నేను పోటీచేయను: స్పీకర్‌ సుమిత్రా | Sumitra Mahajan not to contest Lok Sabha polls | Sakshi
Sakshi News home page

నేను పోటీచేయను: స్పీకర్‌ సుమిత్రా

Published Sat, Apr 6 2019 5:18 AM | Last Updated on Sat, Apr 6 2019 5:18 AM

Sumitra Mahajan not to contest Lok Sabha polls - Sakshi

సుమిత్రా మహాజన్‌

న్యూఢిల్లీ/ఇండోర్‌: తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రస్తుత లోక్‌సభ స్పీకర్, సీనియర్‌ బీజేపీ నేత సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు లేఖ రాశానని శుక్రవారం ఇండోర్‌లో ఆమె మీడియాతో చెప్పారు. ‘ఏప్రిల్‌ 12వ తేదీకి సుమిత్రకు 75 ఏళ్లు నిండుతాయి. 75 ఏళ్లు దాటిన వారికి బీజేపీ టికెట్‌ ఇస్తుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. సుమిత్ర నిర్ణయంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. సుమిత్రా మహాజన్‌ లోక్‌సభకు 8సార్లు ఎంపీగా గెలుపొందారు. తొలిసారిగా 1989లో ఇండోర్‌ నుంచి గెలిచారు. వాజపేయి ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ, టెలికాం శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement