gang arrest
-
కాలంచెల్లిన చాక్లెట్లు,బిస్కెట్లకు కొత్త లేబుల్స్ వేసి విక్రయం.. ముఠా గుట్టు రట్టు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బొడిప్పల్‌లో అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా కాలంచెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లను రీసైకిల్ చేస్తోంది. ప్రముఖ బ్రాండ్ల నుంచి ఎక్స్పైర్ అయిన వస్తువులు, ఆహార పదార్థాలను సేకరించి వాటికే కొత్త లేబుల్స్ వేసి తిరిగి మార్కెట్లో విక్రయిస్తోంది. సబ్బులు, షాంపులు, తిను బండారాలు వంటి వంటి మొత్తం 300 రకాల వస్తువులను ఈ ముఠా రీసైకిల్ చేసి భారీ మోసానికి పాల్పడటటేగాక.. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతోంది. హైదరాబాద్ శివార్లలోని గోదాములు, కోఠిలోని హరిహంత్ కార్పోరేషన్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేయగా ఈ రీసైక్లింగ్ ముఠా బాగోతం బట్టబయలైంది. ఈ సోదాల్లో రూ.కోట్లు విలువ చేసే ఆహారపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. -
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం
-
దారి దోపిడీ ముఠా అరెస్ట్
పెనుకొండ: చిల్లర ఖర్చులకు దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను గురువారం అరెస్ట్ చేసినట్లు పెనుకొండ డీఎస్పీ రమ్య తెలిపారు. గురువారం పెనుకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను ఆమె వెల్లడించారు. రొద్దం మండలానికి చెందిన కురుబ శబరీష్ ప్రస్తుతం పరిగిలో ఉంటున్నాడు. హిందూపురం రూరల్ కొట్నూరుకు చెందిన భరత సింహారెడ్డి, మరో మైనర్ బాలునితో కలసి రాత్రి వేళ, తెల్లవారుజాము సమయాల్లో 44వ జాతీయ రహదారిపై నిలిపి ఉన్న వాహనాల డ్రైవర్లను కత్తితో బెదిరించి, సెల్ఫోన్లు, నగదు అపహరించుకెళ్లేవారు. ఈ ఏడాది జూలై 8న అనంతపురం జిల్లా రాప్తాడు, కియా, సోమందేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో వరుస దోపిడీలు సాగించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు సీఐ కరుణాకర్, కియా ఎస్ఐ వెంకటరమణ, సోమందేపల్లి ఎస్ఐ విజయకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కురుబ శబరీష్, భరతసింహారెడ్డి, మరో మైనర్ బాలుడు చోరీలకు పాల్పడినట్లుగా గుర్తించి, గురువారం నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఏడు సెల్ఫోన్లు, పల్సర్‌బైక్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. శబరీష్, భరతసింహారెడ్డిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. బాలుడిని జువైనల్ హోంకు తరలించారు. నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సిబ్బందికి ఉన్నతాధికారులు రివార్డు ప్రకటించారు. సమావేశంలో సీఐ కరుణాకర్, ఎస్ఐలు రమే‹Ùబాబు, వెంకటరమణ, విజయకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: పరిటాల శ్రీరామ్ మా తండ్రిని హత్య చేయించింది మీరు కాదా?) -
నగరంలో చోరీ.. తాండూరులో అమ్మకం
తాండూరు: బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను వికారాబాద్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తాండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. యాలాల మండలం, కమాల్‌పూర్ గ్రామానికి చెందిన బోయిని శ్రీకాంత్, మ్యాతరి భాస్కర్, మ్యాతరి శివ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారు. జల్సాలకు అలవాటుపడిన వీరు ముఠాగా ఏర్పడి వాహనాల చోరీకి పాల్పడుతున్నారు. నాలుగు నెలలుగా వాహనాలు అపహరిస్తూ.. మధ్యవర్తుల సాయంతో తక్కువ ధరకు తాండూరులో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 20 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు దొంగిలించారు. మాదాపూర్ పరిధిలో ఐదు బైకులు, కూకట్‌పల్లిలో రెండు బైకులు, ఒక ఆటో, మియాపూర్‌లో రెండు బైకులు, బంజారాహిల్స్ ప్రాంతంలో మూడు బైకులు, సనత్‌నగర్‌లో రెండు బైకులు, బాచుపల్లి ప్రాంతంలో ఒక ఆటో, చందానగర్‌లో మూడు, యూసుఫ్‌గూడలో ఒక బైక్ చోరీ చేశారు. యాలాల మండలంలోనూ రెండు బైకులను దొంగిలించారు. ఇందులో 9 ద్విచక్రవాహనాలను పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన బోయిని ఆనంద్‌కు విక్రయించారు. మరో నాలుగు ద్విచక్రవాహనాలను యాలాల మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన తుప్పలి మహిపాల్‌కు విక్రయించారు. మిగతా వాటిలో బోయిని శ్రీకాంత్ వద్ద 3 బైకులు ఒక ఆటో, మ్యాతరి భాస్కర్ ఇంటి వద్ద 2 బైకులు, మ్యాతరి శివ ఇంటి వద్ద 2 బైకులు, ఒక ఆటోను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వాహనాలను కొనుగోలు చేసిన ఆనంద్, మహిపాల్‌లపై కేసు నమోదు చేశామన్నారు. దొరికారిలా.. యాలాల పీఎస్ పరిధిలో 2 ద్విచక్రవాహనాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు అందడంతో ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 18న యాలాలలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులను ఆపి పత్రాలు అడిగారు. వీరు పారిపోయేందుకు ప్రయత్నించడంతో అదుపులోకి తీసుకుని, విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ రాంబాబు, యాలాల ఎస్ఐతో పాటు బృందాన్ని అభినందించారు. సమావేశంలో డీఎస్పీ శేఖర్‌గౌడ్, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: అదృశ్యమైన బాలిక సెల్లార్ గుంతలో అదృశ్యమైంది) -
ఆధార్ మార్చి.. ఆస్తులు కాజేయాలని..
సాక్షి, అనంతపురం: ఆధార్ కార్డులో ఫొటో, ఇతర వివరాలు మార్పు చేసి స్థిరాస్తులను కాజేయాలనుకున్న ఓ‘ ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ప్రింటర్, స్కానర్ తదితర 12 రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం అనంతపురం డీఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు వెల్లడించారు. ప్రస్తుతం అరెస్టు అయిన బత్తల శేఖర్ (ఆర్కేనగర్, అనంతపురం), అచ్చుకట్ల ఇంతియాజ్ (అనంతపురం తహసీల్దార్ కార్యాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి, కళ్యాణదుర్గం రోడ్డులో నివాసం), కర్తనపర్తి సురేష్ (ఆధార్ సెంటర్ నిర్వాహకుడు, రామకృష్ణ కాలనీ, అనంతపురం) ముఠాలో సభ్యులు. ఈ ముఠాకు సూత్రధారి నగరంలోని ఆర్కే నగర్‌కు చెందిన అంపగాని శ్రీనివాసులు. ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. విలువైన భూములు, స్థలాలున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడేవాడు. నాల్గవ పట్టణ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తికి సంబంధించిన 14 ఎకరాల స్థిరాస్తి కాజేయాలనుకున్న కేసులో ఈ నెల 12న పోలీసులు రిమాండ్‌కు పంపారు. ఇలా వెలుగులోకి.. ఈ ముఠా సభ్యులు అనంతపురంలోని సైఫుల్లా బ్రిడ్జి సమీపంలోని కామన్ సర్వీస్ పాయింట్లో ఆధార్‌లో మార్పులు చేసి అమాయకుల ఆస్తులు కొల్లగొట్టేందుకు యతి్నంచేవారు. ఇదే క్రమంలో త్రీటౌన్ పీఎస్ పరిధిలో ఉండే వృద్ధుడు వెంకటసుబ్బయ్య ఆస్తులపై కన్నుపడింది. వన్‌టౌన్, తదితర ప్రాంతాల్లో ఇతని పేరు మీద విలువైన స్థలాలు ఉన్నాయి. దీంతో శేఖర్ అనే టీ స్టాల్ నిర్వాహకుడి ద్వారా హకీం అబ్దుల్ మసూద్‌ను పావుగా వాడుకున్నారు. వెంకట సుబ్బయ్య ఆధార్ కార్డులో హకీం అబ్దుల్ మసూద్ ఫొటోను మార్చి, అదే అడ్రెస్సుతో కొత్త ఆధార్ కార్డుకు ఎన్రోల్ చేశారు. ఆధార్‌లో వెంకటసుబ్బయ్య అడ్రెస్సు ఉండడంతో అతని ఇంటికి ఆధార్ వెళ్లింది. అప్రమత్తమైన వెంకటసుబ్బయ్య విషయాన్ని త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కేసు నమోదు చేసి లోతుగా విచారణ చేపట్టగా అసలు బాగోతం వెలుగు చూసింది. ఆదివారం నాల్గవ రోడ్డు ఎక్స్‌టెన్షన్‌లోని శాంతినగర్ బోర్డు వద్ద ముఠాలోని ముగ్గురు నిందితులను సీఐ కత్తి శ్రీనివాసులు, ఎస్ఐ వలిబాషు అరెస్టు చేశారు. అనంతరం కామన్ సరీ్వసు పాయింట్లో ఉన్న 12 రకాల వస్తువులను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా రిమాండ్‌కు ఆదేశించారు. ఆధార్ కార్డులో పేరు మార్పు.. వ్యక్తికి రిమాండ్ ఆధార్ కార్డులో పేరు మార్పు చేసిన కేసులో ఓ వ్యక్తిని వన్‌టౌన్ పోలీసులు రిమాండ్‌కు పంపారు. సీఐ రవిశంకర్ రెడ్డి తెలిపిన మేరకు... బుక్కరాయ సముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎలాంటి పనులు చేయకుండా తిరిగేవాడు. ఈ క్రమంలో తన ఆధార్ కార్డును మార్చి పింఛన్ తీసుకునేందుకు కుట్ర పన్నాడు. ఆధార్‌లో తన పేరు, తండ్రి పేరు, ఇంటి అడ్రస్సుకు బదులుగా నగరంలోని పాతూరుకు చెందిన వెంకటరమణ అనే వృద్ధుడు పేరుతో ఆధార్ సెంటర్లో దాఖలు చేయించాడు. కొత్త ఆధార్ కార్డు సంబంధిత వెంకటరమణ ఇంటికి వెళ్లగా అతను వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చీటింగ్‌కు పాల్పడ్డ తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆదివారం కలెక్టరేట్ సమీపంలో అరెస్టు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు పంపారు. (చదవండి: తాత అంతిమయాత్రను అడ్డుకున్న మనవడు.. ‘లెక్క తేలేవరకు శవాన్ని ఎత్తనిచ్చేది లేదు’) -
మొదటి సారి దొంగతనం, అంతా అనుకున్నట్లే జరిగింది.. కానీ చివరిలో..
సాక్షి,మంచిర్యాలక్రైం: ఎవరికంట పడకుండా, దొంగతనం చేసి డబ్బులు సంపాధించుకుందామనుకున్న ఓ ముగ్గురు, ముఠాగా ఏర్పడి దొంగతనానికి పాల్పడి అడ్డంగా బుక్కయ్యారు. దొంగతనం చేసిన తీరు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడం, పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగిలించిన వాహనాన్ని అమ్మేందుకు వెళ్తూ దొరికిపోయారు. స్థానిక సీఐ నారాయణ్‌నాయక్ ఆయన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పాతమంచిర్యాలకు చెందిన వీర్ల శ్రీనివాస్‌కు చెందిన ఎమ్హెచ్ 40 ఎల్ 3165 నంబర్ గల ట్రాక్టర్ ఈ నెల 3న తెల్లవారుజామున దొంగతనానికి గురైందని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకొని ప్రత్యేక పోలీస్ బృందంతో తనిఖీలు చేశాం. దొంగతనం చేసిన తీరు కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. 3వ తేదీన దొంగతనానికి పాల్పడి ట్రాక్టర్‌ను కాలేజీ రోడ్డులోని ముళ్లపొదల్లో దాచిపెట్టారు. ట్రాక్టర్‌ను తిరిగి బుధవారం అమ్మేందుకు వెళ్తుండగా, ఫ్లై ఓవర్‌బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖి చేస్తుండగా చూసి బయపడి పారిపోయే ప్రయత్నం చేయగా వారిని అనుమానించి పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ట్రాక్టర్‌ను గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేసిన తీరును ఒప్పుకున్నారు. ఈ మేరకు రూ. 3లక్షల విలువ గల ట్రాక్టర్‌ను, వారి వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ముగ్గురు దొంగలను రిమాండ్‌కు తరలించామని సీఐ వెల్లడించారు. మొదటి సారి దొంగతనానికి పాల్పడి అడ్డంగా దొరికిపోయి.. మొదటిసారి దొంగతనానికి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన దొంగల ముఠాలో ములుగు జిల్లా లక్ష్మిదేవిపేటకు చెందిన సెగ్గం రాజతిరుపతి, సెగ్గం లచ్చులు, భూపాలపల్లి జిల్లా దేవరాంపల్లి గ్రామానికి చెందిన బోర్లకుంట ప్రకాష్ ఈజీగా మనీ సంపాదించాల నే దురాలోచనతో మొదటి దొంగతనానికి అలవా టుపడి దొరికిపోయి కటకటాలపాలయ్యారు. 48గంటల్లో కేసు చేధించిన పోలీసులు.. ట్రాక్టర్ దొంగతనానికి గురైన 48గంటల్లో మంచిర్యా ల పోలీసులు చేధించడంతో ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ నారాయణ్‌నాయక్, ఎస్సై హరిశేఖర్, స్పెషల్ పార్టీ పోలీసులు దివాకర్, రాము, మహేష్‌బాబు, శ్రీనివాస్‌లను రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, డీసీపీ అఖిల్‌మహాజన్, ఏసీపీ సాధన రష్మీ పెరుమాళ్ అభినందించారు. చదవండి: రెండేళ్ల ప్రేమ.. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడంతో.. -
రూ.లక్షల్లో బెట్టింగ్.. హార్స్ రేసుల్లాగా పావురాల రేస్.. ఇలా తీసుకొచ్చి.. చివరికి..
నాయుడుపేటటౌన్ (నెల్లూరు జిల్లా): తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులు పక్కా ప్రణాళిక వేసుకుని సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర ప్రాంతాల్లో పావురాల రేస్‌కు తెరతీశారు. తాజాగా నాయుడుపేటలో రేస్ నిర్వహించేందుకు వచ్చిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి సోమవారం కోర్టుకు హాజరుపరిచామని సీఐ వైవీ సోమయ్య తెలిపారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతానికి చెందిన ఆంగ్లో ఇండియన్ అవీన్ ఫిలిప్స్ తిరుచ్చి, చెన్నై తదితర ప్రాంతాల్లో పందెం పావురాళ్లతో రేస్‌లు నిర్వహిస్తుంటాడు. రూ.లక్షల్లో బెట్టింగ్ కాస్తుంటారు. ఈక్రమంలో అతను అధిక లాభాలను గడించాడు. తర్ఫీదు పొందిన పందెం పావురాల కాళ్లకు నంబర్లతో కూడిన ట్యాగ్‌ను కడతారు. వాటిని వాహనాల్లో సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు తదితర ప్రాంతాలకు తీసుకొచ్చి వదులుతారు. తమిళనాడులోని గమ్యస్థానానికి ముందుగా వెళ్లే పావురాలను విజేతలు ప్రకటించి పందెం కాసిన వారికి నగదు బహుమతులిస్తారు. హార్స్ రేస్‌లాగే పావురాలతో బెట్టింగ్ రేస్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండగను పురస్కరించుకుని జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెద్దఎత్తున పందెం పావురాలతో బెట్టింగ్ రేస్ నిర్వహిస్తున్నామని నిందితులు విచారణలో చెప్పారు. పందెం పావురాలతో బెట్టింగ్ రెస్ నిర్వహించేందుకు తమకు చెన్నైలో పోలీసులు, అటవీ ఇతర శాఖల అధికారులు అనుమతి ఇచ్చారని నకిలీ పత్రాలు తమ వద్ద ఉంచుకుని నాయుడుపేటకు ఫిలిప్స్ వచ్చినట్లుగా గుర్తించారు. మినీ లారీలో 521 పందెం పావురాలను 27 ప్లాస్టిక్ బాక్సులో ఉంచి తిరుచ్చి ప్రాంతానికి చెందిన మరో ఆరుగురు సహాయకులను వెంట తీసుకుని బిరదవాడ గ్రామ సమీపంలో జాతీయ రహదారి వద్దకు ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నాడు. అక్కడ పావురాలను వదిలి పెడుతున్నట్లు సమాచారం అందడంతో సీఐ ఆధ్వర్యంలో ఎస్సైలు టీవీ కృష్ణయ్య, కె.బాలకృష్ణయ్య సిబ్బంది వెళ్లి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న 521 పావురాలను నెల్లూరులోని ఫౌండేషన్ ఆఫ్ యానిమల్స్ కేంద్రానికి తరలించారు. మినీ లారీని సీజ్ చేశారు. నిందితులను సోమవారం కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు. ఈ కేసులో ఏడుగురిని చాకచాక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసిన ఇద్దరు ఎస్సైలతోపాటు ఏఎస్సై విజయభాస్కర్, హెడ్‌కానిస్టేబుల్ రామ్మోహన్‌రాజు, టి.బాలసుబ్రహ్మణ్యం తదితరులను సీఐ అభినందించారు. -
నకిలీ సర్టిఫికెట్ ముఠా గుట్టురట్టు
సాక్షి, ముంబై: భారత ఆర్థిక రాజధాని ముంబైలో నకిలీ సర్టిఫికేట్లు, డిగ్రీ పట్టాలను తయారు చేస్తున్న రాకెట్ బయటపడింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బోరివలి ప్రాంతంలోని ఒక భవనంపై ఆకస్మికంగా దాడిచేశారు. దాడిచేసిన ప్రదేశంలో అనేక యూనివర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లు, డిగ్రీపట్టాలు కుప్పలుగా ఉండటాన్ని కనుగొన్నారు. ఈ క్రమంలో.. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ స్థానిక న్యాయస్థానం ఎదుట హజరుపర్చారు. వీరిని విచారించిన న్యాయస్థానం నిందితులకు ఈనెల 27 వరకు పోలీసు కస్టడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ముంబై డీసీపీ సంగ్రామ్ నిషాందర్ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: ప్రేయసి కళ్లలో ఆనందం కోసం ప్రియుడి కిడ్నీ దానం.. ట్విస్ట్ ఏంటంటే -
హైదరాబాద్ లో భారీగా ఫేక్ ఆధార్ కార్డు ముఠా గుట్టు రట్టు
-
దేశముదుర్లు.. క్షణాల్లో నకిలీ ఆధార్ కార్డులు రెడీ
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఆధార్ ముఠా గుట్టు హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ రట్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. ► బోరబండ, న్యూ అల్లాపూర్‌కు చెందిన నితేష్ సింగ్, టోలిచౌకీకి చెందిన సయ్యద్ ముస్తఫా, ఓల్డ్ హఫీజ్‌పేటకు చెందిన షేక్ జహంగీర్ పాషా, హైదర్‌గూడకు చెందిన మహ్మద్ అన్వరుద్దీన్ స్నేహితులు. గోల్నాక తులసీనగర్‌కు చెందిన రబ్బాని ఎంఏ, హకీంపేటకు చెందిన మహ్మద్ అజహర్ షరీఫ్ ఇద్దరూ ముస్తఫాకు చెందిన ఎస్ఎం ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేసేవారు. బోరబండ ఎస్ఆర్టీ నగర్‌కు చెందిన మహ్మద్ సోహైల్ నితేష్ సింగ్‌కు చెందిన జేబీ ఎంటర్‌ప్రైజెస్‌లో పని చేసేవారు. ► లాక్డౌన్ తర్వాత ముస్తఫా వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో తన ఇబ్బందులను మిగిలిన స్నేహితులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా నితేష్ సింగ్ తనకు మధ్యప్రదేశ్ భోపాల్‌లో పవన్ అనే స్నేహితుడు ఉన్నాడని.. అతను అస్సాంలో ఆధార్ ఏజెన్సీలో పని చేస్తున్నట్లు తెలిపాడు. అతని వద్ద అస్సాంకు చెందిన ఆధార్ ఐడీ కార్డులు ఉన్నాయని, వాటిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడంతో వారు వాటిని కొనుగోలు చేసి నగరంలో నకిలీవి సృష్టించి అవసరమైన అభ్యర్థులకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని పథకం పన్నారు. ► గత అక్టోబర్‌లో నితేష్ పవన్ నుంచి రూ.90 వేలకు ఆరు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీలను కొనుగోలు చేసి మిగిలిన వారికి విక్రయించాడు. దీంతో ఈ నలుగురు ఆధార్ కిట్స్, ల్యాప్‌టాప్, ఫింగర్ ప్రింట్ స్లాబ్, కెమెరాలను కొనుగోలు చేసి తమ ఆన్లైన్ సర్వీసెస్ కేంద్రాల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ సేవలు ప్రారంభించారు. ► కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒక రాష్ట్రంలో జారీ చేసిన ఆధార్ కార్డులు ఆ రాష్ట్ర పరిధిలోనే వినియోగించాలి. అయితే నిందితులు హైదరాబాద్‌లో ఆధార్ ఎన్రోల్మెంట్ లేదా అప్డేషన్ కోసం అస్సాంకు కేటాయించిన కార్డులపై వివరాలను ముద్రించి నకిలీవి సృష్టించారు. ఇందుకోసం హైదరాబాద్, మేడ్చల్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ల పేరుతో నకిలీ స్టాంప్‌లను సృష్టించారు. ఆయా గెజిటెడ్ ఆఫీసర్ల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ బర్త్ సర్టిఫికెట్లను కూడా తయారు చేశారు. గత రెండు నెలలుగా ఆయా కేంద్రాల నుంచి సుమారు 3 వేల ఆధార్ కార్డులను జారీ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ► నకిలీ ఆధార్ కార్డ్‌ల భాగోతం యూఐడీఏఐ దృష్టికి వెళ్లడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బంజారాహిల్స్, గోల్కొండ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ బృందాలు నితేష్ సింగ్, ముస్తఫా, రబ్బాని, అజహర్ షరీఫ్, సోహైల్, జహంగీర్ పాషా, అన్వరుద్దీన్లతో పాటు మొరమ్మగడ్డకు చెందిన మహ్మద్ అహ్మద్‌లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు భోపాల్‌కు చెందిన పవన్ పరారీలో ఉన్నాడు. వీరి నుంచి రూ.80 వేల నగదు, ఆరు ఆధార్ కిట్లు, 5 స్టాంప్‌లు, ఆధార్ ఎన్రోల్మెంట్ దరఖాస్తులు, ఫోర్జరీ బర్త్ సర్టిఫికెట్లు, ఫేక్ ఆధార్ కార్డ్‌లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: వద్దంటే రెచ్చిపోయాడు, ముద్దులు పెడుతూ అసభ్యంగా తాకుతూ.. -
జైలులో స్నేహం.. బయటకు వచ్చాక ముగ్గురు కలిసి..
సాక్షి,కోస్గి(మహబూబ్‌నగర్): గతంలో చేసిన వేర్వేరు దొంగతనాల కేసుల్లో కటకటాలు లెక్కపెట్టిన ముగ్గురు యువకులు జైలులోనే స్నేహితులుగా మారారు. బయటికి వచ్చిన తర్వాత వీరు ఓ ఓమ్నీ కారు కొనుగోలు చేసి, రాష్ట్రంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్నారు. జల్సాలకు అలవాటు పడ్డారు. ఇదిలాఉండగా కోస్గి పరిధిలో నెల వ్యవధిలోనే పదుల సంఖ్యలో వరుస చోరీలు చోటుచేసుకోవడంతో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. ఆ వివరాలను సీఐ జనార్దన్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ముఠాలో జడ్చర్ల నిమ్మగడ్డ బావి ప్రాంతానికి చెందిన బొంతల మూర్తి, దేవరకద్రకు చెందిన చెక్క గోపి అశోక్, హన్వాడకు చెందిన ఆర్కెపల్లి చంద్రశేఖర్ ఉన్నారు. ఈనెల 11న తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుండుమాల్‌కు చెందిన వెంకటయ్య ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 14న వాహనాలను తనిఖీలు చేస్తుండగా మార్కెట్ కమిటీ చెక్‌పోస్ట్ సమీపంలో అనుమానాస్పదంగా ఇనుప రాడ్, ఇతర సామగ్రితో వచ్చిన వీరిని పట్టుకొని పోలీసులు విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు. దీంతో చోరీల బాగోతం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసుల సమగ్ర దర్యాప్తులో వీరిపై రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనం కేసులు నమోదైనట్లు గుర్తించారు. వీరి నుంచి కోస్గి పరిధిలో జరిగిన దొంగతనాలకు సంబందించి రూ. 1.25లక్షల విలువైన బంగారు నగలు, 44.5 తులా ల వెండి ఆభరణాలు రికవరీ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. ఆభరణాలు రికవరీ చేసి ఆయా స్టేషన్లకు అప్పగించారు. కాగా బొంతల మూర్తిపై జడ్చర్ల, నల్లగొండ జిల్లా దేవరకొండలో, అశోక్‌పై బాలానగర్ పోలీసులు, చంద్రశేఖర్‌పై జడ్చర్ల పోలీసులు పీడీ యాక్టు కేసు నమోదు చేశారు. కేసును సీఐ జనార్దన్ సమక్షంలో ఛేదించిన ఎస్సై నరేందర్, పీసీ మహేందర్, ఆంజనేయులును జిల్లా పోలీసు అధికారులు ప్రశంసించారు. -
14 ఏళ్లు.. వంద చోరీలు.. పోలీసులకు తలనొప్పిగా మారాడు.. చివరికి..
సాక్షి,కావలి: రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్, చెన్నై నగరాల్లో నూరు దొంగతనాలు చేసిన ఓ అంతర్రాష్ట్ర దొంగను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కావలి డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. వైజాగ్‌లోని గాజువాక ప్రాంతానికి చెందిన బోలా నాగసాయి 2007 నుంచి దొంగతనాలే వృత్తిగా మార్చుకున్నాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి ఒంటరిగా దొంగతనాలు చేయడం ఇతని నైజం. 2008 నుంచి ఇప్పటి వరకు వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలతో పాటు హైద్రాబాద్, చెన్నై నగరాల్లో వంద దొంగతనాలకు పాల్పడ్డాడు. చోరీ కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లడం, తిరిగొచ్చిన తరువాత మళ్లీ చోరీలబాట పట్టడంతో పోలీసులకు తలనొప్పిగా తయారయ్యాడు. నెల్లూరును షెల్టర్‌జోన్‌గా మార్చుకుని 20కి పైగా చోరీలు చేయడంతో ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నిఘా ముమ్మరం చేశారు.శుక్రవారం వేకువజామున ముసునూరు సమీపంలోని పమిడి కళాశాల ప్రాంతంలో బోలా నాగసాయి సంచరిస్తున్నట్లు గుర్తించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.పది లక్షలు విలువైన 212 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.30వేల విలువైన 315 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: భార్యాభర్తలు వాట్సాప్ చాటింగ్.. భర్త ఇంటికొచ్చేసరికి షాక్.. -
ఆకతాయిల వేధింపులు.. సిగరెట్ తాగమని చెట్టుకు కట్టేసి..
బెంగళూరు(కర్ణాటక): చిన్న పిల్లలపై కొందరు అల్లరి మూకలు అమానుషంగా ప్రవర్తించారు. సిగరెట్ తాగాలని బలవంతం చేశారు. అంతటితో ఆగకుండా.. పాఠశాల ఆవరణలోనే చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఆధ్వర్యంలో నడుపుతున్న పాఠశాలలో 10-13 సంవత్సరాల మధ్య వయస్సు గల కొంతమంది విద్యార్థులను క్యాంపస్‌లో ప్రవేశించిన ఆరుగురు సభ్యుల ముఠా తరచుగా బెదిరింపులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో గత శనివారం కూడా.. చిన్న పిల్లలను పట్టుకుని సిగరెట్ తాగాలని వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా పాఠశాల సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లి సిగరెట్లు తేవాలని చిన్న పిల్లలను బెదిరించారు. కాగా, నిందితులు... సమీపంలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు.. పాఠశాలకు సమీపంలోని గ్రామానికి చెందిన వారు కావడంతో యాజమాన్యం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిందితులు పలుమార్లు ఉపాధ్యాయులను కూడా బెదిరించారని స్థానికులు తెలిపారు. కాగా, ఈ క్రమంలో కొంత మంది స్థానికులు.. పిల్లలను చెట్టుకు కట్టేసి కొడుతున్న క్లిప్పింగ్‌లను స్థానిక కార్పోరేటర్‌కు పంపించారు. కార్పోరేటర్.. పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక పోలీసులు ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారిలో ఐదుగురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్న పిల్లల తల్లిదండ్రులు పోలీసులను కోరారు. కాగా, దీనిపై స్పందించిన డీసీపీ దేవరాజ్ మాట్లాడుతూ.. గ్రామంలో, పాఠశాల పరిసరాలలో అసాంఘిక చర్యలు జరగకుండా పెట్రోలింగ్ గస్తీని పెంచుతామన్నారు. చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య.. -
పాము, విభూతి, భస్మంతో బురిడీ, రూ.62 లక్షలు గోవిందా!
గద్వాల : ప్రజల అమాయకత్వాన్ని, మూఢనమ్మకాలను ఆసరా చేసుకుని మంత్రాల పేరిట డబ్బు దోచుకుంటున్న ఓ ముఠాను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు. ఈ ముఠా సభ్యులు ఓ వ్యక్తిని నమ్మించి ఏకంగా రూ.62.5 లక్షలను ఎత్తుకెళ్లారు. రెండేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ఎనిమిది మంది మోసగాళ్లను గద్వాల జిల్లా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్ ఈ ముఠా చేసిన మోసాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని వాసి జిల్లా రిసోడ్‌కు చెందిన మహమ్మద్ తాశావర్‌ఖాన్, సయ్యద్‌ఇక్బాల్, అజయ్, భీంరావు, అలీముద్దీన్, నవాజ్‌షేక్, హైదరాబాద్‌కు చెందిన అన్వర్‌ఖాన్, షేక్‌బషీర్ ఓ ముఠాగా ఏర్పడి మంత్రాల పేరిట జనాన్ని మభ్యపెట్టి అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. పూజల పేరిట నమ్మించి.. రూ.62 లక్షలకు టోకరా 2019 అక్టోబర్‌లో ఈ ముఠా సభ్యులు జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉప్పలకు చెందిన ప్రహ్లాద్‌రెడ్డిని కలసి మాయమాటలు చెప్పి ఇంట్లో నాగదేవత పేరిట పాముకు ప్రత్యేక పూజలు చేస్తే అద్భుతమైన శక్తులు వస్తాయని నమ్మించారు. అలాగే తమ వద్ద ఉన్న మహిమగల భస్మం, విభూతిని ఇంట్లో చల్లితే కష్టాలు పోయి పెద్ద ధనవంతులు అవుతారని, పూజలో డబ్బులు ఉంచితే పదింతలు అవుతాయని చెప్పారు. దీంతో బాధితుడు ఇంట్లో ఉన్న రూ.62.5 లక్షలను పూజలో ఉంచాడు. ముఠాసభ్యులు పూజ పేరిట కొద్దిసేపు హడావుడి చేసి పథకం ప్రకారం అప్పటికే మత్తు కలిపిన పౌడర్‌ను అతడిపై చల్లి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. డబ్బులు వస్తాయన్న భ్రమలో ఉన్న బాధితుడు రెండు రోజుల తర్వాత మంత్రగాళ్లు మోసం చేశారని గుర్తించి అయిజ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో ఈ ముఠాసభ్యులు గత నెల 30వ తేదీన అయిజ మండలం తుపత్రాలలో సూర్యవెంకటన్నగౌడ్కు కూడా మాయమాటలు చెప్పారు. పూజలకోసం భస్మం, విభూతి డబ్బా కొనేందుకు రూ.10 లక్షలు కావాలని అడిగారు. అయితే అతడి వద్ద డబ్బులు లేకపోవడంతో అడ్వాన్సుగా రూ.30 వేలు ముఠా సభ్యులకు ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, శుక్రవారం తెల్లవారుజామున అయిజ శివారులో పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా సభ్యులు పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు కార్లు, తొమ్మిది సెల్ఫోన్లు, రెండు రాగి రింగులు, భస్మం, విభూతి, నాగుపాముతో పాటు రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గద్వాల కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. పామును అటవీ అధికారులకు అప్పగించారు. కాగా, ఈ కేసుల దర్యాప్తులో పాల్గొన్న పోలీసులను ఎస్పీ అభినందించారు. -
స్పా ముసుగులో వ్యభిచారం: ఏడుగురి రిమాండ్
కేపీహెచ్‌బీకాలనీ: స్పా ముసుగులో వ్యభిచా రం నిర్వహిస్తున్న నిర్వాహకులను కేపీహెచ్‌బీ పోలీస్‌లు రిమాండ్‌కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నెంబర్–1లోని ఆర్ఏ స్పా అండ్ మసాజ్ పేరుతో వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం కేంద్రంపై దాడిచేసి నిర్వాహకుడు సయ్యద్ అక్బర్ అలీతో ఆయనకు సహకరిస్తున్న మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు పట్టుబడిన ముగ్గురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. చదవండి: బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా పేరుతో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ Cyber Crime: అమెరికా వెళ్లాకే పెళ్లి అని, 22 లక్షలు కొట్టేశాడు! -
అన్నదమ్ముల పక్కా స్కెచ్.. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్..
సాక్షి, సర(హైదరాబాద్): తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములతోపాటు చోరీ సొత్తు విక్రయించేందుకు సహకరించిన మరో వ్యక్తిని కీసర పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ. 8.90 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం కీసర పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి వెల్లడించారు. గత నెల 27న నాగారం నవత అవెన్యూలో నివసించే కె.రమణయ్య ఇంటికి తాళం వేసి వనస్థలిపురంలోని అత్తగారింటికి వెళ్లారు. వచ్చేసరికి గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బెడ్రూంలో ఉన్న బీరువా ఓపెన్ చేసి 600 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు నగదు ఎత్తుకెళ్లారు. రమణయ్య ఇంటిపక్కనే ఉంటే సయ్యద్‌మహ్మద్ ఇంటి తాళాలు పగలగొట్టి వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. వీటితోపాటు నాగారంలోని పలు ఇళ్లలో చోరీలు జరుగుతుండటంతో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు కీసర ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. శనివారం కీసర పోలీసులు నాగారం మున్సిపల్ పరిధిలోని రాంపల్లి చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న జి.యోగేందర్(27), జి.నాగేందర్(21)తోపాటు ఎన్.స్నేహాత్‌రాజ్(30)ను అదుపులోకి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. యోగేందర్, నాగేందర్‌లు సోదరులు. చెడు అలవాట్లకు బానిసలై దొంగలుగా మారారు. పెయింటర్స్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బు సరిపోక దొంగతనాలు చేస్తున్నారు. యోగేందర్ పలు కేసులో నిందితుడని.. ఇతడిపై పీడీ యాక్ట్ నమోదై ఉంది. క్రైం డీసీపీలు యాదగిరి, షేక్ సాలి, మల్కాజిగిరి జోన్ అదనపు డీసీపీ శివకుమార్, కుషాయిగూడ ఏసీపీ వెంకన్ననాయక్, మల్కాజిగిరి సీసీఎస్ బాలు చౌహాన్, కీసర ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఒంటరి మహిళలే టార్గెట్: అత్యంత క్రూరంగా..
సాక్షి, అమరావతి బ్యూరో: ఒంటరి మహిళలను అత్యంత క్రూరంగా హత్యలు చేస్తున్న ముఠాను పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 12న పోరంకి సెంటర్లో ఉన్న కరూర్ వైశ్యా బ్యాంక్ ఏటీఎం చోరీ కేసులో నిందితుల్ని పోలీసులు పట్టుకోవడంతో వారి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. గురువారం విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ సమావేశ మందిరంలో సీపీ బత్తిన శ్రీనివాసులు కేసుకు సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. పెనమలూరు మండలం పోరంకి, తాడిగడపకు చెందిన వేల్పూరి ప్రభుకుమార్, సుంకర గోపి రాజు, పొనమాల చక్రవర్తి అలియాస్ చక్రి, మోరం నాగ దుర్గారావు అలియాస్ చంటి, మద్ది ఫణీంద్రకుమార్‌లు ముఠాగా ఏర్పాడ్డారు. వీరిలో ప్రభు, చక్రి, చంటి ఆటో డ్రైవర్లు. సుంకర గోపి ఆటోపై కూరగాయల వ్యాపారం చేస్తాడు. ఫణీంద్ర పెయింటర్. వీరంతా చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని నేరాలకు పాల్పడ్డారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇంటికి రెండువైపులా తలుపులు ఉన్న ఇళ్లను ఎంపిక చేసుకున్నారు. అనుమానం రాకుండా అర్ధరాత్రి ఇంట్లో ప్రవేశించి సహజ మరణంలా హత్యలు చేయాలని ప్రణాళికలు రచించారు. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం రాదని, పైగా కరోనా సమయంలో చనిపోయిన వారిని త్వరగా ఖననం చేస్తారనే ఉద్దేశంతో వృద్ధులే లక్ష్యంగా ఈ తరహా నేరాలకు పాల్పడ్డారు. ఆరు హత్యలు.. 40 తులాల బంగారం.. ఐదు కేసుల్లో మొత్తం ఆరుగురు వ్యక్తులను హతమార్చి సుమారు 40 తులాల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. మృతులపై శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో సహజమరణాలుగా భావించిన వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ ఏటీఎం చోరీ కేసులో విచారణలో పోలీసుల కనబరిచిన ప్రతిభ వల్ల హత్యలు బయటపడ్డాయి. నిందితుల వేలిముద్రలు సేకరించి జిల్లాలో ఇతర ఘటనా స్థలాల్లో లభించిన వేలిముద్రలతో సరిపోల్చి చూడగా కంచికచర్లలో వృద్ధ దంపతులను హత్య చేసింది వీరేనని తేలింది. తర్వాత లోతుగా విచారించగా పెనమలూరు పోలీసుస్టేషన్ పరిధిలో చేసిన నేరాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు చేసిన నేరాలు.. ►నిందితులు మొదటి హత్యను 2020 అక్టోబరులో పెనమలూరు పోలీసుస్టేషన్ పరిధిలో చేశారు. పోరంకి గ్రామంలోని విష్ణుపురం కాలనీలో ఒంటరిగా నివాసం ఉండే నళిని(58)అనే మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ►రెండో హత్యను 2020 నవంబరులో అదే పోలీసు స్టేషన్ పరిధిలోనే చేశారు. పోరంకి గ్రామం తూముల సెంటర్ సమీపంలో నివాసం ఉండే సీతా మహా లక్ష్మి(63) అనే వృద్ధురాలిని హత్య చేశారు. ►కృష్ణా జిల్లా కంచికచర్లలో అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి నిద్రపోతున్న వృద్ధదంపతులు నాగేశ్వరరావు(80), ప్రమీలారాణి(75)లను 2020 డిసెంబరులో హత్య చేసి వారి ఒంటిపై ఉన్న నగలను దొంగిలించారు. ►2021 జనవరి నెలలో పెనమలూరు మండలం తాడిగడప కార్మికనగర్ కట్ట వద్ద ఒంటరిగా ఉంటోన్న తాళ్లూరు ధనలక్ష్మి(58) అనే మహిళను హత్య చేశారు. ►అలాగే మార్చి నెలలో తాడిగడప కార్మికనగర్‌లో మల్లేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించి, ఇంటోల బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. ►ఇదే ఏడాది జూన్‌లో పోరంకి గ్రామంలోని పోస్టాఫీసు సమీపంలో ఒంటరిగా నివసిస్తున్న పాపమ్మ(85) అనే వృద్ధురాలిని హత్య చేసి ఆభరణాలు దొంగిలించారు. రెక్కీ నిర్వహించిన ప్రాంతాలు.. నిందితులు ఇప్పటి వరకు చేసిన నేరాలు కాకుండా విజయవాడ నగరంలోని కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరులో ఒంటరి వృద్ధులు ఉండే నివాసాలను, గుంటూరు జిల్లా తెనాలి, మంగళగిరిలోనూ ఈ తరహా నేరాలు చేయడానికి రెక్కీ నిర్వహించారు. అయితే నిందితులను అరెస్టు చేయడం ద్వారా వారు తర్వాత చేయనున్న నేరాలను నిరోధించాం. పోలీసులకు రివార్డులు.. హంతక ముఠా చేసిన నేరాలను వెలుగులోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన పెనమలూరు సీఐ ఎం. సత్యనారాయణ, ఎస్ఐ వి.వెంకటేష్, హెడ్‌కాన్‌స్టేబుల్ రెహమాన్, కాన్స్టేబుల్ రమణలను సీపీ అభినందించి రివార్డులు అందజేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.. కమిషనరేట్ పరిధిలో ఒంటరిగా జీవించేవాళ్లు ఇకపై తమ ఇళ్లకు సీసీ టీవీలను ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు. ఆపత్కాలంలో సమీప పోలీసుస్టేషన్ ఫోన్ నంబరు, డయల్–100, ఏపీ పోలీసు సేవా యాప్, పోలీసు వాట్సాప్ నంబరు, దిశ యాప్‌ల ద్వారా సమాచారం ఇస్తే వెంటనే పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపడతారు. చదవండి: కోడలిని వేధించిన పాపం..! పక్కాగా రెక్కీ.. మరో 10 మందిని చంపేందుకు స్కెచ్ -
బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్: బ్లాక్‌ఫంగస్ ఇంజెక్షన్లను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 9 మందిని అరెస్ట్ చేసి, 28 అంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. సీపీ అంజనీ కుమార్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్‌లో ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఈ ముఠా.. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.35 వేల నుంచి రూ.50 వేల చొప్పున అమ్ముతున్నారు. మొదటి గ్యాంగ్‌లో ఐదుగురిని, రెండో గ్యాంగ్‌లో నలుగురిని అరెస్ట్ చేశామని.. మొత్తం తొమ్మిది మంది అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. బ్లాక్మార్కెట్లో ఇంజెక్షన్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పువని సీపీ అంజనీకుమార్ హెచ్చరించారు. చదవండి: ఏమిటి జోకర్ యాప్స్.. బహుపరాక్ ఖైరతాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసం.. -
ముగ్గురి గ్యాంగ్ రూ.3 కోట్ల మోసం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల్లో లబ్ధి పొందేలా చేస్తానని అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూములు ఇప్పిస్తాం.. ప్రభుత్వ స్థలాలు వచ్చేలా చేస్తామని ప్రజలు, నిరుద్యోగులను మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టయ్యింది. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల పీఏనంటూ సుధాకర్ మోసాలకు పాల్పడుతున్నాడు. అతడికి నాగరాజు, భీమయ్య సహకరిస్తున్నారు. ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి అమాయకులను మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి దర్యాప్తు చేశారు. ఫార్చూనర్ కారు సఫారీ డ్రెస్ లు వేసుకుని డమ్మీ గన్ ద్వారా వారు దందా నడిపిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకోవడంతో దాదాపు నిరుద్యోగులు, ప్రజల నుంచి రూ.2.2 కోట్లు వసూలు చేశారని తెలిసింది. ఈ ముగ్గురిని ఎస్సార్ నగర్లో అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్ గ్యాంగ్ లీడర్‌గా ఉంటుండగా నాగరాజు, భీమయ్య అతడికి సహకరించేవారు. ఈ విధంగా వారు 82 మందిని మోసం చేశారని పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ స్థలాలు, ఉద్యోగాలు, తక్కువ డబ్బులకు బంగారం వంటి నేరాలకు పాల్పడ్డారని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. మొత్తం రూ.3 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. నిందితుల నుంచి రూ.కోటి 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, కోటి రూపాయల ఇంటి పేపర్లు, ఫార్చూనర్ కారు, డమ్మీ గన్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అయితే సీఎం ఓఎస్డీగా, సెక్రటేరియట్ ఎంట్రీకి ఐడీ కార్డులు పొంది వారు ఈ దందా కొనసాగించినట్లు చెప్పారు. ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ పిలుపునిచ్చారు. చదవండి: ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య చదవండి: విద్యార్థిని చితక్కొట్టిన వాచ్మెన్ -
రిటైర్డు డీజీపీ మెయిల్ నుంచి మెసేజ్ రావడంతో..
బనశంకరి(కర్ణాటక): సైబర్ నేరగాళ్లు ఐటీ సిటీలో చెలరేగిపోతున్నారు. పోలీస్ పెద్దలను కూడా విడిచిపెట్టడం లేదు. విశ్రాంత డీజీపీ శంకరబిదిరి ఈమెయిల్‌ను హ్యాక్ చేసి డబ్బు పంపాలని స్నేహితులకు మెసేజ్ పంపి డబ్బులు కొల్లగొట్టిన నాగాల్యాండ్ కు చెందిన ముగ్గురిని బుధవారం సీఇఎన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 4 మొబైల్స్, 13 పాన్ కార్డులు, 6 ఆధార్ కార్డులు, 2 ఏటీఎం కార్డులు సుమారు 20 కి పైగా బ్యాంకుల్లో ఉన్న రూ. 2 లక్షల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దియా, సరోపా, ఇస్పర్ కోన్సాక్. ఇటీవల బిదరి ఈమెయిల్‌ను హ్యాక్ చేసి ఆయన స్నేహితులకు డబ్బు పంపాలని మెయిల్ పంపారు. బిదరినే పంపారేమోనని ఒకరు రూ.25 వేలు ఖాతాలో వేశారు. తరువాత నిజం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల క్రితం నాగాల్యాండ్ నుంచి బెంగళూరుకు వచ్చిన నిందితులు బ్యూటీపార్లర్, మాల్స్‌లో పనిచేసేవారు. నాగాల్యాండ్ కు చెందిన నిరుద్యోగ యువకులకు డబ్బు ఆశ చూపించి వారి పాన్, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకుని నగదును ఆ ఖాతాల్లోకి వేయించేవారు. చదవండి: చంపి అయినా ‘పరువు’ కాపాడుకోవాలనుకుని.. బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కు పుడకలు -
అంతా సినీ ఫక్కీ: 20 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..
చిత్తూరు అర్బన్: సినీ ఫక్కీలో నిరుద్యోగులను ఓ ముఠా మోసం చేసి సుమారు రూ. 20 కోట్లు కొట్టేసిన ఘటన తమిళనాడు కేంద్రంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినట్లు ఆర్డర్ కాపీలు చేతిలో పెట్టి.. కోల్‌కతా తీసుకెళ్లి ఫేక్ శిక్షణ ఇచ్చి.. నిరుద్యోగులను మోసం చేసింది ఆ ముఠా. ఆ కేటుగాళ్ల చేతిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు నిరుద్యోగులు మోసపోయారు. ముఠా నాయకుడు 27 ఏళ్ల దేవప్రియన్, సభ్యుడు 50 ఏళ్ల హరిహరకుమార్‌ను చిత్తూరు పోలీసులు బుధవారం అరెస్టు చేయడంతో వీరి బండారం బయటపడింది. ఆ వివరాలను డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐలు నరసింహరాజు, యుగంధర్, ఎస్ఐ విక్రమ్ వెల్లడించారు. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన దేవప్రియన్ చెన్నై ఎయిర్‌పోర్టులో పనిచేసేవాడు. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ కేంద్ర మంత్రికి సన్నిహితంగా ఉన్న వ్యక్తితో పరిచయం పెంచుకుని ఎయిర్‌పోర్టులో ఉద్యోగం మానేశాడు. ఢిల్లీ వెళ్లి అక్కడ మంత్రి పేషీలో మరికొందరితో పరిచయాలు పెంచుకున్నాడు. తర్వాత మోసాలు మొదలు పెట్టాడు. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చెన్నైలకు చెందిన పలువురిని తన ఏజెంట్లుగా పెట్టుకున్నాడు. రైల్వే, ఐటీ తదితర శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు వసూలు చేశాడు. ఫేక్ ఆర్డర్ కాపీలు నిరుద్యోగుల చేతిలో పెట్టి నిజంగానే ఉద్యోగాలు వచ్చినట్లు భ్రమ కల్పించేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే డబ్బు వెనక్కి ఇచ్చేవాడు. వసూలు చేసిన డబ్బుతో పాండిచ్చేరి, చెన్నై ప్రాంతాల్లో విలాసవంతమైన విల్లాలు, పంట పొలాలు కొనుగోలు చేశాడు. ఇతని మోసం ఖాతాలో చెన్నైకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు గుర్తించారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురానికి చెందిన ఓ వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నమ్మి దేవప్రియన్‌కు 20 రోజుల క్రితం రూ. 26 లక్షలు ముట్టచెప్పాడు. అయితేఅతని కదలికలపై అనుమానం రావడంతో తన నగదు ఇచ్చేయాలని డిమాండ్ చేశాడు. అతను చెల్లని చెక్కు ఇవ్వడంతో బాధితుడు చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. కాగా, ఈ లింకులో దొరకాల్సిన కేటుగాళ్లు చాలామంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు చదవండి: పెళ్లైన మరుసటి రోజే షాకిచ్చిన వధువు.. తెల్లారితే ముహూర్తం.. వరుడికి వధువు షాక్..! -
బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కండరాల బలం కోసం స్టెరాయిడ్స్ అమ్ముతున్న ఫిట్ నెస్ ట్రైనర్ జుబేర్ సహా మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న జుబైర్.. విదేశాల నుండి స్టెరాయిడ్స్ కొనుగోలు చేసి ఇక్కడ యువతకు విక్రయిస్తున్నారు. బంజారాహిల్స్ లోని ఏ 1 సప్లమెంట్ స్టోర్స్ పేరుతో స్టెరాయిడ్స్ విక్రయాలు జరుపుతున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి మొత్తం రూ. 14 లక్షలు విలువ చేసే స్టెరాయిడ్స్ స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసులే లక్ష్యంగా మోసాలకు పాల్పడిన ముఠా అరెస్ట్
సాక్షి, నల్గొండ: పోలీసుల పేరుతో నకిలి పేస్బుక్ ఖాతాలతో ఘరాన మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాకు నల్గొండ పోలీసులకు చెక్ పెట్టారు. రాజస్థాన్ కేంద్రంగా ఫేస్ బుక్ నకిలీ ఖాతాలతో దందా సాగిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు వారి వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, 8 సెల్ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 30 సిమ్ కార్డు, ఆధార్ కార్డులతో పాటుపలు డాకుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముఠా సభ్యులంతా రాజస్థాన్‌లోని భరత్ పూర్ జిల్లా కేత్వాడ గ్రామానికి చెందివారుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా పోలీసు అధికారుల ఖాతాలే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. అధికారుల పేర్లతో ఫేస్బుక్ ఖాతాను క్రియోట్ చేసి పలువురికి డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేస్తూ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ, ఏపీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాష్ట్రాలకు చెందిన పోలీసు అధికారులతో పాటు.. బ్యాంక్, రైల్వే, సీఆర్పీఎఫ్ అధికారుల పేరుతో ఫేస్బుక్ ఖాతాను సృష్టించి రిక్వెస్ట్ పెట్టినట్లు చెప్పారు. అంతేగాక ఈ ముఠా ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ అప్లికేషన్ అడ్డాగా చేసుకుని ఆర్మీ పేరుతో కూడా సైబర్ నేరాలకు పాల్పడ్డారని, నల్లగొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ పేరిట కూడా నకిలీ ఫేస్ బుక్ ఖాతాను సృష్టించి పలువురికి డబ్బులు పంపించాలంటూ రిక్వెస్ట్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. -
అవతార్ యాప్‌తో క్రికెట్ బెట్టింగ్
సాక్షి, కృష్ణా: బెజవాడ నగరం కేంద్రగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టైంది. ఆన్లైన్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు నిర్వహించిన ముఠాను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అన్లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన సెటప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెజవాడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నరని, ఈ మూఠా తూర్పు గోదావరి జిల్లా చెందిందిగా పోలీసులు వెల్లడించారు. డీసీపీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మొగల్రాజపురంలో ఆచార్య ప్లే స్కూలులో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం అందిందని తెలిపారు. దీంతో అక్కడికి చేరుకొని బెట్టింగ్ సామాగ్రి మొత్తం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అవతార్ అనే యాప్ ద్వారా ఈ బెట్టింగ్ నడిపిస్తున్నారని వెల్లడించారు. బాగా తెలిసిన వాళ్ల ద్వారానే ఈ బెట్టింగ్ యాప్‌లో బెట్టింగ్ కాస్తున్నారని చెప్పారు. రూ.12 లక్షల వరకూ బెట్టింగ్ జరుగుతోందని సమాచారం వచ్చిందన్నారు. ఇక ఈ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారి నవీన్‌ను త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఐపీఎల్ రోజుల్లో పోలీసులకు బెట్టింగ్‌పై సమాచారం ఇచ్చి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ వ్యాలెట్ ద్వారా నగదు లావాదేవీలు చేస్తున్నారని చెప్పారు. విద్యార్ధులు ఇలాంటి బెట్టింగ్‌లకు ఆకర్షితులు కావద్దని విజ్ఞప్తి చేశారు. -
హలో.. మేము ఏసీబీ!
కర్నూలు (టౌన్): ‘హలో.. నేను ఏసీబీ డీఎస్పీ.. విజయవాడ హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడుతున్నాం. మీ అవినీతి కార్యకలాపాల చిట్టా మా వద్ద ఉంది. మీపై ఫిర్యాదులొస్తున్నాయి. కేసులు నమోదు చేయాల్సి ఉంటుందం’టూ ఫోన్లలో బెదిరించి భారీగా డబ్బు వసూలు చేస్తున్న ముఠాలో అరుగురిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ట్రైనీ ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్, కర్నూలు టౌన్ ఇన్చార్జ్ డీఎస్పీ వెంకటరామయ్య బుధవారం రెండో పట్టణ పోలీసు స్టేషన్ ఆవరణలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు. వెలుగులోకి వచ్చిందిలా... కర్నూలు నగరంలోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేసే ఓ అధికారికి ఏసీబీ అధికారుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీనిపై సదరు అధికారి కర్నూలు 2 వ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ మహేశ్వరరెడ్డి ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. పట్టుకున్నారిలా.. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుల ఫోన్ కాల్స్, ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. వాటి ఆధారంగా నిఘా పెట్టి కర్ణాటక రాష్ట్రం హోసూరు వద్ద ఇద్దరిని, అనంతపురం జిల్లా ఉరవకొండ వద్ద నలుగురిని ఫోన్ కాల్ ఆధారంగా ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు జయకృష్ణ (ఏ–1), ఉదయ్‌కుమార్ (ఏ–8) కోసం ప్రత్యేక బృందాలçను నియమించామని పోలీసు అధికారులు వెల్లడించారు. కీలక శాఖల అధికారులే టార్గెట్ ముఠా సభ్యులు రాష్ట్రంలో కీలక శాఖల అధికారులను టార్గెట్ చేశారు. మైనింగ్‌శాఖ, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, ఫ్యాక్టరీలు, మున్సిపల్, కమర్షియల్ ట్యాక్స్, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన వారి ఫోన్ నెంబర్లు తెలుసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. దాదాపు 70 నుంచి 80 మంది అధికారులను బెదిరించారు. వైజాగ్, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలోని కొందరు అధికారులు వారిపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. కాగా ఇప్పటి వరకు నిందితులు బెదిరింపుల ద్వారా అధికారుల నుంచి రూ. 14.34 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందన కేసు దర్యాప్తును వేగవంతం చేసి ఛేదించిన కర్నూలు టూటౌన్ సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్ఐ సునీల్‌కుమార్, పోలీసు సిబ్బంది మహీంద్ర, ప్రియకుమార్, రవిలను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. ముఠాలో అందరూ పాత నేరస్తులే ఏసీబీ పేరు చెప్పి అధికారుల వద్ద డబ్బులు వసూలు చేస్తూ పట్టుబడిన వారంతా పాత నేరస్తులే. వివిధ కేసుల్లో పట్టుబడి జైలుకెళ్లారు. అక్కడ ఒకరినొకరు పరిచయం పెంచుకుని జత కట్టారు. బెయిల్‌పై బయటికి వచ్చిన తరువాత బెదిరింపులకు పాల్పడటం మొదలు పెట్టారు. ఇందుకు కర్ణాటకలో 6 సిమ్ కార్డులు తెప్పించుకుని అందులో 3 సిమ్ కార్డుల ద్వారా అధికారులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు విచారణలో తేలింది. ముఠాలో అత్యధికంగా రేప్‌కేసుల్లో పట్టుబడిన నిందితులే ఉన్నారు. పట్టుబడిన వారిలో ఏ–1 గా ఉన్న జయకృష్ణ అనంతపురం 3 వ పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు అయ్యాడు. రెడ్డిపల్లి జిల్లా జైలులో శిక్ష అనుభవించాడు. అలాగే ఏ–2 తమిటిగొల్ల గంగాధర్ కదిరి రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో బాలికను రేప్ చేసిన కేసులో పట్టుబడ్డాడు. ఏ–3 జోలదరాశి సాల్మన్ రాజు కణేకల్లు పోలీసు స్టేషన్లో బాలికను రేప్ చేసిన కేసులో నిందితుడు. ఏ–4 బొడ్డు సాయికుమార్ బత్తల పల్లి పోలీసు స్టేషన్లో అమ్మాయి కిడ్నాప్ కేసులో అరెస్టు అయ్యాడు. ఏ–5 నారాయణస్వామి హిందూపురం 2 వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో బాలికను రేప్ చేసిన కేసులో జైల్ కెళ్లాడు. ఏ–6 హోసురు నారాయణప్ప గోవిందరాజులు అనంతపురం 3 వ పట్టణ పోలీసు స్టేషన్లో 354 కేసులో అరెస్టు అయ్యాడు. ఏ–7 హోసూరు గ్రామానికి చెందిన హేమంత్‌కుమార్, ఏ–8 ఉదయ్‌కుమార్ ఇతర నేరాలకు పాల్పడి జైలు జీవితం అనుభవించారు. రెడ్డి పల్లి జిల్లా జైలులో ఉన్న సమయంలో ఏ1 నిందితుడు జయకృష్ణతో మిగతా నిందితులకు పరిచయం ఏర్పడింది. ఎలాగైనా డబ్బు సంపాదించాలని వారంతా నిర్ణయించుకుని ముఠాగా ఏర్పడ్డారు. -
2500 కిలోల ఎర్ర చందనం స్వాధీనం
సాక్షి, హైదరబాద్: అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లింగ్ దొంగల ముఠాను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసినట్లు క్రైం డిపార్ట్మెంట్ కమిషనర్ అంజనీ కూమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎర్రచందనాన్ని కడప జిల్లా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తుండగా ఈ ముఠాలోని నలుగురిని అరెస్టు చేశామని.. వారి నుంచి 2500 ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా దీని విలువ దేశ మార్కెట్లో దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ముఠాకి గ్యాంగ్ లీడరైన రాధాకృష్ణతో పాటు చంద్ర, చిన్నయ్య, రాం సేవక్ కుమార్‌లను అరెస్టు చేశామని, ఈ ముఠాలోని మెయిన్ సప్లయర్ శివ కుమార్ పరారీలో ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. కాగా ఈ ముఠా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాలో స్మగ్లింగ్ చేస్తుందని, రాధాకృష్ణకు మొదట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడని, వ్యాపారంలో నష్టం రావడంతో కలప స్మగ్లింగ్‌ను ప్రారంభించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ ముఠా లంకమండల రిజర్వ్ ఫారెస్టు సుద్దపహలో కేజీకి రూ.400 వందల చొప్పున అమ్ముతుందని, నిందితుల నుంచి కోటి రూపాయల విలువ చేసే 2500 కేజీల కలపతో పాటు 5 సెల్ఫోన్లను, హోండా సిటి కారులను స్వాధీనం చేసుకున్నామని, త్వరలోనే పరారీలో ఉన్న సప్లయర్ శివను పట్టుకుంటామని కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. -
తొట్టిగ్యాంగ్ గుట్టు రట్టు..
సాక్షి, విజయవాడ: అవసరాలు తీర్చుకొనేందుకు దొంగలుగా అవతారం ఎత్తిన తొట్టిగ్యాంగ్ గుట్టు రట్టయింది. వరుసచోరీలకు పాల్పడి బెంబేలెత్తించిన ముఠా నిఘా కెమెరాల్లో చిక్కి బుక్కైంది. మంగళవారం పోలీసుల చేతికి చిక్కి కటకటాల ఊచలు లెక్కపెడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఖానికి ముసుగులు ధరించి ఉన్న ఈ ముఠాలో దాసరి దుర్గారావు, జగన్నాధం షణ్ముఖలు ఇద్దరూ విజయవాడలోని రాజరాజేశ్వరీపేటకు చెందినవారు. వీరికి చదువు అబ్బకపోవటంతో చెడు దారిపట్టి వ్యసనాలకు బానిసలయ్యారు. అవసరాలు తీర్చుకొనేందుకు దొంగతనంపై దృష్టిపెట్టారు. దొంగతనాలు, దోపిడీలు చేసి తమ అవసరాలు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము ఉన్న ప్రాంత పరిసరాల్లో చేతివాటం ప్రదర్శించి ఇప్పటికే చాలాసార్లు పట్టుబడ్డారు. కాగా జైలుకి వెళ్లి వచ్చినా వారిలో ఏమాత్రం మార్పు రాకపోగ మళ్లీ దొంగతనాలకు తెగబడ్డారు. మరో ఇద్దరు మైనర్లని తమ ముఠాలో చేర్చుకుని.. దొంగతనాలు ఏలాచేయాలో తర్ఫీదు ఇచ్చారు. వారు ఎంపిక చేసుకొన్న షాపులోల డబ్బు అవసరమైనప్పుడు కన్నం వేయాలని స్కెచ్ వేశారు. అనుకున్నట్టే ఈ నెల ఒకటో తేదీ రాత్రి అజిత్‌సింగ్‌నగర్‌లోని మూడు దుకాణాల్లో చొరబడ్డారు. హెచ్‌పీ గ్యాస్, సంగం డైరీ, గురుసాయి మెడికల్ అండ్ ఫాన్సీ షాపుల్లో చోరి చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్త బృందాన్ని రంగంలోకి దించి వేలిముద్రలు సేకరించారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. మైనర్లు కూడా దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. దాంతో వారిని అదుపులోకి తీసుకొని తమ దైనశైలిలో విచారించారు. వారిని నడిపిస్తున్న తోడుదొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు, 42 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
దొంగనోట్ల ముఠా అరెస్ట్
సాక్షి, నెల్లూరు (క్రైమ్): ఏలూరు–జంగారెడ్డిగూడెం రోడ్డు కేంద్రంగా దొంగనోట్లను ముద్రించి వాటిని చలామణి చేస్తున్న ముఠాను నెల్లూరు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.34.19 లక్షలు విలువైన దొంగనోట్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి ముఠా వివరాలను వెల్లడించారు. ఏలూరుకు చెందిన పి.మురళి అలియాస్ మురళీకృష్ణ పాత నేరస్తుడు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది. గతంలో దొంగనోట్లను తయారు చేసి చెలామణి చేస్తుండగా గుంటూరు జిల్లా రేపల్లె పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నెలన్నర క్రితం బెయిల్‌పై బయటకు వచ్చిన అతను తిరిగి దొంగనోట్ల తయారీకి తెరలేపాడు. కర్నూలు జిల్లా గోనెగండ్లకు చెందిన సంధ్యపోగు రాములు అలియాస్ ఆదాం, నెల్లూరు నగరంలోని వనంతోపుసెంటర్కు చెందిన కాకు శ్రీను అలియాస్ శ్రీనివాసులు, గుంటూరు జిల్లా తెనాలి పట్టణం రాధా టాకీస్ సెంటర్ ప్రాంతానికి చెందిన కానికిచెర్ల నరేంద్రకుమార్, తెనాలి మండలం రావూరు గ్రామానికి చెందిన కె.రవికుమార్, చుండూరు మండలం మోదుకూరి గ్రామానికి చెందిన ఆర్.విద్యాకుమార్ అలియాస్ విద్యాసాగర్, ప్రకాశం జిల్లా చీరాల పట్టణం ఈపూరుపాళేనికి చెందిన ఎ.సునీత, రాజస్థాన్ రాష్ట్రం, బాదమురు జిల్లా గడ్డాడారోడ్, జనకలై గ్రామానికి చెందిన ప్రేమదాస్‌లను కలుపుకుని ముఠాగా ఏర్పడ్డారు. వీరందరూ నేరచరిత్ర కలిగిన వారే. గది అద్దెకు తీసుకుని.. మురళీకృష్ణ తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో దొంగనోట్లను ముద్రించేందుకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, ఆర్బీఐ మార్కు కలిగిన స్టిక్కర్లను ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం ఏలూరు పట్టణంలో ఓ గదిని అద్దెకు తీసుకుని రూ.45 లక్షల దొంగనోట్లను ముద్రించాడు. వాటిని ముఠాలోని సభ్యులకు ఇచ్చాడు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని రొయ్యల వ్యాపారస్తులకు వాటిని చలామణి చేయాలని నిర్ణయించుకుని మురళీ, రాములు, కాకు శ్రీని, మౌలాలీలు ఈనెల 5వ తేదీ ఇందుకూరుపేట యార్లగడ్డ సెంటర్ వద్ద దొంగనోట్లను మార్చేందుకు యత్నించసాగారు. ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్ నేతృత్వంలో నెల్లూరు రూరల్ సీఐ కె.రామకృష్ణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఏలూరులో దొంగనోట్లు ముద్రించే పరికరాలతో పాటు ముఠాలోని నరేంద్రకుమార్, విద్యాసాగర్ సునీత, ప్రేమదాస్‌లను అరెస్ట్ చేశారు. నిందితులు సుమారు నెలరోజుల వ్యవధిలో రూ.9 లక్షల దొంగనోట్లను చలామణి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. వారంతా రూ.లక్షకు రూ.25 వేలు కమీషన్ చొప్పున నకిలీ నోట్లు చలామణి చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే సూరత్ నుంచి ఓ వ్యాపారి రూ.200 దొంగనోట్లు రూ.4 లక్షలు కావాలని నిందితులను కోరినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కేవలం మూడురోజుల వ్యవధిలోనే దొంగనోట్ల ముఠా ఆటకట్టించిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ.శ్రీనివాసన్, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. సంధ్యపోగు రాములు అలియాస్ ఆదాంపై అనేక జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. -
పోలీసుల అదుపులో సుపారీ గ్యాంగ్..?
మహబూబాబాద్ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలోని సుపారీగ్యాంగ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను శనివారం అర్ధరాత్రి మానుకోట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దమ్మపేట మండలానికి చెందిన ఒకరిని..ఇద్దరు వ్యక్తులు హత్య చేసేందుకు యత్నిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఇద్దరిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రాంతం నుంచి శనివారం మహబూబాబాద్‌కు తీసుకువచ్చినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. దమ్మపేట ఉపసర్పంచ్, అధికార పార్టీ నాయకుడు దారా యుగంధర్‌తో పాటు శేషగిరిరావును మానుకోట పోలీసులు శనివారం అర్ధరాత్రి దమ్మపేటలో అదుపులోకి తీసుకుని కేసముద్రం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం తెల్లారేసరికల్లా సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి వచ్చింది. అదే విధంగా యుగంధర్‌తో పాటు మరికొందరికి, దమ్మపేట మండలం నల్లకుంటకు చెందిన గిరిజనుడు సోడెం వెంకట్‌కి మధ్య భూ వివాదాలున్నాయి. ఈ విషయంలో కేసులు, భౌతికదాడులు కూడా జరిగాయి. శాసనసభ ఎన్నికల సమయంలో గిరిజనులపై అక్రమ కేసులు పెడుతున్నారని, హత్యాయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. కొద్దికాలం పాటు భూవివాదం.. వెంకట్ తన సహచరులు చేస్తున్న ఆందోళనలు నిలిచిపోయాయి. శనివారం అర్ధరాత్రి వెలుగులోకి.. పోలీసుల చర్యతో మళ్లీ అన్ని విషయాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా మహబూబాబాద్ జిల్లా పోలీసులు పక్కా ఆధారాలతోనే ఇరువురిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు భూ ఉద్యమాలకు పాల్పడుతున్న సోడెం వెంకట్, ఊకే సత్యం, ఊకే చందర్రావులను చంపేందుకు ఒక్కొక్కరికి రూ.10లక్షలు చొప్పున మొత్తం రూ.30లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారాన్ని పక్కా ఆధారాలతో పోలీసులు సేకరించినట్లు తెలిసింది. కేసముద్రం ప్రాంతానికి చెందిన ఓ మాజీ మావోయిస్టు అనుచరుడు పిస్టల్‌తో పోలీసులకు కొద్దిరోజుల క్రితం చిక్కాడు. అతడిని విచారించగా దమ్మపేట హత్యల డీల్‌ను కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. అతడిని పోలీసులు అప్రూవర్‌గా మార్చుకుని.. ఫోన్‌కాల్స్ ద్వారా యగంధర్‌తో మాట్లాడించి వాటిని రికార్డు చేయించినట్లు వాట్సాప్‌లో ప్రచారం జరుగుతోంది. గతంలో హత్యాయత్నం చేసి విఫలం చెందినట్లు సదరు అప్రూవర్ పోలీసుల వద్ద అంగీకరించినట్లు తెలిసింది. దీంతో విచారణ వేగవంతం చేసి.. తన హత్యకు కుట్ర పన్నారని.. ఓ వ్యక్తికి సుపారీ కూడా ఇచ్చారనే విషయం తెలియని వెంకట్‌కు అటు పోలీసులు, ఇటు సుపారీ తీసుకున్న వ్యక్తి ఆధారాలతో చూపించి.. వెంకట్‌ను కిడ్నాప్ చేసినట్లు వీడియోకాల్ ద్వారా యుగంధర్ నమ్మించారు. ఆ తర్వాత మాజీ మావోయిస్టుతో పాటు అతని అనుచరుల మాదిరిగా మఫ్టీలో దమ్మపేటకు వచ్చి.. యుగంధర్ దగ్గర రూ.3లక్షలు నగదు తీసుకున్నారు. మరో రూ.2లక్షలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు(ఆధారం కోసం). ఇవన్నీ ఆధారాల కోసం రికార్డు చేసుకుని పక్కా వ్యూహంతో శనివారం రాత్రి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌లో ఈ కథంతా ఆదివారం ఉదయం నుంచి తోకలేని పిట్టలా పదే పదే సంచరిస్తోంది. ఇంతకీ మహబూబాబాద్ పోలీసులు ఏం తేలుస్తారో.. వేచి చూడాలి మరి. ఈ విషయమై జిల్లా పోలీసు ఉన్నతాధికారులను సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నించగా వారు అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు. -
నకిలీ పోలీసు ముఠా అరెస్టు
సాక్షి, విజయవాడ: నగరంలో పోలీసుల మని చెప్పి ప్రజలను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నముఠాను టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు... అరెస్టు చేసిన ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు. కానిస్టేబుళ్లు తన స్నేహితుడు శ్రీనివాసరావుతో కలసి ప్రజలను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. కానిస్టేబుళ్లు నరేష్ కుమారు(జార్ఖాండ్ బెటాలియన్), వల్లభేని స్వామి( ఛత్తిస్ ఘడ్ బెటాలియన్)ల్లో పని చేస్తున్నట్లు గుర్తించామని పోలీసలు వెల్లడించారు. స్నేహితుడు శ్రీనివాసరావుతో కలిసి వసూళ్లకు దిగిన నరేష్ కుమార్, వల్లభనేని స్వామి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. -
వయసు 29, ఏడాదికి వంద లగ్జరీ కార్లు టార్గెట్
సాక్షి, న్యూఢిల్లీ : ఎట్టకేలకు లగ్జరీ కారు దొంగల ముఠా ఆటకట్టించారు ఢిల్లీ పోలీసులు. విలాసవంతమైన కార్లే టార్టెట్‌గా ఈ ముఠా గత ఐదేళ్లుగా చోరీలకు పాల్పడుతోంది. ఆధునిక టెక్నాలజీని సహాయంతో హైటెక్‌గా అనుకున్న పని కానిచ్చేసి, అనంతరం విమానంలో చెక్కేస్తారు. అయితే ఈ ముఠాపై నిఘా పెట్టిన ఢిల్లీ పోలీసులు చివరికి వారికి చెక్ పెట్టారు. విలాసవంతమైన కార్లను దొంగిలించడం, అమ్ముకోవడమే పనిగా పెట్టుకుంది హైదరాబాద్‌కు చెందిన సఫ్రుద్దీన్ (29) అండ్ గ్యాంగ్. ఢిల్లీలో ఏడాదికి 100 లగ్జరీ కార్ల చోరీ చేయడం వీళ్ల టార్గెట్. ఇలా కొట్టేసిన కార్లను పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటారు. అయితే ఎంతటి టెక్ దొంగ అయినా పోలీసులకు చిక్కక తప్పదు కదా. ఆగస్టు 3న ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు నీరజ్ చౌదరి, కుల్దీప్ నాయకత్వంలోని బృందం వీరిని అరెస్ట్ చేసిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ డియో చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన సఫ్రూద్దీన్ సహా మహమ్మద్ షరీక్, ఇంకా కొంతమంది ముఠాగా ఏర్పడ్డారు. ఢిల్లీ లగ్జరీ కార్లే వీళ్ల టార్గెట్. హైదరాబాద్ -ఢిల్లీ, ఢిల్లీ-హైదరాబాద్ విమానంలో మాత్రమే ప్రయాణం చేస్తారు. ల్యాప్‌టాప్, ఇతర హైటెక్ గాడ్జెట్లు వీరి ఆయుధాలు. వీటి ద్వారా కార్ల సాప్ట్వేర్ జీపీఎస్‌ను కేంద్రీకృత లాకింగ్ సిస్టంలోకి ఎంటరై కారును కొట్టేస్తారు.. ఆ తరువాత విమానంలో హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేస్తారు. ఇదీ వీరి మోడస్ ఒపరాండీ. కాగా జూన్ 5న సఫ్రుద్దీన్ అతని నలుగురు సహచరులు వివేక్ విహార్‌లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా ఈ గ్యాంగ్‌లోని ననూర్ మహ్మద్‌ను కాల్చిచంపిన పోలీసులు మరో నిందితుడు రవి కుల్దీప్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సప్రూద్దీన్ను అరెస్ట్ చేశారు. అన్నట్టు సప్రూద్దీన్ ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల ప్రైజ్ మనీ కూడా గతంలో పోలీసు శాఖ ప్రకటించింది. -
తొమ్మిది మంది ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
రైల్వేకోడూరు : నియోజకవర్గంలో వేరు వేరు చోట్ల దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది మంది ఎర్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ లక్ష్మినారాయణ తెలిపారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఉర్లగట్టుపోడు పంచాయతీలోని కన్నెకుంట రోడ్డులో బుగ్గలవాగు పరిసర ప్రాంతాలలో గాలిస్తుండగా పోలీసులపై స్మగ్లర్లు రాళ్లు, కట్టెలతో దాడిచేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఇందులో భాగంగా చాకచక్యంగా అక్కడున్న ఐదు ఎర్రచందనం దుంగలను, ఒక మహేంద్ర గూడ్స్ వాహనం, ఒక హీరో హోండా బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన దంతం వెంకటేష్, అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన బెల్డోనా మల్లయ్య, వేలూరు జిల్లా తిరుపత్తూరుకు చెందిన నుగాలన్ అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న రూ. 2.30 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే ఓబులవారిపల్లె మండలం వైకోట సమీపంలోని గుండాలేరు అటవీ ప్రాంతంలో 6 ఎర్రచందనం దుంగలను , ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కె.బుడుగుంటపల్లె పంచాయతీ సమతానగర్‌కు చెందిన వెలుగు గంగయ్య, అల్లం మణి, రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన ఎలకచెర్ల సుదర్శన్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాగే చిట్వేలి మండలం రాజుకుంట సమీపంలో నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని రాఘవరాజుపురం అరుంధతివాడకు చెందిన వెంకటేష్, కన్నెకుంట ఎస్టీ కాలనికి చెందిన కమ్మల వెంకటరమణ,, తమిళనాడుకు చెందిన పూచి గోవ్నరాజ్‌లను అరెస్ట్ చేశామన్నారు. పై మూడు దాడుల్లో 15 దుంగలను, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీఐ సాయినాథ్, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె , చిట్వేలి ఎస్ఐలు వెంకటేశ్వర్లు, భక్తవత్సలం, సత్యనారాయణ, డాక్టర్ నాయక్‌లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
వీఐపీ దర్శనం చేయిస్తా..!
ఇంద్రకీలాద్రి (విజయవాడ వెస్ట్) : అందరికీ గ్రూప్‌గా వీఐపీ దర్శనం చేయిస్తా... అంతరాలయంలోకి పంపుతాను... మామూలుగా అయితే టికెటు రూ.300... మీరు ఐదుగురికి రూ.వెయ్యి ఇవ్వండి చాలు.. అమ్మవారిని దగ్గర నుంచి కూడా చూడవచ్చు... అంటూ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి బురిడీ కొట్టిస్తున్న ముఠా ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో తిరుగుతోంది. ఈ ముఠాలో ఒకరు కాదు ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఘాట్ రోడ్డులోని పూజా సామాగ్రి విక్రయించే దుకాణాలలో పని చేసిన కొంత మంది వ్యక్తులు ఈ విధంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. ఇదే తరహాలో గురువారం ఓ భక్తుల బృందాన్ని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన కొంత మంది భక్తులను పూర్ణా అనే వ్యక్తి కలిశాడు. అందరికీ వీఐపీ దర్శనం చేయిస్తానని డీల్ మాట్లాడుకున్న తర్వాత వారిని అంతరాలయంలో దర్శనానికి పంపుతానని చెప్పి వారిని క్యూ లైన్లోకి పంపాడు. అయితే వారు అంతరాలయంలోకి కాకుండా ముఖ మండప దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి పూర్ణా కనిపించలేదు. దీంతో ఆగ్రహించిన భక్తులు ఆలయ ప్రాంగణంలో వెతికారు. కొద్దిసేపు తర్వాత పూర్ణా కనిపించడంతో వారు నిలదీశారు. దీంతో వారి మధ్య వాదోపవాదనలు జరగడంతో పోలీసులు పూర్ణాను అదుపులోకి తీసుకున్నారు. ఆలయ సిబ్బంది పాత్రపై ఆరా... ముఠాకు సహకరిస్తున్న ఆలయ సిబ్బందిపైనా ఈవో ఆరా తీస్తున్నట్లు సమాచారం. నకిలీ టికెట్లు, టికెట్ల రీసైకిలింగ్‌పై దృష్టి పెట్టడంతో కొందరు సిబ్బంది రూటు మార్చి ఈ ముఠాతో చేతులు కలిపారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిబ్బంది సహకారం లేకుండా ఇటువంటి దర్శనాలు సాధ్యం కాదనేది ఆలయ ఉన్నతాధికారుల మాట. -
జల్సాల కోసం దొంగలుగా మారి...
ధర్మవరం అర్బన్ : జల్సాలకు అలవాటుపడిన దొంగలుగా మారిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ధర్మవరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఇన్చార్జ్ డీఎస్పీ రామవర్మ, సీఐ హరినాథ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. కేశవనగర్‌కు చెందిన గిరక నరేష్, శివానగర్‌కు చెందిన చింతాకుల రాజ్‌కుమార్, కేశవనగర్‌కు చెందిన షేక్ నూర్ మహమ్మద్ జల్సాలకు అలవాటుపడ్డారు. ఇందుకు అవసరమైన డబ్బులు సమకూర్చుకునేందుకు దొంగలుగా మారారు. ముఠాగా ఏర్పడిన వీరు యరగుంట వద్దనున్న హెచ్‌పీ గ్యాస్ కార్యాలయంలో నగదు దొంగతనం చేశారు. అనంతరం గాంధీనగర్‌లో ఒక మహిళ మెడలో బంగారు గొలుసు, లక్ష్మీచెన్నకేశవపురంలో మహిళ మెడలో బంగారు గొలుసు, కొత్తపేట, కేశవనగర్, శివానగర్లలో ఇళ్లలో అమర్చిన నీళ్ల మోటార్లతోపాటు సాయినగర్‌లోని ఒక ఇంట్లో చోరీ చేశారు. ఇప్పటికే పట్టుచీరల దొంగతనం కేసులో నరేష్, రాజ్‌కుమార్ జైలుకు వెళ్లి వచ్చారని డీఎస్పీ తెలిపారు. ఈ ముగ్గురూ బుధవారం బంగారు గొలుసులు, నీళ్ల మోటార్లను తీసుకుని బెంగళూరుకు వెళ్లేందుకు ప్రయత్నించగా మార్కెట్‌యార్డు వద్ద పట్టణ సీఐ హరినాథ్, ఎస్ఐలు జయానాయక్, శ్రీహర్ష, హెడ్‌కానిస్టేబుల్ డోనాసింగ్, మునేనాయక్, కానిస్టేబుళ్లు ప్రసాద్, భాస్కర్‌నాయుడు, షాకీర్, నాగరాజు, శ్రీనివాసులు, నాగార్జున, మంజునాథ్, హోంగార్డు నరసింహులు దొంగలను అరెస్టు చేశారన్నారు. వీరి నుంచి రెండు బంగారు గొలుసులు, రెండు వెండి కుంకుమ భరిణిలు, 8 నీళ్ల మోటార్లు మొత్తం రూ.1,90,530 విలువగల వస్తువులను రికవరీ చేశామని డీఎస్పీ తెలిపారు. -
ముఠాపై తూటా...
బనశంకరి : చైన్‌స్నాచింగ్ పాల్పడి బైక్‌పై ఉడాయిస్తున్న బావరియాగ్యాంగ్ సభ్యులపై ఉత్తరవిభాగం పోలీసులు కాల్పులు జరిపి ఒకరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో చైన్‌స్నాచర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బావరియా గ్యాంగ్ నగరంలో మకాం వేసి బైకుల్లో సంచరిస్తూ మహిళల మెడల్లో గొలుసులు అపహరించే ఉడాయించేది. బెంగళూరు ఉత్తరవిభాగంలో ఇటీవల ఆ గ్యాంగ్ సభ్యులు మూడునాలుగుచోట్ల చైన్‌స్నాచింగ్‌కు తెగబడ్డారు. దీంతో ముఠాను అరెస్ట్ చేసేందుకు ఉత్తరవిభాగం డీసీపీ చేతన్సింగ్రాథ్డ్ ఆధ్వర్యంలో యశవంతపుర ఏసీపీ రవిప్రసాద్, మహాలక్ష్మీలేఔట్ సీఐ లోహిత్, నందినీలేఔట్ సీఐ కాంతరాజు, ఆర్ఎంసీ.యార్డు సీఐ రామప్ప, ఎస్ఐ సోమశేఖర్లు బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు. నిందితులు పంజాబ్ రిజిస్ట్రేసన్ కలిగిన బైక్ ఉపయోగిస్తన్నట్లు సమాచారంతో సూలదేవనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురక్రాస్ వద్ద మంగళవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో పంజాబ్ రిజిస్ట్రేషన్ కలిగిన బజాజ్పల్సర్బైక్ రాగానే కానిస్టేబుళ్లు బిరాదార, ఇమామ్సాబ్కురికుట్టిలు వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన చైన్‌స్నాచర్లు ఓ కానిస్టేబుల్ గొంతుపై కత్తితో దాడి చేసి ఉడాయించారు. చైన్‌స్నాచర్లు నీలగిరి తోపులో పారిపోతుండగా ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్యేక పోలీస్‌బృందం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపుచర్యలు చేపట్టింది. రాత్రి 11.50 గంటల సమయంలో సోమశెట్టిహళ్లి సమీపంలోని కెరెగుడ్డదహళ్లి వద్ద నిందితలులు పారిపోతుండగా పోలీసులు గుర్తించి పట్టుకోవడానికి యత్నించారు. నిందితులు ఎదురు తిరిగి కానిస్టేబుల్ ఇమామ్సాబ్కురికుట్టిపై చాకుతో దాడికి యత్నించగా అప్రమత్తమైన నందీనీలేఔట్ ఎస్ఐ సోమశేఖర్ కాల్పులు జరిపారు. బుల్లెట్లు చైన్‌స్నాచర్ రామ్‌సింగ్ కుడికాలు, చేతిపై దూసుకుపోవడంతో అక్కడే కిందపడిపోయాడు. అనంతరం నిందితుడిని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. చైన్‌స్నాచర్ దాడిలో గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సూలదేవనహళ్లిపోలీసులు చైన్‌స్నాచర్లు వినియోగించిన పల్సర్‌బైక్. యలహంక పోలీస్‌స్టేషన్ పరిధిలో అపహరించిన బంగారుచైన్, చాకును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో చైన్‌స్నాచర్ రాజేంద్ర కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడు రామ్‌సింగ్‌పై బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో కేసులున్నాయని పోలీసులు తెలిపారు. గ్యాంగ్‌లో రామ్‌సింగ్ కీలకవ్యక్తి అని డీసీపీ చేతన్సింగ్రాథ్డ్ తెలిపారు. -
యువతులపై మూకుమ్మడి లైంగిక దాడి
ఒంగోలు క్రైమ్: ప్రకాశం జిల్లాలో పొలాల్లోకి, కాలువ గట్లపైకి సరదాగా గడుపుదామని వచ్చే జంటలను, ప్రేమికులను బెదిరించి, లైంగిక దాడులు చేస్తున్న ముఠాను ఒంగోలు సబ్ డివిజన్, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే.. జిల్లాలో చీమకుర్తిలోని శిద్ధానగర్‌కి చెందిన పాలపర్తి ఏసు (28) తన తల్లిదండ్రులతో కలిసి పరిసర ప్రాంతాల్లో రైతుల పొలాల్లో ఎలుకలు పట్టుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో సాగర్ కాలువ వెంట పొలాలకు వెళ్లే సమయంలో ద్విచక్రవాహనాలపై, ఆటోల్లో జంటలు, ప్రేమికులు వస్తుండటం గమనించేవాడు. ఏకాంతంగా గడపడానికి వచ్చే వీరిని ఏంచేసినా ఎవరికీ చెప్పుకోలేరని అనుకున్నాడు. చీమకుర్తికే చెందిన నల్లబోతుల శ్రీనివాసులు, మరో వ్యక్తి సాగర్ కాలువలో చేపలు పట్టుకుంటూ జీవనం సాగించేవారు. వీరిద్దరితోపాటు మరో ఐదుగురు, ఒక బాల నేరస్తుడ్ని కలిపి ముఠాగా ఏర్పడ్డారు. ఈ ముఠా ఏకాంత ప్రదేశాలకు వచ్చే జంటలను, ప్రేమికులను అత్యంత దారుణంగా హింసించి, పురుషులను కట్టేసి మహిళలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడేవారు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న బంగారు నగలను, నగదును, ద్విచక్రవాహనాలను సైతం దోచుకునేవారు. ఏకాంతం కోసం వచ్చే జంటలే లక్ష్యం సాగర్ కాలువపై ఎప్పుడూ ఏసు ముఠాలోని ఇద్దరు సభ్యులు రెండు వాహనాలపై పహారా కాస్తూ ఉండేవారు. ఏకాంతంగా వచ్చిన జంటలను గుర్తించి ఆ సమాచారాన్ని వెంటనే ఏసుకు చేరవేసేవారు. ఆ తర్వాత ఈ ముఠా.. జంట, ప్రేమికులు ఉన్న ప్రదేశానికి వెళ్లి బెదిరించి పురుషులపై దాడి చేసి కొట్టి చెట్లకు కట్టేసేవారు. తర్వాత ఒకరి తర్వా ఒకరు మహిళ/యువతిపై లైంగికదాడి చేసేవారు. వారి వద్ద దోచుకున్న బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి సొమ్ము చేసుకునేవారు. ఈ ముఠా గత రెండేళ్లలో ఒంగోలుతోపాటు సాగర్ కాలువ, మల్లవరం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 17 మందిపై ఈ రాక్షస కాండ సాగించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఇంకా వెలుగుచూడని అరాచకాలు మరో 13 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. బాధితులు పరువు పోతుందని బయటకు చెప్పుకోలేకపోయేవారు. ఇదే అవకాశంగా తీసుకున్న కిరాతకులు రెండేళ్లపాటు ఈ రాక్షసత్వాన్ని కొనసాగించారు. 15 ఏళ్ల క్రితం ఒంగోలు పట్టణ శివారు ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు జరిగేవి. ఆ తర్వాత చీరాల ప్రాంతంలోని దండుబాటలో ఇలాంటి కిరాతకాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మళ్లీ ఏసు ముఠా ఈ దారుణాలకు ఒడిగట్టింది. దొంగతనం కేసులో ఒక చిన్న దొంగను పట్టుకొని విచారిస్తుంటే ఈ ముఠా చేసిన అకృత్యాలు వెలుగుచూశాయి. దీంతో ఒంగోలు సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావుల ఆధ్వర్యంలోని దర్యాప్తు బృందాలు కిరాతక ముఠా గుట్టును రట్టుచేసి పాలపర్తి ఏసుతోపాటు చీమకుర్తికి చెందిన నల్లబోతుల శ్రీనివాసులు, కొమరగిరి కొండయ్య, బొజ్జా దుర్గాప్రసాద్, మన్నెం అంకమరావు, మన్నెం నరసింహారావు, మన్నెం గంగయ్య, తుపాకుల అంజయ్యలను అరెస్టు చేశారు. ఈ ఎనిమిది మంది కాకుండా ఒక బాల నేరస్తుడు కూడా ఉన్నట్టు తెలిపారు. -
పోలీసుల అదుపులో నాగపూర్ మహిళా ముఠా
కాజీపేట రూరల్ : కాజీపేట జీఆర్పీ పోలీసులు శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న 14 మంది మహిళలను అదుపులోకి తీసుకొని కాజీపేట మండల తహసీల్దార్ కార్యాయలంలో తహసీల్దార్ రవీందర్ ముందు బైండోవర్ చేశారు. కాజీపేట జీఆర్పీ సీఐ ఎస్.వెంకటేష్, ఎస్ఐ జితేందర్ రెడ్డి విలేకర్లకు తెలిపిన వివరాల ప్రకారం..కాజీపేట రైల్వేస్టేషన్లో పోలీసులు తనిఖీ చేస్తుండగా కొందరు మహిళలు ప్రయాణికుల బ్యాగులను అనుమానాస్పదంగా చూస్తూ వాటిని తనిఖీ చేయబోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నాగపూర్‌లోని పార్వతినగర్‌కు చెందిన వారుగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ మహిళలు రైళ్లలో ప్రయాణికుల వద్ద చంటిపిల్లలను ఎత్తుకొని బిక్షాటన చేస్తూ జాలిపడేటట్లు నటిస్తూ అనుకూల సమయం దొరికినప్పుడు మహిళా ప్రయాణికుల హ్యాండ్ బ్యాగుల నజర్‌వేసి నగదు, బంగారు ఆభరణాలను చోరీ చేస్తుంటారని చెప్పారుజ 14 మంది మహిళలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి తహసీల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు. రైళ్లలో బిక్షాటన చేస్తున్నట్లు నటించే మహిళలను, చిరు వ్యాపారాలు చేసే వారిని ప్రయాణికులు నమ్మరాదని వారు తెలిపారు. -
30 రోజుల్లో కోటి రూపాయలంటూ...
సాక్షి, హైదరాబాద్ : 30 రోజుల్లో కోటి రూపాయలు సంపాదించుకోండి.. అదెలా అంటే మమ్మల్ని సంప్రదించండి అంటూ.. మల్టిలెవల్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టైంది. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 30 రోజుల్లో కోటి రూపాయలు సంపాదించడంటూ వీరు ఈ మల్టిలెవల్ మార్కెటింగ్ మోసానికి పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తుల నుంచి 6 లక్షల రూపాయల విలువైన గోల్డ్ కాయిన్లను, రూ.1.73 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా మల్టిలెవల్ మార్కెటింగ్ మోసాలు పెరుగుతూ వస్తున్నాయి. అతి తక్కువ కాలంలోనే కోట్లు రూపాయలు ఎలా సంపాదించాలో తాము చెబుతామంటూ.. ఈ ముఠాలు అమాయకుల వద్ద నుంచి డబ్బులు గుంజడం, గోల్డ్ కాయిన్లను సేకరించడం వంటివి చేస్తూ ఉన్నారు. కొన్ని మల్టిలెవల్ మార్కెటింగ్ కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదంతాలు ఉన్నాయి. -
నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్
అమీర్‌పేట : ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ వీరస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. మేడ్చల్‌కు చెందిన రమేష్‌బాబు, నాగేష్ అమీర్‌పేట, మధురానగర్‌లో కన్సల్టెన్సీల పేరుతో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. రెండు కార్యాలయాలకు భరత్ అనే వ్యక్తి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నాడు. ప్రము ఖ కంపెనీలకు చెందిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లను ఇప్పిస్తామని ప్రచారం చేసుకున్న వీరు నకిలీ సర్టిఫికెట్లు అంటగట్టి నిరుద్యోగుల నుండి లక్షల్లో డబ్బులు దండుకునేవారు. దీనిపై సమాచారం అందడంతో పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి అమీర్‌పేట, మధురానగర్ లోని కార్యాలయాలపై దాడులు నిర్వహించి నిందితులు రమేష్‌బాబు, నగేష్, భరత్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి ఫాం 16, వివిధ కంపెనీలకు చెందిన సర్టిఫికెట్లు, స్టాంపు లు ఐడీ కార్డులతో పాటు రూ.6500 నగదు,12 సీపీయూలు, 9 మానీటర్లు, 5 ల్యాప్‌టాప్‌లు, ఒక ప్రింటర్, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
నకిలీ వాక్సిన్ తయారీ ముఠా గుట్టు రట్టు
హైదరాబాద్ : నకిలీ వ్యాక్సిన్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. చిన్నపిల్లలకు ఇచ్చే టెటానస్ వ్యాక్సిన్‌ని ఈ ముఠా రీసైకిల్ చేస్తున్నట్లు బయటపడింది. కాలం చెల్లిన వ్యాక్సిన్‌ని తీసుకొచ్చి కొత్తవ్యాక్సిన్‌గా లేబుల్స్ అంటించి విక్రయిస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. కొత్తడేట్తో తయారు చేస్తూ నకిలీ వ్యాక్సిన్ ప్రభుత్వానికే విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అంబర్ పేటలో వ్యాక్సిన్ తయారు చేస్తున్న కర్మాగారంలో అధికారులు సోదాలు నిర్వహించారు. లక్షల సంఖ్యలో నకిలీ వ్యాక్సిన్ బాటిల్స్‌ను సీజ్ చేశారు. యజమానితోపాటు పలువురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్లేడ్.. బెంబేలు..
► నగరంలో మళ్లీ బ్లేడ్ బ్యాచ్ ముఠా ఆగడాలు పెరిగాయా? ► వివిధ కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై తిరిగొచ్చిన వారిని కొంతమంది రాజకీయ నాయకులు ప్రోత్సహిస్తున్నారా? ► బ్లేడ్ బ్యాచ్ ముఠాల్లోని వారు తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకు పోటీపడుతున్నారా? అవుననే అంటోంది తాజా సంఘటన. ► కొంత కాలంగా స్తబ్ధుగా ఉన్న ఈ ముఠా మంగళవారం మరోసారి రెచ్చిపోయింది. దీంతో వీరి చేష్టలు శ్రుతిమించి, శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. రాజమహేంద్రవరం క్రైం : బ్లేడ్ బ్యాచ్ ముఠా తగాదాల్లో ఓ వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. కొంత కాలంగా బ్లేడ్ బ్యాచ్ ముఠా సభ్యులు స్థబ్దుగా ఉండగా మంగళవారం రాత్రి కోటగుమ్మం సెంటర్లో ఇరువర్గాల వారు ఒకరి పై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ సంఘటనలో రాజమహేంద్రవరం రూరల్ నామవరం గ్రామానికి చెందిన కందా శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల వారు దాడులు చేసుకుంటున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయాల పాలైన శ్రీనును చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరలా రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్ ముఠా గతంలో ఒకరిపై మరొకరు దాడులు, హత్యలు చేసుకున్న బ్లేడ్ బ్యాచ్ ముఠా సభ్యులు ప్రస్తుతం బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో మరలా వీరు ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలనే లక్ష్యంతో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ముఠా సభ్యులు వివిధ కేసుల్లో జైలుకు వెళితే కొందరు రాజకీయ నాయకులు వీరికి బెయిల్ ఇప్పించి మరీ బయటకు తీసుకువస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తరచూ ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం, ఒంటిరిగా ఉన్న మహిళలు, పురుషులు, ఆటోలో వెళుతున్న వారిపై దాడులు చేసి వారి వద్ద ఉన్న బంగారు నగలు, నగదు దోచుకోవడం వీరి వృత్తిగా మారింది. ఎస్పీ బి.రాజ కుమారి కార్డెన్ సెర్చ్ పేరుతో ఆకస్మిక తనిఖీలు చేసి వీరిలో కొంత మందిని అరెస్ట్ చేశారు. అయితే మరలా వీరిపై దృష్టి సారించకపోవడంతో మరోసారి వీరు రెచ్చిపోయి నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఇప్పటికైనా బ్లేడ్ బ్యాచ్‌పై దృష్టి సారించి వారి కదలికల పై దృష్టిసారించకపోతే నగరంలో మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ప్రజలు హడలిపోతున్నారు. -
పోలీసుల అదుపులో కి‘లేడి’?
విజయనగరం టౌన్: గర్భసంచి అమ్మకాలకు సంబంధించిన ముఠాలో కీలక నిందితురాలు జ్యోతిని, ఆమెతో పాటూ మరో వ్యక్తిని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గర్భసంచిని ఇస్తే మనిషికి రూ.8 లక్షల వరకూ ఇస్తానంటూ సుమారు ఎనిమిది మంది మహిళలను మభ్యపెట్టి, వారి నుంచి పరీక్షల నిమిత్తం రూ. 3లక్షలకు పైగా వసూలు చేసిన కిలేడీపై బాధితుల పిర్యాదు మేరకు కొద్దిరోజుల కిందట టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం రాత్రి ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ గర్భసంచి అమ్మకాల ముఠా వెనుక ఎవరెవరూ ఉన్నారు. రాజకీయ నాయకులు ప్రమేయమేమైనా ఉందా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
దొంగనోట్ల ముఠా అరెస్ట్
జనగామ జిల్లా : దొంగ నోట్లను చలామణీ చేస్తోన్న ముగ్గురిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 28వ తేదీన జనగామలో దొంగ నోట్లతో దందా చేస్తుండగా సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఒక లక్ష రూపాయల నకిలీ నోట్లు, రెండు కార్లు, ఒక స్కానర్, నోట్ల తయారీ కాగితాలు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురిని రిమాండుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జనగామ డీసీపీ ఎం మల్లారెడ్డి తెలిపారు. -
కల్లు తాగించి నగలు దోచుకుంటున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ : ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ వారికి పీకల దాకా కల్లు తాగించి నగలను దోసుకెళుతున్న ముగ్గురు మోసగాళ్లను సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 తులాల బంగారం, 40 తులాల వెండి, ఒక ఆటో , సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ శశిధర్ రాజు విలేఖరులకు వివరాలు వెల్లడించారు. హయత్ నగర్లో నివాసం ఉంటున్న తిరుపతి అనే వ్యక్తి పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. తీరు మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఇతను ఒంటరిగా ఉన్న మహిళలను ఆటోలో ఎక్కించుకొని కల్లు కాంపౌండుకు తీసుకెళ్లి మత్తు ఎక్కేలా మందు తాగించేవాడు. స్పృహ కోల్పోయాక వచ్చిన ఆటోలోనే ఎక్కించుకొని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లి వారి వద్ద ఉన్న బంగారు నగలను దోచుకొని పారిపోయేవాడు. సీసీఫుటేజీ సహాయంతో ఇతనికి సహకరిస్తున్న ఇద్దరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ దోపిడీలు తాము చేశామని ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. -
శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ : శిశు విక్రయాలు జరుపుతున్న ఓ ముఠాను బాలల హక్కుల సంఘం అధికారులు, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసుల సహాయంతో పట్టుకున్నారు. అనంతరం నిందితులను సరూర్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ముఠాగా ఏర్పడి ఈ దందా చేస్తున్నట్లు బాలల హక్కుల సంఘం అధికారులకు తెలియడంతో, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. ఈ ముఠా వద్ద నుంచి రూ.80 వేల నగదు, నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. సరూర్ నగర్ లిమిట్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విచారణలో మరి కొందరు ముఠా సభ్యులు బయట పడే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు
కాకినాడ క్రైం, న్యూస్‌లైన్ : ఫైనాన్స్ వ్యాపారం ముసుగులో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. శనివారం కాకినాడలోని తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఎన్.శివశంకర్ రెడ్డి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. తణుకుకు చెందిన వల్లూరి రాజశేఖర్ వడ్రంగి పని, వస్త్ర వ్యాపారం, రోల్డ్‌గోల్డ్ వస్తువుల వ్యాపారం చేసి నష్టాల పాలయ్యాడు. దీంతో అతడు మండపేటకు మకాం మార్చాడు. అనపర్తి మండలం కుతుకులూరు కాలనీకి చెందిన మేడపాటి శ్రీనివాసరెడ్డి ఫైనాన్స్, ఇన్స్టాల్మెంట్ వ్యాపారాలు చేసి నష్టపోయాడు. కొద్దికాలం క్రితం రాజశేఖర్‌తో శ్రీనివాసరెడ్డికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ నకిలీ కరెన్సీ చలామణితో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఏడు నెలల క్రితం జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన నకిలీ కరెన్సీ నోట్లు మార్చే ధన్‌బాద్‌రెడ్డి రాజశేఖర్‌కు పరిచయమయ్యాడు. రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి అతడితో రూ.47 వేలు అసలు కరెన్సీకి లక్ష రూపాయల నకిలీ కరెన్సీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ధన్‌బాద్ రెడ్డి నుంచి దఫదఫాలుగా నకిలీ కరెన్సీ తీసుకువచ్చి మహేంద్రవాడకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి మల్లిడి కుమార్ రెడ్డి (మణికంఠ)కు, రామవరం కాలనీకి చెందిన ఫైనాన్స్ వ్యాపారి కర్రి వెంకట రెడ్డికి ఇచ్చి అసలు నగదు తీసుంటున్నారు. ఫైనాన్స్ వ్యాపారులు కొంతకాలంగా వారి వద్ద నుంచి నకిలీ కరెన్సీని తీసుకుని మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి మండపేట బస్టాండ్ సమీపంలో రాజశేఖర్, శ్రీనివాసరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధన్‌బాద్ రెడ్డి, మల్లిడి కుమార్ రెడ్డి, కర్రి వెంకట రెడ్డి పరారీలో ఉన్నారు.