Olympic Gold Medalist Neeraj Chopra Buys a New Range Rover Velar Car - Sakshi
Sakshi News home page

గోల్డెన్‌ బోయ్‌ నీరజ్‌ చోప్రా కొత్త కారు చూశారా? ధర ఎంతంటే?

Published Fri, Jul 21 2023 8:54 PM | Last Updated on Fri, Jul 21 2023 9:27 PM

Olympic Gold Medalist Neeraj Chopra buys a new Range Rover Velar worth Rs 90 lakh - Sakshi

Neeraj Chopra buys a new Range Rover Velar ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా   కొత్త రేంజ్ రోవర్ వెలార్‌ను కొనుగోలు చేశాడు. దీనికి  సంబంధించిన ఫోటోలను and Rover Malwa Automotives సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. రూ. 90 లక్షల విలువైన ఈ ఐకానిక్ వాహనాన్ని సొంతం చేసుకున్నాడు. చాలామంది  క్రీడాకారుల్లాగానే   ఒలంపిక్‌  సెన్సేషన్‌  నీరజ్ చోప్రాకు  లగ్జరీ కార్లంటే మోజు ఎక్కువు. కొత్త రేంజ్ రోవర్ వెలార్‌తో పాటు, రేంజ్ రోవర్ స్పోర్ట్ , అనేక ఇతర టాప్-టైర్ వాహనాలు అతని గ్యారీజేలో ఉండడం విశేషం. రేంజ్ రోవర్ వెలార్  ఇండియా  ప్రారంభ ధర రూ. 78.87 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) అయితే, నీరజ్ చోప్రా చెల్లించిన ఖచ్చితమైన ధర ఇంకా తెలియరాలేదు. (ఓలా ఎస్‌1 ఎయిర్‌ లాంచింగ్‌ బంపర్‌ ఆఫర్‌: మూడు రోజులే!)

రేంజ్ రోవర్ వెలార్  పలు  డ్రైవింగ్‌ వేరియంట్లలో లభిస్తోంది. లో వేరియంట్‌ 179 Bhpతో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ లేదా 250 Bhp తో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో   లాంచ్‌కాగా,  టాప్-ఎండ్ వేరియంట్‌లు 296 Bhpపవర్‌,  3.0-లీటర్ V6 టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. (అదరగొట్టిన రిలయన్స్‌ జియో)

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే..మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, యూజర్ ఫ్రెండ్లీ టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్‌తో టచ్ ప్రో డ్యుయో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, మెమొరీ ఫంక్షన్‌తో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ,యాక్టివ్ రియర్-లాకింగ్ ఇ-డిఫరెన్షియల్ వంటి ముఖ్యమైన హైలైట్‌లు ఉన్నాయి. కొత్త పివి ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 10-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అధునాతన కనెక్టివిటీ  ఆప్షన్స్‌ ఇందులో ఉన్నాయి. 

నీరజ్ చోప్రాతోపాటు,ప్రముఖ నటి కృతి ఖర్బందా, స్టాండ్-అప్ కమెడియన్ జకీర్ ఖాన్ , నటి అవ్నీత్ కౌర్‌ లాంటి సెలబ్రిటీలు  ఈ రేంజ్‌రోవర్‌ వెలార్‌ను  కొనుగోలు చేశారు. అంతుకాదు  ప్యాన్‌ ఇండియా  హీరో ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు రేంజ్ రోవర్ వెలార్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement