యూకే వాహన తయారీ సంస్థ 'ల్యాండ్ రోవర్' మొదటిసారి భారతదేశంలో తన కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో బ్రాండ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ల్యాండ్ రోవర్ భారతదేశంలో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్ల తయారీని ప్రారంభించనుంది. కంపెనీ యూకే వెలుపల తన వాహనాలను ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి. భారతదేశం బ్రాండ్‌కు కీలకమైన మార్కెట్ కావడంతోనే సంస్థ ఈ డెసిషన్ తీసుకుంది.
రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కోసం ఒక కొత్త అసెంబ్లింగ్ లైన్ మహారాష్ట్రలోని పూణేలోని టాటా మోటార్స్ తయారీ కేంద్రంలో ఏర్పాటు కానుంది. ఈ ప్లాంట్‌లో ఏటా రెండు షిఫ్టులలో 10,000 యూనిట్ల కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రేంజ్ రోవర్ రిటైల్ అమ్మకాలు 160 శాతం పెరిగాయి. అంటే భారతీయులు రేంజ్ రోవర్ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీకి భారత్ ఒక ప్రధానమైన మార్కెట్ అని రేంజ్ రోవర్ మేనేజింగ్ డైరెక్టర్ గెరాల్డిన్ ఇంఘమ్ పేర్కొన్నారు.
భారతదేశంలో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు స్థానికంగా తయారైన తరువాత ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు. ఇవి రెండూ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment