కుటుంబంతో హాలిడే ట్రిప్ ముగించుకొని తిరిగి హైదరాబాద్‌లోకి ఎంటర్ అయ్యారు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. షూటింగ్‌లకు స్పల్ప విరామం చెప్పిన బన్నీ తన భార్య స్నేహా, ఇద్దరు పిల్లలతో కలిసి ఇటీవల దుబాయ్ వెకేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ తరుచుగా సోషల్ మీడియాలో పోస్టు చూస్తూ అభిమానులకు టచ్‌లో ఉన్నారు. కొన్ని రోజులపాటు దుబాయ్‌లో ఎంజాయ్ చేసిన ఈ హీరో బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. సిటీలో తన లగ్జరీ కారును (రేంజోవర్) డ్రైవింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఇందులో బన్నీ బ్లాక్ డ్రెస్‌లో దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.
ఇక ఈ ట్రిప్ అనంతరం అల్లు అర్జున్ తిరగి పుష్ప షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా మూవీగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్గా కనిపించబోతున్నాడు. ఇటీవల రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ ముగించుకుంది. తదుపరి షెడ్యూల్ కేరళలో జరగనుంది. ప్రస్తుతం రష్మికపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం సెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న పుష్ప ఆగస్ట్ 13న విడుదల కానుంది.
చదవండి:
'బన్నీ తన ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తాడు'
వకీల్ సాబ్: ‘సత్యమేవ జయతే’ పాట విన్నారా..
Comments
Please login to add a commentAdd a comment