
డ్రైవింగ్ నేర్చుకుందాం..!
- డ్రైవింగ్‌పై యువత, విద్యార్థుల ఆసక్తి
- శిక్షణ సంస్థలకు పెరిగిన డిమాండ్
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: డ్రైవింగ్ నేర్చుకునేందుకు యువతీయువకులు, ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. డ్రైవింగ్‌తో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తుండడంతో యువత మొగ్గుచూపుతున్నారు. డ్రైవిం గ్‌ను హుందాతనంగా భావించేవారు కూడా వేల సంఖ్యలోనే ఉన్నారు. దేశ ప్రథమపౌరుడు నుంచి మండలస్థారుు అధికారి వరకు అందరూ డ్రైవర్ పక్కన లేదా డ్రైవర్ వెనకాలా సీటులో కూర్చోవల్సిందే. దీన్ని డ్రైవర్లు ఎంతో గౌరవంగా భావిస్తుంటారు.
ఇదంతా ఒకెత్తయితే... నేటి పోటీ ప్రపంచ యుగంలో ఉద్యోగ సాధనకు పోటీపడుతున్నారు. చిన్న వయసులోనే ఐదంకెల జీతమిచ్చే ఉద్యోగాలు చేస్తున్నవారు జిల్లాలో క్రమేపి పెరుగుతున్నారు. వీరందరూ నాలుగు చక్రాలవాహనాలు కొనుగోలు చేయడం, డ్రైవర్లకు డిమాండ్ ఉండడంతో ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు కార్‌డ్రైవింగ్ నేర్చుకునేందుకు సై అంటున్నారు.
డ్రైవింగ్ స్కూ ళ్లకు పరుగులు తీస్తున్నారు. యువకులు ఆసక్తికి తగ్గట్టుగానే పట్టణంలో డ్రైవింగ్ శిక్షణ సంస్థలు కూడా అదే స్థారులో వెలశారు. ప్రస్తుతం ఒక్క శ్రీకాకుళం పట్టణంలోనే దాదా పు 8 డ్రైవింగ్ శిక్షణ సంస్థలు ఉన్నాయి. ఈ వేసవిలో ప్రత్యేక ఆఫర్ల పేరిట తక్కువ ఫీజులతో శిక్షణ అంది స్తున్నారు. ఆన్‌లైన్‌ద్వారా ముందుగా లెసైన్స్‌కోసం తమ పేర్లునమోదు చేసుకున్న అనంత రం శిక్షణ పొందడం మొదలు పెడుతున్నారు.
శిక్షణ అందించే సంస్థలు...
సాయి డ్రైవింగ్ స్కూల్, బలగ మెట్టు, సెల్: 9494200111. శ్రీరామచంద్ర డ్రైవింగ్ స్కూల్, బలగ జంక్షన్, 9848950678, శిరిడీసాయి డ్రైవింగ్ స్కూల్, అరసవల్లిరోడ్, సెల్: 9949861551, వీటితోపాటు పట్టణంలో మరికొన్ని డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నాయి.
ఫీజులు ఇలా...
డ్రైవింగ్‌లో నెల నుంచి మూడు నెలల కాలవ్యవధిలో శిక్షణ ఇస్తున్నారు. డ్రైవింగ్‌లోని మెలకువులను నేర్పుతారు. మరీ భయస్తులకైతే మరో నెలరోజుల పాటు అదనంగా శిక్షణ ఇస్తున్నారు. వీరికి ప్రవేశ రుసుంగా * వెయ్యి తీసుకుంటున్నారు. డిమాండ్, వ్యక్తులను బట్టి నెలకు * 5 వందల నుంచి 15 వందల వరకు వసూలు చేస్తున్నారు.