jivitharajashekar
-
‘స్టార్స్’ @ రాజ్‌భవన్
-
పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను
సాక్షి, సినిమా: తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై మహిళా సంఘ నేత సంధ్య ఓ చానల్లో మాట్లాడుతూ జీవితా రాజశేఖర్‌పై ఆరోపణలు చేశారు. దీనిపై జీవిత స్పందిస్తూ.. సంధ్య చేసిన ఆరోపణలు అవాస్తవం అని అన్నారు. సంధ్య మహిళల హక్కులను సంరక్షించే మీరు ఇలాంటివి ఎలా మాట్లాడతారని జీవిత ప్రశ్నించారు. తన గురించి, తన కుటుంబం గురించి ఏమీ ఆధారాలు లేకుండా ఎలా లైవ్ లో మాట్లాడతారని అడిగారు. ‘సంధ్య మీకు భర్త ఉన్నాడో లేదో నాకు తెలియదు.. డివోర్స్ అనుకుంటాను. మీకు అత్త, మామలు కూడా ఉన్నారో లేదో నాకు తెలియదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను. ఈ విషయాన్ని నేను అప్పుడే వదలన’ని హెచ్చరించారు. సంధ్యపై కేసు పెడతా.. ‘సంధ్య నాపై ఓ ఛానెల్లో అవాస్తవాలు మాట్లాడింది. అందుకే నన్ను అభిమానించే వాళ్లందరికి తెలియాలనే మీడియా ముందుకొచ్చాను. ఎలాంటి ఆధారాలు లేకుండా సంధ్య నా గురించి ఎలా మాట్లాడుతుంది. సెలబ్రెటి కుటుంబాల గురించి సంధ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నాపై, నాకుటుంబంపై అసత్య ప్రచారం చేసిన చానల్‌పై, సంధ్యలపై కేసు పెడతాను. అంతేకాకుండా పరువు నష్టం దావా వేస్తా. నాపై చేసిన ఆరోపణలకు సమాధానం వచ్చే నేను నిద్రపోను’ శ్రీరెడ్డి విషయంలో ఏం న్యాయం జరిగింది ‘శ్రీరెడ్డి విషయంలో ఏం న్యాయం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు మీ అమ్మాయిని సినిమాల్లో నటింపజేస్తున్నారని నన్ను నిలదీసే పరిస్థితి వచ్చింది. శ్రీరెడ్డికి సినిమాల్లో అవకాశాలు ఎలా ఇస్తారు? సినీ పరిశ్రమలో తప్పులు జరగడం లేదని నేను అనడం లేదు. అన్ని రంగాల్లో మహిళలపై వివక్ష జరుగుతూనే ఉంది. పరిశ్రమలో వివాదాలు తలెత్తినప్పుడు చర్యలు తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఒక్క సారి మోసపోతారు, పదేళ్లు మోసపోతుంటే ఏం చేస్తున్నారు. పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిలంతా ఇలానే ఉంటారనేది తప్పు’ మాకెఎప్పుడు అలాంటివి ఎదురవ్వలేదు ‘కాస్టింగ్ కౌచ్ వలనే మేము హీరోయిన్లు అయ్యాము అంటే తప్పు. మేము 30 ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉన్నాము. మాకు ఎప్పుడు కాస్టింగ్ కౌచ్ ఎదురు కాలేదు. శ్రీరెడ్డి ఫేస్ బుక్ చూసి ఆమెను ఎవరైనా మోసం చేశారు అంటే నమ్ముతారా? అమ్మాయిల కోసమే ఫిల్మ్ ఆఫీసులు తీసిన వాళ్ళు ఉన్నారు. వేషాలు ఇస్తామని మోసం చేస్తుంటే మీరెందుకు ఊరుకున్నారు. పరిశ్రమకు గౌరవం ఇస్తాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఎంతో మంది ఇంట్లో నుంచి పారిపోయి పరిశ్రమలోకి వచ్చిన వారిని ఇళ్లకు పంపించా. పరిశ్రమలోని ప్రతి మహిళలకు నేను అభ్యర్థిస్తున్నా వచ్చి మాట్లాడండి. వారు ఎందుకు కలిసి రావడం లేదు ‘నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై ఈరోజు సాయంత్రం కేసు పెట్టాను. నేను ఊరికే టీవీల ముందు కూర్చొని లైవ్ లకు వెళ్లకుండా కేసు ఫైల్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నా. సంధ్య ఎన్ని ఆధారాలతో వస్తుందో రానివండి, నేను ఏమి తగ్గేది లేదు. సినిమా పరిశ్రమలోని పెద్దలు ఎందుకు కలసి రావడం లేదు. నా వెనుక ఎవరు అక్కరలేదు, నేను ఒక్కదాన్నే చాలు. దాసరి నారాయణరావు లేని లోటు తెలుస్తుంది. ఎల్లుండి లాయర్ తోనే ప్రెస్ మీట్ పెడతాము’ -
రెండు రాష్ట్రాల ప్రేమ మొదలు
హిందీ హిట్ మూవీ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్ మొదలైంది.‘2 స్టేట్స్’ పేరుతోనే రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా జీవితారాజశేఖర్‌ల తనయ శివానీ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. వెంకట్‌రెడ్డి కుంచం దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు కృష్ణంరాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘అడివి శేష్ మంచి నటుడు. శివానీని హీరోయిన్గా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. అనూప్ ఇప్పటికే మూడు బ్యూటిఫుల్ ట్యూన్స్ అందించారు’’ అన్నారు వెంకట్ కుంచం. ‘‘తెలుగులో బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత ఎం.ఎల్.వి. సత్యనారాయణ (సత్తిబాబు). ‘‘నేను నటించడానికి అంగీకరించిన నా తల్లిదండ్రులకు థ్యాంక్స్’’ అన్నారు శివానీ రాజశేఖర్. ‘‘ఎప్పటి నుంచో మంచి లవ్‌స్టోరీలో నటించాలనుకుంటుంటే ఈ సినిమాతో కుదిరింది’’ అన్నారు అడివి శేష్. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూఛిబొట్ల, సమర్పణ: విశ్వప్రసాద్. -
సూపర్ న్యాచురల్ సుబ్రహ్మణ్యపురం
సుమంత్, ఈషా రెబ్బ జంటగా నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. తారస్ సినీకార్ప్ పతాకంపై ధీరజ్ బొగ్గారం, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాగచైతన్య క్లాప్‌నివ్వగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు చందు మొండేటి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్రం లోగోను ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, రాజశేఖర్, జీవితా సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు సంతోష్ స్టోరీ న్యారేషన్లోనే సినిమాను చూపించారు. సూపర్ న్యాచురల్ అంశాలున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇది. ఇలాంటి జోనర్ అంటే నాకు భయం కానీ కథ నచ్చి చేస్తున్నాను. నిర్మాతలు గుర్తు చేసేవరకు ఇది నా 25వ సినిమా అని నాకు తెలియదు. అందుకే సందడిగా ప్రారంభించారు’’ అన్నారు. ‘‘కథ వింటున్నప్పుడు తర్వాత ఏంటి? అనే ఉత్కంఠతో ఎదురు చూశాను. ఆడియన్స్ కూడా అలానే ఫీల్ అవుతారని అనుకుంటున్నాను’’ అన్నారు ఈషా. ‘‘నా షార్ట్ ఫిల్మ్స్ చూసి నిర్మాతలు నాకీ అవకాశం ఇచ్చారు. సింపుల్‌గా అవుట్‌లైన్ చెబుదాం అని వెళ్తే క్లియర్‌గా స్టోరీ అంతా చెప్పమన్నారు సుమంత్‌గారు. కథ అంతా విన్న తర్వాత అంగీకరించారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అన్నారు దర్శకుడు. ‘‘సుమంత్‌గారి 25వ సినిమా నిర్మించడం ఆనందంగా ఉంది. సుధాకర్ రెడ్డిగారు మంచి సహకారం అందిస్తున్నారు’’ అన్నారు ధీరజ్ రెడ్డి. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె. ప్రతాప్, సంగీతం: శేఖర్ చంద్ర. -
జీవితరాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శిపై కేసు
చిలకలగూడ : ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో నటి జీవితరాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శిపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. చిలకలగూడ సవరాలబస్తీకి చెందిన ఆటోడ్రైవర్ పీ కొండ (33)కు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన జ్యోతితో 2005లో వివాహమైంది. అయితే కుటుంబ గొడవల కారణంగా విడిపోయారు. 2010 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని జ్యోతి తెలుగు ఛానెల్లో ప్రసారం అవుతున్న బతుకుజట్కాబండి నిర్వాహకులను ఆశ్రయించింది. ఈనెల 17న జీవితరాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శిగా చెప్పుకున్న కిరణ్ అనే వ్యక్తి కొండకు ఫోన్ చేసి మీభార్య నీ మీద ఫిర్యాదు చేసింది, తక్షణమే స్టూడియోకు రావాలన్నాడు. విడిపోతున్నట్లు మరోమారు స్టూడియోలోనే ఒప్పందం కుదుర్చుకోవాలన్నాడు. అతను రానని చెప్పడంతో బెదిరించారు. దీంతో తనను బతుకుజట్కాబండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జీవితరాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శి తనను బెదిరిస్తున్నాని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కిరణ్‌తో పాటు మరో మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ పోలీసులు తెలిపారు.