
తనకు తానే గిఫ్ట్ ఇచ్చుకున్న హీరోయిన్
రెండేళ్ల క్రితం ముంబైలో ఇల్లు కొనుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్.. ఇపుడు మరో కలను నెరవేర్చుకుని సంబరాలు చేసుకుంటోంది. సంవత్సరం క్రితం మనసు పడిన వాహనాన్ని సొంతం చేసుకుని ఆనందంలో మునిగి తేలుతోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సక్సెస్ను తన కొత్త రెడ్ రేంజ్ రోవర్ కారుతో సెలబ్రేట్ చేసుకుంటోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్తో జంటగా నటించిన గబ్బర్ ఈజ్ బ్యాక్ ఘన విజయానికి గుర్తుగా తనకు తానే ఈ బహుమతి ఇచ్చుకున్నానని శ్రుతిహాసన్ మీడియాకు తెలిపింది.
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లలో అగ్ర హీరోల సరసన నటిస్తూ శ్రుతిహాసన్ వరుస విజయాలతో దూసుకుపో్తోంది. ప్రస్తుతం తమిళంలో అజిత్, విజయ్, సూర్య సరసన ... తెలుగులో మహేష్బాబుకు జంటగా శ్రీమంతుడు చిత్రంలో నటిస్తోంది.