ఆ ఘటన బాధించింది.. 'పుష్ప' మేకర్స్‌ కీలక ప్రకటన | Mythri Movie Makers, Producers React On Sandhya Theatre Incident | Sakshi
Sakshi News home page

ఆ ఘటన బాధించింది.. 'పుష్ప' మేకర్స్‌ కీలక ప్రకటన

Published Thu, Dec 5 2024 4:22 PM | Last Updated on Thu, Dec 5 2024 4:50 PM

Mythri Movie Makers, Producers React On Sandhya Theatre Incident

అల్లు అర్జున్‌ 'పుష్ప ది రూల్‌'  ప్రీమియర్‌ షోలు డిసెంబర్‌ 4న రాత్రి 9:30గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే, హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద రాత్రి తొక్కిసలాట జరగడంతో  రేవతి (35) మరణించింది. ఈ ఘటనపై తాజాగా పుష్ప చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ యాజమాన్యం స్పందించింది. ఈ సంఘటనపై  సంధ్య థియేటర్‌ వద్ద డీవైఎఫ్, ఎస్ఎఫ్ఐ వారు ఆందళోనకు దిగారు.

ప్రముఖ హీరోలు నటించిన ఏ సినిమా అయినా సరే.. విడుదల రోజు సంధ్య థియేటర్‌ వద్ద సందడిగా వాతావరణం కనిపిస్తుంది. అభిమానులు అక్కడకు భారీగా చేరిపోతుంటారు కూడా.. ఈ క్రమంలోనే పుష్ప ప్రీమియర్‌ షో చూసేందుకు బుధవారం రాత్రి పెద్ద ఎత్తున అల్లు అర్జున్‌ అభిమానులు అక్కడకు చేరుకున్నారు. బన్నీ కూడా సంధ్య థియేటర్‌ వద్దకు రావడంతో ఒక్కసారి అభిమానులు పరుగులు తీశారు. ఆ సమయంలో రేవతి తన కుమారుడు  శ్రీతేజ(9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. తన కుమారుడిని కాపాడుకునే క్రమంలో ఆమె ప్రాణాలు వదిలేసింది. అయితే, తేజ చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.

స్పందించిన మైత్రీ మూవీస్‌ నిర్మాతలు
ఈ ఘటన మమ్మల్ని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ కుటుంబానికి అన్ని విధాలా మేము అండగా ఉంటాము.  గత రాత్రి సినిమా స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద సంఘటనతో మేము చాలా బాధపడ్డాము. మా  ప్రార్థనలతో పాటు ఆ కుటుంబ ఆరాధనలు కూడా తోడై చికిత్స పొందుతున్న చిన్నారిని కాపాడుతాయని కోరుకుంటున్నాం.  ఈ క్లిష్ట సమయంలో వారికి మేము తప్పకుండా అండగా నిలుస్తాం. వారికి సాధ్యమైన అన్ని విధాలుగా సహాయాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ ఘటనపై మేము అందరమూ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం.' అని సోషల్‌మీడియాలో పంచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement