range rover
-
రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?
భారతీయ మార్కెట్లో '2025 రేంజ్ రోవర్ స్పోర్ట్' రూ.1.45 కోట్ల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. దేశీయ విఫణిలో తయారైన ఈ కారు ధర రూ.5 లక్షలు పెరిగింది. బ్రాండ్ ఇప్పుడు డైనమిక్ ఎస్ఈ వేరియంట్‌ను నిలిపివేసి.. స్థానికంగా తయారైన 'డైనమిక్ హెచ్ఎస్ఈ' వేరియంట్‌తో భర్తీ చేశారు.2025 రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ.. 3.0 లీటర్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 400 హార్స్ పవర్ అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ 351 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతాయి.సాంటోరిని బ్లాక్, వారెసిన్ బ్లూ, ఫుజి వైట్, ఛారెంటే గ్రే, జియోలా గ్రీన్ అనే కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు ఆటో పార్కింగ్ అసిస్ట్, ఎయిర్ సస్పెన్షన్, అడాప్టివ్ ఆఫ్ రోడ్ క్రూయిజ్ కంట్రోల్, మెరిడియన్ సౌండ్ సిస్టమ్, పవర్డ్ అండ్ హీటెడ్ రియర్ సీట్లు వంటి వాటిని పొందుతుంది.కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ హెచ్ఎస్ఈ అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్, లో స్పీడ్ మ్యాన్యువరింగ్ లైట్లు, డిజిటల్ ఎల్ఈడీ హెడ్లైట్లను పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం. -
కోటిన్నర కారు తల్లికి గిఫ్ట్ ఇచ్చిన టాలీవుడ్ హీరో
తెలుగు యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. కాకపోతే సరైన హిట్ పడటం లేదు. ఓవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు రెస్టారెంట్ బిజినెస్‌లోనూ ఉన్నాడు. ఇలా రెండు చేతులతో సంపాదిస్తున్న ఇతడు.. ఇప్పుడు తన తల్లికి అపురూపమైన బహుమతి ఇచ్చాడు. ఆ విషయాన్నే చెబుతూ తెగ మురిసిపోయాడు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న రామ్ చరణ్ 'ఆరెంజ్' హీరోయిన్)'మా అమ్మకు బర్త్ డేకి ముందే గిఫ్ట్ ఇస్తున్నా. ఇప్పటికీ అమ్మ.. ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేసేందుకు సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కారు కొనివ్వమని అడిగింది. ఇప్పుడు అది నెరవేర్చా. చిన్న కానుకలే బోలెడంత సంతోషాన్ని ఇస్తాయి' అని సందీప్ కిషన్ రాసుకొచ్చాడు. గిఫ్ట్ ఇచ్చిన ఈ రేంజ్ రోవర్ కారు ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.1.50 కోట్ల నుంచి రూ.2 కోట్ల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.2010లో 'ప్రస్థానం' సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన సందీప్ కిషన్.. ఇప్పుడు తెలుగు, తమిళంలో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ ఏడాది 'ఊరు పేరు భైరవకోన', 'కెప్టెన్ మిల్లర్', 'రాయన్' తదితర సినిమాలు చేశాడు. ప్రస్తుతం 'మజాకా' అనే కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇది సంక్రాంతికి రిలీజ్ అన్నారు. కానీ పండక్కి చరణ్, బాలకృష్ణ, వెంకటేశ్ మూవీస్ విడుదల కానున్నాయి. సందీప్ మూవీ కూడా అదే టైంకి అంటే కష్టమే.(ఇదీ చదవండి: ఇంత దిగజారుతావ్ అనుకోలేదు.. హీరో ధనుష్‌తో నయనతార గొడవ) -
ప్రపంచంలోని బెస్ట్ ఆఫ్-రోడింగ్ కార్లు (ఫోటోలు)
-
కేవలం 12 మందికే ఈ కారు: ధర ఎంతో తెలుసా?
రేంజ్ రోవర్ తన మొట్టమొదటి ఇండియా ఎక్స్‌క్లూజివ్ మోడల్ ఎస్వీ రణథంబోర్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 4.98 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది కేవలం 12 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే 12మంది మాత్రమే దీనిని కొనుగోలు చేయగలరు.రేంజ్ రోవర్ ఎస్వీ రణథంబోర్ ఎడిషన్ అనేది రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్ నుంచి ప్రేరణ పొందింది. ఈ కారును విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు కంపెనీ విరాళంగా అందించనున్నట్లు సమాచారం.రణథంబోర్ ఎడిషన్ ఒక ప్రత్యేకమైన పెయింట్ స్కీమ్ పొందుతుంది. ఇది బ్లాక్ బాడీ కలర్లో రెడ్ షిమ్మర్‌తో నిండి ఉంది. డిజైన్ పులికి చిహ్నంగా రూపొందించారు. కాబట్టి పులి చారల వంటి డిజైన్ కూడా ఇందులో చూడవచ్చు. ఇది 23 ఇంచెస్ ఫోర్జ్డ్ డార్క్ గ్రే వీల్స్ పొందుతుంది.ఇదీ చదవండి: భారత్ కీలక నిర్ణయం: ఊపిరి పీల్చుకున్న దిగ్గజ దేశాలుఇంటీరియర్.. కారావే అండ్ లైట్ పెర్లినో సెమీ-అనిలిన్ లెదర్ కలయికను పొందింది. సీట్లపై ఎంబ్రాయిడరీ పులి వెన్నెముక వెంట ఉన్న చారల మాదిరిగా కనిపిస్తుంది. ఇందులో రిక్లినబుల్ సీట్లు, పవర్డ్ క్లబ్ టేబుల్, డిప్లోయబుల్ కప్‌హోల్డర్స్, రిఫ్రిజిరేటెడ్ కంపార్ట్మెంట్ మొదలైనవి ఉన్నాయి.ఈ కారు ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్స్ కలిగి ఉన్నప్పటికీ ఇంజిన్‌లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. కాబట్టి ఇందులో 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 500 Nm టార్క్, 394 Bhp పవర్ అందిస్తుంది. కాబట్టి పనితీరు బాగుంటుందని భావిస్తున్నాము. -
కోట్ల విలువైన కారును కొన్న సల్మాన్ ఖాన్ బాడీగార్డ్!
బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సికిందర్ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో రానున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. అయితే ఇటీవల సల్మాన్‌ఖాన్‌కు పక్కటెములకు గాయాలు కావడంతో ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. తమ హీరో త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గాయం అయినప్పటికీ తాజాగా ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు.అయితే తాజాగా సల్మాన్ ఖాన్‌కు బాడీగార్డ్ షేరా ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. 1995 నుంచి సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పనిచేసిన షేరా కొత్త రేంజ్ రోవర్‌ను కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ కారు విలువ దాదాపుగా రూ.1.4 కోట్లుగా ఉంటుందని సమాచారం. షేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ కాగా.. సల్మాన్‌కు బాడీగార్డ్‌గా పని చేయడమే కాకుండా టైగర్ సెక్యూరిటీ అనే సంస్థను స్థాపించారు. View this post on Instagram A post shared by shera (@beingshera) -
కోట్ల రూపాయల లగ్జరీ కారు కొనేసిన ప్రముఖ సింగర్
ప్రముఖ సింగర్ కమ్ మ్యూజీషియన్ రాహుల్ వైద్య ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. బిగ్‌బాస్-14 హిందీ షోలో రన్నరప్‌గా నిలిచిన మనవాళ్లకు కూడా కొంత పరిచమయ్యాడు. ఇకపోతే తెలుగు డబ్బింగ్ అయ్యే హిందీ సినిమాల్లో పలు పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. ఇప్పుడు నాలుగు కోట్ల రూపాయల విలువైన కారు కొనుగోలు చేయడం విశేషం.(ఇదీ చదవండి: త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్.. జోర్దార్ సుజాత కంటతడి)'ఇండియన్ ఐడల్' సింగింగ్ షోతో కెరీర్ మొదలుపెట్టిన రాహుల్ వైద్య.. ఆ తర్వాత మ్యూజిక్ కంపోజర్‌గానూ ఫేమ్ సంపాదించాడు. ప్రస్తుతం 'లాఫర్ చెఫ్-అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్' అనే షో చేస్తున్నాడు. ఇప్పుడు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే రేంజ్ రోవర్ కారు కొనేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని పోస్ట్ చేశాడు.ఇకపోతే బిగ్ బాస్ షోలో పాల్గొన్న టైంలో సీరియల్ నటి దిశా పర్మర్‌తో ప్రేమలో పడ్డాడు. 2021లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌తో బిజీగా ఉన్న ఇతడు ఇప్పుడు ఖరీదైన కారు కొని వార్తల్లో నిలిచాడు.(ఇదీ చదవండి: కట్టప్ప లేటెస్ట్ సినిమా.. డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్) View this post on Instagram A post shared by RAHUL VAIDYA (@rahulvaidyarkv) -
బర్త్ డే స్పెషల్.. ఖరీదైన కారుతో డబుల్ ఇస్మార్ట్ నటుడు!
కేజీఎఫ్ సినిమాతో దక్షిణాదిలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న నటుడు సంజయ్ దత్. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న డబుల్ ఇస్మార్ట్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో బిగ్ బుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది.అయితే జూలై 29న సంజయ్ దత్ 65వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులతో పాటు పలువురు సినీతారలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తన బర్త్ డే రోజున అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చుకున్నారు. దాదాపు రూ.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే బాలీవుడ్లో గుడ్ఛాడీ మూవీలో సంజయ్ దత్ నటిస్తున్నారు. ఇందులో రవీనా టాండన్‌తో జతకట్టారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఆగస్టు 9న జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఆ తర్వాత రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమాలో కనిపించనున్నారు. #WATCH | Sanjay Dutt Gifts Himself New Range Rover On His 65th Birthday#Bollywood #SanjayDutt @duttsanjay pic.twitter.com/vIhiFbkpV2— Free Press Journal (@fpjindia) July 29, 2024 -
హార్దిక్‌తో డేటింగ్ రూమర్స్.. ఖరీదైన కారు కొన్న బ్యూటీ!
సినీతారలకు కార్లపై మక్కువ ఎక్కువ. మార్కెట్లో ఏదైనా కొత్త బ్రాండ్ వచ్చిందంటే గ్యారేజ్‌లోకి రావాల్సిందే. హీరోలైనా, హీరోయిన్లయినా సరే తమ రేంజ్‌కు తగిన కారును కొనేస్తుంటారు. అలా తాజాగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఆమె కొన్న రేంజ్ రోవర్ కారు విలువ దాదాపు రూ.3.38 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ఇటీవల బ్యాడ్ న్యూజ్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. ఈ మూవీలో విక్కీ కౌశల్, త్రిప్తి డిమ్రీ జంటగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. అంతే కాకుండా కాల్ మీ బే అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్.. హార్దిక్‌తో డేటింగ్!ఇటీవల అనంత్ అంబానీ బారాత్‌లో క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో కలిసి అనన్య డ్యాన్స్ చేసిన వీడియో వైరలైన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. అంతే కాకుండా ఇన్‌స్టాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో ఆ వార్తలు మరింత వైరలయ్యాయి. కాగా.. తన ప్రియుడు ఆదిత్య రాయ్ కపూర్‌లో ఈ ఏడాది మార్చి బ్రేకప్ చేసుకుంది. మరోవైపు హార్దిక్ ఇటీవలే తన భార్య నటాసా స్టాంకోవిచ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించాడు. అయితే డేటింగ్ రూమర్స్ పై అనన్య పాండే, హార్దిక్ కానీ ఎవరూ స్పందించలేదు. View this post on Instagram A post shared by Ananya pandey 💫💛 (@ananya__panday__love) -
మేడిన్ ఇండియా రేంజ్ రోవర్
ముంబై: మేడిన్ ఇండియా రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు కొద్ది రోజుల్లో భారత రోడ్లపై పరుగు తీయనున్నాయి. దేశీయంగా వీటి తయారీ చేపట్టాలని టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ నిర్ణయించింది. 54 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ మోడళ్లు యూకే వెలుపల ఒక దేశంలో తయారు కానుండడం ఇదే తొలిసారి. ప్రస్తుతం యూకేలోని సోలహల్ వద్ద ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్లాంటులో తయారైన రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా 121 మార్కెట్లకు ఎగుమతి అవుతున్నాయి. దేశీయంగా తయారైతే ఈ రెండు మోడళ్ల ధర 18–22 శాతం తగ్గనుందని కంపెనీ వెల్లడించింది. రానున్న రోజుల్లో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్ల అమ్మకాలు పెరుగుతాయని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ధీమా వ్యక్తం చేశారు. టాటా మోటార్స్‌కు చెందిన పుణే ప్లాంటులో ఇప్పటికే రేంజ్ రోవర్ వెలార్, రేంజ్ రోవర్ ఇవోక్, జాగ్వార్ ఎఫ్–పేస్, డిస్కవరీ స్పోర్ట్ అసెంబుల్ అవుతున్నాయి. 2023–24లో దేశవ్యాప్తంగా జేఎల్ఆర్ ఇండియా 4,436 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 81 శాతం అధికం. -
మొదటిసారి భారత్‌కు రానున్న యూకే కంపెనీ.. తగ్గనున్న ఈ కార్ల ధరలు
యూకే వాహన తయారీ సంస్థ 'ల్యాండ్ రోవర్' మొదటిసారి భారతదేశంలో తన కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో బ్రాండ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ల్యాండ్ రోవర్ భారతదేశంలో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్ల తయారీని ప్రారంభించనుంది. కంపెనీ యూకే వెలుపల తన వాహనాలను ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి. భారతదేశం బ్రాండ్‌కు కీలకమైన మార్కెట్ కావడంతోనే సంస్థ ఈ డెసిషన్ తీసుకుంది.రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కోసం ఒక కొత్త అసెంబ్లింగ్ లైన్ మహారాష్ట్రలోని పూణేలోని టాటా మోటార్స్ తయారీ కేంద్రంలో ఏర్పాటు కానుంది. ఈ ప్లాంట్‌లో ఏటా రెండు షిఫ్టులలో 10,000 యూనిట్ల కార్లను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో రేంజ్ రోవర్ రిటైల్ అమ్మకాలు 160 శాతం పెరిగాయి. అంటే భారతీయులు రేంజ్ రోవర్ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీకి భారత్ ఒక ప్రధానమైన మార్కెట్ అని రేంజ్ రోవర్ మేనేజింగ్ డైరెక్టర్ గెరాల్డిన్ ఇంఘమ్ పేర్కొన్నారు.భారతదేశంలో రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ కార్లు స్థానికంగా తయారైన తరువాత ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని పలువురు నిపుణులు భావిస్తున్నారు. ఇవి రెండూ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. -
రూ.5 కోట్లు విలువ చేసే కారు కొన్న యంగ్ హీరో
తెలుగు హీరోల్లో చాలామంది దగ్గర అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. కాకపోతే వాటి గురించిన సమాచారం పెద్దగా బయటకు రాదు. కొత్త కారు కొన్నా సరే వాళ్లకు తప్పితే బయటకు వ్యక్తులకు తెలిసే అవకాశాలు చాలా తక్కువ. కానీ బాలీవుడ్లో మాత్రం కార్ల హడావుడి మామూలుగా ఉండదు. తాజాగా అలానే యంగ్ హీరో.. ఏకంగా రూ.5 కోట్లు విలువ చేసే కారు కొన్నాడు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. (ఇదీ చదవండి: మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం) బాలీవుడ్లో ప్రస్తుత జనరేషన్ హీరోల్లో కార్తిక్ ఆర్యన్ కాస్త డిఫరెంట్. ఫన్, ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమాలు చేస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. 'భూల్ భులయ్యా 2', 'సత్య ప్రేమ్ కి కథ' చిత్రాలతో గతేడాది హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం 'భూల్ భులయ్యా 3' చేస్తున్నాడు. ఇప్పటికే పలు లగ్జరీ కార్లని కొనుగోలు చేసిన కార్తిక్ ఆర్యన్.. ఇప్పుడు తన గ్యారేజీలోకి ఏకంగా ఆరో కారుని తీసుకొచ్చాడు. యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ దగ్గర ఇప్పటికే బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్, మెక్ లారెన్ జీటీ, మినీ కూపర్ ఎస్, లాంబోర్గిని ఊరుస్ క్యాప్సల్, పోర్స్ 718 బాక్స్టర్ లాంటి అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు లిస్టులోకి రేంజే రోవర్ 4.4p lwb sv కారుని కొనుగోలు చేశాడు. దీని ధర దాదాపు రూ.5 కోట్ల వరకు ఉందట. కారు కొన్న విషయాన్ని ఈ హీరో పోస్ట్ చేయగా, రేటు గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. (ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్) View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
బ్రిటిష్ రాణి కారు కొన్న ఇండియన్ బిజినెస్ టైకూన్.. ఎవరీ యోహాన్?
బ్రిటిష్ రాచరిక చరిత్రలో ఒక ప్రత్యేకమైన భాగాన్ని భారతీయ బిజినెస్ టైకూన్ సొంతం చేసుకున్నారు. బ్రిటిష్ రాణి దివంగత క్వీన్ ఎలిజబెత్ 2 ఉపయోగించిన రేంజ్ రోవర్ కారును పూనావాలా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ యోహాన్ పూనావాలా కొనుగోలు చేశారు. దివంగత రాణి ఉపయోగించిన అదే రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఈ కారు ఇప్పటికీ కలిగి ఉండటం విశేషం. విశేషమైన చరిత్రను ఉన్న కారును సొంతం చేసుకున్నందుకు పూనావాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను అలాగే ఉంచడం అదనపు బోనస్ అని ఆయన పేర్కొన్నారు. "ఈ అద్భుతమైన ఆటోమోటివ్ చరిత్రను సంపాదించినందుకు నేను సంతోషిస్తున్నాను" అని పూనావాలా చెప్పినట్లు ఎకనామిక్స్ టైమ్స్ పేర్కొంది. “సాధారణంగా రాజ కుటుంబం ఆధీనం నుంచి వెళ్లిపోయిన తర్వాత కారు నంబర్ ప్లేట్ మారుతుంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే.. దివంగత క్వీన్ ఉపయోగించిన అదే రిజిస్ట్రేషన్ నంబర్ OU16 XVHని ఇప్పటికీ కలిగి ఉంది. ఇది అదనపు బోనస్‌గా మారింది” అని ఆయన చెప్పారు. ఐవరీ అప్హోల్స్టరీతో లోయిర్ బ్లూ పెయింట్ చేసిన 2016 రేంజ్ రోవర్ SDV8 ఆటోబయోగ్రఫీ LWB ఎడిషన్ కారు సుమారు 18,000 మైళ్లు తిరిగింది. బ్రామ్లీ ఆక్షనీర్స్ వెబ్సైట్లో ఈ కారు రిజర్వ్ ధర 224,850 పౌండ్లు (రూ. 2.25 కోట్లకు పైగా) ఉంది. అయితే ఈ వేలం ప్రక్రియ లేకుండానే పూనావాలా కారును ప్రైవేట్‌గా కొనుగోలు చేశారు. కారు ప్రత్యేకతలివే.. ఈ రేంజ్ రోవర్ కారును ప్రత్యేకంగా రాణి ఉపయోగించేందుకు రూపొందించారు. రహస్య లైటింగ్, పోలీసు ఎమర్జెన్సీ లైటింగ్‌తో సహా ప్రత్యేకమైన మార్పులు ఇందులో ఉన్నాయి. రాణి కోసం చేసిన ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. సులువుగా కారు ఎక్కేందుకు, దిగేందుకు వెనుక భాగంలో గ్రాబ్ హ్యాండిల్స్ జోడించడం. కారులో చేసిన అన్ని మార్పులను అలాగే ఉంచాలని భావిస్తున్నట్లు పూనావాలా పేర్కొన్నారు. -
అనంత్ అంబానీ ఎలాంటి కారులో కనిపించారో చూసారా.. వీడియో
భారతదేశంలో పరిచయం అవసరం లేని కుటుంబాలలో ఒకటి 'ముకేశ్ అంబానీ' ఫ్యామిలీ. అత్యంత సంపన్నులైన అంబానీ కుటుంబం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రపంచంలో ఖరీదైన భవనాల్లో ఒకటైన 'యాంటిలియా' నివసిస్తున్న వీరు ఖరీదైన అన్యదేశ్య కార్లను వినియోగిస్తారు. ఇటీవల ముకేశ్ అంబానీ చిన్న కొడుకు 'అనంత్ అంబానీ' ఖరీదైన రోల్స్ రాయిస్ కారు వదిలి.. అంతకంటే తక్కువ ధర కలిగిన రేంజ్ రోవర్ కారులో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంత్ అంబానీ ఎప్పుడూ రోల్స్ రాయిస్ కారులో ప్రయాణిస్తుంటాడు, తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో రేంజ్ రోవర్ కారులో కనిపించారు. రోల్స్ రాయిస్ కల్లినన్ భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు, దీని ధర రూ. 8 కోట్ల కంటే ఎక్కువ. రేంజ్ రోవర్ కారు ధర కోటి రూపాయల వరకు ఉంటుంది. 8 కోట్ల రూపాయల కారు ముందు వెళ్తుంటే దాని వెనుక రేంజ్ రోవర్ కారులో అనంత్ అంబానీ వెళ్లడం చూడవచ్చు. ఇదీ చదవండి: అందుకే వారానికి 70 గంటల పని చేయమన్నా! - నారాయణ మూర్తి రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్ చూసుకుంటున్న అనంత్ అంబానీ దేశంలోని బిలియనీర్ల జాబితాలో ఒకరు. బ్రౌన్ యూనివర్శిటీలో చదువుకున్న అనంత్ నికర విలువ కొన్ని నివేదికల ప్రకారం రూ. 40 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని (భారతీయ కరెన్సీ ప్రకారం రూ.3 లక్షల కోట్ల కంటే ఎక్కువ) తెలుస్తుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. ఆయనతో ప్రత్యేక పూజలు!
బిగ్‌బాస్ రియాలిటీ షోతో గుర్తింపు తెచ్చుకున్న భామ అషురెడ్డి. సోషల్ మీడియాలో రీల్స్‌తో ఫేమస్ అయిన అషు పలు టీవీ షోల్లో కనిపించింది. అంతేకాకుండా బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఓ కామెడీ షోకు హోస్ట్‌గా కూడా వ్యవహరించింది. సోషల్ మీడియాలో అభిమానులకు టచ్‌లో ఉంటూ అలరిస్తూనే ఉంటోంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలు, వీడియోలను పంచుకుంటోంది. (ఇది చదవండి: బిగ్‌బాస్‌లో అతనొక్కడే నాకు తెలుసు.. ఎందుకంటే?: బాలాదిత్య కామెంట్స్!) తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. దాదాపు రూ.70 లక్షల విలువైన రేంజ్ రోవర్ కారును సొంతం చేసుకుంది. అనంతరం లగ్జరీ కారుకు ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహించింది. తన కొత్త కారు రేంజ్ రోవర్‌కు వేణుగోపాల స్వామితో పూజలు చేయించింది. అయితే సినీ తారలపై సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ వస్తుంటాయి. అందువల్లే కామెంట్స్ చేయకుండా.. ఆ సెక్షన్‌ను క్లోజ్ చేస్తూ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Venu Swamy Parankusham (@parankushamvenu) -
రూ.76 లక్షల రేంజ్ రోవర్ కేవలం రూ.100కే..! ఎగబడుతున్న జనం..
తక్కువ ధరలో కారు కొనాలన్నా.. కనీసం ఐదు లక్షలైనా ఉండాలి. లగ్జరీ కార్ల విషయానికి వస్తే కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం రూ. 100 పెడితే లక్షల ఖరీదైన కారు గెలుచుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అస్సాంలో ప్రతి ఏటా నిర్వహించే హౌలీ రాస్ ఫెస్టివల్ (Howly Raas Festival) ముందు నిర్వాహక కమిటీ గత సంవత్సరం మాదిరిగానే లాటరీని నిర్వహించింది. ఇందులో మొదటి బహుమతి రూ.76 లక్షల విలువైన రేంజ్ రోవర్. రెండవ బహుమతి రూ. 50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్, స్కార్పియో, మూడవ బహుమతి స్కోడా కుషాక్, నెక్సాన్ ఉన్నాయి. ఈ ఖరీదైన కార్లను సొంతం చేసుకోవాలంటే కేవలం రూ.100 పెట్టి లాటరీ టికెట్ కొంటే సరిపోతుంది. ఈ లాటరీ అనేది గత 95 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు, విజేతలకు కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాటరీ విషయం తెలిసి చాలామంది టికెట్ కొనటానికి బారులు తీరుతున్నారు. ఇదీ చదవండి: వారానికి 60 గంటల కంటే ఎక్కువే.. పని గంటలపై ఇదిగో ప్రూఫ్.. లాటరీ టికెట్ కొనుగోలు చేసిన తరువాత విజేతలను 2023 డిసెంబర్ 10న ప్రకటించనున్నారు. లాటరీ టికెట్స్ అమ్మిన డబ్బును వివిధ కార్యక్రమాలను ఉపయోగిస్తారు. ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు రాస్ పండుగను నిర్వహిస్తారు. గతేడాది మొత్తం 3.2 లక్షల లాటరీ టికెట్స్ అమ్ముడయ్యాయి, ఈ సారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. -
Pooja Hegde: లగ్జరీ కారు కొన్న పూజా హెగ్డే.. ధర ఎంతో తెలిస్తే షాకే!
కెరీర్ పరంగా పూజా హెగ్డే చాలా కష్టాల్లో ఉంది. ఇటీవల ఆమె నటించిన చిత్రాలేవి విజయం సాధించలేదు. ప్రభాస్ సరసన నటించిన రాధేశ్యామ్, చిరంజీవి, రామ్ చరణ్‌తో కలిసి నటించిన ఆచార్య, తమిళంలో విజయ్‌తో జత కట్టిన బీస్ట్, హిందీలో సల్మాన్ ఖాన్‌తో చేసిన ‘కిసీకా బాయ్ కిసికి జాన్’చిత్రాలన్ని వరుసగా రిలీజై..డిజాస్టర్స్‌గా మిగిలాయి. దీంతో బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ బుట్టబొమ్మకు అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతానికైతే బాలీవుడ్‌పైనే ఆశలు పెట్టుకుంది ఈ భామ. షాహిద్ కపూర్ సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కెరీర్ పరంగా కొంత గ్యాప్ రావడంతో ఆ సమయాన్ని పర్సనల్ లైఫ్‌కి కేటాయించింది పూజా. ఇటీవల మాల్దీవుల ట్రిప్‌కు వెళ్లింది. బర్త్‌డేని కూడా గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త కారును కొనుగోలు చేసింది. దసరా సందర్భంగా రేంజ్ రోవర్ ఎస్వీ ఎస్యూవీ కారును పూజా హెగ్డే కొనుగోలు చేశారు. ప్రసుత్తం పూజా కొత్త కారు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్స్ .. ఆ కారు ధర ఎంత అనేది గూగుల్‌లో సెర్చ్ చేసి చూస్తున్నారు. పూజా కొనుగోలు చేసిన కొత్త కారు దాదాపు రూ. 4 కోట్ల వరకు ఉంటుందట. ఈ కారు గరిష్ట వేగం గంటకు 234 కిలోమీటర్లుగా ఉంటుంది. పూజా గ్యారేజ్‌లో ఇప్పటికే ఆడి Q7, జాగ్వార్ సెడాన్, పోర్స్చే కయెన్ , BMW 5-సిరీస్ సెడాన్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by 🦋 Pooja 🦋 (@hegdepoojjaa) -
కొత్త కారు కొన్న రణబీర్ కపూర్ - ధర తెలిస్తే అవాక్కవుతారు!
Ranbir Kapoor Range Rover: ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ 'రణబీర్ కపూర్' ఇటీవల బ్రిటీష్ బ్రాండ్ 'రేంజ్ రోవర్' (Range Rover) కంపెనీకి చెందిన ఖరీదైన కారుని తన గ్యారేజిలో చేర్చారు. దీని ధర ఏకంగా రూ. 4 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి కార్ల మీద సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలకు మక్కువ చాలా ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగానే వారు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. కాగా ఇప్పుడు రణబీర్ మరో ఖరీదైన కారుని తన గ్యారేజిలో చేర్చారు. రేంజ్ రోవర్ ఫీచర్స్.. రణబీర్ కపూర్ కొత్త రేంజ్ రోవర్ లాంగ్ వీల్‌బేస్ వెర్షన్, ఇది VIP నంబర్ ప్లేట్ కలిగి ఉంది. అద్భుతమైన డిజైన్ అధునాతన ఫీచర్స్ కలిగిన ఈ కారులో 35 స్పీకర్లతో కూడిన మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 13.1 ఇంచెస్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, రియర్ సీట్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. భారతదేశంలో రేంజ్ రోవర్ మల్టిపుల్ ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. ఇదీ చదవండి: ప్రపంచంలో ఖరీదైన ఎలక్ట్రిక్ కారు - కేవలం 10 మందికి మాత్రమే.. రణబీర్ బెల్గ్రావియా గ్రీన్ షేడ్‌లో కనిపించే కొత్త ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ బ్రాండ్ కార్లను అజయ్ దేవగన్, సంజయ్ దత్, నిమ్రత్ కౌర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి నటులు కూడా కలిగి ఉన్నారు. రణ్‌బీర్ కపూర్‌కు లగ్జరీ ఎస్‌యూవీలంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఆతని వద్ద కొత్త రేంజ్ రోవర్ కారుతో పాటు మెర్సిడెస్-AMG G63, ఆడి A8L వంటి మరెన్నో ఖరీదైన కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. -
గోల్డెన్ బోయ్ నీరజ్ చోప్రా కొత్త కారు చూశారా? ధర ఎంతంటే?
Neeraj Chopra buys a new Range Rover Velar ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా కొత్త రేంజ్ రోవర్ వెలార్‌ను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను and Rover Malwa Automotives సోషల్ మీడియాలో షేర్ చేసింది. రూ. 90 లక్షల విలువైన ఈ ఐకానిక్ వాహనాన్ని సొంతం చేసుకున్నాడు. చాలామంది క్రీడాకారుల్లాగానే ఒలంపిక్ సెన్సేషన్ నీరజ్ చోప్రాకు లగ్జరీ కార్లంటే మోజు ఎక్కువు. కొత్త రేంజ్ రోవర్ వెలార్‌తో పాటు, రేంజ్ రోవర్ స్పోర్ట్ , అనేక ఇతర టాప్-టైర్ వాహనాలు అతని గ్యారీజేలో ఉండడం విశేషం. రేంజ్ రోవర్ వెలార్ ఇండియా ప్రారంభ ధర రూ. 78.87 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) అయితే, నీరజ్ చోప్రా చెల్లించిన ఖచ్చితమైన ధర ఇంకా తెలియరాలేదు. (ఓలా ఎస్1 ఎయిర్ లాంచింగ్ బంపర్ ఆఫర్: మూడు రోజులే!) రేంజ్ రోవర్ వెలార్ పలు డ్రైవింగ్ వేరియంట్లలో లభిస్తోంది. లో వేరియంట్ 179 Bhpతో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ లేదా 250 Bhp తో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లాంచ్కాగా, టాప్-ఎండ్ వేరియంట్లు 296 Bhpపవర్, 3.0-లీటర్ V6 టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. (అదరగొట్టిన రిలయన్స్ జియో) ఇతర ఫీచర్ల విషయానికి వస్తే..మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, యూజర్ ఫ్రెండ్లీ టచ్‌స్క్రీన్ ఇంటర్ఫేస్తో టచ్ ప్రో డ్యుయో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, మెమొరీ ఫంక్షన్‌తో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ,యాక్టివ్ రియర్-లాకింగ్ ఇ-డిఫరెన్షియల్ వంటి ముఖ్యమైన హైలైట్లు ఉన్నాయి. కొత్త పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 10-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అధునాతన కనెక్టివిటీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. నీరజ్ చోప్రాతోపాటు,ప్రముఖ నటి కృతి ఖర్బందా, స్టాండ్-అప్ కమెడియన్ జకీర్ ఖాన్ , నటి అవ్నీత్ కౌర్ లాంటి సెలబ్రిటీలు ఈ రేంజ్‌రోవర్ వెలార్‌ను కొనుగోలు చేశారు. అంతుకాదు ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు రేంజ్ రోవర్ వెలార్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో మోహన్ లాల్ (ఫొటోలు)
-
లగ్జరీ కారు కొన్న మోహన్ లాల్.. వామ్మో అన్ని కోట్లా?
మలయాళ సీనియర్ నటుడు మోహన్‌లాల్ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేశారు. బ్రిటన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రేంజ్ రోవర్ కొత్త మోడల్ ఆటో బయోగ్రఫీని తన ఇంటికి తీసుకొచ్చారు. ఈ కారు ధర దాదాపుగా రూ.4 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాాగా.. మోహన్‌లాల్ వద్ద ఇప్పటికే 3 కోట్ల రూపాయల ఖరీదు చేసే లంబోర్గినీ కారును కలిగి ఉన్నాడు. టయోటా వెల్ఫైర్ రూ. 1 కోటి, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ 350(సుమారు రూ. 80 లక్షలు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ (సుమారు రూ. 2 కోట్లు) మోహన్ లాల్ వద్ద ఉన్నాయి. ప్రస్తుతం అతని గ్యారేజీలో ఉన్న అత్యంత ఖరీదైన కారుగా రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ నిలవనుంది. కాగా.. మోహన్‌లాల్ ఇటీవలే రాజస్థాన్‌లో తన రాబోయే చిత్రం మలైకోట్టై వాలిబన్ షెడ్యూల్‌ను ముగించారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిసేరి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ లాల్ రజనీకాంత్ జైలర్‌లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. New one to the garage 🚗#RangeRover @Mohanlal #Mohanlal #MalaikottaiVaaliban pic.twitter.com/2bZBuBKL3K — Mohanlal Fans Club (@MohanlalMFC) April 10, 2023 -
కొత్త కారు కొన్న తీన్మార్ బ్యూటీ.. ధర ఎంతో తెలుసా?
హిందీ, కన్నడ భాషలతో పాటు తెలుగులో కూడా తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన 'కృతి ఖర్బందా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2009లో బోణి చిత్రంతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ఈమె పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ సినిమాలో కూడా కనిపించింది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఖరీదైన ఒక రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేసింది. నివేదికల ప్రకారం, కృతి ఖర్బందా కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ వెలార్ ధర సుమారు రూ. 90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు వైట్ కలర్లో చూడచక్కగా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేంజ్ రోవర్ వెలార్ ఎక్కువ మంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఒకటి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. అయితే కృతి డీజిల్ కారుని కొన్నట్లు సమాచారం. ఈ ఇంజిన్ 204 పీఎస్ పవర్ 430 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా పవర్ డెలివరీ చేస్తుంది. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు 12.3 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ వంటి వాటితో పాటు.. 3D 360 డిగ్రీ సరౌండ్ కెమెరా, PM2.5 ఎయిర్ ఫిల్టర్, 12 స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన 14 వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు కలిగి వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. రేంజ్ రోవర్ వెలార్ ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ. 89.41 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇప్పటికే ఈ కారు గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి ఉంది. ఇది భారతీయ విఫణిలో కూడా త్వరలో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఈ కారు మార్కెట్లో మెర్సిడెస్ GLE, ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ ఎక్స్5, పోర్స్చే మకాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
బాలీవుడ్ నటి లగ్జరీ కారు, దర్జా పోజు వైరల్
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటులు,లగ్జరీ కార్లును సొంతం చేసుకోవడం చాలాకామన్. తాజాగా లంచ్‌బాక్స్ నటి ఈ లిస్ట్‌లో చేరింది. బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ తాజాగా లగ్జరీకారును కొనుగోలు చేసింది. కొత్త కారుకు సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. "వెల్కమ్ హోమ్ మై బ్లాక్ బీస్ట్" అంటూ ఒక పిక్నుషేర్ చేసింది. కొత్త కారు కొన్నందుకు ఫ్యాన్స్ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం కౌర్ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కొత్త రేంజ్ రోవర్లో ముంబైలోని మాడాక్ ఫిల్మ్స్ ఆఫీసుకు వచ్చిన వీడియో ఒకటి ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతోంది. ఐదో తరం రేంజ్ రోవర్ కారు భారతదేశంలో కంపెనీ విడుదల చేసినంది. నటి నిమ్రత్ కొన్న రేంజర్ రోవర్ ఎస్యూవీ ధర 2.38 కోట్లకు పై మాటేనని అంచనా . నిమ్రత్‌కౌర్ అభిషేక్ బచ్చన్ ,యామీ గౌతమ్‌లతో కలిసి నటించిన దాస్విలో కనిపించింది. ఈ మూవీలో అభిషేక్ ఆన్ స్క్రీన్ భార్య బిమ్లా దేవి పాత్రలో నటించింది. దాస్వీ కంటే ముందు 2016లో అక్షయ్ కుమార్ ఎయిర్‌లిఫ్ట్‌లో నటించింది. ఒక హిందీ వెబ్ సిరీస్ ది టెస్ట్ కేస్‌లో కూడా కౌర్ యాక్ట్ చేసింది. కాగా కొత్త రేంజ్ రోవర్ స్టాండర్డ్ , లాంగ్-వీల్‌బేస్ బాడీ డిజైన్లలో ఐదు సీట్లతో అందుబాటులో ఉంది. కొత్త రేంజ్ రోవర్ హైబ్రిడ్ ధరలు రూ. 2.61 కోట్లు నుండి ప్రారంభం. గత నెలలో కారు డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ కారు పెట్రోల్ , డీజిల్ వెర్షన్లలో, 25 ట్రిమ్స్‌లో లభ్యం. -
20 ఏళ్లకే రూ.2 కోట్ల ఖరీదైన కారు కొన్న నటి
బుల్లితెర నటి అవనీత్ కౌర్ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. రెండు కోట్ల రూపాయలు విలువ చేసే రేంజ్ రోవర్ కారును తన ఇంటికి తెచ్చుకుంది. ఈ సందర్భంగా కొత్త కారుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఇది నా కల నెరవేరిన సంవత్సరం అని ఎమోషనలైంది. లగ్జరీ కారు కొన్న అవనీత్‌కు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 20 ఏళ్లకే రూ.2 కోట్ల ఖరీదైన కారును తనకు తాను బహుమతిగా ఇచ్చుకోవడం చాలా గొప్ప విషయం అని ప్రశంసిస్తున్నారు. కాగా పలు సీరియళ్లలో నటించిన అవనీత్ మర్దానీ, మర్దానీ 2 లోనూ మెరిసింది. ఇటీవలే ఆమె కథానాయికగానూ మారింది. కంగనా రనౌత్ నిర్మించిన టికు వెడ్స్ షెరు సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ సరసన నటించింది. -
డైరెక్టర్‌కు రేంజ్ రోవర్ కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
సాధారణంగా సినిమా రిలీజ్ అయ్యాక మంచి సక్సెస్ అయితే డైరెక్టర్స్‌కి హీరోలు, నిర్మాతల నుంచి బహుమతులు వస్తుంటాయి. కానీ రిలీజ్‌కు ముందే ఖిలాడి డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ అందింది. మాస్‌రాజా రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్వకత్వంలో రూపొందుతున్న సినిమా ఖిలాడి. ఫిబ్రవరి11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ విజయంపై ఇప్పటికే మేకర్స్ చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌కు ముందే డైరెక్టర్ రమేశ్ వర్మకు నిర్మాత కోనేరు సత్యనారాయణ అదిరిపోయే బహుమతి ఇచ్చారు. కోటిన్నర రూపాయల విలువైన రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నారు. -
హైదరాబాద్ రోడ్లపై దర్శనమిచ్చిన అల్లు అర్జున్
కుటుంబంతో హాలిడే ట్రిప్ ముగించుకొని తిరిగి హైదరాబాద్‌లోకి ఎంటర్ అయ్యారు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. షూటింగ్‌లకు స్పల్ప విరామం చెప్పిన బన్నీ తన భార్య స్నేహా, ఇద్దరు పిల్లలతో కలిసి ఇటీవల దుబాయ్ వెకేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ తరుచుగా సోషల్ మీడియాలో పోస్టు చూస్తూ అభిమానులకు టచ్‌లో ఉన్నారు. కొన్ని రోజులపాటు దుబాయ్‌లో ఎంజాయ్ చేసిన ఈ హీరో బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. సిటీలో తన లగ్జరీ కారును (రేంజోవర్) డ్రైవింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఇందులో బన్నీ బ్లాక్ డ్రెస్‌లో దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ ట్రిప్ అనంతరం అల్లు అర్జున్ తిరగి పుష్ప షూటింగ్లో జాయిన్ కానున్నారు. సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా మూవీగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవల రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ ముగించుకుంది. తదుపరి షెడ్యూల్ కేరళలో జరగనుంది. ప్రస్తుతం రష్మికపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం సెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న పుష్ప ఆగస్ట్ 13న విడుదల కానుంది. చదవండి: 'బన్నీ తన ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తాడు' వకీల్ సాబ్: ‘సత్యమేవ జయతే’ పాట విన్నారా.. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
రష్మిక రేంజ్ పెరిగిపోయింది!
టాలీవుడ్లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా మారారు రష్మిక మందన్నా. వరుస ఆఫర్లతో హిట్ల మీద హిట్లు కొడుతున్న ఈ అమ్మడు తాజాగా రేంజ్ రోవర్ కారు కొన్నారు. ఈ విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకోకుండా ఉండలేకపోయారు. 'సాధారణంగా ఇలాంటి విషయాలను నేను ఎవరితోనూ పెద్దగా పంచుకోను. కానీ ఈ సారి మాత్రం చెప్పకుండా ఉండబట్టలేకపోతున్నా. ఎందుకంటే నా ప్రయాణంలో మీరు కూడా భాగస్వామ్యులే. ఇలాంటి ఓ రోజు వస్తుందని నేనస్సలు ఊహించలేదు. ఇంకా నేను ఎయిర్‌పోర్టుకు పరుగెత్తుతున్న సమయంలో ఓ రెండు నిమిషాలు ఆగి మరీ కారు దగ్గర ఫొటోలు దిగాను. మనం ఎంతదూరం వచ్చామో మీకు చూపించాలి కదా! నా మీద ప్రేమ కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు' అంటూ కారు ముందు నిలబడి స్టిల్స్ ఇచ్చిన ఫొటోను షేర్ చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రేంజ్ ఓవర్ కారుతో రష్మిక రేంజ్ పెరిగిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ కారు విలువ ఎంత ఉంటుందనుకుంటున్నారు? రూ. కోటి రూపాయల పైనే! (చదవండి: మరో ‘మెగా’ చాన్స్ కొట్టేసిన రష్మిక!) ప్రస్తుతం రష్మిక సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప' సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. 'ఆడాళ్లు మీకు జోహార్లు' చిత్రంలో శర్వానంద్‌తో జోడీ కడుతున్నారు. 'మిస్టర్ మజ్ను'తో బాలీవుడ్లో అడుగు పెడుతున్నారు. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో ఓ సినిమాలో కలిసి నటించనున్నారు. 'డాడీ' టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆమె అమితాబ్ కూతురిగా కనిపించనున్నారట. ఈ సినిమాకు వికాస్ బాల్ దర్శకత్వం వహిస్తున్నారు. (చదవండి: కాలి నడకన తిరుపతి కొండెక్కిన యంగ్ హీరో) -
లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్
సినిమాల్లో రాణించాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు అందం, అభినయం ఉండాల్సిందే. హీరోల విషయానికొస్తే ఫిట్నెస్ తప్పనిసరి. అందుకే ఇప్పుడు ఏ హీరో చూసినా షూటింగ్స్‌లో కన్నా ఎక్కువగా జిమ్ముల్లోనే గడిపేస్తున్నారు. చెమటలు చిందిస్తూ శరీర సౌష్ఠవాన్ని కాపాడుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇందుకోసం వారికి స్పెషల్ ట్రైనర్లు కూడా ఉంటారు. అందరిలాగే బాహుబలి హీరో కు కూడా ఓ జిమ్ ట్రైనర్ ఉన్నాడు. ప్రభాస్ అతడితో ఆప్యాయంగా మాట్లాడేవారు. (చదవండి: ఈ హీరోల పారితోషికం ఎంతో తెలుసా?) తనకోసం కష్టపడుతున్న అతనికి ఓ బహుమతిని కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ గిఫ్ట్ విషయం అందరి నోరెళ్లబెట్టేలా చేసింది. ఎందుకంటే జిమ్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి ఇచ్చిన గిఫ్ట్ ఆషామాషీది కాదు. లక్షలు ఖరీదు చేసే రేంజ్ రోవర్ కారు కొనిచ్చారు. తన చుట్టూ ఉన్నవారికి ప్రభాస్ ఇలా గిఫ్ట్ ఇవ్వడం ఇదేం తొలిసారేం కాదు. గతంలోనూ డార్లింగ్ పలువురికి బహుమతులు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ప్రభాస్‌లో ఉన్న ఈ కోణాన్ని చూసి కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరుగుతోంది. (చదవండి:మూడు సినిమాల నుంచి తప్పించారు) -
తన బీస్ట్‌ను పరిచయం చేసిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇటీవల భారీ ఖర్చుతో కార్వాన్ను డిజైన్ చేయించుకున్న అల్లు అర్జున్ తాజాగా మరో లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. అభిమానుల కోసం తన కొత్త కారుతో తను దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘ఇంట్లో కొత్త కారు. దీనికి నేను బీస్ట్ అని పేరు పెట్టాను. నేను ఏదైన కొన్న ప్రతిసారి నాకు కృతజ్ఞత భావనే కలుగుతుంది’ అంటూ ట్వీట్ చేశాడు బన్నీ. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో సినిమాలో నటిస్తున్నాడు బన్నీ. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్, టబు, జయరామ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. New Car in the House . I named him BEAST . Everytime I buy something... there is only one thing on my mind . Gratitude. #rangerover #aabeast pic.twitter.com/pbhtM1iyVs — Allu Arjun (@alluarjun) August 24, 2019 -
రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ లాంచ్.. ధర ఎంత
సాక్షి,ముంబై: టాటా మోటార్స్ సొంతమైన ల్యాండ్ రోవర్ ఇండియా తన పాపులర్ వేరియంట్లో కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేసింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ (జె.ఎల్.ఆర్.ఐ.ఐ.ఐ.ఐ) తన రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ 2018 మోడళ్లను విడుదల చేసింది. బుధవారం వీటిని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. క్లామ్ షోల్ బోయినెట్, ఆల్ న్యూ ఫ్రంట్ గిల్లే , పిక్సెల్ లేజర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ లాంటి అప్‌గ్రేడ్ ఫీచర్స్‌తో వీటిని లాంచ్ చేసింది. రేంజ్ రోవర్ డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర 1.74కోట్ల రూపాయిలు. గరిష్ట ధర 3.76కోట్లు, పెట్రోల్ వేరియంట్ ధర రూ.1.87 కోట్ల నుంచి, రూ. 3.88కోట్ల మధ్య ఉంటుందని కంపెనీ తెలిపింది. రేంజ్ రోవర్ స్పోర్ట్ డీజిల్ వేరియంట్ ప్రారంభ ధర రూ .99.48 లక్షలు, గరిష్ట ధర రూ. 1.43 కోట్లుగా ఉంది. అదే పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర 1.1003 కోట్లు, గరిష్టంగా 1.96 కోట్లరూపాయలుగా ఉండనుంది. 2018 రేంజ్ రోవర్ మోడల్ ఎస్‌యూవీలు గ్జరీ, సామర్ధ్యం, టెక్నాలజీలోని అందించడం లో ల్యాండ్ రోవర్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని, కంపెనీ ప్రెసిడెంట్ , మేనేజింగ్ డైరెక్టర్, రోహిత్ సూరి తెలిపారు. ల్యాండ్ రోవర్ వాహనాలు భారతదేశంలో 27 అధికారిక కేంద్రాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. -
ఆ నటి నా కారును తిరిగి ఇవ్వడం లేదు!
న్యూఢిల్లీ: తెలుగులో ‘ఖడ్గం’, ‘మగధీర’ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి కిమ్ శర్మ చిక్కుల్లో పడింది. ఆమె తన రేంజ్‌రోవర్ లగ్జరీ కారును వాడుకుంటూ తిరిగి ఇవ్వడం లేదని రాజస్థాన్‌కు చెందన ఓ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2017 సెప్టెంబర్‌లో వ్యాపారవేత్త దిలీప్‌కుమార్ ఈ విషయమై పోలీసులను ఆశ్రయించాడు. అయితే, పోలీసులు కిమ్ శర్మ పేరుకు బదులు విడిపోయిన ఆమె భర్త అలీ పుంజానీ పేరును పొరపాటును కేసులో నమోదుచేశారని తాజాగా ఆయన మీడియా ముందుకొచ్చారు. ముంబైలో తనకు నివాసం లేదని, తరచూ రాజస్థాన్, ముంబై మధ్య ప్రయాణం చేస్తుండటంతో తన లగ్జరీ కారును కిమ్, ఆమె భర్త ఉండే ఖర్ రెసిడెన్సీలో పార్క్ చేసేవాడినని తెలిపాడు. కిమ్ తన లగ్జరీ కారును వాడుతున్న విషయం గత ఏడాది తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ‘కారు తిరిగి ఇవ్వాలని ఆమెను అడిగితే.. ఇది తన భర్త ఇచ్చాడని వాపస్ ఇవ్వడానికి నిరాకరించింది’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కిమ్ ఇటీవల భర్త నుంచి విడిపోయి.. వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్య తీసుకోలేదని, అందుకే తాజాగా మరోసారి ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు. తనకు మరాఠీ రాకపోవడంతో పోలీసు రిపోర్ట్‌లోని పొరపాటును చదవలేకపోయానని, ఇప్పుడు దానిని సవరించి ఫిర్యాదు చేసినా పోలీసులు చర్య తీసుకోవడం లేదని ఆయన అన్నారు. షారుఖ్‌ఖాన్, అమితాబ్ బచ్చన్ నటించిన ‘మొహబతెం’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కిమ్ శర్మ ‘ఫిదా’, తుమ్సే అచ్చా కౌన్ హై, కహెతా హై దిల్ బార్ బార్ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో ‘మగధీర’ సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించింది. 2010లో వ్యాపారవేత్త అలీ పుంజానీని పెళ్లాడిన ఆమె.. ఇప్పుడు విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటోంది. -
హెవెన్ గేట్ ఎక్కేసిన రేంజ్ రోవర్
చైనా హెవెన్ గేట్.. స్వర్గధామంగా పేరు పొందిన ఈ ప్రదేశాన్ని చేరుకోవాలంటే 99 మలుపులు, నిటారుగా ఉన్న 999 మెట్లు ఎక్కాలి. ఈ ప్రదేశానికి కేవలం నడక ద్వారా మాత్రమే సాధ్యమవుతోంది. కానీ అలాంటి ఈ మలుపులను, మెట్లను చేధించుకుని హెవెన్గేటును చేరుకుంది రేంజ్ రోవర్. ఇప్పటి వరకు ఎలాంటి వాహనాలు ప్రయాణించని ఈ మెట్లపై, రేంజ్‌రోవర్ రేంజ్ రోవర్ నాన్-స్టాప్‌గా ప్రయాణించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఎక్కడా ఆగకుండా హెవెన్ గేట్‌ను చేరుకుని రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్యూవీ ప్రపంచ రికార్డు సృష్టించింది. చెైనాలోని టియాన్మెన్ మౌంటెయిన్ రోడ్డులో అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఏడు మైళ్ల గుండా రోవర్ స్పోర్ట్ ప్రయాణించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ రోడ్డును డ్రాగన్ రోడ్డు అని కూడా పిలుస్తారు.ఈ డ్రాగన్ రోడ్డు ఛాలెంజ్‌లో మొత్తం 99 మలుపులు మరియు నిటారుగా ఉన్న 999 మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల సాధారణంగా మనుషులు నడవడమే ఎంతో కష్టంతో కూడుకున్నదిగా ఉంటుంది. ఇలాంటి మెట్ల మీద రేంజ్ రోవర్ నాన్-స్టాప్‌గా ప్రయాణించింది. అంతా కొత్తగా రూపొందించిన రేంజ్‌రోవర్ స్పోర్ట్ పీ400ఈ కారు ద్వారా ఈ అసాధ్యాన్ని సుసాధ్యమైంది. తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు కూడా ఇదే కావడం విశేషం. 2.0 లీటరు ఇంజిన్‌తో 295బీహెచ్పీని, 85కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్‌తో 394 బీహెచ్పీ, 640 ఎన్ఎం టర్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ సవాల్‌ను అధిగమించడానికి ఎస్‌యూవీలో ప్రత్యేకమైన టైర్లను అందించారు. జాగ్వార్ రేసింగ్ బృందం నుంచి హో-పిన్ టుంగ్ రేసర్, రేంజ్ రోవర్ ఎస్‌యూవీని డ్రైవ్ చేసి ఛాలెంజ్ పూర్తి చేశాడు. ఎలాంటి ప్రమాదం సంభవించకుండా, సురక్షితంగా నిటారుగా ఉన్న 999 మెట్ల గుండా సహజ సిద్దంగా ఏర్పడిన ఈ హెవెన్ గేటును చేరుకున్నారు. ప్రపంచంలో ఈ మార్గాన్ని వెహికల్ ద్వారా చేరుకోవడం ఇదే తొలిసారి. రేంజ్ రోవర్ స్పోర్ట్ నడిపిన డ్రైవర్ హో-పిన్ టుంగ్ మాట్లాడుతూ.. " నేను, ఇప్పటి వరకు ఫార్మాలా ఇ, ఫార్ములా 1, 24 గంటల లి మ్యాన్స్ పోటీల్లో పాల్గొన్నాను. అయితే, ఇప్పటి వరకు ఇలాంటి కఠినమైన సవాల్‌తో కూడుకున్న డ్రైవింగ్ అనుభవాన్ని ఇదివరకెన్నడూ అనుభవించలేదు. రేంజ్ రోవర్ ఎస్‌యూవీలు తీసుకున్న అత్యంత కఠినమైన సవాళ్లలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. గతంలో పైక్స్ పీక్ కొండను ఎక్కడం, అరేబియన్ భూ భాగంలో నిర్జీవంగా ఉన్న సువిశాలమైన ఎడారిని దాటడం, స్విట్జర్లాండ్‌లోని 7,119 అడుగుల ఎత్తు ఉన్న పల్లపు మంచు పర్వతం నుండి క్రిందకు దిగడం వంటి ఎన్నో సవాళ్లను స్వీకరించింది'' అని తెలిపారు. ఈ మొత్తం ప్రయాణాన్ని 22 నిమిషాల 41 సెకన్లలో చేధించాడు. -
మార్కెట్లోకి రేంజ్ రోవర్ వెలార్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తాజాగా తన కొత్త ఎస్‌యూసీ మోడల్ ‘రేంజ్ రోవర్ వెలార్’ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.78.83 లక్షల నుంచి రూ.1.38 కోట్ల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. వచ్చే ఏడాది జనవరి చివరి నుంచి ఈ మోడళ్లను కస్టమర్లకు డెలివరీ చేస్తామని కంపెనీ తెలిపింది. ‘రేంజ్ రోవర్ పోర్ట్‌ఫోలియోలో రేంజ్ రోవర్ ఎవొక్యూ, రేంజ్ రోవర్ స్పోర్ట్ మధ్య ఉన్న అంతరాన్ని వెలార్ మోడల్ భర్తీ చేస్తుంది. దీంతో ఎస్యూవీ విభాగం మరింత బలోపేతమౌతుంది’ అని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి తెలిపారు. ఈ కొత్త మోడల్ 2 లీటర్ పెట్రోల్, 2 లీటర్ డీజిల్, 3 లీటర్ డీజిల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని ఎండీ రోహిత్ సూరి ఈ సందర్భంగా తెలిపారు. జేఎల్ఆర్ విక్రయాల్లో 10 శాతం వృద్ధి జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) విక్రయాలు నవంబర్ నెలలో 10 శాతం వృద్ధితో 52,332 యూనిట్లకు పెరిగాయి. దీనికి కొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ, రేంజ్ రోవర్ వెలార్ ఆవిష్కరణలు బాగా దోహదపడ్డాయి. ‘నవంబర్‌లో బలమైన వృద్ధి సాధించాం. అంతర్జాతీయంగా ప్రధాన మార్కెట్లలోని విక్రయాల్లో వృద్ధి నమోదయ్యింది’ అనిగ్రూప్ ఎస్ఓడీ గాస్ తెలిపారు. -
జేఎల్ఆర్ నుంచి కొత్త రేంజ్ రోవర్
ప్రారంభ ధర రూ.49.1 లక్షలు న్యూఢిల్లీ: టాటా మోటార్స్ అనుబంధ కంపెనీ ‘జాగ్వార్ ల్యాండ్ రోవర్’ తాజాగా కొత్త ఏడాది కోసం కొత్తమోడల్‌ను ఆవిష్కరించింది. ఇది తన పాపులర్ ఎస్యూవీ రేంజ్ రోవర్ ఇవోక్‌లో 2017 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.49.1 లక్షల నుంచి రూ.67.9 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఇది ఆరు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఇది వరకు మోడళ్లతో పోలిస్తే తాజా కొత్త వాహనంలో కంపెనీ కొన్ని మార్పులు చేసింది. ఇందులో ప్రధానమైనది 2.0 లీటర్ ఇంజీనియమ్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చడం. కంపెనీ నుంచి వచ్చిన ఇదివరకు ఇంజిన్లతో పోలిస్తే దీనిబరువు 20 కేజీలు తక్కువ. ల్యాండ్ రోవర్ నుంచి వచ్చిన కొత్త ఇంజిన్ ఇది. ఇక కొత్త రేంజ్ రోవర్ ఇవోక్‌లోని అదిరిపోయే డిజైన్, టాప్‌క్లాస్ టెక్నాలజీ, లగ్జరీ ఫీచర్లు కస్టమర్లను కట్టిపడేస్తాయని కంపెనీ పేర్కొంది. ఆల్ ఫోర్ వీల్ డ్రైవ్, 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఇన్‌కంట్రోల్ టచ్ ప్రొ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని వివరించింది. -
బట్టలన్నీ విప్పేసి వీధుల్లో యువతి విహారం
శాండియాగో: శాండియాగో వీధుల్లో ఓ బార్ డ్యాన్సర్ యువతి మొత్తం మహిళలకే తలవొంపులు తెచ్చే పని చేసింది. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా కారులో రోడ్డుపై విహరిస్తూ హల్ చల్ చేసింది. ఎంతలా అంటే తన దేహం పూర్తిగా రోడ్డుపై ఉన్న వ్యక్తికి కనిపించేలా.. అది కూడా హాయ్ అంటూ అందరికీ చెప్పడమే కాకుండా టైటానికి సినిమాలో హీరోయిన్ షిప్ చివర అంచులో రెండు చేతులు చాచి విహరించినట్లుగా.. ఈ వీడియో సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయి వెలుగులోకి రావడంతో ఆమెకోసం పోలీసులు కదిలారు. డొమినికన్ రిపబ్లికన్ సాంటియాగోలో రాత్రిపూట ఈ ఘటన చోటుచేసుకుంది. టాప్ లేని రేంజ్ రోవర్ కారులో ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా ఆమె తన దుస్తులన్నింటిని విప్పేసి వీధుల్లో విహరించడం తమకు కనిపించిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఆమె ఎవరనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అయితే, గతంలో ఇక్కడే ఉన్న కాసా బ్లాంకా క్లబ్ లో డ్యాన్స్ చేసే వెనిజులాకు చెందిన యువతిగా భావిస్తున్నారు. ఆమె అలా వివస్త్రగా రోడ్లపై కేకలు వేస్తూ విహరిస్తుంటే ఇది నిజమా లేక భ్రమా అన్నట్లుగా చూడటం మిగితా కార్లలో ప్రయాణించేవారి వంతైంది. అయితే, ఆమెతో న్యూడ్ షూటింగ్ కోసమే అలా కొందరు వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకొని కావాలనే వీధుల్లో విహరింప చేయిస్తూ ఎవరికీ కనిపించకుండా వీడియో షూట్ చేసి ఉంటారని చెప్తున్నారు. -
సూపర్‌స్టార్ కొత్త కారు
శ్రీమంతుడు సక్సెస్ మహేష్ బాబులో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాతో హీరోగానే కాక నిర్మాతగా కూడా విజయం సాధించిన మహేష్ అదే జోష్‌లో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నాడు. తనకు శ్రీమంతుడు లాంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ కొరటాల శివకు లేటెస్ట్ మోడల్ కారును బహుమతిగా అందించిన మహేష్, దీపావళి పండుగ సందర్భంగా తన ఫ్యామిలీ కోసం కూడా కొత్త కారు కొన్నాడు. ప్రస్తుతం సంపన్నవర్గాల్లో స్టేటస్ సింబల్‌గా భావిస్తున్న రేంజ్ రోవర్ కారును దీపావళి పండుగ సందర్భంగా మహేష్ కొనుగొలు చేశాడు. ఆ కారు ముందు, కొడుకు గౌతమ్, కూతురు సితారలతో కలిసి మహేష్ బాబు దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ ట్రిప్ ముగించుకొని వచ్చిన మహేష్ బాబు తిరిగి షూటింగ్‌లతో బిజీ అయ్యాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి మంచి విజయాన్ని అందించిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం షూటింగ్లో పాల్గొంటున్నాడు మహేష్. కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను పివిపి సినిమాస్ బ్యానర్‌తో పాటు మహేష్‌బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2016 సమ్మర్ లోరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకున్న హీరోయిన్
రెండేళ్ల క్రితం ముంబైలో ఇల్లు కొనుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్.. ఇపుడు మరో కలను నెరవేర్చుకుని సంబరాలు చేసుకుంటోంది. సంవత్సరం క్రితం మనసు పడిన వాహనాన్ని సొంతం చేసుకుని ఆనందంలో మునిగి తేలుతోంది. బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సక్సెస్‌ను తన కొత్త రెడ్ రేంజ్ రోవర్ కారుతో సెలబ్రేట్ చేసుకుంటోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌తో జంటగా నటించిన గబ్బర్ ఈజ్ బ్యాక్ ఘన విజయానికి గుర్తుగా తనకు తానే ఈ బహుమతి ఇచ్చుకున్నానని శ్రుతిహాసన్ మీడియాకు తెలిపింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో అగ్ర హీరోల సరసన నటిస్తూ శ్రుతిహాసన్ వరుస విజయాలతో దూసుకుపో్తోంది. ప్రస్తుతం తమిళంలో అజిత్, విజయ్, సూర్య సరసన ... తెలుగులో మహేష్‌బాబుకు జంటగా శ్రీమంతుడు చిత్రంలో నటిస్తోంది. -
మేకప్ మ్యాన్ భార్యకు అమితాబ్ భారీ బహుమతి
అమితాబ్ బచ్చన్.. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బాలీవుడ్ మెగాస్టార్‌కు ఎవరైనా కష్టపడుతున్నట్లు తెలిస్తే చాలు, ఆయన గుండె ఇట్టే కరిగిపోతుంది. దాదాపు 40 ఏళ్లుగా తన మేకప్ మ్యాన్‌గా ఉన్న దీపక్ సావంత్ భార్యకు ఆయన ఏకంగా రేంజిరోవర్ కారు బహూకరించారు. దీపక్ సావంత్ భార్య సరోద్ చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాను కూడా లగ్జరీ కారులో తిరగాలని, ఆ కారు తన సొంతం కావాలని ఆమెకు కోరిక ఉండేది. ఆ విషయం ఎలాగో అమితాబ్ చెవిన పడింది. దాంతో వెంటనే ఆయన తనవద్ద ఉన్న రేంజి రోవర్ కారును ఆమెకు బహుమతిగా ఇచ్చేశారు. సాధారణంగా అమితాబ్ ఏదైనా కారు కొన్నారంటే దాన్ని మూడు నాలుగేళ్లు వాడిన తర్వాత అమ్మేసి, మరో కొత్త కారు కొంటారు. కానీ ఈ కారు మాత్రం 2002 నుంచి.. అంటే దాదాపు 12 ఏళ్లుగా అమితాబ్ దగ్గరే ఉంది. అదంటే ఆయనకు చాలా ఇష్టం. అయినా చాలా తక్కువసార్లు మాత్రమే ఆ కారును ఉపయోగించారు. సరోద్ కోరిక గురించి తెలియగానే ఆమెకు దాన్ని బహుమతిగా ఇచ్చేశారని అమితాబ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీనిపై దీపక్ సావంత్‌ను అడిగితే, 'నా భార్యకు బచ్చన్‌జీ ఓ కారు బహుమతిగా ఇచ్చారు' అని చెప్పాడు.