జీవితరాజశేఖర్‌ వ్యక్తిగత కార్యదర్శిపై కేసు | Case on Jivitarajasekhar personal secretary | Sakshi
Sakshi News home page

జీవితరాజశేఖర్‌ వ్యక్తిగత కార్యదర్శిపై కేసు

Published Tue, Sep 27 2016 12:04 AM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

Case on Jivitarajasekhar personal secretary

చిలకలగూడ : ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో నటి జీవితరాజశేఖర్‌ వ్యక్తిగత కార్యదర్శిపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.  పోలీసులు తెలిపిన  మేరకు.. చిలకలగూడ సవరాలబస్తీకి చెందిన  ఆటోడ్రైవర్‌ పీ కొండ (33)కు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన జ్యోతితో 2005లో వివాహమైంది. అయితే కుటుంబ గొడవల కారణంగా విడిపోయారు. 2010 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని జ్యోతి తెలుగు ఛానెల్‌లో ప్రసారం అవుతున్న బతుకుజట్కాబండి నిర్వాహకులను ఆశ్రయించింది.

ఈనెల 17న జీవితరాజశేఖర్‌ వ్యక్తిగత కార్యదర్శిగా చెప్పుకున్న కిరణ్‌ అనే వ్యక్తి కొండకు ఫోన్ చేసి మీభార్య నీ మీద ఫిర్యాదు చేసింది, తక్షణమే  స్టూడియోకు రావాలన్నాడు. విడిపోతున్నట్లు మరోమారు స్టూడియోలోనే  ఒప్పందం కుదుర్చుకోవాలన్నాడు. అతను రానని చెప్పడంతో బెదిరించారు.

దీంతో తనను బతుకుజట్కాబండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జీవితరాజశేఖర్‌ వ్యక్తిగత కార్యదర్శి తనను  బెదిరిస్తున్నాని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కిరణ్‌తో పాటు మరో మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement