Land Rover : జేమ్స్‌బాండ్‌ స్పెషల్‌ ఎడిషన్‌.. ప్రత్యేకతలు ఇవే ! | Land Rover Defender V8 Bond Edition revealed | Sakshi
Sakshi News home page

Land Rover : జేమ్స్‌బాండ్‌ స్పెషల్‌ ఎడిషన్‌.. ప్రత్యేకతలు ఇవే !

Published Fri, Sep 3 2021 7:56 AM | Last Updated on Fri, Sep 3 2021 9:10 AM

Land Rover Defender V8 Bond Edition revealed - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) డిఫెండర్‌ వీ8 బాండ్‌ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.సెప్టెంబర్‌ 30న విడుదల కానున్న జేమ్స్‌ బాండ్‌ సినిమా ‘నో టైమ్‌ టు డై’ వేడుకల్లో భాగంగా ఈ ఎడిషన్‌కు రూపకల్పన చేసింది. 

కేవలం 300 యూనిట్లే
డిఫెండర్‌ వీ8 బాండ్‌  300 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది. 5.0 లీటర్‌ సూపర్‌చార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజిన్, 386 కిలోవాట్‌ పవర్, 625 ఎన్‌ఎం టార్క్, 8 స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో రూపుదిద్దుకుంది. 50.80 సెంటీమీటర్ల సాటిన్‌ డార్క్‌ గ్రే వీల్స్‌తో ఎక్స్‌టెండెడ్‌ బ్లాక్‌ ప్యాక్, సిగ్నేచర్‌ జినాన్‌ బ్లూ ఫ్రంట్‌ బ్రేక్‌ కాలిపర్స్, డిఫెండర్‌ 007 రేర్‌ బ్యాడ్జ్‌ పొందుపరిచారు. డిఫెండర్‌ వీ8 90 వేరియంట్‌ 5.2 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు.

చదవండి: ఇండియన్‌ మార్కెట్‌లో..వరల్డ్‌ ఫేమస్‌ సూపర్‌ బైక్స్‌!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement