
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కండరాల బలం కోసం స్టెరాయిడ్స్ అమ్ముతున్న ఫిట్ నెస్ ట్రైనర్ జుబేర్ సహా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న జుబైర్.. విదేశాల నుండి స్టెరాయిడ్స్ కొనుగోలు చేసి ఇక్కడ యువతకు విక్రయిస్తున్నారు. బంజారాహిల్స్ లోని ఏ 1 సప్లమెంట్ స్టోర్స్ పేరుతో స్టెరాయిడ్స్ విక్రయాలు జరుపుతున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి మొత్తం రూ. 14 లక్షలు విలువ చేసే స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment