Indoor
-
ప్రపంచంలో అతి పెద్ద ఇన్డోర్ స్కీయింగ్ పార్క్
సినిమాల్లో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో స్కీయింగ్ చూస్తాం. మంచు మీద స్కీస్ బిగించుకుని చాలా వేగంగా దూకుతూ ముందుకెళతారు. స్కీయింగ్‌లో మాగ్జిమమ్ ఎంత స్పీడ్‌గా వెళ్లవచ్చో తెలుసా? గంటకు 250 కిలోమీటర్లు. అవును. పారిస్‌లో సిమోన్ బిల్లీ అనే స్కియర్ ఈ ఘనత సాధించాడు. మన దేశంలో జనవరి నుంచి మార్చి మధ్యలో కశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో స్కీయింగ్ చేసేంత మంచు ఉంటుంది. ఆ సీజన్లో టూరిస్ట్‌లు వెళ్లి స్కీయింగ్ చేస్తారు. ఆ సీజన్ తర్వాత ఊరికే కూచోవాల్సిందే. అయితే చైనా వాళ్లు సంవత్సరం పోడుగునా స్కీయింగ్ చేయొచ్చు కదా అనుకున్నారు. అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద ఇండోర్ స్కీయింగ్ పార్క్‌లో ఇటీవల షాంఘైలో ప్రాంరంభించారు. దీని పేరు ‘ఎల్ స్నో స్కీయింగ్ థీమ్ రిసార్ట్’.90 వేల చదరపు మీటర్లలోస్కీయింగ్ చాలా దూరం వరకూ చేయాల్సిన స్పోర్ట్. ఔట్‌డోర్ అయితే మంచు మైదానం ఉంటుంది. కాని ఇండోర్‌లో అంటే కష్టమే. అయినా సరే చైనావాళ్లు 90 వేల చదరపు మీటర్ల పార్క్‌లో కృత్రిమ మంచు మైదానం సృష్టించారు. ఇందుకోసం 72 కూలింగ్ మిషీన్లు 33 స్నోమేకింగ్ మెషిన్లు ఉపయోగిస్తారు. అంటే ఎప్పుడూ లోపలి ఉష్ణోగ్రత 0 డిగ్రీల కంటే తక్కువే ఉంటుంది.సహజమైన మంచు లేకచైనాలోని ఉత్త ప్రాతంలో మంచు కొండలు ఉన్నాయి. చైనీయులు అక్కడ స్కీయింగ్ చేయడానికి వెళతారు. అయితే సహజమైన మంచు మైదానాల్లో ప్రమాదాలు ఎక్కువ. పైగా గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు పలుచబడుతోంది. అందువల్ల చైనీయులు తమకో స్కీయింగ్ ΄ార్క్ కావాలని కోరుకున్నారు. వారి ఆలోచనలకు తగినట్టుగా ఇప్పుడు పార్క్ తయారైంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉండటానికి గదులు షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. నగరంలో ఉంటూనే మంచు ప్రాంతానికి వెళ్లివచ్చిన అనుభూతిని పోందవచ్చు. పిల్లలు ఈ పార్క్ గురించి విన్న వెంటనే వెళ్దామని అంటున్నారట. మనం వెళ్లలేం. ఇక్కడ ఫొటోలు చూడటమే. -
Anita Sharma: కదలండి కదిలించండి
ఆమె పోలియో బాధితురాలు. ఐ.ఐ.ఎం. ఇండోర్‌లో పీహెచ్డీ చేసిన విద్యాధికురాలు. కాని ఆమె తన జీవితాన్ని దివ్యాంగుల కోసం అంకితం చేసింది. పట్టుదలగా డ్రైవింగ్ నేర్చుకోవడమేగాక దివ్యాంగులకు డ్రైవింగ్ నేర్పించే స్కూల్ నడుపుతోంది. ఏయే పరికరాలు అమర్చడం ద్వారా దివ్యాంగులు సులభంగా డ్రైవ్ చేయవచ్చో తెలుపుతోంది. ‘డ్రైవ్ ఆన్ మై ఓన్’ సంస్థ నడుపుతున్న డాక్టర్ అనితా శర్మ గురించి. అనితాశర్మకు కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనిపించింది. జైపూర్ ఆమెది. జైపూర్‌లో పదిహేను, ఇరవై కాల్స్ చేసింది. ఎవరూ నేర్పించము అన్నారు. ఢిల్లీలో నేర్పుతారేమోనని అక్కడా ఒక పది, ఇరవై కాల్స్ చేసింది. అక్కడా ఎవరూ నేర్పము అన్నారు. కారణం? అనిత కుడికాలుకు పోలియో ఉంది. పోలియోతో బాధ పడుతున్నవారికి, లేదా ఇతర దివ్యాంగులకు కారు డ్రైవింగ్ నేర్పించే తర్ఫీదు డ్రైవింగ్ స్కూల్స్‌కు లేదు. అలా చేయడానికి అవసరమైన మోడిఫైడ్ కార్లు వారి దగ్గర ఉండవు. దివ్యాంగులు చక్రాల కుర్చీకి పరిమితం కావలసిందేనా? వారు తమకు తాముగా బయటకు తిరగకూడదా అనుకుంది అనితా శర్మ. తల్లి సహాయంతో... అనితా శర్మ ఇండోర్ ఐ.ఐ.ఎంలో పీహెచ్డీ చేసింది. అమృతసర్ ఐ.ఐ.ఎంలో ్ర΄÷ఫెసర్ ఉద్యోగం సం΄ాదించింది. అయితే ఆమెకు కారు నడ΄ాలన్న కోరిక మాత్రం తీరలేదు. ‘మొదట నేను అదనపు చక్రాలు బిగించిన టూ వీలర్ నడి΄ాను. నా ఆనందానికి అవధుల్లేవు. కారు నడిపితే ఎంత బాగుండో అనిపించింది. హ్యాండ్ కంట్రోల్ ఉండేలా కారును మోడిఫై చేయించి మా అమ్మ సహాయంతో నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఎక్కడికైనా నా కారులో ప్రయాణించగలను. నేను కారు నడపడం చూసి చాలామంది దివ్యాంగులు మాకు నేర్పించవచ్చు కదా అనడిగేవారు. వారి కోసం పని చేయాలనిపించింది. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేసి‘డ్రైవ్ ఆన్ మై ఓన్’ సంస్థ స్థాపించాను. దివ్యాంగులకు కారు డ్రైవింగ్ నేర్పించి, సొంత కారు కొనుక్కోవడంలో అవసరమైన సాయం చేయడమే మా సంస్థ ఉద్దేశం’ అంటుందామె. కస్టమైజ్డ్ కార్లు అనితాశర్మ సంస్థ దివ్యాంగుల కోసం డ్రైవింగ్ క్లాసులు నిర్వహిస్తుంది. వెబినార్లు, సెమినార్లు నిర్వహిస్తుంది. దివ్యాంగుల కమ్యూనిటీలో ఒకరికొకరికి పరిచయాలు చేసి ్రపోత్సహించుకునేలా చేస్తుంది. శారీరక పరిమితులను అనుసరించి కారులో ఎటువంటి మోడిఫికేషన్ చేస్తే కారు నడపవచ్చో సూచిస్తుంది. ఆ మోడిఫికేషన్ పరికరాలు సమకూర్చడంలో సాయం చేస్తుంది. ఆ తర్వాత కార్ల రిజిస్ట్రేషన్, జిఎస్టి వంటివి దివ్యాంగుల పక్షంలో జరిగేలా చూస్తుంది. ‘ఇదంతా చేయడానికి మేము కొంత ఫీజు తీసుకుంటాం. దివ్యాంగులు ఛారిటీ మీద కాకుండా తమ కాళ్ల మీద తాము బతకాలన్నదే నా ఉద్దేశం’ అంటుంది అనితా శర్మ. కుటుంబ సభ్యులు ‘దివ్యాంగులు కారు నడపడానికి వారి కుటుంబసభ్యులను ఒప్పించడమే పెద్ద సమస్య. దివ్యాంగులు కారు నడపగలరు. వారిని డ్రైవింగ్ సీట్లో స్లయిడర్స్ ద్వారా సులువుగా చేర్చవచ్చు. కాళ్లతో పని లేకుండా చేతులతోనే మొత్తం కంట్రోల్ చేయొచ్చు. వారికి తిరగాలని ఉంటుంది. ధైర్యం చెప్పి సహకరించి తిరగనివ్వండి’ అని సూచిస్తోంది అనితా శర్మ. -
మరోసారి ఇక ఎవ్వరూ దరఖాస్తు చేయరు సార్!
-
అదొక్కటే! ఎన్నో వ్యాయామాలకు సరిసాటి..
వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయనే విషయం అందరికీ తెలుసు. అయితే అందరికీ వ్యాయామం చేయడం కుదరకపోవచ్చు. కొందరికైతే కనీసం వాకింగ్ చేయడం కూడా కష్టమే అవుతుంటుంది వారున్న పరిస్థితులలో. అలాంటప్పుడు కనీసం ఇండోర్ సైక్లింగ్ లేదా స్టేషనరీ సైకిల్‌తో వ్యాయామం చేసినా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇండోర్ సైక్లింగ్ వల్ల ఏయే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.. ఇండోర్ సైక్లింగ్ శరీరాన్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గిస్తుంది ఇండోర్ సైక్లింగ్ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇండోర్ సైక్లింగ్ ఎన్నో రోగాల ముప్పు నుంచి కాపాడుతుంది. ఏరోబిక్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అలాగే హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది మీ గుండె కండరాలను బలోపేతం చేయడానికి, శరీరంలోకి రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయడానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామాన్ని స్థిరంగా చేయడం వల్ల రక్త ప్రసరణ, ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపడుతుంది. దీంతో అధిక రక్తపోటు పోటు సమస్యలు రావు. గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. మెటబాలిజాన్ని పెంచుతుంది ఏ రకమైన కదలిక అయినా సరే శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. సైక్లింగ్ ఎఫెక్టీవ్ కేలరీల బర్నింగ్ వ్యాయామం. సైక్లింగ్ తో బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం.. 70 కిలోల బరువున్న వ్యక్తి ఇండోర్ సైక్లింగ్ వల్ల 250 నిమిషాల్లో 30 కేలరీలను కరిగించగలడు. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే జిమ్ముకు బదులుగా ఇంట్లో ఉండి ఇండోర్ సైక్లింగ్ చేస్తే సరి! అంతేకాదు ఈ సైకిల్‌ను తొక్కడం వల్ల మీ కాలి కదలికలు మెరుగుపడతాయి. ఫలితంగా కాళ్లలోని కండరాల సమూహాలు – క్వాడ్రిసెప్స్, గ్లూట్స్, తొడ కండరాలు కాలక్రమేణా బలంగా, టోన్ అయ్యేలా చేస్తాయి. ఇండోర్ సైక్లింగ్ మీ కీళ్లకు మంచిది ఇండోర్ సైక్లింగ్ ప్రభావవంతమైన తక్కువ–ప్రభావ వ్యాయామంగా పరిగణించబడుతుంది. ఇది వృద్ధులకు, మోకాలి, కీళ్ల నొప్పులు ఉన్నవారికి బాగా సహాయపడుతుంది. ఇది కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. మోకాలి సమస్య లేదా వెన్నునొప్పి ఉన్నవారు ఇండోర్ సైక్లింగ్‌కు ముుందు డాక్టర్‌తో మాట్లాడాలి. వైద్యుడి సలహా మేరకే ఈ సైకిల్‌ను తొక్కాలి. ఒత్తిడిని తగ్గిస్తుంది ఇండోర్ సైక్లింగ్ మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఏదో ఒక రూపంలో శారీరకంగా చురుకుగా ఉండటం వల్ల మీ శరీరం ఎండార్ఫిన్లు అని పిలువబడే ఫీల్–గుడ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. çకొన్ని అధ్యయనాల ప్రకారం.. సైక్లింగ్ డోపామైన్, సెరోటోనిన్ ను కూడా పెంచుతుంది. ఫలితంగా మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి స్థాయులు కూడా తగ్గుతాయి. శక్తి సామర్థ్యాలను పెంచుతుంది ఇండోర్ సైక్లింగ్ మీ స్టామినాను పెంచడానికి కూడా సహాయపడుతుంది. దీన్ని రెగ్యులర్ గా తొక్కుతుంటే క్రమంగా అలసట తగ్గి రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి, ఇతర వ్యాయామాలలో పాల్గొనడానికి ఎక్కువ శక్తి, సామర్థ్యాన్ని కలిగి ఉండటానికి సహాయపడుతుంది. (చదవండి: మనిషన్నవాడు ఏమైపోయాడో..ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిన హత్యాకాండలు!) -
మాటే మంత్రమై...
చిన్న వయసులో ఉన్నప్పుడు ఇండోర్ (మధ్యప్రదేశ్)లో జరిగిన మ్యాజిక్ షోకు వెళ్లాడు రాజ్ షమని.మెజిషియన్ టోపి నుంచి కుందేలు పిల్లను బయటికి తీశాడు. మంత్రదండం నుంచి పూలవర్షం కురిపించాడు.ఈ అబ్బురాలను చూసి ‘మెజిషియన్ అయితే ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో కదా!’ అనుకున్నాడు రాజ్. పెద్దయ్యాక రాజ్ మెజిషియన్ కాలేదుగానీ ‘మాటల మాంత్రికుడు’ అయ్యాడు! సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా బోలెడు పేరు తెచ్చుకున్నాడు.... పదహారు సంవత్సరాల వయసులో ఇండోర్‌లో తండ్రి చేసే వ్యా పారానికి చేదోడువాదోడుగా ఉండేవాడు రాజ్ షమని. తండ్రితో పాటు డిష్ సోప్స్ అమ్మేవాడు. ‘కాలాన్ని కనిపెట్టుకొని ఉండాలి’ అనేది వ్యా పారసూత్రం. ఆ వయసులో అతడికి ఇది తెలుసో లేదోగానీ డిష్ సోప్ నుంచి ΄పౌ డర్‌కు, ΄పౌ డర్ నుంచి లిక్విడ్‌కు, డిష్వాషర్ జెల్‌కు బిజినెస్‌ను మార్చాడు. అంతకు ముందు ఉండీ లేనట్లుగా ఉన్న వ్యా పారం కొత్త ఊపిరి పోసుకొని లాభాల బాటలో పరుగెత్తింది.రాజ్‌కు తన గురించి తాను తెలుసుకునేలా చేసింది. కొన్ని సంవత్సరాల తరువాత...సోషల్ మీడియాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబైకి వచ్చాడు రాజ్.‘మరీ ఎక్కువగా ఉత్సాహపడుతున్నావు. ఇక్కడ బాగానే ఉంది కదా’ అన్నారు ఇండోర్ ఫ్రెండ్స్. అయితే రాజ్ షమని ఒక్క విజయం దగ్గర ఆగిపోయే టైప్ కాదు. ఉత్సాహమే అతని ఇంధనం. కొన్ని సంవత్సరాల కష్టం తరువాత మన దేశంలోని మోస్ట్–ఫాలోవ్డ్ కంటెంట్ క్రియేటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు రాజ్ షమని. మరో విశేషం...మన దేశంలోని ఎంటర్ప్రెన్యూర్షిప్కు సంబంధించిన పాడ్‌కాస్ట్‌లలో రాజ్ షమని చేసిన ‘ఫిగర్ ఔట్’ పాడ్‌కాస్ట్ టాప్‌లో నిలిచింది. పన్నెండు నెలల వ్యవధిలో 100 మిలియన్ వ్యూలు వచ్చాయి.తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఎంతోమంది స్టార్టప్‌ల వైపు రావడానికి కారణమైన రాజ్ తొమ్మిది స్టార్టప్‌లలో ఏంజెల్ ఇన్వెస్టర్‌గా ఉన్నాడు. ‘వినియోగదారుల ఇష్టాలపైనే వ్యా పారాన్ని నిర్మించాలి’ అని చెప్పే రాజ్ షమని డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ తమ కన్జ్యూమర్ బ్రాండ్స్‌ను ఎస్టాబ్లిష్ చేసుకోవడం, విజయవంతం చేయడంలో సహాయపడే ‘హౌజ్ ఆఫ్ ఎక్స్’ వెంచర్ స్టార్ట్ చేశాడు. ఈ వెంచర్ ఇన్వెస్టర్ల జాబితాలో నితిన్ కామత్( జెరోదా–కో ఫౌండర్), వినీత సింగ్ (షుగర్ కాస్మెటిక్స్)లాంటి వ్యా పారదిగ్గజాలు ఉండడం విశేషం. మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు 26 సంవత్సరాల రాజ్ షమని.ఇప్పటివరకు ఇరవైకి పైగా దేశాల్లో స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఇచ్చిన రాజ్ షమని ‘బిల్డ్, డోన్ట్ టాక్’ పేరుతో వ్యక్తిత్వ వికాస పుస్తకం రాశాడు. ఈ పుస్తకం గురించి ఇలా పరిచయం చేసుకుంటాడు రాజ్...‘మన స్కూల్లో మ్యాథ్స్, సైన్స్‌లాంటి సబ్జెక్ట్‌లు తెలుసుకుంటాం. అయితే ఒక వస్తువును ఎలా అమ్మాలి? స్నేహసంబంధాలను ఏర్పర్చుకోవడం ఎలా? మానసిక ఆరోగ్యంపై ఎలా శ్రద్ధ చూపా లి? ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి....మొదలైన విషయాలు స్కూల్లో తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు. అందుకే ఈ పుస్తకం బడిలోకి రండి. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు’ ‘హౌజ్ ఆఫ్ ఎక్స్’ ఇన్వెస్టర్లలో ఒకరైన నితిన్ కామత్ ఇలా అంటాడు...‘ఐడియాలు, ప్రో డక్ట్ ఎంత ముఖ్యమో వ్యక్తులు కూడా అంతే ముఖ్యం. సోషల్ మీడియాలో రాజ్ షమని సాధించిన విజయాలే మా నమ్మకానికి కారణం’ఒక్క విజయం దగ్గరే ఆగిపోయే అలవాటు లేని రాజ్ షమని, తన విజయాలకు మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదు. ఇతరులను కూడా గెలుపు బాటలో నడిపించాలనుకుంటున్నాడు. -
వింత పోకడలు.. 30 సెకన్ల ప్రమాదం
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయెర్స్‌ను పెంచుకోవడానికి నేటి కుర్రకారు 30 సెకన్ల రీల్స్ ద్వారా వింత పోకడలు పోతోంది. ఇండోర్ ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ శ్రేయ కాల్రా ట్రాఫిక్ సమయంలో జీబ్రా క్రాస్ మీద డాన్స్ చేసి సమస్యలు తెచ్చుకుంది. ఏకంగా హోమ్ మినిస్టర్ ఆమె మీద చర్యలకు ఆదేశించాడు. తెలుగు ప్రాంతాలతో మొదలు దేశం మొత్తం వేల మంది అమ్మాయిలు ఇన్‌స్టా అకౌంట్ల ద్వారా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారిలో కొందరి రీల్స్ అందరి మెచ్చుకోలు పొందేలా ఉంటే మరికొందరివి తల్లిదండ్రులకు గుండెపోట్లు తెస్తున్నాయి. రీల్స్ ట్రెండ్‌పై ఒక నజర్. మొన్నటి ఆగస్టు నెలలో అహమదాబాద్ (గుజరాత్)లో ఒక టీనేజ్ అమ్మాయి తన ఫాలోయెర్స్‌ను పెంచుకోవడానికి అర్ధనగ్న వీడియోలు చేస్తోందని తెలిసి ఆమె తల్లిదండ్రులిద్దరికీ ఒకేసారి హార్ట్ఎటాక్ వచ్చింది. ఇద్దరూ బతికి బట్ట కట్టాక కూతురు ఏం చేస్తున్నదో వివరంగా తెలుసుకున్నారు. కరోనా వల్ల ఆన్లైన్ క్లాసులు మొదలయ్యేసరికి ఆమె చదువుకు భంగం కలగకూడదని ఒక గదీ ఫోన్ ఇచ్చారు. ఆ అమ్మాయి ఆ గదిలో ఒక సోషల్ మీడియాలో తన వీడియోలు పోస్ట్ చేయడమే కాకుండా తన కజిన్స్‌ను తనను ఫాలోకమ్మని చెప్పింది. అంతేకాదు వాళ్లను కూడా అలాంటి వీడియోలు చేయమని చెప్పింది. ఆమెకు ఈ వీడియోల పిచ్చి ఎంత పట్టిందంటే తల్లిదండ్రులు హాస్పిటల్ పాలయ్యి ఇంటికి చేరినా ఆ వీడియోలు పోస్ట్ చేయడం మానలేదు. దాంతో వారు టీనేజ్ కౌన్సిలర్లను సంప్రదించి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించారు. ‘ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే సైబర్ చట్టాల కింద కేస్ అవుతుంది. అరెస్ట్ కూడా చేయొచ్చు’ అని కౌన్సిలర్ ఆ అమ్మాయికి చెప్తే అప్పుడుగాని ఆ అమ్మాయి వాటిని మానలేదు. ఆ తర్వాత తన అకౌంట్ డీయాక్టివేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో మనకో అకౌంట్ ఉంటే దానికి ఫ్రెండ్సో, ఫాలోయెర్సో ఉంటారు. వారి సంఖ్య పెరిగితే కొన్ని మీడియాలు ఆర్థిక లాభం కలిగిస్తాయి. దాంతో కొన్ని అనవసర ధోరణులను ఈ కాలపు అమ్మాయిలు అవలంబిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. రెండు పద్ధతులు కేరళకు చెందిన టీనేజ్ అమ్మాయి నివేద్య ఆర్.శంకర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 16 లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. ఆ అమ్మాయికి 13– 14 ఏళ్లకు మించవు. ఆమె తన సోదరితో కలిసి 30 సెకన్ల రీల్స్ చేస్తూ విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే ఆ రీల్స్ అన్నీ సినిమా పాటలకు చేసిన డాన్సులే. ఆహార్యంలో ఎటువంటి ‘అసభ్యత’ లేకుండా తన ఎక్స్‌ప్రెషన్స్‌తో నవ్వుతూ ఆమె అన్ని లక్షల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకుంది. అయితే ఇదే సమయంలో మరో ఐదుమంది టాప్ ఇన్‌స్టాగ్రామర్స్ ఉన్నారు. వారు నేహా సింగ్ (16 లక్షల ఫాలోయెర్లు), శాశీ పూనమ్ ( 8.5 లక్షలు), శ్రిష్ (27 లక్షలు), ఏంజల్ రాయ్ (39 లక్షలు), సోఫియా (39 లక్షలు). కానీ వీరంతా ఫాలోయెర్స్ కామెంట్స్‌ను బట్టి ‘బోల్డ్’గా ఉండటం వల్లే ‘బోల్డ్’ వీడియోస్ చేయడం వల్ల ఇంతమంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకున్నారు. ఫాలోయెర్స్ వేటలో ‘సౌందర్య ప్రదర్శన’కు ‘శరీర ప్రదర్శన’కు ఈ సోషల్ సెలబ్రిటీలకు తేడా తెలియడం లేదని కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు. వీరిలో కొందరు ఇన్స్టాగ్రామర్లు ప్రత్యేక యాప్‌లు తయారు చేసుకుని వాటిలో తమ వీడియోలు పోస్ట్ చేస్తూ తద్వారా యాడ్స్‌ను ఆకర్షించి లాభాలు కూడా పొందుతున్నారు. మొదటి కోవకు చెందిన అమ్మాయి అందరి మన్ననలు పొందుతుంటే రెండో తరగతి అమ్మాయిలు కొన్ని సెక్షన్ల నుంచి విమర్శలు పొందుతున్నారు. ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. పెద్ద సరంజామా 30 సెకన్ల వీడియోలు చేసి ఫాలోయెర్స్‌ను సంపాదించుకోవడం చిన్న విషయం కాదు. ప్రతి వీడియోకి ఒక డ్రస్ సంపాదించుకోవాలి. దానికి మేకప్, ఆభరణాలు, చెప్పులూ... ప్రతిదీ సమకూర్చుకోవాలి. దానికి ఖర్చు అవుతుంది. సరైన పద్ధతిలో షూట్ చేసేవారు కావాలి. ఇన్‌స్టాలో ఇవన్నీ సమకూర్చుకోగల ‘స్తోమత ఉన్న’ సెలబ్రిటీలు ఉన్నారు.. మరోవైపు మురికివాడల్లో ఉంటూ రేకుల గదిలో ఉన్న బట్టల్లో డాన్స్ ప్రతిభ చూపుతూ గుర్తింపు పొందిన వారు ఉన్నారు. రూపాలీ అగర్వాల్ అనే శ్రీమంతురాలు తన భర్త, ఇద్దరు టీనేజ్ కుమార్తెలతో సరదా వీడియోలు, సినిమా పాటల వీడియోలు చేసి 12 వేల మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకున్న ఉదంతాలు ఉన్నాయి. అయితే ఎలా చూసినా ‘బోల్డ్ వీడియోలు చేస్తేనే ఫాలోయెర్స్ పెరుగుతారు’ అనుకునే ప్రమాదం ఈ రీల్స్ ద్వారా సెలబ్రిటీలు అయిన వారిని చూస్తే అనిపించవచ్చు. కొందరు ఆ దారి పడుతున్నారు కూడా. ఇండోర్‌లో డాన్స్ తాజాగా ఇండోర్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామర్ శ్రేయా కాల్రాకు రెండున్నర లక్షల మంది ఫాలోయెర్స్ ఉన్నారు. ఈమె కూడా అడపా దడపా బోల్డ్ వీడియోస్ చేస్తూ ఉంటుంది. రెండు రోజుల క్రితం ఇండోర్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడినప్పుడు హటాత్తుగా జీబ్రా క్రాస్ మీద ప్రత్యక్షమై అమెరికన్ ర్యాపర్ డోజా క్యాట్ పాట ‘లెట్ మి బి యువర్ ఉమన్’కు డాన్స్ చేసింది. 30 సెకన్ల ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగి ట్రాఫిక్ నియమాలు పాటించండి. మాస్క్ వాడండి’ అని సందేశం ఇచ్చిందిగాని నెటిజన్లకు, ఇండోర్ పోలీసులకు ఈ వ్యవహారం ఏమాత్రం నచ్చలేదు. అంతేకాదు మధ్యప్రదేశ్ హోమ్ మినిస్టర్ నరోత్తమ్ మిశ్రా శ్రేయా మీద చర్య తీసుకోమని కోరారు. పోలీసులు ఆమెపై న్యూసెన్స్ కేస్ బుక్ చేయడమే కాక మరెవరూ ఇలాంటి తలతిక్క పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి అని స్టేట్మెంట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వచ్చే పేరు ఎన్నాళ్లు నిలబడుతుందో చెప్పడం కష్టం. ఆ గుర్తింపును కొనసాగించడమూ కష్టమే. ఒక్కసారి ఫాలోయెర్స్ డ్రాప్ అయ్యాక దాంతో వచ్చే డిప్రెషన్ కథలు వేరు. మంచి చెడ్డలను గమనించుకుంటూ సోషల్ మీడియాను ఉపయోగించేలా స్త్రీలు, యువతులు జాగ్రత్త తీసుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యం తాము ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియ చేసి వారి అంగీకారమో లేదా వారిని ప్రిపేర్ చేయడమో తప్పనిసరిగా చేయాలి. వ్యక్తులు ఒక వయసు వచ్చాక సర్వ స్వతంత్రులే అయినా వారితో పాటు ఒక కుటుంబం ఉంటుంది కదా. -
నేను పోటీచేయను: స్పీకర్ సుమిత్రా
న్యూఢిల్లీ/ఇండోర్: తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రస్తుత లోక్‌సభ స్పీకర్, సీనియర్ బీజేపీ నేత సుమిత్రా మహాజన్ ప్రకటించారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశానని శుక్రవారం ఇండోర్‌లో ఆమె మీడియాతో చెప్పారు. ‘ఏప్రిల్ 12వ తేదీకి సుమిత్రకు 75 ఏళ్లు నిండుతాయి. 75 ఏళ్లు దాటిన వారికి బీజేపీ టికెట్ ఇస్తుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. సుమిత్ర నిర్ణయంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. సుమిత్రా మహాజన్ లోక్‌సభకు 8సార్లు ఎంపీగా గెలుపొందారు. తొలిసారిగా 1989లో ఇండోర్ నుంచి గెలిచారు. వాజపేయి ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ, టెలికాం శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు. -
ఇండోర్–హైదరాబాద్ మధ్య జెట్ ఎయిర్వేస్ సర్వీస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఆగస్టు 1 నుంచి ఇండోర్–చండీగఢ్–ఇండోర్–హైదరాబాద్ మధ్య కొత్త సర్వీసును ప్రారంభిస్తోంది. ఇండోర్‌లో మధ్యాహ్నం 12.45కు బయల్దేరి 2.45కు చండీగఢ్ చేరుకుంటుంది. అక్కడి నుంచి 3.15కు మొదలై సాయంత్రం 5.15కు ఇండోర్‌లో ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి సాయంత్రం 6కు ప్రారంభమై 7.25కు హైదరాబాద్‌లో అడుగుపెడుతుంది. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. -
అత్యంత పరిశుభ్రమైన నగరం ఇండోర్
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరం గా ఇండోర్ గుర్తింపు తెచ్చుకుంది. 2018 సంవత్స రానికి గాను కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ఇండోర్ మొదటి స్థానంలో నిలిచిందని గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దేశ వ్యాప్తంగా 4,200 నగరాల్లో చేపట్టిన సర్వేలో ఇండోర్ తర్వాతి స్థానాల్లో భోపాల్, చండీగఢ్ ఉన్నాయని తెలిపారు. గత ఏడాది 430 నగరాల్లో చేపట్టిన సర్వేలోనూ ఇండోర్‌కే మొదటి స్థానం దక్కిందన్నారు. అదేవిధంగా, పరిశుభ్రత పాటించే రాష్ట్రాల్లో జార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. -
గ్రేటర్.. ఇండోర్ రూట్
సాక్షి,సిటీబ్యూరో: ఇండోర్ నగరాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు అక్కడి యంత్రాంగం కంకణం కట్టుకుంది. అక్కడ రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 నుంచి రూ.1000 వరకు జరిమానా వసూలు చేస్తున్నారు. ఇలా సంవత్సరంలో రూ.1.5. కోట్లు వసూలు చేశారంటే ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నగరమంతా రోడ్డుకు ఇరువైపులా ప్రతి 100 మీటర్లకు రెండు చెత్తడబ్బాలు ఏర్పాటు చేశారు. తడి–పొడి చెత్త ఇంటివద్దే వేరు చేయాల్సిందే. దుకాణాలు, హోటళ్లు, తదితర సంస్థల నుంచి ప్రతిరోజు వెలువడే చెత్త పరిమాణాన్ని బట్టి నెలవారీ చెత్త తరలింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. అలా తక్కువ చెత్త వెలువడే దుకాణాలకు రూ.500 వసూలు చేస్తుండగా, పెద్ద హోటళ్లకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇళ్ల నుంచి చెత్త తరలించే కార్మికులకు నెలకు రూ.60 చెల్లిస్తున్నారు. చెత్త తరలింపు బండ్లలో తడి,పొడికి వేర్వేరు అరలే కాక నాప్కిన్లకు మరో డబ్బా కూడా ఉంచారు. చెత్త రవాణా కేంద్రాల్లో బయో మెథనైజేషన్ చేస్తున్నారు. ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే సంస్థల నిర్వాహకులతో పాటు కాలనీ సంఘాలు తదితరులకు ఎక్కడికక్కడే సేంద్రియ ఎరువు యంత్రాలను వినియోగించాల్సిందిగా అవగాహన కల్పించారు. రోజుకు పది కేజీల కన్నా ఎక్కువ చెత్త వెలువడే ప్రాంతాల్లో ఈ యంత్రాలను ఉంచారు. పెద్ద హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లలో వీటిని తప్పనిసరి చేశారు. పార్టీ ఇస్తే చార్జి చెల్లించాల్సిందే.. ఏదైనా ఫంక్షన్ హాల్లో గానీ, రోడ్డుపై టెంటు వేసి వేడుక ఏర్పాటు చేసి విందు ఇస్తే ఎంతమంది హాజరు కానున్నారో మనిషికి రూ.50 చొప్పున సదరు పార్టీ నిర్వాహకులు కార్పొరేషన్‌కు ముందుగానే చెల్లించాలి. వ్యర్థాల తరలింపునకు ఈ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఎవరైనా చెల్లించకుంటే పెనాల్టీగా రెట్టింపు చార్జీ వసూలు చేస్తున్నారు. ఇటీవల ఇండోర్‌లోని స్థానిక ఎమ్మెల్యే ఒకరు ముందస్తు ఫీజు చెల్లించనందుకు అతని నుంచి రూ.50 వేల పెనాల్టీ వసూలు చేశారని అధ్యయనం చేసి వచ్చిన గ్రేటర్ అధికారులు తెలిపారు. అంటే అక్కడ పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేస్తున్నారో తెలుస్తోంది. చెత్త తరలింపు పర్యవేక్షణకు కన్సల్టెన్సీ.. ఇంటింటి నుంచి చెత్త తరలింపు సక్రమంగా జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించేందుకు ఇండోర్ కార్పొరేషన్ ఎన్విరాన్మెంట్ సర్వీసెస్ కన్సల్టెన్సీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అందుకుగాను ఒక్కో ఇంటికి నెలకు రూ.11 వంతున కార్పొరేషన్ చెల్లిస్తోంది. అక్కడ సేకరించిన చెత్తను రీసైకిల్ చేసి చెత్తడబ్బాలను తయారు చేశారు. తరిగి ఒక్కో డబ్బాను రూ.25లకు ప్రజలకు విక్రయించారు. టాయ్లెట్ల నిర్వహణ ఇలా.. ఒక్కో టాయ్‌లెట్ నిర్వహణకు ఇండోర్‌లో నెలకు రూ.15 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో రూ.7500 కేర్‌టేకర్‌కు చెల్లిస్తుండగా, రూ.7500 నిర్వహణకు వెచ్చిస్తున్నారు. అక్కడ ఔట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకునేది 29 రోజులకే. ఆ ఒప్పందం ముగియగానే వారినే మళ్లీ తాజా ఒప్పందంతో తీసుకుంటారు. రెగ్యులర్ చేయాలనే డిమాండ్లు రాకుండా ఇండోర్‌లో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. గతేడాది స్వచ్ఛ ర్యాంకింగ్‌లో దేశంలోనే నెంబర్–1గా నిలిచిన ఇండోర్‌లో స్వచ్ఛ కార్యక్రమాలు ఎలా అమలు చేస్తున్నారో పరిశీలించేందుకు జీహెచ్ఎంసీకి చెందిన అధికారులు ఇప్పటికే అక్కడ పర్యటించి వచ్చారు. వారు అధ్యయనం చేసిన వివరాలను ‘సాక్షి’కి వివరించారు. అధ్యయనం చేసి వచ్చిన వారిలో జోనల్ కమిషనర్లు శ్రీనివాసరెడ్డి, శంకరయ్య, హరిచందన, భారతి హొళికేరి, అడిషనల్ కమిషనర్ మనోహర్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, శశికిరణాచారి తదితరులు ఉన్నారు. వారు తమ అధ్యయన నివేదికను కమిషనర్‌కు అందజేయనున్నారు. వాటిలో నగరానికి అనువైన వాటిని త్వరలో అమలు చేయనున్నారు. స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ.. ఇండోర్ కార్పొరేషన్ జనాభా 35 లక్షలు. విస్తీర్ణం 150 చ.కి.మీ. కమిషనర్‌తో పాటు నలుగురు అడిషనల్ కమిషనర్లు స్వచ్ఛ కార్యక్రమాలపైనే ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని జోనల్ కమిషనర్ శంకరయ్య తెలిపారు. గతేడాది నెంబర్–1గా నిలవడంతో దాన్ని తిరిగి నిలుపుకుందామంటూ ఎక్కడ చూసినా ‘ఫిర్ రహేంగే’ ప్రకటనలు కనిపిస్తున్నాయని సీసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. -
శరన్నవరాత్రి వేడుకల్లో టీమిండియా
-
వివాహిత మృతి కేసు.. తండ్రే హంతకుడు
రాయికోడ్ : మండలంలోని ఇందూర్ గ్రామంలో ఈ నెల 20వ తేదీన వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనలో కన్నతండ్రే హంతకుడిగా పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం జహీరాబాద్ రూరల్ సీఐ రఘు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరించారు. ఇందూర్ గ్రామానికి చెందిన రుకియా బేగం (30) ఈ నెల 20న ఇందూర్‌లోని తన తల్లిదండ్రుల ఇంట్లో మృతి చెందింది. అయితే బేగం మృతిపై అత్తింటి వారు అనుమానం వ్యక్తం చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో తండ్రిని విచారించగా.. తన కుమార్తె మానసిక స్థితి సరిగా లేక భరించలేక ఈ నెల 29వ రాత్రి చీరతో ఉరేసి హత్య చేసినట్లు మృతురాలి తండ్రి గౌస్ మొహల్లా ఒప్పుకున్నాడు. దీంతో అతడిపై హత్యకేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. సమావేశంలో ఎస్ఐ శివప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్ గౌస్, కానిస్టేబుల్ భీంరావు ఉన్నారు. -
భారత్ క్లీన్‌స్వీప్
ఇండోర్: డేవిస్‌కప్‌లో ఆంధ్రప్రదేశ్ యువ సంచలనం సాకేత్ మైనేని మళ్లీ మెరిశాడు. భారత్ సంపూర్ణ విజయానికి తన వంతు సహకారం అందించాడు. దీంతో డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్-1లో భారత్ 5-0తో చైనీస్ తైపీపై క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లే గెలిచారు. తెలుగు కుర్రాడు సాకేత్ 2-0 సెట్లతో సంగ్ హూ యంగ్‌పై, యూకీ బాంబ్రీ 2-0 సెట్లతో సియెన్ యిన్ పెంగ్‌పై జయభేరి మోగించారు. మొత్తం మీద ఓ జట్టుపై వైట్‌వాష్ సాధించడం 2005 తర్వాత భారత్‌కిదే తొలిసారి. తాజా విజయంతో ఏప్రిల్‌లో జరిగే రెండో రౌండ్ పోరులో దక్షిణ కొరియాతో తలపడనుంది. ఇందులో గెలిస్తే భారత్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సంపాదిస్తుంది. సాకేత్ మెరుపులు తాను ఆడుతున్న తొలి డేవిస్‌కప్ పోరులో సాకేత్ మైనేని సత్తాచాటుకున్నాడు. శనివారం డబుల్స్‌లో అదరగొట్టిన ఈ ఏపీ ఆటగాడు ఆదివారం సింగిల్స్‌లోనూ మెరుపులు మెరిపించాడు. 26 ఏళ్ల మైనేని తనకన్నా మెరుగైన ర్యాంకింగ్ ఆటగాడు సంగ్ హూ యంగ్‌ను కంగుతినిపించాడు. ప్రపంచ 313వ ర్యాంకర్ సాకేత్ 6-1, 6-4తో కేవలం 48 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించడం విశేషం. యూకీ ఖాతాలో మరో గెలుపు తొలి సింగిల్స్‌లో గెలిచి భారత్‌కు శుభారంభాన్నిచ్చిన ఢిల్లీ ఆటగాడు యూకీ బాంబ్రీ రివర్స్ సింగిల్స్‌లోనూ తన జోరు కొనసాగించాడు. 22 ఏళ్ల యూకీ 7-5, 6-0తో సియెన్ యిన్ పెంగ్‌పై గెలుపొందాడు. ఇతను కూడా గంటలోపే (55 నిమిషాల్లోనే) ప్రత్యర్థిపై జయకేతనం ఎగురవేశాడు. తొలి సెట్లో గట్టి పోటీనిచ్చిన పెంగ్ రెండో సెట్లో యూకీ బాంబ్రీ ధాటికి చేతులెత్తేశాడు. ‘దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండటమే కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ మ్యాజికే విజయాలందించింది. కేవలం ఐటీఎఫ్ టోర్నీలే కాకుండా ఇదే ఉత్సాహంతో ఈ సీజన్లో గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయర్స్పై కూడా దృష్టిసారిస్తాను. ఫిట్నెస్ను కాపాడుకుంటూనే ఆటలో నైపుణ్యాన్ని సాధిస్తా’ - సాకేత్ మైనేని -
భళా..భారత్
యువకులతో కూడిన భారత టెన్నిస్ జట్టు అదరగొట్టింది.మరో రెండు మ్యాచ్‌లుండగానే చైనీస్ తైపీపై విజయం సాధించి డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్-1 రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌తో డేవిస్ కప్‌లో అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు సాకేత్ మైనేని చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇండోర్: అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత ఆటగాళ్లు డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్-1లో ముందంజ వేశారు. చైనీస్ తైపీతో జరుగుతున్న ఈ పోరులో భారత్ 3-0తో స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఆదివారం జరిగే మిగతా రెండు రివర్స్ సింగిల్స్ ఫలితాలతో సంబంధం లేకుండా భారత జట్టు తదుపరి రెండో రౌండ్ పోరులో దక్షిణ కొరియాతో వారి సొంతగడ్డపై తలపడనుంది. అందులోనూ గెలిస్తే భారత్ తిరిగి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించగలుగుతుంది. డబుల్స్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ యువ సంచలనం సాకేత్ మైనేని అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. ఎలాంటి తడబాటు లేకుండా బోపన్నతో కలిసి డబుల్స్ మ్యాచ్‌లో భారత్‌కు విజయాన్ని అందించాడు. అంతకుముందు జరిగిన సింగిల్స్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ నెగ్గాడు. వెలుతురు మందగించడంతో అతని మ్యాచ్ శనివారం కొనసాగించగా కేవలం ఎనిమిది నిమిషాల్లోనే మిగతా ఆటను పూర్తి చేశాడు. ఈ రెండో సింగిల్స్ పోరులో భారత నంబర్‌వన్ ఆటగాడు సోమ్‌దేవ్ 3-2 సెట్లతో టీ చెన్పై గెలుపొందాడు. డబుల్స్ మ్యాచ్‌లో సాకేత్- బోపన్న జోడి 3-1 సెట్లతో సెయైన్ యిన్ పెంగ్- సింగ్ హూ యాంగ్ ద్వయంపై విజయం సాధించింది. ఎనిమిది నిమిషాల్లోనే... వెలుతురులేమి కారణంగా శనివారం కొనసాగిన సింగిల్స్ మ్యాచ్ చివరి సెట్‌ను ముగించేందుకు సోమ్‌దేవ్‌కు ఎంతో సేపు పట్టలేదు. 7-7తో కొనసాగిన ఈ నిర్ణాయక ఐదో సెట్లో మరో రెండు పాయింట్లను గెలవడం ద్వారా సోమ్‌దేవ్ 6-7 (4/7), 7-6 (7/3), 1-6, 6-2, 9-7తో టీ చెన్ ఆటను ముగించాడు. భారత్, తైపీ ఆటగాళ్ల మధ్య ఇది మూడో సమరం. డేవిస్ కప్ కంటే ముందు 2009లో జరిగిన మ్యాచ్‌లో, ఆసియా గేమ్స్ (2010)లోనూ భారత ఆటగాడే విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. డబుల్స్‌లోనూ భారత్‌దే జోరు అనంతరం జరిగిన డబుల్స్ మ్యాచ్‌లోనూ భారత జోడి రోహన్ బోపన్న- సాకేత్ మైనేని అదరగొట్టింది. రెండు గంటల 21 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సాకేత్-బోపన్న ద్వయం 6-0, 6-7 (3/7), 6-3, 7-6 (7/2)తో సెయైన్ యిన్ పెంగ్- టింగ్ హూ యాంగ్ జంటను కంగుతినిపించింది. తొలి మ్యాచ్ ఆడుతోన్న సాకేత్ శక్తివంతమైన సర్వీస్‌లతో హడలెత్తించాడు. నెట్ వద్ద అప్రమత్తంగా కదులుతూ, చూడచక్కనైన రిటర్న్ షాట్లు సంధిస్తూ బోపన్నకు మంచి సహకారం అందించాడు. నా విజయం తాలూకూ క్రెడిట్ జట్టు మొత్తానికి దక్కుతుంది. మ్యాచ్‌కు ముందు యూకీ నాపై ఒత్తిడి పెరగకుండా చూశాడు. అనవసర అంచనాలు పెంచకుండా సహచరులను కామ్‌గా ఉంచాడు. ఏదేమైనా వాళ్లంతా నాపై నమ్మకం పెట్టుకున్నారు. కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ ఇచ్చిన ప్రోత్సాహం కూడా నా ప్రదర్శనకు ఉపయోగపడింది - సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ సాకేత్ ఆడిన తీరు అద్భుతం. మా జోడి చక్కగా కుదిరింది. మేం ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇంతటి సమన్వయం సాధించడం విశేషమే. సర్వీస్‌లోనూ నాకంటే అతని స్పీడే ఎక్కువ. ఈ వేగమే నెట్ దగ్గర నా పనిని సులువుచేసింది. - రోహన్ బోపన్న -
భారత్ శుభారంభం
ఇండోర్: కాలి కండరాలు పట్టేసినా... పట్టుదలతో పోరాడిన యూకీ బాంబ్రీ భారత జట్టుకు శుభారంభం అందించాడు. దీంతో చైనీస్ తైపీతో శుక్రవారం మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ పోటీలో తొలి రోజు భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. తొలి సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ 6-2, 6-4, 6-7 (1/7), 6-3తో సుంగ్ హువా యాంగ్‌ను ఓడించాడు. మూడో సెట్లో యూకీ కాలికి గాయం కావడంతో భారత శిబిరంలో ఆందోళన కలిగింది. కానీ ఈ యువ ఆటగాడు పోరాడి గెలిచాడు. సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, టీ చెన్ల మధ్య రెండో మ్యాచ్ 6-7 (4/7), 7-6 (7/3), 1-6, 6-2, 7-7 స్కోరు వద్ద వెలుతురులేమి కారణంగా శనివారానికి వాయిదా పడింది. చివరి సెట్లో స్కోరు 5-3తో ఉన్నపుడు సోమ్‌దేవ్ తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. టీ చెన్ మూడు మ్యాచ్ పాయింట్లు కాచుకొని సోమ్‌దేవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి... ఆ తర్వాత తన సర్వీస్‌నూ నిలబెట్టుకొని స్కోరును 5-5తో సమం చేశాడు. ఆ తర్వాతి గేముల్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకున్నారు. మైదానంలో ఫ్లడ్‌లైట్లు లేకపోవడం... వెలుతురు మందగించడంతో మ్యాచ్‌ను శనివారానికి వాయిదా వేశారు. సింగిల్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత సాకేత్ మైనేని-బోపన్న (భారత్) జోడి యిన్ పెంగ్-హాన్ లీ (చైనీస్ తైపీ) జంటతో డబుల్స్ ఆడుతుంది. -
ఫేవరెట్‌గా భారత్
ఇండోర్: నేటి (శుక్రవారం) నుంచి చైనీస్ తైపీతో జరిగే ఆసియా ఓసియానియా గ్రూప్ 1 టోర్నీలో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ నేతృత్వంలోని యువ భారత్... తైపీ జట్టుతో పోలిస్తే పటిష్టంగా ఉంది. వాస్తవానికి గతేడాది టాప్ ఆటగాళ్ల తిరుగుబాటుతో ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగాల్సి వచ్చింది. కొరియాతో స్వదేశంలో జరిగిన పోరులో ఓటమి కారణంగా ఎలైట్ వరల్డ్ గ్రూప్‌కు అర్హత సాధించకుండా గ్రూప్ 1 దశలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మాత్రం భారత్ పూర్తి స్థాయిలో సత్తా చూపేందుకు సిద్ధంగా ఉంది. ఇక్కడ విజయం సాధిస్తే రెండో రౌండ్లో కొరియాతో ఆడాల్సి ఉంటుంది. వీరిలో విజేత ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్‌లో ఆడుతుంది. సింగిల్స్‌లో సోమ్‌దేవ్‌తో పాటు యుకీ బాంబ్రీ జోరు మీదున్నాడు. గతేడాది సీజన్లో వీరు మంచి విజయాలందుకున్నారు. గత వారం హవాయిలో జరిగిన చాలెంజర్ ఈవెంట్లో బాంబ్రీ ఫైనల్స్‌కు చేరాడు. నేటి తొలి సింగిల్స్ మ్యాచ్‌లో తను తైపీ నంబర్‌వన్ ఆటగాడు సంగ్ హువా యంగ్‌తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 1-0తో ఆధిక్యం అందుకోవాలనే ఆలోచనలో జట్టు ఉంది. అనంతరం సోమ్‌దేవ్.. టి చెన్‌తో రెండో సింగిల్స్ ఆడనున్నాడు. గతంలో ఐటా నుంచి నిషేధం ఎదుర్కొన్న రోహన్ బోపన్న తిరిగి జట్టులో చేరాడు. తను సాకేత్ మైనేనితో డబుల్స్‌లో జత కట్టనున్నాడు. 2012లో బోపన్న తన చివరి డేవిస్ కప్ ఆడాడు. చెన్నై ఓపెన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని సెమీస్‌కు చేరిన సాకేత్‌కు ప్రమోషన్ లభించినట్టయ్యింది. శనివారం డబుల్స్ మ్యాచ్ ఉండగా ఆదివారం రివర్స్ సింగిల్స్ జరుగుతాయి. మరోవైపు తైపీ తమ స్టార్ టెన్నిస్ ఆటగాళ్లు ప్రపంచ 54వ ర్యాంకర్ యెన్ సున్ లూ, జిమ్మీ వాంగ్ లేకుండానే బరిలోకి దిగుతోంది. -
పట్టు బిగించిన మహారాష్ట్ర
ఇండోర్: బెంగాల్‌తో జరుగుతున్న రంజీ సెమీఫైనల్లో మహారాష్ట్ర జట్టు భారీ ఆధిక్యాన్ని సాధించింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సంగ్రామ్ అతిట్కార్ (228 బంతుల్లో 168; 29 ఫోర్లు) సెంచరీ సహాయంతో తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 126.3 ఓవర్లలో 455 పరుగుల స్కోరు సాధించింది. దీంతో ప్రత్యర్థిపై 341 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ స్వల్ప స్కోరుకే కుప్పకూలగా అటు బౌలర్లు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. అంకిత్ బానే (208 బంతుల్లో 89; 14 ఫోర్లు; 1 సిక్స్) సంక్లేచ (72 బంతుల్లో 52; 4 ఫోర్లు; 4 సిక్స్) తమ వంతు సహకారం అందించారు. దిండా, శుక్లాలకు మూడు, సర్కార్, పాల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బెంగాల్ 4.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో ఆరిందమ్ దాస్ (7 బ్యాటింగ్) ఉన్నాడు. పంజాబ్ తొలి ఇన్నింగ్స్ 270 మొహాలీ: కర్ణాటకతో జరుగుతున్న మరో సెమీఫైనల్లో పంజాబ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 64.5 ఓవర్లలో 270 పరుగులు చేసింది. తొలి రోజు ఆట వర్షార్పణం కాగా రెండో రోజు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు పేసర్ వినయ్ కుమార్ (5/27) ధాటికి కోలుకోలేక పోయింది. యువరాజ్ సింగ్ (56 బంతుల్లో 42; 4 ఫోర్లు; 2 సిక్స్) ఆకట్టుకున్నాడు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన కర్ణాటక 22.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది.