Exercise With Indoor Cycling Or Stationary Cycle Has Many Benefits For Health In Telugu - Sakshi
Sakshi News home page

అదొక్కటే! ఎన్నో వ్యాయామాలకు సరిసాటి..

Published Sat, Jun 17 2023 3:11 PM | Last Updated on Sat, Jun 17 2023 3:49 PM

Exercise With Indoor Cycling Or Stationary Cycle Has Many Benefits - Sakshi

వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం అందరికీ తెలుసు. అయితే అందరికీ వ్యాయామం చేయడం కుదరకపోవచ్చు. కొందరికైతే కనీసం వాకింగ్‌ చేయడం కూడా కష్టమే అవుతుంటుంది వారున్న పరిస్థితులలో. అలాంటప్పుడు కనీసం ఇండోర్‌ సైక్లింగ్‌ లేదా స్టేషనరీ సైకిల్‌తో వ్యాయామం చేసినా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇండోర్‌ సైక్లింగ్‌ వల్ల ఏయే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం..

ఇండోర్‌ సైక్లింగ్‌ శరీరాన్ని ఫిట్‌ గా ఉంచడమే కాకుండా గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గిస్తుంది
ఇండోర్‌ సైక్లింగ్‌ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇండోర్‌ సైక్లింగ్‌ ఎన్నో రోగాల ముప్పు నుంచి కాపాడుతుంది. ఏరోబిక్‌ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అలాగే హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది మీ గుండె కండరాలను బలోపేతం చేయడానికి, శరీరంలోకి రక్తాన్ని సమర్థవంతంగా పంప్‌ చేయడానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామాన్ని స్థిరంగా చేయడం వల్ల రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. దీంతో అధిక రక్తపోటు పోటు సమస్యలు రావు. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. 

మెటబాలిజాన్ని పెంచుతుంది
ఏ రకమైన కదలిక అయినా సరే శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. సైక్లింగ్‌ ఎఫెక్టీవ్‌ కేలరీల బర్నింగ్‌ వ్యాయామం. సైక్లింగ్‌ తో బెల్లీ ఫ్యాట్‌ ను తగ్గించుకోవచ్చు. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ ప్రకారం.. 70 కిలోల బరువున్న వ్యక్తి ఇండోర్‌ సైక్లింగ్‌ వల్ల 250 నిమిషాల్లో 30 కేలరీలను కరిగించగలడు. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే జిమ్ముకు బదులుగా ఇంట్లో ఉండి ఇండోర్‌ సైక్లింగ్‌ చేస్తే సరి! అంతేకాదు ఈ సైకిల్‌ను తొక్కడం వల్ల మీ కాలి కదలికలు మెరుగుపడతాయి. ఫలితంగా కాళ్లలోని కండరాల సమూహాలు – క్వాడ్రిసెప్స్, గ్లూట్స్, తొడ కండరాలు కాలక్రమేణా బలంగా, టోన్‌ అయ్యేలా చేస్తాయి.

ఇండోర్‌ సైక్లింగ్‌ మీ కీళ్లకు మంచిది
ఇండోర్‌ సైక్లింగ్‌ ప్రభావవంతమైన తక్కువ–ప్రభావ వ్యాయామంగా పరిగణించబడుతుంది. ఇది వృద్ధులకు, మోకాలి, కీళ్ల నొప్పులు ఉన్నవారికి బాగా సహాయపడుతుంది. ఇది కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. మోకాలి సమస్య లేదా వెన్నునొప్పి ఉన్నవారు ఇండోర్‌ సైక్లింగ్‌కు ముుందు డాక్టర్‌తో మాట్లాడాలి. వైద్యుడి సలహా మేరకే ఈ సైకిల్‌ను తొక్కాలి.

ఒత్తిడిని తగ్గిస్తుంది
ఇండోర్‌ సైక్లింగ్‌ మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఏదో ఒక రూపంలో శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల మీ శరీరం ఎండార్ఫిన్లు అని పిలువబడే ఫీల్‌–గుడ్‌ హార్మోన్లను విడుదల చేస్తుంది. çకొన్ని అధ్యయనాల ప్రకారం.. సైక్లింగ్‌ డోపామైన్, సెరోటోనిన్‌ ను కూడా పెంచుతుంది. ఫలితంగా మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి స్థాయులు కూడా తగ్గుతాయి. 

శక్తి సామర్థ్యాలను పెంచుతుంది
ఇండోర్‌ సైక్లింగ్‌ మీ స్టామినాను పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్‌ గా తొక్కుతుంటే క్రమంగా అలసట తగ్గి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి, ఇతర వ్యాయామాలలో పాల్గొనడానికి ఎక్కువ శక్తి, సామర్థ్యాన్ని కలిగి ఉండటానికి సహాయపడుతుంది. 

(చదవండి: మనిషన్నవాడు ఏమైపోయాడో..ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిన హత్యాకాండలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement