రిటైర్డు డీజీపీ మెయిల్‌ నుంచి మెసేజ్‌ రావడంతో.. | Gang Arrested For Cyber Scams In Karnataka | Sakshi
Sakshi News home page

రిటైర్డు డీజీపీ మెయిల్‌ నుంచి మెసేజ్‌ రావడంతో..

Published Thu, Mar 11 2021 6:23 AM | Last Updated on Thu, Mar 11 2021 9:20 AM

Gang Arrested For Cyber Scams In Karnataka - Sakshi

పట్టుబడిన ముఠా

నిందితులు దియా, సరోపా, ఇస్పర్‌ కోన్సాక్‌. ఇటీవల బిదరి ఈమెయిల్‌ను హ్యాక్‌ చేసి ఆయన స్నేహితులకు డబ్బు పంపాలని మెయిల్‌ పంపారు. బిదరినే పంపారేమోనని ఒకరు రూ.25 వేలు ఖాతాలో వేశారు.

బనశంకరి(కర్ణాటక): సైబర్‌ నేరగాళ్లు ఐటీ సిటీలో చెలరేగిపోతున్నారు. పోలీస్‌ పెద్దలను కూడా విడిచిపెట్టడం లేదు. విశ్రాంత డీజీపీ శంకరబిదిరి ఈమెయిల్‌ను హ్యాక్‌ చేసి డబ్బు పంపాలని స్నేహితులకు మెసేజ్‌ పంపి డబ్బులు కొల్లగొట్టిన నాగాల్యాండ్‌ కు చెందిన ముగ్గురిని బుధవారం సీఇఎన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 4 మొబైల్స్, 13 పాన్‌ కార్డులు, 6 ఆధార్‌ కార్డులు, 2 ఏటీఎం కార్డులు సుమారు 20 కి పైగా బ్యాంకుల్లో ఉన్న రూ. 2 లక్షల నగదు ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు దియా, సరోపా, ఇస్పర్‌ కోన్సాక్‌. ఇటీవల బిదరి ఈమెయిల్‌ను హ్యాక్‌ చేసి ఆయన స్నేహితులకు డబ్బు పంపాలని మెయిల్‌ పంపారు. బిదరినే పంపారేమోనని ఒకరు రూ.25 వేలు ఖాతాలో వేశారు. తరువాత నిజం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల క్రితం నాగాల్యాండ్‌ నుంచి బెంగళూరుకు  వచ్చిన నిందితులు బ్యూటీపార్లర్, మాల్స్‌లో పనిచేసేవారు. నాగాల్యాండ్‌ కు చెందిన నిరుద్యోగ యువకులకు డబ్బు ఆశ చూపించి వారి పాన్, ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకుని నగదును ఆ ఖాతాల్లోకి వేయించేవారు.
చదవండి:
చంపి అయినా ‘పరువు’ కాపాడుకోవాలనుకుని..  
బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కు పుడకలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement