచ్చు కదా బండి నడపడం? ఇలా నా మీదో.. నాన్న మీదో ఆధారపడేకంటే?’’ అంది అదే విసుగుతో పావని. ఆ మాటను మనసుకు తీసుకుంది పావని తల్లి. లేడీ ట్రైనర్ కోసం చాలా వెదికింది. ఎవరూ దొరకలేదు. ఆమె పట్టుదల చూసి చివరకు తనే వారం రోజులు సెలవు పొడిగించుకుని, మథురలో ఉండి మరీ అమ్మకు బండి నేర్పించింది. అప్పుడు తట్టింది పావనికి ఐడియా! ఆ ఐడియా ఇప్పుడు ఓ ఆకారం దిద్దుకోబోతోంది. ట్రైన్ ఆగింది. స్టేషన్లో దిగింది పావని. మహిళలా! మథురలోనా?! అమ్మకు తను డ్రైవింగ్ నేర్పడానికి ముందు, స్కూటీ నేర్పే లేడీ ట్రైనర్ కోసం వెదకుతుంటే అర్థమైంది పావనికి.. లేడీ ట్రైనర్స్ అవసరం ఎంతుందో. అప్పుడే అలాంటి ప్రాజెక్ట్‌కు అంకురం పడింది ఆమె మైండ్‌లో. అమ్మకు డ్రైవింగ్ నేర్పించి, మథుర నుంచి పుణె వెళ్లగానే దానికి సంబంధించి ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసింది. చాలా మంది తమకూ డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉందనీ పుణె నుంచి పోస్టులు పంపారు. మథుర సంప్రదాయబద్ధుల నిలయం. ఆ పట్టణంలో ఓ గృహిణి తన కట్టును చీర నుంచి సెల్వార్కమీజ్కు మార్చుకోవడమే పెద్ద విప్లవం. అలాంటి ఊళ్లో బండి నేర్చుకోవడానికి అంత మంది స్త్రీలు ఉత్సాహం చూపడం ఆమెకు ప్రోత్సాహాన్నిచ్చింది. మథుర వచ్చిన వెంటనే ‘ఆత్మనిర్భర్’ పేరుతో తను మొదలుపెట్టబోయే ‘ఆల్ విమెన్ టూ వీలర్ డ్రైవింగ్ స్కూల్’ను రిజిస్టర్ చేయించింది. వెంటనే పనిలోకి దిగింది. డ్రైవ్ చెయ్యాలా.. వద్దా?! వారం గడిచేసరికి డ్రైవింగ్ నేర్చుకోడానికి ముందుకు వచ్చిన వాళ్లలో సగం మంది ‘ఎందుకులేబ్బా’ అని వెనక్కి తగ్గారు. పావని వాళ్ల అమ్మ నిరుత్సాహపడింది. అప్పటికే ఆమె స్కూటీ నడపడంలో పర్ఫెక్ట్ అయిపోయింది. డ్రైవింగ్‌ని ఆస్వాదిస్తోంది. ‘‘రెక్కలు కట్టుకుని విహరిస్తున్నట్టుంది’’ అంటుంది ఆమె. ఇంకొకరి మీద ఆధారపడకుండా బయట పనులన్నీ స్వయంగా చేసుకుంటే ఉండే సౌకర్యాన్ని, సాధికారతను, దర్పాన్నీ ఆమె అనుభవిస్తోంది. అదే మాట చెప్పింది.. తన కూతురు పెట్టిన డ్రైవింగ్ స్కూల్‌కి వచ్చిన మహిళలకు. కొంతమందికి ఆ మాటలు స్ఫూర్తినిచ్చాయి. డ్రైవింగ్ నేర్చుకోడానికి చేరారు. వాళ్ల సంఖ్య పెరిగేసరికి, నేర్పుతామని బయటి ఊళ్ల నుంచి వచ్చే మహిళా ట్రైనర్లూ పెరిగారు. ఇలా పద్దెనిమిది మందితో మొదలైన ఆ స్కూల్ నెల గడిచే సరికి 25 మందికి పెరిగింది. ఒకర్ని చూసి ఒకరికి ధైర్యం నలభై ఐదేళ్ల పావని వాళ్ల అమ్మ తన స్కూటీపై మథుర అంతా తిరుగుతుంటే ఆ వయసు వాళ్లకు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలన్న ఆశ కలిగింది. డ్రైవింగ్ స్కూల్లో ట్రైనర్స్ అంతా ఆడవాళ్లే అయ్యేసరికి ధైర్యమొచ్చింది. క్యూ కట్టారు స్కూల్‌కి. ఇప్పుడు దాదాపు యాభై మంది అయ్యారు నేర్చుకునేవారు. అంతా పదహారు నుంచి 48 ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్లే. చుట్టుపక్కల ఊళ్ల నుంచీ అప్లికేషన్లు పెరుగుతుండటంతో పక్కనే ఉన్న భరత్పూర్, జైపూర్‌లో కూడా బ్రాంచ్‌లను తెరిచింది పావని. ఆత్మనిర్భర్లోనే డ్రైవింగ్ నేర్చుకున్న కొంతమంది అల్పదాయ మహిళలకు అందులోనే ట్రైనర్స్‌గా అవకాశం ఇస్తోంది పావని. అలా వాళ్లు తమ కుటుంబానికి చేదోడువాదోడు అవుతున్నారు. ఆత్మనిర్భర్ ఆలోచన రావడానికి, అది కార్యాచరణ దాల్చడానికి వాళ్లమ్మే కారణం కాబట్టి దానికి వాళ్లమ్మనే సీఈఓగా నియమించింది పావని. సింపుల్ అండ్ స్పీడ్ కోర్స్ పావని డ్రైవింగ్ కోర్సులో థియరీ, ప్రాక్టికల్స్ రెండూ ఉంటాయి. కోర్సు వ్యవధి పది రోజులు. కోర్సు అయ్యాక బండి మెయిన్టెనెన్స్ గురించీ వివరిస్తారు. అంతేకాదు, లైసెన్స్‌ను ఇప్పించే బాధ్యతనూ ఆత్మనిర్భరే తీసుకుంటోంది. ఇలా.. పాతికవేల రూపాయల పెట్టుబడితో, రెండు స్కూటీలతో మొదలైన ఈ స్కూల్ యేడాది గడవకముందే ఏడాదికి ఆరు లక్షల ఆదాయానికి చేరుకుంది. ఇలా.. ఆంట్రప్రెన్యూర్ అవ్వాలన్న పావని కల కూడా నెరవేరింది. బ్రేక్స్ లేకుండా డ్రైవింగ్ స్కూల్‌ను ముందుకు పరిగెత్తించడమే నా ధ్యేయం అంటోంది పావని. మహిళా (డ్రైవింగ్) దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తమ ఆత్మనిర్భర్‌లో విమెన్ ఆంట్రప్రెన్యూర్స్ కోసం ఓ వర్క్‌షాప్‌నూ నిర్వహించింది పావని. దీనికి మథుర చుట్టుపక్కల పట్టణాల నుంచే కాక రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచీ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఇదికాకుండా ఏప్రిల్ నెలలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని చిన్న చిన్న పట్టణాల్లోని మహిళల కోసం డ్రైవింగ్ క్యాంప్స్ను నిర్వహించనున్నట్లు చెప్పింది పావని ఖండేల్వాల్. అన్నట్టు పావని రాయల్ ఎన్ఫీల్డ్ ‘బైకర్ని’ కూడా! బైకర్ని అంటే ఫిమేల్ బైకర్ అని. – శరాది -
అర్ధరాత్రి 18 కిలోమీటర్లు నడిచా ..
ఊహ తెలియని స్థితిలో వివాహం... ఆపై పిల్లలు.. జీవితంలో ఆటుపోట్లు తట్టుకోలేక వదిలేసిన భర్త.. పట్టుమని 16 ఏళ్లు కూడా నిండకుండానే కష్టాలు.. కన్నీళ్లే జీవితం. కన్న బిడ్డలతో కలిసి రైలుకిందపడి ప్రాణాలు తీసుకోవాలని.. అదే రైలు ఎక్కి పరాయి రాష్ట్రంలో మూడేళ్ల అజ్ఞాతం. తర్వాత అత్తింటికి చేరుకుంటే అయినవాళ్ల సూటిపోటి మాటలు. తండ్రిలా ఆదరించాల్సిన బావ దారుణ ప్రవర్తన! ఇమడలేక అత్తింటిని వదులుకుని పట్నం చేరుకుంది. ఆత్మస్థైర్యంతో అడుగేసింది. చదువులు నేర్చింది. విధినెదిరించి విజయకేతనం ఎగురవేసింది. అర్ధరాత్రి 18 కిలోమీటర్లు నడిచా ఒకసారి బాబుకు ‘పెద్ద అమ్మవారు’ పోసింది. ఒళ్లంతా చీము కారుతోంది. ఇతర ఇళ్లలో దుస్తులు ఉతికి రాత్రి ఇంటికి చేరుకున్న నేను బాబును చూసి తట్టుకోలేకపోయాను. 18 కి.మీ. దూరంలోని అనంతపురం ఆస్పత్రికి బాబును, పాపను ఎత్తుకుని ఒక్కదాన్నే చీకట్లో నడుచుకుంటూ వెళ్లా. నా పరిస్థితి తలుచుకుని బాగా ఏడుపొచ్చింది. పిల్లలకు అన్నం పెట్టేలేక.. కష్టాలు భరిస్తూ బతకడం ఇక సాధ్యం కాదని అనుకున్నా. పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నా.. కానీ బతికి సాధించాలని నిర్ణయం తీసుకున్నా.. జీవితంలో నిలదొక్కుకున్నా.. నా బిడ్డలకు మంచి జీవితం ఇచ్చా. – మీనాక్షి మూడేళ్ల అజ్ఞాతంలో ఆదర్శ జీవితం.. పిల్లలతో కలిసి నేను ఎక్కిన రైలు ఎక్కిడికి పోతోందో కూడా నాకు తెలియదు. అటుఇటు చూసే లోపు ఓ పెద్ద ఊళ్లో రైలు ఆగింది. నేను ప్లాట్‌ఫాంపై దిగాను. చూస్తుంటే అంతా కన్నడలో రాసి ఉంది. అక్కడి వారి మాటలను బట్టి హుబ్లీ అని తెలుసుకున్నాను. నాకు భాష రాదు. ఎక్కడికెళ్లాలో తెలియక స్టేషన్లోనే ఓ బెంచిపై కూర్చొని ఉండిపోయాను. ఇంతలో ఒకావిడ నా దగ్గరకు వచ్చి వివరాలు అడిగింది. తెలుగులో చెప్పాను. ఆమెకు అర్థమైనట్లు ఉంది. తన పేరు రాధారాణి అని పరిచయం చేసుకుని తనతో పాటు మమ్మల్ని పిలుచుకెళ్లి, తన ఇంటిలోనే ఆశ్రయమిచ్చారు. మూడు నెలల తర్వాత నేను బెల్గాంలో ఉన్నట్లు తెలుసుకున్నాను. మూడేళ్లలో ఎక్కడా ఎలాంటి పొరబాటు లేకుండా ఆదర్శంగా జీవనం సాగించాను. అప్పటికి భాష నేర్చుకున్నా. ఓ ప్రమాదంలో రాధారాణి చనిపోయారు. దీంతో మళ్లీ ఒంటరిదానయ్యా. ఇక అక్కడ ఉండిబుద్ధి కాలేదు. 2003లో అనంతపురానికి తిరిగి వచ్చాను. 12వ ఏటనే పెళ్లి చేశారు మాది నిరుపేద కుటుంబం. అనంతపురం పాతూరు సమీపంలోని రాణి నగర్లో ఉండేవాళ్లం. అమ్మనాన్న దుస్తులు ఉతికితే వచ్చే సంపాదనతోనే కుటుంబం గడుస్తుంది. 1996లో నేను ఏడో తరగతి చదువుకుంటుండగా (12వ ఏట) మా మేనమామ లక్ష్మీనారాయణతో నాకు పెళ్లి చేశారు. ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలోని అత్తారింటిలో అడుగుపెట్టాను. పెళ్లైనా రెండేళ్లకు పాప పుట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు చెప్పాపెట్టకుండా మా ఆయన ఎక్కడికో వెళ్లిపోయాడు. కొన్ని నెలల తరువాత తిరిగొచ్చాడు. 2000 సంవత్సరంలో మాకు బాబు పుట్టాడు. ఆ తర్వాత నా భర్త మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాడు. బతుకుపై చిరు ఆశ జీవితంపై విరక్తితో పిల్లలను తీసుకుని రైలు కిందపడి చనిపోవాలని అనుకున్నాను. ఇద్దరు పిల్లలను తీసుకుని అనంతపురం రైల్వే స్టేషన్‌ని చేరుకున్నాను. దూరంగా రైలు కూత వినిపిస్తోంది. నా కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. చిన్నోడు ఒడిలో నిద్రపోతున్నాడు. పాప బుడిబుడి అడుగులతో ఆడుకుంటోంది. వారి మొహం చూస్తే బాధేసింది. ఇంతలో రైలు కూత దగ్గర కావడంతో చిన్నోడు ఉలిక్కిపడి లేచాడు. వాడి ఏడుపు నన్ను బతుకుపై ఆశలు రగిలింది. ఆత్మహత్య చేసుకునే ఆలోచనను విడిచి ఆగిన రైలు ఎక్కేసాను. ఆదుకున్న ఆర్డీటీ 2009 ఆగస్టులో ఆర్డీటీ సంస్థ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ సార్‌ని కలిసి నా పరిస్థితి మొత్తం వివరించాను. డ్రైవర్‌గా ఉద్యోగం కల్పిస్తే పిల్లలను చదివించుకుంటానని ప్రాధేయపడ్డాను. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. నాకు డ్రైవింగ్ సరిగా రాకపోయినా జాబ్ ఇచ్చారు... నేను సరిగ్గా నడపలేనని చెప్పాను. అందుకు ఆయన... ‘నీలాంటి వాళ్లను ఎంకేరేజ్ చేయాలి. అందుకే అవకాశం ఇచ్చాను... ట్రైనింగ్ అవ్వు’ అంటూ గ్యారేజి డ్యూటీ వేశారు. అక్కడ పనిచేయిస్తూ ఆరు నెలల్లో డ్రైవింగ్ బాగా నేర్పారు. గ్యారేజీలో రెండున్నర ఏళ్లు పనిచేశా. అక్కడ వాహన మరమ్మతులు పూర్తిగా నేర్చుకున్నాను. ఆ తర్వాత ఏటీఎల్ వాహనానికి డ్రైవర్‌గా పంపారు. మూడేళ్లు పనిచేశాను. అటు తరువాత అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ మూడేళ్లు పనిచేశాను. పనిచేస్తూనే టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. అక్కడే నా జీవితం మారిపోయింది. హెవీ లైసెన్స్ తీసుకుంటానని మాంఛో సార్‌కి చెప్పాను. టెస్ట్‌లో ఫెయల్ అయితే లైసెన్స్ ఫీజు జీతం నుంచి కట్ చేస్తా, పాస్ అయితే తానే కడతానని అన్నారు. నేను టెస్ట్‌లో పాస్ అయ్యాను. బతుకే కష్టమైంది ఇద్దరు చిన్న పిల్లలు. అత్తింటి వారు మమ్మల్ని పట్టించుకోలేదు. ఏమీ చేయాలో... పిల్లలను ఎలా పోషించుకోవాలో అర్థం కాలేదు. కులవృత్తిని నమ్ముకుని దుస్తులు ఉతుకుతూ జీవించాలని అనుకుని ప్రతి రోజూ మదిగుబ్బ నుంచి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ ఆత్మకూరుకు వచ్చి అక్కడి నుంచి బస్సులో అనంతపురం చేరుకునేదాన్ని ఐదారు ఇళ్లు ఒప్పుదల చేసుకుని దుస్తులు ఉతికి తిరిగి ఇంటికి వెళ్లిపోయేదాన్ని. అయినవాళ్లూ ఇబ్బంది పెట్టారు మూడేళ్ల తర్వాత అనంతపురానికి వచ్చిన నేను నేరుగా మదిగుబ్బకు పోయాను. నా భర్త చనిపోయినట్లు తెలిసింది. ఆ సమయంలో నా భర్త అన్నవాళ్లూ నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. చాలా దారుణంగా వ్యవహరిస్తూ వచ్చారు. వారి ప్రవర్తనతో అక్కడ ఇమడలేక పిల్లలను తీసుకుని అనంతపురానికి చేరుకున్నాను. బాబానగర్‌లో చిన్న గది అద్దెకు తీసుకున్నాను. అక్కడికి దగ్గరలోని గుల్జార్ పేటలో ఐదారిళ్లలో దుస్తులు ఉతికేందుకు ఒప్పందం చేసుకున్నాను. నెలకు రూ. 1,500 వచ్చేది. దాంట్లోనే బాడుగ కట్టి, పిల్లలను పోషించుకునేదాన్ని. అలా నాలుగేళ్ల పాటు గడిచింది. మలుపు తిప్పిన డ్రైవింగ్ గుల్జార్‌పేటకు గవర్నమెంట్ ఐటీఐ మీదుగా రోజూ వెళ్లేదానిని. పొదుపు సంఘం సభ్యులకు కుట్టు, డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు డీఆర్డీఏ బోర్డు కనిపించింది. ఐటీఐలోకి వెళ్లి డ్రైవింగ్ నేర్చుకుంటానని అడిగాను. 8వ తరగతి పాస్ అయ్యి ఉండాలని చెప్పారు. నేను ఏడవ తరగతి వరకే చదువుకున్నాను. రాత్రి బడికి వెళ్లి 8వ తరగతి చదవాలని నిర్ణయించుకున్నాను. రాత్రి బడికెళితే పిల్లలను చూసుకోవడం కష్టంగా ఉంటుందని, బాబుని విజయవాడలోని క్రిష్టియన్ స్కూల్లో చేర్పించాను. పాపను గుమ్మఘట్ట హాస్టల్లో చేర్పించాను. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే తపన నన్ను వారిని దూరం చేసింది. రాత్రి బడికి వెళ్లి చదువుకుని 2008లో పరీక్ష రాసి 8వ తరగతి పాస్ అయ్యాను. తర్వాత ఐటీఐలోకి వెళ్లి డ్రైవింగ్ నేర్చకుంటానని చెప్పాను. 2008 డిసెంబరులో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేశాను. 2009లో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. డ్రైవింగ్‌లో మెళుకువలు, నిబంధనల గురించి విద్యార్థులకు క్లాస్ నిర్వహిస్తున్న మీనాక్షి డ్రైవింగ్ స్కూల్ పెడితే.. చాలా మంది మహిళా అధికారులు, తెలిసిన వారు డ్రైవింగ్ నేర్పించు అని అడిగేవారు. ఒక మహిళ డ్రైవర్ అవసరం ఇంత ఉందా అని అప్పుడు నాకు అనిపించి, సొంతంగా ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. 2016లో మాంఛోసార్ని కలిసి విషయం చెప్పాను. ఆలో చన మంచిదేనని అయన ప్రోత్సహించారు. ఆర్డీటీలో జాబ్‌కు రాజీనామా చేసి, బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుని డ్రైవింగ్ స్కూల్ పెట్టాను. స్పందన పేరుతో సేవ నేను ఎన్నో కష్టాలు అనుభవించి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నాను. నాలాంటి వారికి ఏదైనా చేయాలనే ఉద్ధేశంతో స్పందన సంస్థ స్థాపించి రైతు బజార్లో కార్యాలయం ఏర్పాటు చేశాను. ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడే గడుపుతాను. ఎవరైనా వారి వద్ద ఉన్న పాత దుస్తులు తెచ్చి కార్యాలయంలో ఉంచి వెళ్లవచ్చు. వాటిని పేదలు వచ్చి తమకు నచ్చినవి ఉచితంగా తీసుకెళతారు. నాలా ఎవరూ ఇబ్బంది పడకూడదనేది నా కోరిక. అందుకే పేదవారికి ఉచితంగా డ్రైవింగ్ నేర్పించి నాకు తెలిసిన స్వచ్ఛంద సంస్థలతో ఫీజు కట్టించి లైసెన్స్ ఇప్పిస్తుంటాను. -
నేర్చుకొని నేర్పిస్తోంది..!
అమ్మాయిలూ.. అబ్బాయిల్లా బైక్‌పై దూసుకెళ్లాలంటే ఎన్నో ఆంక్షలు. ఈ పరిస్థితిలో ఇప్పుడు కొంచెంమార్పొచ్చినా ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇక 1990 ప్రాంతంలో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో సొంతంగా బైక్ డ్రైవింగ్నేర్చుకొని, మరెంతో మందికినేర్పిస్తూ ముందుకెళ్తున్నారు నగరవాసి నిర్మల. హిమాయత్‌నగర్: నిర్మలకు ఇద్దరు పిల్లలు. వారిని స్కూల్ తీసుకెళ్లి, ఆఫీస్‌కు వెళ్లే సరికి ఆలస్యమవుతోందని భర్త కోప్పడేవాడు. ‘నీకు కనీసం బండి కూడా రాదు..’ అంటూ హేళన చేసేవాడు. దీనికి ఎలాగైనా సమాధానం చెప్పాలనుకున్న నిర్మల.. అవసరాన్ని చాలెంజ్‌గా తీసుకొని ఇంట్లో ఎవరికీ తెలియకుండా కెనటిక్ హోండా బైక్‌పై ఓ 10రోజులు ప్రాక్టీస్ చేసి, సొంతంగా డ్రైవింగ్ నేర్చుకుంది. ఫర్ఫెక్ట్ అయ్యాక భర్త, బంధువుల ఎదుట నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పూజారి మాటతో... డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నిర్మల కొత్త బైక్ కొనుగోలు చేశారు. పూజ చేయించేందుకు గుడికి వెళ్లగా ‘అమ్మా.. డ్రైవింగ్ రాక ఇంట్లో మాటలు పడుతున్నవారు చాలామంది ఉన్నారు. వారికి నేర్పిస్తే బాగుంటుంది కదా’ అని పూజారి ఆమెతో అన్నారు. ఆ మాట నిర్మల మనసులో నాటుకుపోయింది. దానికి కట్టుబడి ‘సాయి డ్రైవింగ్ స్కూల్’ పేరుతో మహళల కోసం ప్రత్యేకంగా బైక్ డ్రైవింగ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించారు. 1997లో ప్రారంభమైన ఈ స్కూల్లో ఇప్పటి వరకు 3వేలకు పైగా మంది బైక్ నేర్చుకున్నారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు.. సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7:30 వరకు డ్రైవింగ్ నేర్పిస్తారు. ఫీలింగ్ హ్యాపీ.. బైక్ డ్రైవింగ్ రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇతరులను సాయం కోరేకన్నా నేర్చుకుంటే బాగుంటుంది కదా అని... కష్టంతో ఇష్టపడి నేర్చుకున్నాను. ఇప్పుడు నేనే మరొకరి నేర్పించే స్థాయికి ఎదిగినందుకు చాలా ఆనందంగా ఉంది. సిటీలో ఫస్ట్ లేడీస్ టూవీలర్ డ్రైవింగ్ స్కూల్ నాదే అయినందకు గర్వంగా కూడా ఉంది. – నిర్మల చార్జీలు ఇలా.. ఇక్కడ పాతకాలం బైక్‌ల నుంచి ఆధునిక బైక్‌ల వరకు అందుబాటులో ఉన్నాయి. కెనటిక్ హోండాపై నేర్చుకోవాలంటే రూ.2,800, హోండా యాక్టివాపై అయితే రూ.3,800 చొప్పున చార్జీ చేస్తారు. శిక్షణ సమయంలో ఆర్టీఏ రూల్స్‌ని వివరిస్తూ నేర్పిస్తారు. -
హైదరాబాద్‌లో టయోటా డ్రైవింగ్ స్కూల్
-
డ్రైవింగ్ నేర్చుకుందాం..!
- డ్రైవింగ్‌పై యువత, విద్యార్థుల ఆసక్తి - శిక్షణ సంస్థలకు పెరిగిన డిమాండ్ శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: డ్రైవింగ్ నేర్చుకునేందుకు యువతీయువకులు, ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. డ్రైవింగ్‌తో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తుండడంతో యువత మొగ్గుచూపుతున్నారు. డ్రైవిం గ్ను హుందాతనంగా భావించేవారు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు. దేశ ప్రథమపౌరుడు నుంచి మండలస్థారుు అధికారి వరకు అందరూ డ్రైవర్ పక్కన లేదా డ్రైవర్ వెనకాలా సీటులో కూర్చోవల్సిందే. దీన్ని డ్రైవర్లు ఎంతో గౌరవంగా భావిస్తుంటారు. ఇదంతా ఒకెత్తయితే... నేటి పోటీ ప్రపంచ యుగంలో ఉద్యోగ సాధనకు పోటీపడుతున్నారు. చిన్న వయసులోనే ఐదంకెల జీతమిచ్చే ఉద్యోగాలు చేస్తున్నవారు జిల్లాలో క్రమేపి పెరుగుతున్నారు. వీరందరూ నాలుగు చక్రాలవాహనాలు కొనుగోలు చేయడం, డ్రైవర్లకు డిమాండ్ ఉండడంతో ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు కార్‌డ్రైవింగ్ నేర్చుకునేందుకు సై అంటున్నారు. డ్రైవింగ్ స్కూ ళ్లకు పరుగులు తీస్తున్నారు. యువకులు ఆసక్తికి తగ్గట్టుగానే పట్టణంలో డ్రైవింగ్ శిక్షణ సంస్థలు కూడా అదే స్థారులో వెలశారు. ప్రస్తుతం ఒక్క శ్రీకాకుళం పట్టణంలోనే దాదా పు 8 డ్రైవింగ్ శిక్షణ సంస్థలు ఉన్నాయి. ఈ వేసవిలో ప్రత్యేక ఆఫర్ల పేరిట తక్కువ ఫీజులతో శిక్షణ అంది స్తున్నారు. ఆన్‌లైన్‌ద్వారా ముందుగా లెసైన్స్‌కోసం తమ పేర్లునమోదు చేసుకున్న అనంత రం శిక్షణ పొందడం మొదలు పెడుతున్నారు. శిక్షణ అందించే సంస్థలు... సాయి డ్రైవింగ్ స్కూల్, బలగ మెట్టు, సెల్: 9494200111. శ్రీరామచంద్ర డ్రైవింగ్ స్కూల్, బలగ జంక్షన్, 9848950678, శిరిడీసాయి డ్రైవింగ్ స్కూల్, అరసవల్లిరోడ్, సెల్: 9949861551, వీటితోపాటు పట్టణంలో మరికొన్ని డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి. ఫీజులు ఇలా... డ్రైవింగ్‌లో నెల నుంచి మూడు నెలల కాలవ్యవధిలో శిక్షణ ఇస్తున్నారు. డ్రైవింగ్‌లోని మెలకువులను నేర్పుతారు. మరీ భయస్తులకైతే మరో నెలరోజుల పాటు అదనంగా శిక్షణ ఇస్తున్నారు. వీరికి ప్రవేశ రుసుంగా * వెయ్యి తీసుకుంటున్నారు. డిమాండ్, వ్యక్తులను బట్టి నెలకు * 5 వందల నుంచి 15 వందల వరకు వసూలు చేస్తున్నారు.