ప్రాణం తీసిన సిక్స్‌ప్యాక్‌ మోజు | Teenager used steroids to bulk up but within weeks he was dead | Sakshi

ప్రాణం తీసిన సిక్స్‌ప్యాక్‌ మోజు

Mar 8 2017 10:11 AM | Updated on Nov 6 2018 4:55 PM

ప్రాణం తీసిన సిక్స్‌ప్యాక్‌ మోజు - Sakshi

ప్రాణం తీసిన సిక్స్‌ప్యాక్‌ మోజు

సిక్స్‌ప్యాక్‌ మోజుతో ఓ యువకుడు మృతి చెందాడు.

బెంగళూరు(బనశంకరి) :
సిక్స్‌ప్యాక్‌ మోజుతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన కర్ణాటకలో బనశంకరిలోని కుమారస్వామిలేఔట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు..కుమారస్వామిలేఔట్‌కు చెందిన కిరణ్‌ (30) అబ్కారీ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సిక్స్‌ప్యాక్‌ బాడీ కోసం ఓ జిమ్‌లో చేరాడు.

అతి తక్కువ సమయంలో సిక్స్‌ప్యాక్‌ పొందడానికి స్టెరాయిడ్స్‌ తీసుకున్నాడు. దీంతో బ్రెయిన్‌డెడ్‌ కావడంతో కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం మల్లిగే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement