Olympic gold medalist
-
గోల్డెన్ బోయ్ నీరజ్ చోప్రా కొత్త కారు చూశారా? ధర ఎంతంటే?
Neeraj Chopra buys a new Range Rover Velar ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా కొత్త రేంజ్ రోవర్ వెలార్‌ను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను and Rover Malwa Automotives సోషల్ మీడియాలో షేర్ చేసింది. రూ. 90 లక్షల విలువైన ఈ ఐకానిక్ వాహనాన్ని సొంతం చేసుకున్నాడు. చాలామంది క్రీడాకారుల్లాగానే ఒలంపిక్ సెన్సేషన్ నీరజ్ చోప్రాకు లగ్జరీ కార్లంటే మోజు ఎక్కువు. కొత్త రేంజ్ రోవర్ వెలార్‌తో పాటు, రేంజ్ రోవర్ స్పోర్ట్ , అనేక ఇతర టాప్-టైర్ వాహనాలు అతని గ్యారీజేలో ఉండడం విశేషం. రేంజ్ రోవర్ వెలార్ ఇండియా ప్రారంభ ధర రూ. 78.87 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) అయితే, నీరజ్ చోప్రా చెల్లించిన ఖచ్చితమైన ధర ఇంకా తెలియరాలేదు. (ఓలా ఎస్1 ఎయిర్ లాంచింగ్ బంపర్ ఆఫర్: మూడు రోజులే!) రేంజ్ రోవర్ వెలార్ పలు డ్రైవింగ్ వేరియంట్లలో లభిస్తోంది. లో వేరియంట్ 179 Bhpతో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ లేదా 250 Bhp తో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లాంచ్కాగా, టాప్-ఎండ్ వేరియంట్లు 296 Bhpపవర్, 3.0-లీటర్ V6 టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను కలిగి ఉంటాయి. (అదరగొట్టిన రిలయన్స్ జియో) ఇతర ఫీచర్ల విషయానికి వస్తే..మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, యూజర్ ఫ్రెండ్లీ టచ్‌స్క్రీన్ ఇంటర్ఫేస్తో టచ్ ప్రో డ్యుయో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హిల్ డిసెంట్ కంట్రోల్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, మెమొరీ ఫంక్షన్‌తో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ,యాక్టివ్ రియర్-లాకింగ్ ఇ-డిఫరెన్షియల్ వంటి ముఖ్యమైన హైలైట్లు ఉన్నాయి. కొత్త పివి ప్రో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ 10-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి అధునాతన కనెక్టివిటీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. నీరజ్ చోప్రాతోపాటు,ప్రముఖ నటి కృతి ఖర్బందా, స్టాండ్-అప్ కమెడియన్ జకీర్ ఖాన్ , నటి అవ్నీత్ కౌర్ లాంటి సెలబ్రిటీలు ఈ రేంజ్‌రోవర్ వెలార్‌ను కొనుగోలు చేశారు. అంతుకాదు ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ తన జిమ్ ట్రైనర్‌కు రేంజ్ రోవర్ వెలార్‌ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
Abhinav Bindra: బుల్లెట్ దిగింది..
2000 సిడ్నీ ఒలింపిక్స్.. 18 ఏళ్ల వయసులో పతకం ఆశలతో బరిలోకి దిగిన అతనికి ఏదీ కలిసి రాలేదు. చివరకు దక్కింది 11వ స్థానం. కనీసం ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేదు. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్.. ఈసారి తన ఆట ఎంతో మెరుగైందని భావిస్తూ లక్ష్యం దిశగా ముందుకెళ్లాడు.. కానీ ఈసారి 7వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది! ఒక వ్యక్తిగత క్రీడాంశంలో, అదీ మానసికంగా ఎంతో దృఢంగా ఉండాల్సిన ఆటలో, రెండు ఒలింపిక్స్‌లో వరుస వైఫల్యాల తర్వాత వెంటనే కోలుకొని తర్వాతి నాలుగేళ్ల కాలానికి లక్ష్యాలు పెట్టుకొని సిద్ధం కావడం అంత సులువు కాదు. కానీ ఆ ఆటగాడి పట్టుదల ముందు ప్రతికూలతలన్నీ తలవంచాయి. బీజింగ్‌లో అతని బుల్లెట్ గురి తప్పలేదు. సరిగ్గా టార్గెట్‌ను తాకి పసిడి పతకాన్ని అతని మెడలో వేసింది. ఒలింపిక్స్ చరిత్రలో ఏ భారత ఆటగాడికి సాధ్యం కాని ఘనతను అందించింది. ఆ శూరుడే అభినవ్ బింద్రా. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు. ఆటలో అద్భుతాలు చేయగానే మనలో చాలా మందికి సహజంగానే అతని నేపథ్యంపైనే ఆసక్తి పెరుగుతుంది. అయితే విజయగాథలన్నీ పేద కుటుంబం నుంచో, మధ్యతరగతి కుటుంబాల నుంచో మొదలు కావాలనేం లేదు.. కోటీశ్వరుడైనా క్రీడల్లోకి వెళితే స్కోరు సున్నా నుంచే మొదలవుతుంది. అందుకే ఎక్కువగా వినిపించే సాధారణ స్థాయి నుంచి శిఖరానికెదిగిన లాంటి కథ కాదు బింద్రా జీవితం. అతను ఐశ్వర్యంలో పుట్టాడు. దేశంలోనే టాప్ స్కూల్లో ఒకటైన ‘డూన్ స్కూల్’లో చదువుకున్నాడు. ఉన్నత విద్యను అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీలో అభ్యసించాడు. తిరిగొచ్చి తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించడమే తరవాయి.. కానీ బింద్రా మరో బాటను ఎంచుకున్నాడు. అది కూడా సరదా కోసమో, వ్యాపారంలో అలసిపోయాక వారాంతంలో టైమ్ పాస్‌గా ఆడుకునేందుకో కాదు. ఆటలో అగ్రస్థానానికి చేరేందుకు అడుగు పెట్టాడు. అందుకే పగలు, రాత్రి కష్టపడ్డాడు. ఒక వ్యాపారవేత్తగా సాధించే కోట్లతో పోలిస్తే అంతకంటే విలువైన దానిని అందుకున్నాడు. కోట్లాది భారతీయుల ప్రతినిధిగా, వారంతా గర్వపడేలా తన రైఫిల్‌తో సగర్వంగా విశ్వ క్రీడా వేదికపై జనగణమన వినిపించాడు. చిరస్మరణీయం డబ్బుంటే చాలు క్రీడల్లోకి వెళ్లిపోవడం చాలా సులువు అనే అభిప్రాయం మన దేశంలో బలంగా పాతుకుపోయింది. నిజానికి అలాంటి వాళ్లు ఆటల్లో రాణించాలంటే ఇతరులతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేరణ ఉండాలి. అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు ఏదైనా సాధించాలనే లక్ష్యం, పట్టుదల కొత్తగా పుట్టుకురావాలి. సరిగ్గా చెప్పాలంటే చుట్టూ ఉన్న సకల సౌకర్యాలు, విలాసాలకు ఆకర్షితులవకుండా ఏకాగ్రత చెదరకుండా పోటీల్లో దిగాలి. అలా చూస్తే మా అభినవ్ సాధించిన ఘనత అసాధారణం. దాని విలువ అమూల్యం’ బింద్రా స్వర్ణ పతకం సాధించిన తర్వాత అతని కుటుంబ మిత్రుడొకరు చేసిన వ్యాఖ్య ఇది. నిజంగానే ఆ సమయంలో గానీ, ఆ తర్వాత గానీ బింద్రా.. తన నేపథ్యం వల్లే ఎదిగాడనే మాటను చెప్పేందుకు ఏ ఒక్కరూ సాహసించలేదు. ఎందుకంటే 2008 ఆగస్టు 11న బీజింగ్ ఒలింపిక్స్‌లో బింద్రా స్వర్ణ పతకం గెలుచుకున్నాడనే వార్త విన్న తర్వాత హృదయం ఉప్పొంగని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో 1980 మాస్కో ఒలింపిక్స్‌లో అదీ టీమ్ గేమ్ హాకీలో భారత జట్టు చివరిసారిగా స్వర్ణం సాధించిందని జనరల్ నాలెడ్జ్ పుస్తకాల్లో, క్విజ్ పోటీల్లో వింటూ వచ్చిన కొత్త తరానికి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విలువేమిటో అప్పుడే తెలిసింది. ఇల్లే షూటింగ్ రేంజ్‌గా.. షూటింగ్ ధనవంతులు మాత్రమే ఆడుకునే ‘ఎలీట్ పీపుల్స్ గేమ్’. ఇందులో వంద శాతం వాస్తవం ఉంది. గన్స్ మొదలు పోటీల్లో వాడే బుల్లెట్స్, జాకెట్, అనుమతులు, పన్నులు.. ఇలా అన్నీ బాగా డబ్బులతో కూడుకున్న వ్యవహారమే. అభినవ్ తండ్రి అప్జిత్ బింద్రా పెద్ద వ్యాపారవేత్త. పంజాబ్‌లో ఆగ్రో ఫుడ్ బిజినెస్, హోటల్స్ వ్యాపారంలో పెద్ద పేరు గడించాడు. కొడుకు తాను షూటింగ్ ప్రాక్టీస్‌కు వెళతానని చెబితే తొలుత ఆయన కూడా సరదా వ్యాపకంగానే చూశాడు. కానీ అభినవ్ మొదటి రోజు నుంచి కూడా దానిని ప్రొఫెషనల్, కాంపిటీటివ్ స్పోర్ట్‌గానే భావించాడు. అందుకే సాధన మాత్రమే కాదని ఫలితాలు కూడా ముఖ్యమని అతని మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకే తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేశాడు. దాంతో తండ్రికి కూడా కొడుకు లక్ష్యాలపై స్పష్టత వచ్చింది. అందుకే ప్రోత్సహించేందుకు సిద్ధమైపోయాడు. చండీగఢ్‌లోని తమ ఇంట్లోనే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన షూటింగ్ రేంజ్ ఏర్పాటు చేసేశాడు. అభినవ్‌కు 24 గంటలు అదే అడ్డా అయింది. అన్నీ మరచి ప్రాక్టీస్‌లోనే మునిగాడు. జాతీయ స్థాయిలో వరుస విజయాలతో భారత జట్టులో చోటు దక్కింది. 1998 కామన్వెల్త్ క్రీడల్లో పతకం రాకున్నా, భారత్ నుంచి పాల్గొన్న పిన్న వయస్కుడిగా (16 ఏళ్లు) గుర్తింపు పొందాడు. 2002 కామన్వెల్త్ క్రీడల్లో తొలి పతకం వచ్చినా అది ‘పెయిర్స్’ విభాగంలో కాబట్టి అంతగా సంతృప్తినివ్వలేదు. రెండు ఒలింపిక్స్ వచ్చి పోయాయి కానీ ఫలితం దక్కలేదు. ఏదైనా సాధించాలనే తపన పెరిగిపోతోంది కానీ సాధ్యం కావడం లేదు. 2005కు వచ్చే సరికి వెన్ను గాయం దెబ్బ కొట్టింది. దాదాపు ఏడాది పాటు గన్ కూడా ఎత్తలేకపోయాడు. ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. తేదీలు మారుతున్నా పెద్ద ఘనత సాధించలేకపోవడంతో బింద్రా మనసులో మథనం మొదలైంది. తాను ఎక్కడ వెనుకబడుతున్నాడో గుర్తించాడు. అసాధారణమైన ఏకాగ్రత అవసరం ఉండే క్రీడ షూటింగ్. మిల్లీ సెకండ్ దృష్టి చెదిరినా పతకం సాధించే స్థితినుంచి నేరుగా పాతాళానికి పడిపోవచ్చు. దీనిని అధిగమించాలంటే మన దేశంలో అందుబాటులో లేని ప్రత్యేక శిక్షణ తనకు ఎంతో అవసరం అనిపించింది. అందుకే జర్మనీ చేరుకున్నాడు. ఏడాదికి పైగా విరామం లేకుండా అత్యున్నత స్థాయి కోచ్‌ల వద్ద సాధనలో రాటుదేలాడు. మొదటి ఫలితం 2006, ఆగస్ట్.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో వచ్చింది. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా అతను నిలిచాడు. ఈ గెలుపు సరిగ్గా రెండేళ్ల తర్వాత అందుకున్న ఒలింపిక్స్ పతకానికి తొలి అడుగుగా నిలిచింది. ఈ రెండేళ్లలో అతను మరింతగా కష్టపడ్డాడు. బీజింగ్‌లో షూటింగ్ పోటీలు ఎలా ఉంటాయనేదానిపై పూర్తి స్థాయిలో అక్కడ ఉండే వాతావరణం సహా రిహార్సల్స్ చేశాడు. ఎంతగా అంటే మైక్‌లో అనౌన్సర్ పేరు చెప్పినప్పుడు తాను పోటీలో వేసుకునే షూస్‌తో ఎలా నడవాలి అనే సూక్ష్మమైన అంశాలను కూడా వదిలిపెట్టనంతగా. చివరకు తన లక్ష్యం చేరడంలో సఫలమయ్యాడు. అవార్డులు, రివార్డులు.. సుమారు రెండు దశాబ్దాల కెరీర్లో బింద్రా 150కి పైగా పతకాలు గెలిచాడు. భారత ప్రభుత్వం అతడిని క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్నలతో పాటు పౌర పురస్కారం పద్మభూషణ్‌తో సత్కరించింది. భారత ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ హోదా కూడా బింద్రాకు ఉంది. ‘ఎ షాట్ ఎట్ హిస్టరీ – మై ఆబ్సెసివ్ జర్నీ టు ఒలింపిక్ గోల్డ్’ పేరుతో బింద్రా ఆటోబయోగ్రఫీ పుస్తకరూపంలో వచ్చింది. ఆట తర్వాతా ఆటతోనే.. గన్ పక్కన పెట్టేసిన తర్వాత బింద్రా క్రీడలతో తన అనుబంధం కొనసాగిస్తున్నాడు. సాధారణంగా రిటైరయ్యేవాళ్లు ఒక కోచ్‌గానో, లేక క్రీడా సమాఖ్యల్లో పరిపాలకులుగానో తమ పాత్రను నిర్వర్తించేందుకు సిద్ధమైపోతారు. బింద్రా కూడా కోచింగ్ వైపు దృష్టి పెడితే స్పందన కూడా అద్భుతంగా ఉండేది. కానీ ఇక్కడా అతను భిన్నమైన మార్గాన్నే ఎంచుకున్నాడు. ఒక షూటింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా అన్ని రకాల క్రీడాంశాలకు సంబంధించి ఒక కీలక అంశాన్ని అతను ఎంచుకున్నాడు. ఎంతో ప్రతిభ, సత్తా ఉన్నా కీలక సమయాల్లో విశ్వవేదికపై మన భారతీయులు వెనుకబడుతున్న విషయాన్ని అతను గుర్తించాడు. అందుకే ఈతరం పోటీ ప్రపంచంలో ‘స్పోర్ట్స్ సైన్స్’పై దృష్టి పెట్టాడు. బింద్రా నేతృత్వంలో పని చేస్తున్న ‘అభినవ్ ఫ్యూచరిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ భారత క్రీడల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ వాడకంపై సహకారం అందిస్తుంది. ‘అభినవ్ బింద్రా టార్గెటింగ్ పెర్ఫార్మెన్స్’ ద్వారా అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. భువనేశ్వర్‌లో అభినవ్ బింద్రా స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కూడా పని చేస్తోంది. ఇక తన పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ప్రాథమిక స్థాయిలో క్రీడలకు అత్యుత్తమ కోచింగ్ సౌకర్యాలు అందించడంలో కృషి చేస్తోంది. ఈ అన్ని సంస్థల్లో కలిపి వేర్వేరు క్రీడా విభాగాలకు చెందిన సుమారు 5 వేల మంది అథ్లెట్లు ప్రయోజనం పొందడం విశేషం. అందుకే ఆపేశాను కీర్తి కనకాదులు వచ్చిన తర్వాత ఆటనుంచి తప్పుకోవడం అంత సులువు కాదు. ఆశించిన ఫలితాలు రాకపోయినా, ఏదో ఒక టోర్నీలో సీనియర్ ఆటగాళ్లు తలపడుతూనే ఉంటారు. ఆటపై తమకు ఉన్న ప్రేమే అందుకు కారణమని చెబుతుంటారు. ఈ విషయంలో బింద్రా భిన్నంగానే నిలబడ్డాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో బింద్రా ఆఖరి సారిగా పోటీ పడ్డాడు. ఆ మెగా ఈవెంట్లో నాలుగో స్థానంలో నిలిచిన అతను త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. ఆ సమయంలో బింద్రా వయసు 34 ఏళ్లు. అందుకే అతని రిటైర్మెంట్ చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఒక అభిమాని.. ట్విట్టర్ ద్వారా ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తే దానికి ఏమాత్రం భేషజం లేకుండా బింద్రా స్పష్టంగా సమాధానమిచ్చాడు. ‘ఒకటి.. నా నైపుణ్యం రోజురోజుకూ తగ్గిపోతోందని అర్థమైంది. రెండు.. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో విఫలమయ్యాను. మూడు.. నేను అక్కడే వేలాడుతూ ఉంటూ మరో యువ ప్రతిభావంతుడి అవకాశం దెబ్బ తీసినట్లు అవుతుంది. అలా చేయదల్చుకోలేదు’ అని అతను చెప్పాడు. -మొహమ్మద్ అబ్దుల్ హాది -
తీవ్రంగా గాయపడిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్.. నెదర్లాండ్స్‌కు చెందిన మహిళా సైక్లిస్ట్ అనెమిక్ వాన్ లూటెన్కు పెను ప్రమాదం తప్పింది.సైక్లింగ్ రేసింగ్‌లో పట్టుతప్పడంతో బారియర్‌కు తాకి కిందపడిన లూటెన్ తీవ్ర గాయాలపాలైంది. విషయంలోకి వెళితే ఆస్ట్రేలియాలోని వోల్లోంగాంగ్లోలో నిర్వహిస్తున్న రోడ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బుధవారం మిక్స్డ్ టీమ్ ట్రయల్ రెండో రౌండ్ జరిగింది. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన వాన్ లూటెన్ ర్యాంప్ నుంచి స్టార్ట్ తీసుకోగానే.. డౌన్‌కు వెళుతున్న సమయంలో సైకిల్ పట్టుతప్పింది. దీంతో బారియర్‌కు తాకి కిందపడిన ఆమె తలకు చేతులను అడ్డుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె మోచేతికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆమె వెనకాల ఉన్న రేసర్ వాన్ జిక్తో పాటు ముందు వెళ్తున్న రిజనే మార్కస్లు షాక్‌కు గురయ్యారు. కానీ అప్పటికే గేమ్ ప్రారంభం కావడంతో సైక్లింగ్‌ను కంటిన్యూ చేశారు. దీనికి సంబంధించిన వీడియో (UCI World Tour) తన ట్విటర్లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''మెకానికల్ సమస్య వల్ల డచ్ సూపర్‌స్టార్‌కు ప్రమాదం జరిగింది. నిజంగా డచ్‌కు ఈరోజు నిరాశపరిచింది'' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా ప్రమాదంపై అనెమిక్ వాన్ లూటెన్ స్పందించింది. ''కాసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ సైకిల్ టైర్ పగలడంతో స్కిడ్ అయ్యాను. అంతే రోడ్డు పక్కనున్న బారియర్‌కు గుద్దుకుంది. బ్యాలెన్సింగ్ చేయకపోవడం వల్ల ఇది జరిగిందని అనుకుంటున్నా. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నా'' అంటూ పేర్కొంది. కాగా నెదర్లాండ్స్‌కు చెందిన అనెమిక్ వాన్ లూటెన్.. టోక్యో ఒలింపిక్స్ 2020లో టైమ్ ట్రయల్‌లో స్వర్ణం, రోడ్ రేస్‌లో రజతం గెలిచి చరిత్ర సృష్టించింది. ⚠️ CRASH for @AvVleuten!! ⚠️ Mechanical issue causes horrible crash for the Dutch superstar. Really disappointing day for the Dutch. #Wollongong2022 pic.twitter.com/rU5LYNnlcu — UCI (@UCI_cycling) September 21, 2022 చదవండి: రోజర్ ఫెదరర్ కీలక వ్యాఖ్యలు.. కోహ్లిని కలిసిన వివాదాస్పద పారిశ్రామికవేత్త -
ఒలింపిక్ పతక విజేత కన్నుమూత
వాషింగ్టన్: అలనాటి మేటి అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత చార్లీ మూర్ (అమెరికా) కన్ను మూశారు. 91 ఏళ్ల చార్లీ మూర్ కొంతకాలంగా పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి ఆయన మృతి చెందినట్లు ప్రపంచ అథ్లెటిక్స్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి వేదికగా జరిగిన 1952 ఒలింపిక్స్‌లో బరిలో దిగిన ఆయన 400 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించారు. అంతేకాకుండా 1600 మీటర్ల రిలే ఈవెంట్లో పాల్గొన్న మూర్ అమెరికాకు రజత పతకాన్ని సాధించి పెట్టారు. అనంతరం జరిగిన బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌లో పాల్గొని 440 మీటర్ల హర్డిల్స్‌లో 51.6 సెకన్లలో గమ్యాన్ని చేరి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. 1978లో కార్నెల్స్ అథ్లెటిక్ హాల్ ఆఫ్ ఫేమ్‌తోపాటు 1999లో యూఎస్ఏ ట్రాక్ అండ్ ఫీల్డ్ హాల్ ఫేమ్‌లో మూర్ చోటు దక్కించుకున్నారు. కెరీర్‌కు వీడ్కోలు పలికిన అనంతరం మూర్ వ్యాపారవేత్తగా, ఇన్వెస్టర్‌గా, అథ్లెటిక్స్ పాలనాధికారిగా పలు బాధ్యతలను నిర్వర్తించారు. తన కెరీర్‌కు తోడ్పాటు అందించిన మెర్సెర్స్‌బర్గ్ అకాడమీకి తాను సాధించిన రెండు ఒలింపిక్ పతకాలను విరాళంగా ఇచ్చారు. హర్డిల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు మూర్ ‘13 స్టెప్ అప్రోచ్’ టెక్నిక్‌ను సూచించారు. దీనిని అథ్లెట్స్ ఇప్పటికీ హర్డిల్స్‌లో ఉపయోగిస్తుండటం విశేషం. (చదవండి: ధోనిపై విమర్శలకు, ఫ్యాన్ సమాధానం) -
ప్రభుత్వ ఉద్యోగాలకు అభినవ్ బింద్రా గుడ్‌బై
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా తన రెండు ప్రభుత్వ పదవులకు రాజీనామా చేశారు. షూటింగ్ విభాగంలో పరిశీలక హోదా బాధ్యతలకు, టార్గెట్ ఒలింపిక్ పోడియం(టీవోపీ) పథకం ఐడెంటిఫికేషన్ కమిటీ ఉద్యోగం నుంచి తప్పుకున్నారు. కొన్ని ప్రైవేట్ స్పోర్ట్స్ ప్రాజెక్టులతో తాను సంబంధాలు పెంపొందించుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి వివాదం తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర క్రీడలశాఖ మంత్రి రాజ్యవర్దన్‌సింగ్ రాథోడ్‌కు ఓ లేఖ రాశారు. తనపై విశ్వాసం ఉంచి ఇన్నాళ్లు బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలన్నారు. తన సొంత ప్రాజెక్టులైన అభినవ్ బింద్రా టార్గెటింగ్ పర్ఫామెన్స్(ఏబీటీపీ) సెంటర్లు దేశ వ్యాప్తంగా ఏర్పాటుచేసేందుకు సిద్ధమయ్యే క్రమంలో పలు ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేస్తున్నానని, మరింత సమర్ధంగా పనిచేసేందుకోసమే తాను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడం తప్పవుతోంది. -
ఇంటి స్థలం ఇచ్చేది లేదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించింది. వివిధ స్థాయిలలో గెలిచిన ఆటగాళ్లకు భారీ స్థాయిలో నగదు పురస్కారాలు ఇచ్చే విధంగా నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వం సోమవారం దీనికి సంబంధించి జీఓ నం. 1 జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై క్రీడాకారులు ఏ స్థాయిలో విజయం సాధించినా ఇంటి నిర్మాణానికి స్థలం గానీ ఇతరత్రా భూమి గానీ కానుకగా ఇవ్వరు. నిబంధనల ప్రకారం నగదు పురస్కారం మాత్రమే అందజేస్తారు. అయితే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో 2000 నుంచి అమల్లో ఉన్న మొత్తాలను భారీగా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేతకు రూ. 25 లక్షలు ఉండగా, దానిని రూ. 2 కోట్లకు పెంచారు. రజతానికి రూ. 1 కోటి, కాంస్యానికి రూ. 50 లక్షలు ఇవ్వనున్నారు. టీమ్ ఈవెంట్ల విషయంలో కూడా ప్రత్యేక నిబంధనలు విధించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పారాలింపిక్స్, స్పెషల్ ఒలింపిక్స్‌లో పతకం సాధించినవారితో పాటు చెస్ క్రీడలో గెలిచినవారికి కూడా నగదు ఇవ్వనున్నారు. ఇక నాన్ ఒలింపిక్/గ్రామీణ క్రీడలను కూడా ప్రోత్సహించేందుకు ప్రదర్శనను బట్టి రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ఇస్తారు. ముఖ్యమంత్రి విచక్షణపై ఆధారపడి అంతకంటే ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంది. విజయం సాధించిన ఆటగాడు గత రెండేళ్లుగా తాను ఎవరి వద్ద శిక్షణ పొందాడో చెబితే ఆ కోచ్ (తెలంగాణకు చెందిన వారైతేనే)కు కూడా నగదు పురస్కారం దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంత మంది క్రీడాకారులు తమ స్థాయిలో ఉన్న పరిచయాలతో గుర్తింపు లేని టోర్నీలకు కూడా ప్రభుత్వం నుంచి భారీ మొత్తాలు పొందారనే విమర్శలు వినిపించాయి. ఇప్పటి తాజా నిబంధనల కారణంగా అన్నీ స్పష్టంగా ఉండటంతో ఇకపై అలాంటివాటికి అవకాశం ఉండదు. కొత్త పాలసీ ప్రకారం వ్యక్తిగత నగదు పురస్కారాలు (స్వర్ణ, రజత, కాంస్యాలకు) ఒలింపిక్స్ (రూ. 2 కోట్లు, 1 కోటి, 50 లక్షలు; పాల్గొంటే 5 లక్షలు) ఒలింపిక్ క్రీడాంశంలో వరల్డ్ చాంపియన్‌షిప్ (రూ. 50, 30, 20 లక్షలు) ఆసియా క్రీడలు (రూ. 30, 20, 10 లక్షలు) కామన్వెల్త్ క్రీడలు (రూ. 25, 15, 10 లక్షలు) జాతీయ క్రీడలు (రూ. 5, 3, 2 లక్షలు) ‘శాఫ్’ క్రీడలు (రూ. 3, 2, 1 లక్షలు) పారాలింపిక్స్ (రూ. 5, 3, 2 లక్షలు) స్పెషల్ ఒలింపిక్స్ (రూ. 3, 2, 1 లక్షలు) చెస్‌లో ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ (ఐజీఎం) అయితే రూ. 3 లక్షలు; ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం), ఇంటర్నేషనల్ ఉమెన్ మాస్టర్ (ఐడబ్ల్యూఎం) అయితే రూ. 1 లక్ష.