Sandya
-
ఆ ఘటన బాధించింది.. 'పుష్ప' మేకర్స్ కీలక ప్రకటన
అల్లు అర్జున్ 'పుష్ప ది రూల్' ప్రీమియర్ షోలు డిసెంబర్ 4న రాత్రి 9:30గంటలకు ప్రారంభమయ్యాయి. అయితే, హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద రాత్రి తొక్కిసలాట జరగడంతో రేవతి (35) మరణించింది. ఈ ఘటనపై తాజాగా పుష్ప చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ యాజమాన్యం స్పందించింది. ఈ సంఘటనపై సంధ్య థియేటర్ వద్ద డీవైఎఫ్, ఎస్ఎఫ్ఐ వారు ఆందళోనకు దిగారు.ప్రముఖ హీరోలు నటించిన ఏ సినిమా అయినా సరే.. విడుదల రోజు సంధ్య థియేటర్ వద్ద సందడిగా వాతావరణం కనిపిస్తుంది. అభిమానులు అక్కడకు భారీగా చేరిపోతుంటారు కూడా.. ఈ క్రమంలోనే పుష్ప ప్రీమియర్ షో చూసేందుకు బుధవారం రాత్రి పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు అక్కడకు చేరుకున్నారు. బన్నీ కూడా సంధ్య థియేటర్ వద్దకు రావడంతో ఒక్కసారి అభిమానులు పరుగులు తీశారు. ఆ సమయంలో రేవతి తన కుమారుడు శ్రీతేజ(9) కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. తన కుమారుడిని కాపాడుకునే క్రమంలో ఆమె ప్రాణాలు వదిలేసింది. అయితే, తేజ చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.స్పందించిన మైత్రీ మూవీస్ నిర్మాతలుఈ ఘటన మమ్మల్ని తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ కుటుంబానికి అన్ని విధాలా మేము అండగా ఉంటాము. గత రాత్రి సినిమా స్క్రీనింగ్ సమయంలో జరిగిన విషాద సంఘటనతో మేము చాలా బాధపడ్డాము. మా ప్రార్థనలతో పాటు ఆ కుటుంబ ఆరాధనలు కూడా తోడై చికిత్స పొందుతున్న చిన్నారిని కాపాడుతాయని కోరుకుంటున్నాం. ఈ క్లిష్ట సమయంలో వారికి మేము తప్పకుండా అండగా నిలుస్తాం. వారికి సాధ్యమైన అన్ని విధాలుగా సహాయాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ ఘటనపై మేము అందరమూ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం.' అని సోషల్‌మీడియాలో పంచుకున్నారు. -
ఆశ్వత్థామ ఇంటి వద్ద నిరసనకు దిగిన న్యూడెమోక్రసీ నేతలు
-
అవి హిందుత్వ కుట్రలే
హైదరాబాద్: నాలుగు దశాబ్దాలుగా సామాజిక సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఎందరో మహిళలకు అండగా ఉంటున్న ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ వి.సంధ్యపై సోషల్ మీడియాలో దాడులు హిందుత్వ కుట్రేనని విరసం నేత వరవరరావు విమర్శించారు. సంధ్యపై సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపులను నిరసిస్తూ గురువారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీడీఎస్‌యూ, ఐఎఫ్టీయూ, పీవోడబ్ల్యూ, ఏఐకేఎంఎస్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వరవరరావు మాట్లాడుతూ దాడుల వెనకాల మోదీ ప్రభుత్వం నిలబడిందని ఆరోపించారు. సంధ్యపై సోషల్ మీడియాలో వస్తున్న బెదిరింపులు, అశ్లీల మాటలను పోలీసులు సైబర్ నేరం కింద పరిగణించకపోవటాన్ని బట్టి ఈ వ్యవస్థ ఎవరి అధీనంలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కర్ణాటకలో సీనియర్ జర్నలిస్టు గౌరీలంకేశ్‌ను హత్య చేశారని, సంధ్య, సూరెపల్లి సుజాత, దేవి వంటి సామాజిక కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగాప్రజల హక్కులను కాలరాస్తున్నారని, స్వామి అగ్నివేశ్‌పై దాడి చేయటం దుర్మార్గమని ప్రొఫెసర్ రమా మెల్కొటే అన్నారు. రేటింగుల కోసం దేవి, సంధ్యలను చానళ్లు పిలుస్తాయే తప్ప, వారిపై దాడులు జరుగుతుంటే పట్టించుకోవని దేవి విమర్శించారు. సోషల్ మీడియా ద్వారా దాడులు చేస్తున్న దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయపరమైన పోరాటానికి సిద్ధం కావాలని ‘ఆంధ్రజ్యోతి’ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. రాజ్యం తనపై ఎన్నోసార్లు దాడులు చేసిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో మహిళల హక్కుల కోసం పోరాడుతుంటే తన ఉద్యోగాన్ని సైతం తీసేశారని సంధ్య గుర్తుచేశారు. దాడులు, అణచివేతలు కొత్త కాదని, హిందుత్వ కుట్రలను సైతం ఎదుర్కొంటామన్నారు. కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, సామాజికవేత్త ఉ.సాంబశివరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, సామాజిక కార్యకర్త సజయ, పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు జి.లక్ష్మణ్, టఫ్ అధ్యక్షురాలు విమల, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను
సాక్షి, సినిమా: తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై మహిళా సంఘ నేత సంధ్య ఓ చానల్లో మాట్లాడుతూ జీవితా రాజశేఖర్‌పై ఆరోపణలు చేశారు. దీనిపై జీవిత స్పందిస్తూ.. సంధ్య చేసిన ఆరోపణలు అవాస్తవం అని అన్నారు. సంధ్య మహిళల హక్కులను సంరక్షించే మీరు ఇలాంటివి ఎలా మాట్లాడతారని జీవిత ప్రశ్నించారు. తన గురించి, తన కుటుంబం గురించి ఏమీ ఆధారాలు లేకుండా ఎలా లైవ్ లో మాట్లాడతారని అడిగారు. ‘సంధ్య మీకు భర్త ఉన్నాడో లేదో నాకు తెలియదు.. డివోర్స్ అనుకుంటాను. మీకు అత్త, మామలు కూడా ఉన్నారో లేదో నాకు తెలియదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను. ఈ విషయాన్ని నేను అప్పుడే వదలన’ని హెచ్చరించారు. సంధ్యపై కేసు పెడతా.. ‘సంధ్య నాపై ఓ ఛానెల్లో అవాస్తవాలు మాట్లాడింది. అందుకే నన్ను అభిమానించే వాళ్లందరికి తెలియాలనే మీడియా ముందుకొచ్చాను. ఎలాంటి ఆధారాలు లేకుండా సంధ్య నా గురించి ఎలా మాట్లాడుతుంది. సెలబ్రెటి కుటుంబాల గురించి సంధ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నాపై, నాకుటుంబంపై అసత్య ప్రచారం చేసిన చానల్‌పై, సంధ్యలపై కేసు పెడతాను. అంతేకాకుండా పరువు నష్టం దావా వేస్తా. నాపై చేసిన ఆరోపణలకు సమాధానం వచ్చే నేను నిద్రపోను’ శ్రీరెడ్డి విషయంలో ఏం న్యాయం జరిగింది ‘శ్రీరెడ్డి విషయంలో ఏం న్యాయం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు మీ అమ్మాయిని సినిమాల్లో నటింపజేస్తున్నారని నన్ను నిలదీసే పరిస్థితి వచ్చింది. శ్రీరెడ్డికి సినిమాల్లో అవకాశాలు ఎలా ఇస్తారు? సినీ పరిశ్రమలో తప్పులు జరగడం లేదని నేను అనడం లేదు. అన్ని రంగాల్లో మహిళలపై వివక్ష జరుగుతూనే ఉంది. పరిశ్రమలో వివాదాలు తలెత్తినప్పుడు చర్యలు తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒక్క సారి మోసపోతారు, పదేళ్లు మోసపోతుంటే ఏం చేస్తున్నారు. పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిలంతా ఇలానే ఉంటారనేది తప్పు’ మాకెఎప్పుడు అలాంటివి ఎదురవ్వలేదు ‘కాస్టింగ్ కౌచ్ వలనే మేము హీరోయిన్లు అయ్యాము అంటే తప్పు. మేము 30 ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉన్నాము. మాకు ఎప్పుడు కాస్టింగ్ కౌచ్ ఎదురు కాలేదు. శ్రీరెడ్డి ఫేస్ బుక్ చూసి ఆమెను ఎవరైనా మోసం చేశారు అంటే నమ్ముతారా? అమ్మాయిల కోసమే ఫిల్మ్ ఆఫీసులు తీసిన వాళ్ళు ఉన్నారు. వేషాలు ఇస్తామని మోసం చేస్తుంటే మీరెందుకు ఊరుకున్నారు. పరిశ్రమకు గౌరవం ఇస్తాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఎంతో మంది ఇంట్లో నుంచి పారిపోయి పరిశ్రమలోకి వచ్చిన వారిని ఇళ్లకు పంపించా. పరిశ్రమలోని ప్రతి మహిళలకు నేను అభ్యర్థిస్తున్నా వచ్చి మాట్లాడండి. వారు ఎందుకు కలిసి రావడం లేదు ‘నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై ఈరోజు సాయంత్రం కేసు పెట్టాను. నేను ఊరికే టీవీల ముందు కూర్చొని లైవ్ లకు వెళ్లకుండా కేసు ఫైల్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నా. సంధ్య ఎన్ని ఆధారాలతో వస్తుందో రానివండి, నేను ఏమి తగ్గేది లేదు. సినిమా పరిశ్రమలోని పెద్దలు ఎందుకు కలసి రావడం లేదు. నా వెనుక ఎవరు అక్కరలేదు, నేను ఒక్కదాన్నే చాలు. దాసరి నారాయణరావు లేని లోటు తెలుస్తుంది. ఎల్లుండి లాయర్ తోనే ప్రెస్ మీట్ పెడతాము’ -
అర్చక బాలిక
కొవ్వూరు : ఆలయంలో భక్తులకు శఠగోపంతో పెట్టి తీర్థప్రసాదాలను సాధారణంగా అర్చకులు అందిస్తుంటారు. కానీ, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో మాత్రం పన్నెండేళ్ల బాలిక అర్చకురాలిగా ఆధ్యాత్మిక సేవలో తరించిపోయింది. కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో విశాలక్ష్మి సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో సంధ్య అనే బాలిక అర్చక విధులను నిర్వర్తించి ఆశ్చర్యపరిచింది. -
సీఎంగారూ... సమయమివ్వండి: జూడాలు
హైదరాబాద్: వైద్యాన్ని ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, అందుకే జూనియర్ డాక్టర్లపై గ్రామీణ సర్వీసు వంటి అసంబద్ధ వాదనలు తీసుకొస్తున్నారని ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య అన్నారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో జరుగుతున్న జూడాల రిలే నిరాహార దీక్షలకు శనివారం సంధ్య, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పి. నర్సయ్యలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకుల మొండివైఖరి కారణంగా ప్రజలు ప్రభుత్వ వైద్యానికి దూరం కావాల్సిన దుస్థితి నెలకొంటోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జూడాల పట్ల సానుకూలంగా వ్యవహరించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమ్మెలో భాగంగా శనివారం జూడాలు దీక్షా శిబిరంలో పుస్తకాలు చదువుతూ నిరసన తెలిపారు. చర్చల కోసం తవుకు 15 నిమిషాల సవుయుం ఇవ్వాలని సీఎంను కోరారు. కార్యక్రమంలో తెలంగాణ జూడాల అసోసియేషన్ కన్వీనర్ శ్రీనివాస్, అధ్యక్షుడు క్రాంతి తదితరులు పాల్గొన్నారు. జూడాలకు మద్దతుగా వారి తల్లిదండ్రులూ ఆందోళన బాట పట్టనున్నారు. ఈ మేరకు శనివారం ‘జూడా పేరెంట్స్, సిటిజెన్స్ ఫోరం’ ఏర్పాటయింది. జూనియర్ డాక్టర్లను శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకోవాలని ఫోరం విజ్ఞప్తి చేసింది. -
నేర్చుకోడానికి, మార్చుకోడానికీ బిడియం ఎందుకు?
భోజనం ముగించి డైనింగ్ హాల్ నుంచి తన రూమ్‌కి వచ్చింది మీనా. రూమ్మేట్ సంధ్య కోసం హాస్టల్ మొత్తం వెతికింది. ఎక్కడా సంధ్య లేదు. కిందికి వచ్చి వాచ్మన్ని అడిగింది. ఆమె అసలు కిందికే రాలేదని చెప్పాడతను. తిరిగి పైకి వెళ్లిపోదామనుకుంటూండగా పెద్ద శబ్దం. ఓ గావుకేక. శబ్దం వచ్చిన వైపు చూసింది మీనా. రక్తపు మడుగులో సంధ్య! ఏడడుగుల హాస్టల్ భవనం మీద నుంచి దూకేసింది. పరుగు పరుగున స్నేహితురాలి దగ్గరకు వెళ్లింది మీనా. కానీ అప్పటికే ఆమె ఊపిరి అనంతవాయువుల్లో కలిసిపోయింది. హైదరాబాద్‌లో కొన్నాళ్ల క్రితం జరిగింది ఈ సంఘటన. సంధ్య ఎందుకు ఆత్మహత్య చేసుకుందో మీనా ద్వారా వెల్లడయింది. సంధ్య విజయనగరం జిల్లాలో ఓ చిన్న గ్రామం నుంచి సిటీకి వచ్చింది. తెలివైన పిల్ల. పీజీ చేసింది. కానీ వెనుకబడిన ప్రాంతానికి చెందినది కావడంతో కాస్త నాగరికత తెలియదంతే. చాలామంది అమ్మాయిల్లాగ సిటీకి అలవాటు పడలేకపోయింది. ఇక్కడి వాళ్లతో పోటీ పడలేకపోయింది. అంత యాక్టివ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉండలేక ప్రతి ఇంటర్వ్యూలోనూ ఓడిపోసాగింది. దాంతో తాను ఎందుకూ పనికిరానేమోనన్న న్యూనతను ఏర్పరచుకుంది. చివరికి అదే పెరిగి పెద్దదై ఆమె ప్రాణాలను తీసింది. మన దేశంలో ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్నవారిలో ఎనభై శాతం మంది చదువుకున్నవారే. వారిలో సగానికి పైగా మహిళలే. కొందరు ప్రేమవ్యవహారాల వంటి వాటికి ప్రాణం తీసుకుంటుంటే... ఎక్కువమంది మాత్రం ఒత్తిడిని భరించలేక, న్యూనతను జయించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. నిజానికి న్యూనతను జయించడం అంత కష్టమేమీ కాదు. ఏదైనా విషయంలో మనం విజయం సాధించలేకపోతున్నామంటే... దిగులు పడే బదులు, ఎక్కడ దెబ్బతింటున్నామో చూసుకోవాలి. కారణం తెలిశాక దాని గురించి స్నేహితులు, ఇంట్లోవాళ్లతో చెప్పాలి. అప్పుడు వాళ్లేదైనా మార్గం చెబుతారు. లేదంటే మీరే ఏదైనా పరిష్కారం వెతికే ప్రయత్నం చేయవచ్చు. కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఖర్చు గురించి భయపడక్కర్లేదు. కొన్ని సంస్థల వారు ఉచితంగా కూడా నేర్పుతారు. అలాంటివేమీ అందుబాటులో లేవు, ఖర్చు పెట్టలేరు అనుకుంటే... మీకు లేవు అనుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి దగ్గరకు వెళ్లండి. మొహమాట పడకుండా, నేను నీలా అవాలంటే ఏం చేయాలని అడగండి. నేర్చుకోవడం మీదే మనిషి ఎదుగుదల ఆధారపడి ఉంటుంది కాబట్టి... సంకోచం, సిగ్గు అవసరం లేదు. ఇక మరీ ముఖ్యమైనది... మీ బలాలేమిటో తెలుసుకోవడం. ఒకదాంట్లో సక్సెస్ కాలేనప్పుడు, ఒకటి మీకు చేతకానప్పుడు... మీరేం చేయగలరో దానిమీద ఎందుకు శ్రద్ధ పెట్టకూడదు? ఆ వైపుగా ఎందుకు అడుగులు వేయకూడదు? అవ్వదు అనుకున్నదానికోసం అవస్థ పడే బదులు, అవుతుంది అనుకున్న దానికోసం ఎందుకు సమయాన్ని వెచ్చించకూడదు? అందుకే మీ బలహీనతలను తెలుసుకోవడంతో పాటు మీ బలాలను గుర్తించడం కూడా ఎంతో అవసరం. అలా చేయకుండా... మీరు దేనికీ పనికి రారని, మీరేమీ సాధించలేరని కుమిలిపోవడం కరెక్ట్ కాదు. ఈ లోకంలో ఏ మనిషీ పర్ఫెక్ట్ కాదు. ప్రతివారిలోనూ కొన్ని బలాలుంటాయి. కొన్ని బలహీనతలుంటాయి. బలాలను ఉపయోగించుకుంటూ, బలహీనతలను అధిగమించుకుంటూ పోవడం నేర్చుకోవాలి. జీవితాన్ని మనకు నచ్చినట్టు, మనకు వచ్చినట్టు జీవించాలి. అప్పుడు మీలైఫ్ మీకు అందంగా కనిపిస్తుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. న్యూనత మీ నుంచి దూరంగా పారిపోతుంది!