సాక్షి, సినిమా: తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై మహిళా సంఘ నేత సంధ్య ఓ చానల్‌లో మాట్లాడుతూ జీవితా రాజశేఖర్‌పై ఆరోపణలు చేశారు. దీనిపై జీవిత స్పందిస్తూ.. సంధ్య చేసిన ఆరోపణలు అవాస్తవం అని అన్నారు. సంధ్య మహిళల హక్కులను సంరక్షించే మీరు ఇలాంటివి ఎలా మాట్లాడతారని జీవిత ప్రశ్నించారు. తన గురించి, తన కుటుంబం గురించి ఏమీ ఆధారాలు లేకుండా ఎలా లైవ్ లో మాట్లాడతారని అడిగారు. ‘సంధ్య మీకు భర్త ఉన్నాడో లేదో నాకు తెలియదు.. డివోర్స్ అనుకుంటాను. మీకు అత్త, మామలు కూడా ఉన్నారో లేదో నాకు తెలియదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను. ఈ విషయాన్ని నేను అప్పుడే వదలన’ని హెచ్చరించారు.
సంధ్యపై కేసు పెడతా..
‘సంధ్య నాపై ఓ ఛానెల్‌లో అవాస్తవాలు మాట్లాడింది. అందుకే నన్ను అభిమానించే వాళ్లందరికి తెలియాలనే మీడియా ముందుకొచ్చాను. ఎలాంటి ఆధారాలు లేకుండా సంధ్య నా గురించి ఎలా మాట్లాడుతుంది. సెలబ్రెటి కుటుంబాల గురించి సంధ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నాపై, నాకుటుంబంపై అసత్య ప్రచారం చేసిన చానల్‌పై, సంధ్యలపై కేసు పెడతాను. అంతేకాకుండా పరువు నష్టం దావా వేస్తా. నాపై చేసిన ఆరోపణలకు సమాధానం వచ్చే నేను నిద్రపోను’
శ్రీరెడ్డి విషయంలో ఏం న్యాయం జరిగింది
‘శ్రీరెడ్డి విషయంలో ఏం న్యాయం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు మీ అమ్మాయిని సినిమాల్లో నటింపజేస్తున్నారని నన్ను నిలదీసే పరిస్థితి వచ్చింది. శ్రీరెడ్డికి సినిమాల్లో అవకాశాలు ఎలా ఇస్తారు? సినీ పరిశ్రమలో తప్పులు జరగడం లేదని నేను అనడం లేదు. అన్ని రంగాల్లో మహిళలపై వివక్ష జరుగుతూనే ఉంది. పరిశ్రమలో వివాదాలు తలెత్తినప్పుడు చర్యలు తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒక్క సారి మోసపోతారు, పదేళ్లు మోసపోతుంటే ఏం చేస్తున్నారు. పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిలంతా ఇలానే ఉంటారనేది తప్పు’
మాకెఎప్పుడు అలాంటివి ఎదురవ్వలేదు
‘కాస్టింగ్ కౌచ్ వలనే మేము హీరోయిన్‌లు అయ్యాము అంటే తప్పు. మేము 30 ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉన్నాము. మాకు ఎప్పుడు కాస్టింగ్ కౌచ్ ఎదురు కాలేదు. శ్రీరెడ్డి ఫేస్ బుక్ చూసి ఆమెను ఎవరైనా మోసం చేశారు అంటే నమ్ముతారా? అమ్మాయిల కోసమే ఫిల్మ్ ఆఫీసులు తీసిన వాళ్ళు ఉన్నారు. వేషాలు ఇస్తామని మోసం చేస్తుంటే మీరెందుకు ఊరుకున్నారు. పరిశ్రమకు గౌరవం ఇస్తాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఎంతో మంది ఇంట్లో నుంచి పారిపోయి పరిశ్రమలోకి వచ్చిన వారిని ఇళ్లకు పంపించా. పరిశ్రమలోని ప్రతి మహిళలకు నేను అభ్యర్థిస్తున్నా వచ్చి మాట్లాడండి.
వారు ఎందుకు కలిసి రావడం లేదు
‘నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై ఈరోజు సాయంత్రం కేసు పెట్టాను. నేను ఊరికే టీవీల ముందు కూర్చొని లైవ్ లకు వెళ్లకుండా కేసు ఫైల్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నా. సంధ్య ఎన్ని ఆధారాలతో వస్తుందో రానివండి, నేను ఏమి తగ్గేది లేదు. సినిమా పరిశ్రమలోని పెద్దలు ఎందుకు కలసి రావడం లేదు. నా వెనుక ఎవరు అక్కరలేదు, నేను ఒక్కదాన్నే చాలు. దాసరి నారాయణరావు లేని లోటు తెలుస్తుంది. ఎల్లుండి లాయర్ తోనే ప్రెస్ మీట్ పెడతాము’
జీవితా రాజశేఖర్ హెచ్చరిక
Published Tue, Apr 17 2018 6:25 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment