Anita Sharma: కదలండి కదిలించండి | Drive On My Own: Anita Sharma helping persons with disabilities learn to drive | Sakshi
Sakshi News home page

Anita Sharma: కదలండి కదిలించండి

Published Thu, Apr 4 2024 4:32 AM | Last Updated on Thu, Apr 4 2024 4:32 AM

Drive On My Own: Anita Sharma helping persons with disabilities learn to drive - Sakshi

దివ్యాంగుల కోసం డ్రైవింగ్‌ క్లాసులు నిర్వహిస్తున్న అనితా శర్మ

ఆమె పోలియో బాధితురాలు. ఐ.ఐ.ఎం. ఇండోర్‌లో పీహెచ్‌డీ చేసిన విద్యాధికురాలు. కాని ఆమె తన జీవితాన్ని దివ్యాంగుల కోసం అంకితం చేసింది. పట్టుదలగా డ్రైవింగ్‌ నేర్చుకోవడమేగాక దివ్యాంగులకు డ్రైవింగ్‌ నేర్పించే స్కూల్‌ నడుపుతోంది. ఏయే పరికరాలు అమర్చడం ద్వారా దివ్యాంగులు సులభంగా డ్రైవ్‌ చేయవచ్చో తెలుపుతోంది. ‘డ్రైవ్‌ ఆన్‌ మై ఓన్‌’ సంస్థ నడుపుతున్న డాక్టర్‌ అనితా శర్మ గురించి.

అనితాశర్మకు కారు డ్రైవింగ్‌ నేర్చుకోవాలనిపించింది. జైపూర్‌ ఆమెది. జైపూర్‌లో పదిహేను, ఇరవై కాల్స్‌ చేసింది. ఎవరూ నేర్పించము అన్నారు. ఢిల్లీలో నేర్పుతారేమోనని అక్కడా ఒక పది, ఇరవై కాల్స్‌ చేసింది. అక్కడా ఎవరూ నేర్పము  అన్నారు. కారణం? అనిత కుడికాలుకు పోలియో ఉంది. పోలియోతో బాధ పడుతున్నవారికి, లేదా ఇతర దివ్యాంగులకు కారు డ్రైవింగ్‌ నేర్పించే తర్ఫీదు డ్రైవింగ్‌ స్కూల్స్‌కు లేదు. అలా చేయడానికి అవసరమైన మోడిఫైడ్‌ కార్లు వారి దగ్గర ఉండవు. దివ్యాంగులు చక్రాల కుర్చీకి పరిమితం కావలసిందేనా? వారు తమకు తాముగా బయటకు తిరగకూడదా అనుకుంది అనితా శర్మ.

తల్లి సహాయంతో...
అనితా శర్మ ఇండోర్‌ ఐ.ఐ.ఎంలో పీహెచ్‌డీ చేసింది. అమృతసర్‌ ఐ.ఐ.ఎంలో ్ర΄÷ఫెసర్‌ ఉద్యోగం సం΄ాదించింది. అయితే ఆమెకు కారు నడ΄ాలన్న కోరిక మాత్రం తీరలేదు. ‘మొదట నేను అదనపు చక్రాలు బిగించిన టూ వీలర్‌ నడి΄ాను. నా ఆనందానికి అవధుల్లేవు. కారు నడిపితే ఎంత బాగుండో అనిపించింది. హ్యాండ్‌ కంట్రోల్‌ ఉండేలా కారును మోడిఫై చేయించి మా అమ్మ సహాయంతో నేర్చుకున్నాను.

ఇప్పుడు నేను ఎప్పుడైనా ఎక్కడికైనా నా కారులో ప్రయాణించగలను. నేను కారు నడపడం చూసి చాలామంది దివ్యాంగులు మాకు నేర్పించవచ్చు కదా అనడిగేవారు. వారి కోసం పని చేయాలనిపించింది. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేసి‘డ్రైవ్‌ ఆన్‌ మై ఓన్‌’ సంస్థ స్థాపించాను. దివ్యాంగులకు కారు డ్రైవింగ్‌ నేర్పించి, సొంత కారు కొనుక్కోవడంలో అవసరమైన సాయం చేయడమే మా సంస్థ ఉద్దేశం’ అంటుందామె.

కస్టమైజ్డ్‌ కార్లు
అనితాశర్మ సంస్థ దివ్యాంగుల కోసం డ్రైవింగ్‌ క్లాసులు నిర్వహిస్తుంది. వెబినార్లు, సెమినార్లు నిర్వహిస్తుంది. దివ్యాంగుల కమ్యూనిటీలో ఒకరికొకరికి పరిచయాలు చేసి ్రపోత్సహించుకునేలా చేస్తుంది. శారీరక పరిమితులను అనుసరించి కారులో ఎటువంటి మోడిఫికేషన్‌ చేస్తే కారు నడపవచ్చో సూచిస్తుంది. ఆ మోడిఫికేషన్‌ పరికరాలు సమకూర్చడంలో సాయం చేస్తుంది. ఆ తర్వాత  కార్ల రిజిస్ట్రేషన్, జిఎస్‌టి వంటివి దివ్యాంగుల పక్షంలో జరిగేలా చూస్తుంది. ‘ఇదంతా చేయడానికి మేము కొంత ఫీజు తీసుకుంటాం. దివ్యాంగులు ఛారిటీ మీద కాకుండా తమ కాళ్ల మీద తాము బతకాలన్నదే నా ఉద్దేశం’ అంటుంది అనితా శర్మ.

కుటుంబ సభ్యులు
‘దివ్యాంగులు కారు నడపడానికి వారి కుటుంబసభ్యులను ఒప్పించడమే పెద్ద సమస్య. దివ్యాంగులు కారు నడపగలరు. వారిని డ్రైవింగ్‌ సీట్‌లో స్లయిడర్స్‌ ద్వారా సులువుగా చేర్చవచ్చు. కాళ్లతో పని లేకుండా చేతులతోనే మొత్తం కంట్రోల్‌ చేయొచ్చు. వారికి తిరగాలని ఉంటుంది. ధైర్యం చెప్పి సహకరించి తిరగనివ్వండి’ అని సూచిస్తోంది అనితా శర్మ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement